twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthikeya 2 Review ఎంగేజింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్.. చందూ మొండేటి అలాంటి సాహసంతో..

    |

    Rating: 2.75/5

    Recommended Video

    కార్తికేయ 2 తో చందు మొండేటి సక్సెస్ అయ్యాడా? *Reviews | Telugu OneIndia

    దర్శకుడు చందూ మొండేటి, హీరో నిఖిల్ సిద్దార్థ్ కాంబినేషన్‌లో వచ్చిన కార్తీకేయ చిత్రం ఊహించని విజయాన్ని అందుకొన్నది. 2004లో వచ్చిన చిత్రానికి సీక్వెల్‌గా కార్తీకేయ 2 చిత్రం క‌ృష్ణతత్వం, హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అనే అంశాలతో రూపొందింది. కార్తీకేయ చిత్రం మాదిరిగానే ప్రేక్షకులకు ఈ సీక్వెల్ కొత్త అనుభూతిని అందించిందా? చందూ, నిఖిల్ కెమిస్ట్రీ వర్కవుట్ అయిందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే.. కథ, కథనాలను సమీక్షించాల్సిందే..

    కార్తీకేయ 2 కథ..

    కార్తీకేయ 2 కథ..

    డాక్టర్ కార్తీకేయ కుమారస్వామి కొత్త విషయాలపై పరిశోధన చేసే యువకుడు. వాస్తవాలు, లాజిక్స్ కళ్లకు కనిపిస్తే తప్ప పురాణాలైనా, ఇతిహాసాలైనా నమ్ముని డాక్టర్.. ఓ సందర్భంలో తన తల్లి (తులసి), స్నేహితుడు రవి (సత్య)తో కలిసి పురాతన ఇతిహాస నగరం ద్వారకకు వెళ్తాడు. ద్వారకలో పర్యటిస్తుండగా పురావస్తు పరిశోధకుడి హత్య కేసులో ఇరుక్కుపోతాడు.

     కార్తీకేయ కథలో ట్విస్టులు

    కార్తీకేయ కథలో ట్విస్టులు


    దేవుళ్లంటే నమ్మని కార్తీకేయ ఎందుకు ద్వారకకు వెళ్లాడు? ద్వారకలో కార్తీకేయకు ఎలాంటి పరిస్థితులు తారసపడ్డాయి? ద్వారక నగరంలో ఎలా హత్య కేసులో ఇరుక్కుపోయారు? ద్వారకలోని అభిరా తెగ కార్తీకేయను ఎందుకు వెంబడించారు? ద్వారకలో ఉండే ముగ్ధ (అనుపమ పరమేశ్వరన్)‌తో ఎలాంటి సంబంధం ఏర్పడింది? నిధి నిక్షేపాల వేటను కొనసాగించే డాక్టర్ శంతను (ఆదిత్య మీనన్) కార్తీకేయను ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ కథలో ధన్వంతరి (అనుపమ్ ఖేర్) ప్రాధాన్యత ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే కార్తీకేయ 2 చిత్ర కథ.

     కార్తీకేయ 2 ఫస్టాఫ్ ఇలా..

    కార్తీకేయ 2 ఫస్టాఫ్ ఇలా..


    మూఢ నమ్మకాలను వ్యతిరేకించే డాక్టర్ కార్తీకేయ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి పలు సంఘటనలతో కథ ప్రారంభమవుతుంది. కథ లేకుండా ఫీల్‌గుడ్ సన్నివేశాలతో సినిమాను లాగించినట్టు ఆరంభంలోనే స్పష్టమవుతుంది. సీన్ల వారీగా పేర్చుకొంటూ పోయిన డైరెక్టర్ ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయడంలో సఫలమయ్యాడన చెప్పవచ్చు. అభీరాల కాన్సెప్ట్‌తో కథ లేకుండా కేవలం కథనంపైనే ఆధారపడి.. రకరకాల పాత్రల పరిచయాలతో కథకు అవసరమైన ముడిసరుకును గ్రాఫిక్స్ రూపంలో ఫస్టాఫ్‌ను ముగించారనిపిస్తుంది.

