Kantara Chapter 1 Movie Review: కాంతార చాప్టర్ 1 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, జయరాం, గుల్షన్ దేవయ్య, రాకేష్ పూజారీ తదితరులు
దర్శకత్వం: రిషబ్ శెట్టి
నిర్మాత: విజయ్ కిరగందూర్
సహ నిర్మాత: ఛాలువే గౌడ
సినిమాటోగ్రఫి: అరవింద్ కశ్యప్, కేఎం ప్రకాశ్,
ఎడిటింగ్: శోభిత్ శెట్టి
మ్యూజిక్: అజనీష్ లోక్‌నాథ్ బీ
బ్యానర్‌: హోంబలే ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2025-10-02

కాంతార ప్రాంతానికి చెందిన కాపారి బర్మె (రిషబ్ శెట్టి) తన తెగకు చెందిన ప్రజల హక్కులు, తమ ప్రాంతంలో పండే సుగంధ ద్రవ్యాల వ్యాపారంపై అధిపత్యం కోసం పోరాటం చేసే నాయకుడు. కాంతార వర్గం బంగ్రా అనే తెగతో పోరాటం చేస్తుంటారు. ఈ తెగలకు రాజ విజయేంద్ర అలియాస్ రాజశేఖర్ (జయరాం), యువరాజు కులశేఖర్ (గుల్షన్ దేవయ్య), యువరాణి కనకవతి (రుక్మిణి వసంత్) పాలకులుగా ఉంటారు. బందర్ అనే ప్రాంతంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేందుకు కాంతార వర్గం పోరాటం చేస్తుంటుంది. అయితే కాంతార తెగ ఉండే ఈశ్వర పూతోటలోకి అడుగుపెట్టాలని బంగ్రా తెగ, రాజు, యువరాజు, యువరాణి కుట్ర పన్నుతారు.

Kantara Chapter 1 Kannada Movie Review

దట్టమైన అటవీ ప్రాంతం కాంతార వద్ద మూడు తెగల పోరాటం ఏమిటి? పింజర్ల దేవుడి కోసం వారి మధ్య గొడవ ఏమిటి? పింజర్ల దేవుడిని కాంతారా తెగ వాళ్లు ఎందుకు కాపాడుతుంటారు? ఈశ్వర పూతోట ప్రాంతంపై పట్టు సాధించాలని బంగ్రా, ఇతర పాలకులు ఎందుకు ప్రయత్నం చేస్తుంటారు? బందరు ప్రాంతంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసే హక్కును కంతార ప్రజలు సాధించుకొన్నారా? యువరాణితో కాపారి బర్మే ప్రేమాయణం ఎక్కడి వరకు తీసుకెళ్లింది? బంగ్రా తెగ చేసే అరాచకాలను కాంతార తెగ అడ్డుకొన్నది? రాజు, యువరాణి కుట్రలను బర్మె ఎలా తిప్పి కొట్టాడు? అనే ప్రశ్నలకు సమాధానమే కాంతార చాప్టర్ 1 సినిమా కథ.

కాంతార చాప్టర్ 1 సినిమా విషయానికి వస్తే.. మూడు తెగల మధ్య పోరాటం గురించి పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడిగా రిషబ్ శెట్టి కాస్త సమయం ఎక్కువగానే తీసుకొన్నాడు. అయితే సాధారణ ప్రేక్షకుడికి ఈ కథను సులభంగా చెప్పడానికి బదులు కొంత కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయడం వల్ల ఆడియెన్ స్టోరిని అర్ధం చేసుకోవడానికి కాస్త ఎక్కువగానే శ్రమించాల్సి వస్తుంది. ఒకసారి కథను ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత తెల్ల గుర్రం, పులి ఎపిసోడ్స్‌ను అద్బుతంగా తెర మీద డీల్ చేసి కొత్త అనుభూతిని క్రియేట్ చేశాడు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఫస్టాఫ్‌ను అదరగొట్టాడు. ఫస్టాఫ్‌లో కొంత నిడివి సమస్య సినిమా కథావేగానికి కళ్లెం వేసిందనే ఫీలింగ్ కలుగుతుంది.

