Just In
- 1 hr ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 2 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
- 2 hrs ago
ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా
- 2 hrs ago
ఐదు భాషల్లో ఆర్జీవి ‘దెయ్యం’.. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు.. రిలీజ్ ఎందుకు లేట్ అయిందంటే..
Don't Miss!
- News
ఢిల్లీలో కరోనా రికార్డుల భ్రేక్..: 13వేలు దాటిన కొత్త కేసులు, 200మందికిపైగా మృతి
- Sports
KKR vs MI:గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా.. ముంబై ఇండియన్స్ బోణీ!
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Lifestyle
Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Karthi's Sulthan మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
దక్షిణాది చిత్ర పరిశ్రమలో రైతుల సమస్యలు, వ్యవసాయం లాంటి అంశాలపై భావోద్వేగమైన కథలతో చాలా సినిమాలే వస్తున్నాయి. మహర్షి, శ్రీకారం లాంటి సినిమాల ద్వారా వెండితెరపై గొప్పగా కథలను చెప్పే ప్రయత్నం దర్శకులు చేశారు. తాజాగా రైతుల సమస్యతో వచ్చిన మరో ఎమోషనల్ చిత్రం సుల్తాన్. ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్‌లో మెప్పించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ, కథనాలను సమీక్షించుకోవాల్సిందే.

సుల్తాన్ కథ ఏమిటంటే..
విశాఖపట్నంలో 100 మందికిపైగా రౌడీ గ్యాంగ్‌కు సేతుపతి (నెపోలియన్) నాయకత్వం వహిస్తుంటాడు. ప్రత్యర్థి గ్యాంగ్ జరిపిన దాడి సమయంలో సేతుపతి భార్య సుల్తాన్ అలియాస్ విక్రమ్ (కార్తీ)కి జన్మనిచ్చి చనిపోతుంది. రౌడీ కార్యకలాపాలాకు దూరంగా పెరిగిన సుల్తాన్ ముంబైలో రొబొటిక్ ఇంజినీర్‌గా పనిచేస్తుంటాడు. ఇదిలా ఉండగా తండ్రి బతికి ఉండగా అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో రైతుల కుటుంబాలకు అండగా ఉంటానని తండ్రి సేతుపతి మాట ఇస్తాడు. అయితే ముంబై నుంచి విశాఖపట్నం వచ్చిన సమయంలో తండ్రి ఆకస్మిక మరణం చెందుతాడు. దాంతో 100 మంది రౌడీల బాధ్యత సుల్తాన్ పడుతుంది.

మూవీలో ట్విస్టులు
సుల్తాన్ తల్లి ఏ పరిస్థితుల్లో చనిపోయింది? తనను అల్లారుముద్దుగా పెంచిన మన్సూర్ భాయ్ (లాల్)తో ఎలాంటి సంబంధాలను కొనసాగించాడు? రుక్మిణి (రష్మిక మందన్న)పై సుల్తాన్‌కు ఏ పరిస్థితుల్లో ప్రేమ పుడుతుంది? తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి సుల్తాన్ ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు. రక్తపాతం సృష్టించే రౌడీలను రైతులుగా మార్చాలనే ప్రయత్నంలో సుల్తాన్ సఫలమయ్యారా? రైతుల భూములను కాజేయాలనే జయశీలన్ (నవాబ్ షా) కుయుక్తులను ఎలా ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే సుల్తాన్ మూవీ.

ఫస్టాఫ్‌లో కాస్త స్లోగానే...
సేతుపతి రౌడీ సామ్రాజ్యానికి సంబంధించిన అంశాలతోపాటు సుల్తాన్ తల్లికి చెందిన సన్నివేశాలతో మూవీ ఎమోషనల్ నోట్‌తో ప్రారంభమవుతుంది. సుల్తాన్‌కు జన్మనిచ్చి తల్లి మరణించడం మరింత ఇంటెన్సివ్‌గా మారుతుంది. ఇక సుల్తాన్ ముంబై తిరిగి వచ్చిన తర్వాత కథ వేగం పుంజుకొంటుంది. సుల్తాన్‌కు తండ్రి సేతుపతి మధ్య సీన్లు భావోద్వేగానికి గురిచేస్తాయి. కాకపోతే రొటీన్ సీన్లు, స్లో నేరేషన్‌తో కాస్త సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటాయి. ఎప్పుడైతే వెలగపూడికి వెళ్లి రుక్మిణిని చూసి ప్రేమలో పడుతాడో అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇంటర్వెల్‌కు ముందు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఇంటెన్సివ్‌గా ఉంటాయి. కార్తీ ఫెర్ఫార్మెన్స్ హైలెట్‌గా మారి తొలి భాగం ముగుస్తుంది.

సెకండాఫ్ ఎమోషనల్‌గా
వెలగపూడి భూములను పచ్చగా మార్చిన వ్యక్తినే పెళ్లి చేసుకొంటానని రుక్మిణి చెప్పడం.. ఆ తర్వాత ఈ నేలలు పచ్చగా మారాలి. ఆ భూముల్లో పండిన పంటతోనే నా పెళ్లి జరగాలి అంటూ కార్తీ చెప్పిన డైలాగ్స్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. చివర్లో 100 రౌడీలు సుల్తాన్‌కు ఎదురు తిరగడం.. క్లైమాక్స్‌లో జయశీలన్ దుష్టపన్నాగాలను ఎదురించి తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది. సగటు ప్రేక్షకుడికి కావాల్సిన మాస్, మసాలా అంశాలను దట్టించి భావోద్వేగమైన రైతుల కథను ఆకట్టుకొనేలా విస్తరిలో వడ్డించారని చెప్పవచ్చు.