     కార్తీకేయ 2 సెకండాఫ్‌లో

    కార్తీకేయ 2 సెకండాఫ్‌లో


    ఇక సెకండాఫ్‌లోనైనా అసలు కథ మొదలవుతుందా అనే ప్రేక్షకుడికి ఎక్కువ సేపే వేచి చూడాల్సిన పరిస్థితి. సెకండాఫ్‌లో కృష్ణతత్వం, కృష్ణుడి జీవితసారాన్ని మొక్కుబడిగా చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే.. ప్రీ క్లైమాక్స్ నుంచి బలమైన సన్నివేశాలతో కథను చెప్పిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. చివరి 20 నిమిషాలు స్క్రీన్ ప్లే చాలా రేసింగ్‌గా ఉండటం సినిమాను మరో మెట్టెక్కించిందని చెప్పవచ్చు.

     కథ లేకుండానే దర్శకుడు సాహసం

    కథ లేకుండానే దర్శకుడు సాహసం


    ఎలాంటి అంచనాలు లేకుండా కార్తీకేయ మూవీని సక్సెస్‌గా మలచడంతో దర్శకుడు చందూ మొండేటి ప్రేక్షకులకు గురి పెరిగింది. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు భారీగాను ఉంటాయి. దర్శకుడిలో గొప్పతనం ఏమిటంటే.. కథ లేకుండానే ప్రేక్షకుడిని ఆద్యంతం కట్టిపడేసే విషయం ఆకట్టుకొన్నది. అన్నీ బాగానే డీల్ చేసిన డైరెక్టర్ కృష్ణపక్షం అంటే పదిహేను రోజులు కాకుండా రెండు రోజులని చెప్పడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. సీన్ల వారీగా, ఎపిసోడ్ వారీగా సినిమాను పరిగెత్తించిన చందూ.. కథపై పూర్తిగా పట్టు సాధించి ఉంటే.. కార్తీకేయ 1 కంటే పెద్ద హిట్ కొట్టేవాడనిపిస్తుంది.

     నిఖిల్, అనుపమ గురించి

    నిఖిల్, అనుపమ గురించి


    బ్రహ్మండమైన ఫెర్ఫార్మెన్స్ అవకాశం లేని కార్తీకేయ పాత్రలో నిఖిల్‌ కనిపిస్తాడు. బలమైన సన్నివేశాలను ముందుకు తీసుకెళ్లడంలో నిఖిల్‌లో మెచ్యురిటీ కనిపించింది. కీలక సన్నివేశాల్లో నిఖిల్ అన్ని తానై ఆకట్టుకొన్నాడు. అతి లేకుండా నీట్‌గా తన పాత్రను ప్రజెంట్ చేశాడు. సీన్లలో ఉండే ఇంటెన్సిటీ కారణంగా కార్తీకేయ పాత్రలో ఉండే లోపాలు పెద్దగా కనిపించకపోవడం ఊరట. పాటలు, గ్లామర్‌కు పెద్దగా స్కోప్ లేని పాత్ర కారణంగా అనుపమ పరమేశ్వరన్ తన ప్రతిభను చాటుకోలేకపోయింది. కానీ సపోర్టింగ్ ఆర్టిస్టుగా ఫర్వాలేదనిపించింది.