ఇక ఫస్టాఫ్‌లో కొన్ని సమస్యలను పక్కన పెడితే.. సెకండాఫ్‌ను రిషబ్ శెట్టి దర్శకుడిగానే కాకుండా నటుడిగా విశ్వరూపం చూపించాడు. దైవత్వం సిద్దించే సీన్‌లో రిషబ్ శెట్టి చెలరేగిపోయాడు. సినిమా రెండో భాగాన్ని బ్యాలెన్స్‌గా నడిపించడమే కాకుండా ఎమోషనల్ కంటెంట్‌ను, యాక్షన్ కంటెంట్‌ను పూర్తిగా జొప్పించడంలో సక్సెస్ అయ్యాడు. యాక్షన్ ఎపిసోడ్ విషయానికి వస్తే.. వరాహాలు ఉండే సీన్, ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశాలు చాలా గ్రిప్పింగ్‌గా ఉన్నాయి.

కాంతార చాప్టర్ 1 సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ మెయిన్ అసెట్. తమకు దక్కిన ప్రతీ పాత్రను యాక్టర్లు ప్రతిభతో అద్బుతంగా రాణించారు. రిషబ్ శెట్టి మాత్రం యాక్షన్, ఎమోషనల్, అలాగే రొమాంటిక్ సీన్లలో లీనమై నటించాడు. ఈ సినిమాకు అత్యుత్తమ నటనను మరోసారి రుచి చూపించాడు. ఇక రుక్మిణి వసంత్ యువరాణిగా సర్‌ప్రైజ్ ఎలిమెంట్. రిషబ్‌తో పోటీపడి నటించింది. గుల్షన్ దేవయ్య ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. జయరాం భారమైన పాత్రతో మెప్పించాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శించారు.

ఇక ఈ మూవీకి ఎప్పటిలానే సాంకేతిక అంశాలు అత్యంత బలంగా నిలిచాయి. అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పలు సన్నివేశాలకు జీవం పోశాడు. చాలా సీన్లను బాగా ఎలివేట్ చేశాడు. ఈ సినిమాలో పాటలు మైనస్. ఇక సినిమాటోగ్రఫి అదిరిపోయింది. దట్టమైన ఫారెస్ట్‌లో, మిస్టీరియస్ లొకేషన్లలో సీన్లను అద్బుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ విషయంలో కొన్ని సమస్యలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఈ సినిమాకు కనీసం 10 నుంచి 15 నిమిషాల నిడివిని కట్ చేస్తే ఫీల్, వేగం పెరుగుతుంది. హోంబలే ఫిల్మ్స్ మరోసారి బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించారు.

కాంతార సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా గొప్ప థ్రిల్‌తోపాటు ఓ డివైన్ ఫ్యాక్టర్‌ను అందించిన చిత్రంగా నిలిచింది. ఆ సినిమా ఊహించని విజయం సాధించడంతో కాంతార చాప్టర్ 1 మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. అలాంటి అంచనాలు అందుకోవడం దర్శకుడు రిషబ్ శెట్టికి పెద్ద సవాలే ముందు నిలిచింది. అయితే ఈ ఛాలెంజ్‌ను సరియైన రీతిలో తీసుకొని చక్కటి ఫీల్‌తో సినిమాను అందించారు. చాలా లోపాలు నేరేషన్ పరంగా ఉన్నప్పటికీ.. వాటిని కప్పిపుచ్చేలా కమర్షియల్ హంగులు దట్టించి సినిమాను క్లీన్‌గా అందించాడు. భారీ అంచనాలు లేకుండా వెళితే.. మంచి సినిమాను చూశామనే తృప్తి, అనుభూతితో బయటకు రావొచ్చు. కాంతార ప్రీక్వెల్ సగటు ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్ లాంటి సినిమా. డోంట్ మిస్ ఇట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X