దర్శకుడి ప్రతిభ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రైతు సమస్యను ప్రధామైన కథగా ఎంచుకొని.. దానికి కౌరవుల్లో కృష్థుడు, రుక్మిణి ప్రేమకథ, తండ్రి, కొడుకుల సంబంధాలు లాంటి అంశాలను రంగరించి దర్శకుడు చేసిన ప్రయత్నం ఆకట్టుకొనేలా ఉన్నాయి. అయితే తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే ఇలాంటి సినిమాలను చూసి ఉండటంతో సరికొత్తగా ఫీలయ్యే అవకాశం లేకపోయింది. కార్తీలో హీరోయిజం, ఎమోషనల్ యాంగిల్స్ పక్కగా చూపించడంలో దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ సక్సెస్ అయ్యారు. తమిళ వాసనలు ఎక్కువగా కొట్టొచ్చినట్టు కనిపించడం కొంత మైనస్ అని చెప్పవచ్చు.

కార్తీ మాస్ హీరోగా...
ప్రతీ సినిమాకు విభిన్నంగా కనిపించే కార్తీ సుల్తాన్ సినిమాలో మాస్ హీరోగా మరింతగా విజృంభించాడు. 100 మంది రౌడీలకు సోదరుడిగా, రుక్మిణి అనే పల్లెపడుచుకు ప్రేమికుడిగా, తండ్రి మాటను నిలబెట్టడానికి ఎంతకైనా సిద్దపడే యువకుడిగా పలు కోణాల్లో తన నటన మెప్పించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్ సన్నివేశాల్లో కార్తీ ఫెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పవచ్చు.

పల్లె పడుచుగా రష్మిక మందన్న
తొలిసారి తమిళంలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న పూర్తిగా డీ గ్లామరైజ్డ్ రోల్‌లో కనిపించింది. పల్లె యువతిగా తనదైన శైలిలో ఆకట్టుకొన్నది. కొన్ని కీలక సన్నివేశాల్లో తమ మార్కు నటనను ప్రదర్శించింది. ఓవరాల్‌గా కార్తీతో పోటీ పడి నటించిందని చెప్పవచ్చు. తమిళంలో మంచి చిత్రం, పాత్రతో తన జర్నీని ప్రారంభించిందని చెప్పవచ్చు.

సాంకేతిక విభాగాల పనీతీరు
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. బెస్ట్ ఫెర్ఫార్మర్‌గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన యువన్ శంకర్ రాజా గురించి చెప్పుకోవాలి. ఎమోషనల్ కంటెంట్ ఉన్న పలు సీన్లను, యాక్షన్ ఎపిసోడ్స్‌ను మరో రేంజ్‌లోకి తీసుకెళ్లారని చెప్పవచ్చు. అలాగే వివేక్, మెర్విన్ అందించిన పాటలు బాగానే ఉన్నాయి. రాకేందు మౌళి డైలాగ్స్, పాటలు చాలా బాగున్నాయి. సత్యన్ సూర్యన్ అందించిన సినిమాటోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు. పచ్చటి ప్రదేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. ఎడిటర్ రూబెన్‌కు ఇంకా చేతినిండా పని ఉంది. మూవీ లెంగ్త్ పెరగడం వల్ల కాస్త ఎమోషన్స్ తగ్గినట్టు అనిపిస్తుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి. సెట్ల్స్, తెర నిండా ఎక్స్‌ట్రా ఆర్టిస్టులను నింపిన తీరు బాగుంది.

ఫైనల్‌గా
టాలీవుడ్ విషయానికి వస్తే.. రైతుల సమస్యలపై సుల్తాన్ లాంటి సినిమాలు ఇటీవల కాలంలో ఎక్కువగానే సందడి చేశాయి. అయితే రౌడీలను రైతులుగా మార్చే అంశమే ఈ సినిమాలో సరికొత్త పాయింట్. కార్తీ నటన, తండ్రి, కొడుకుల మధ్య ఎమోషనల్ కంటెంట్ ఆకట్టుకొనే అంశాలుగా కనిపిస్తాయి. ఇక రష్మిక, కార్తీ మధ్య రొటీన్ ప్రేమకథ, వారి మధ్య కెమిస్ట్రీ పండకపోవడం ఈ సినిమాకు మైనస్. అయితే మాస్ ఆడియెన్స్‌కు కావాల్సిన అంశాలు పుష్కలంగానే ఉన్నాయి. రొటీన్ అంశాలు సినిమాను కాస్త వెనుకకు లాగినట్టు కనిపిస్తాయి. కాకపోతే బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను రప్పించే, మెప్పించే అంశాలు సినిమాకు పాజిటివ్‌గా మారాయని చెప్పవచ్చు.

తెర వెనుక, తెర ముందు
నటీనటులు: కార్తీ, రష్మిక మందన్న, నెపోలియన్, యోగిబాబు, నవాబ్ షా, శరత్ కుమార్ తదితరులు
కథ, దర్శకత్వం: బక్కియరాజ్ కన్నన్
నిర్మాత: ఎస్ఆర్ ప్రకాశ్ ప్రభు
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా (బీజీఎం), వివేక్, మెర్విన్ (పాటలు)
సినిమాటోగ్రఫి: సత్యన్ సూర్యన్
ఎడిటింగ్: రుబెన్
బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2021-04-02