    సత్య, హర్ష, మిగితా పాత్రల గురించి

    సత్య, హర్ష, మిగితా పాత్రల గురించి


    కార్తీకేయ 2 సినిమాలో మిగితా పాత్రల విషయంలోకి వెళితే.. ఇటీవల కాలంలో సత్య అద్భుతమైన ఫెర్పార్మెన్స్‌తో ఆకట్టుకొంటున్నాడు. సినిమా అంతా సత్య ప్రజెన్స్ ఉన్నా.. పెద్దగా హాస్యాన్ని పండించలేకపోయాడనే చెప్పవచ్చు. కామెడీని పండించే బాధ్యతలను హర్ష (సులేమాన్), శ్రీనివాసరెడ్డి (సదానంద) సంపూర్ణంగా నిర్వహించారు. సెకండాఫ్‌లో వారిద్దరి సున్నితమైన హాస్యం సినిమా ఫీల్‌గుడ్‌గా ముందుకు తీసుకెళ్లింది. ఇక అనుపమ్ ఖేర్ పాత్ర నిడివి చాలా ఎక్కువే కానీ.. సినిమాను మలుపు తిప్పే విధంగా ఉంటుంది. కథా స్వరూపాన్ని, సినిమాకు జస్టిఫికేషన్ ఇచ్చే విధంగా అనుపమ్ ఖేర్ పాత్రను డిజైన్ చేయడం ఉపశమనం కలిగిస్తుంది.

     సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు


    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కార్తీకేయ 2 సినిమాలో ఎక్కువ మార్కులు కొట్టేసింది కాలభైరవ మ్యూజిక్. పాటలకు స్కోప్ లేకపోవడంతో స్వేచ్ఛాయుతంగా బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో అల్లాడించాడు. కొన్ని పేలవమైన సీన్లను కూడా ఎలివేట్ చేయడంలో కాలభైరవ సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా కార్తీక్ ఘట్టంనేని తన ప్రతిభతో ఈ సినిమాను విజువల్ ఫీస్టుగా మలిచారు. గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే.. విజువల్‌గా మరింత బాగుండేది. కథ లేకుండా సీన్లతోనే సినిమా నడిపించాల్సిన పరిస్థితుల్లో ఎడిటర్‌గా కార్తీక్ చాకచక్యంగా వ్యవహరించాడు. ఈ సినిమా ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ అనుసరించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

    కార్తీకేయ 2 ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    కార్తీకేయ 2 ఫైనల్‌గా ఎలా ఉందంటే?


    కథ లేకుండా కథనాన్ని బలంగా నమ్మి చేసిన అడ్వెంచర్ థ్రిల్లర్ కార్తీకేయ 2. బలంగా రాసుకొన్న సీన్లు ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారాయి. మ్యూజిక్, సినిమాటోగ్రఫి లాంటి అంశాలు సినిమాను ఎంగేజింగ్‌గా మార్చాయి. నటీనటులు ఫెర్ఫార్మెన్స్ కన్నా.. దర్శకుడి ప్రతిభే ఈ సినిమాను నిలబెట్టేలా చేసింది. అనుపమ్ ఖేర్ పాత్ర ఈ సినిమాకు కొసమెరుపు. లాజిక్కులు ఆలోచించకుండా చూస్తే.. ఈ సినిమా అందర్ని ఆకట్టుకొంటుంది.దేశంలోని ఇతిహాస ప్రదేశాలను సందర్శించిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న ఈ చిత్రం.. కాబట్టి ఫ్యామిలీతోపాటు వన్ టైమ్ వాచ్ అని చెప్పవచ్చు.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు


    ప్లాస్ పాయింట్స్
    నిఖిల్ ఫెర్ఫార్మెన్స్
    కథనం, డైలాగ్స్
    కృష్ణతత్వం కాన్సెప్ట్
    ఎంగేజింగ్‌ డ్రామా
    గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్

    మైనస్ పాయింట్స్
    బలమైన కథ లేకపోవడం
    లాజిక్స్ లేకుండా ఉండటం

     కార్తీకేయ 2లో తెర ముందు, వెనుక

    కార్తీకేయ 2లో తెర ముందు, వెనుక


    నటీనటులు: నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్, ఆదిత్య మేనన్, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష, సత్య, ప్రవీణ్, తులసి తదితరులు
    మ్యూజిక్: కాలభైరవ
    సినిమాటోగ్రఫి, ఎడిటర్: కార్తీక్ ఘట్టమనేనని
    డైలాగ్స్: మణిబాబు కరణం
    నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చందూ మొండేటి
    బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
    రిలీజ్ డేట్: 2022-08-13

    English summary
    Karthikeya 2 is set to release on August 13th. This movie started on positive note at box office. Here is the Exclusive reveiw from Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X