»   » మర్డర్ కేసులో హీరో, ఎవరు చేసారనే పజిల్ (విశాల్‘కథకళి’రివ్యూ)

మర్డర్ కేసులో హీరో, ఎవరు చేసారనే పజిల్ (విశాల్‘కథకళి’రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

----సూర్య ప్రకాష్ జోశ్యుల

మారుతున్న కాలంతో పాటు ...తెలుగు సినిమా జానర్ సైతం మారుతోందని ఇటీవల వచ్చి హిట్టవుతున్న చిత్రాలు ప్రూవ్ చేస్తున్నాయి. కేవలం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే కాక విభిన్నమైన చిత్రాలు సైతం చూస్తామని తెలుగు ప్రేక్షకులు చెప్తూ, మొన్న సంక్రాంతికి వచ్చిన ఎక్సప్రెస్ రాజా, క్రిందటి నెలలో రిలీజ్ అయిన క్షణం వంటి చిత్రాలను హిట్ చేస్తున్నారు.


మారిన తెలుగు ప్రేక్షకుల కోసం తమిళం నుంచి ఓ ధ్రిల్లర్ ధియేటర్లలో దిగింది. మొన్న సంక్రాంతికి తమిళనాట విడుదలై హిట్టైన ఈ చిత్రం ఇక్కడ మార్కెట్ లోకి విశాల్, కేథరిన్ ధెరిసా, చక్రవాకం మధు వంటి తెలిసి ఉన్న ఫేస్ లతో వచ్చింది. అయితే విశాల్ మాస్ హీరో కదా, మాటిమాటికీ ఫైట్స్, కామెడీ బిట్స్, మసాలా సాంగ్స్ ఉంటాయని ఆశిస్తే నిరాశే.


ఓ లోకల్ డాన్ మర్డర్ కేసులో ఇరుక్కుపోయిన ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిగా విశాల్...ఒదిగిపోయి చేసిన ఈ చిత్రం రొటీన్ చిత్రాల నుంచి తప్పించుకోవాలనుకునే వారికి, ధ్రిల్లర్ చిత్రాల అభిమానులకు అమితంగా నచ్చుతుంది.


తన లవర్ మల్లీశ్వరి (కేధరిన్) ని పెళ్లి చేుసకోవటానికి దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఎన్నారై కమల్ (విశాల్) తన పుట్టిన ఊరు కాకినాడ వస్తాడు. అయితే అతను అక్కడ అడుగు పెట్టిన తర్వాత అక్కడ లోకల్ లీడర్, డాన్ సాంబ (చక్రవాకం మధు) మర్డరవుతాడు. వాస్తవానికి కమల్ కు, సాంబకు గతంలో కొన్ని గొడవలు ఉంటాయి. కానీ అవన్నీ మర్చిపోయి తిరిగి ప్రశాంత జీవితం గడపాలని కోరుకుంటాడు కమల్.


ఈలోగా సాంబ మర్డరవటంతో ఊహించని విధంగా కమల్ చట్టం ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్ధితి వస్తుంది. ఆ నేరం అతనిపై పడుతుంది. తప్పించుకోలేని పరిస్దితి..ఓ ప్రక్క పోలీసులు, మరో ప్రక్క సాంబ అనుచరులు వెంటాడుతూంటారు. ఆ సిట్యువేషన్ నుంచి కమల్ తప్పించుకుని ఎలా తాను నిర్దోషిని అని ప్రూవ్ చేసుకున్నాడు...అసలు మర్డర్ చేసిందెవరు... ఎండ్ ట్విస్ట్ ఏమిటి... వంటి వివరాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


సాధారణంగా విశాల్ సినిమాలంటే మనకు పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి పక్కా కమర్షియల్ మాస్ మసాలా సినిమాలు గుర్తుకు వస్తాయి. అయితే ఈ రివేంజ్ కథలు ఆయనకే బోర్ కొట్టినట్లున్నాయి. అలాగని యాక్షన్ ఇమేజ్ నుంచి తప్పుకోలేడు కాబట్టి... రివేంజ్ కథలనే రొటీన్ కాకుండా విభిన్నంగా స్క్రీన్ ప్లే చేసి పల్నాడు చిత్రం చేసి హిట్ కొట్టాడు. ఆ ఉత్సాహంలో కథకళి చేసారు. ఫస్టాఫ్ ..ఫ్లాష్ బ్యాక్ తో లవ్ స్టోరీ కాస్త సాగతీసినట్లు సీన్స్ నడిచినా, ఇంటర్వెల్ కు ఓ పదినిముషాల ముందు నుంచి కథ లైవ్ లోకి వచ్చి వేడెక్కుతుంది.


సెకండాఫ్ లోనూ అదే పరిస్దితి...ప్రీ క్లైమాక్స్ దాకా ఫ్లాష్ బ్యాక్, లైవ్ లోనూ హీరో వచ్చిన సమస్య నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా చేష్టలుడిగి ప్యాసివ్ గా ఉండటం గమనించి విసుగొస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ మన ఎమోషన్ ని పతాక స్దాయికి తీసుకు వెళ్తాయి. అయితే దర్శకుడు ఎక్కడా దృష్టి సడలకుండా సినిమాని స్క్రీన్ ప్లే తో కట్టేస్తాడు.


స్లైడ్ షోలో మిగతా రివ్యూ...


కాబట్టే కష్టం

కాబట్టే కష్టం

మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. ఒక్కరోజులో జరిగే కథ ఇది. దాంతో కథ మొత్తాన్ని ఒకే రోజుకు కుదించటం కోసం...కథలో హీరోకు విలన్ కు ఉన్న విరోధానికి కారణమైన సీన్స్, హీరో లవ్ స్టోరీ సీన్స్ ఫ్లాష్ బ్యాక్ గా చెప్పాల్సి వచ్చింది. అదే ఇబ్బంది పెట్టింది.


కలవని లవ్ స్టోరీ

కలవని లవ్ స్టోరీ

ఈ సినిమా ప్రారంభం లవ్ స్టోరీగా మొదలవుతుంది...మెల్లిమెల్లిగా ఆ లవ్ స్టోరికి సంభందం లేని ధ్రిల్లర్ గా ఎండ్ అవుతుంది. ఆ లవ్ స్టోరీ లేకపోయినా కథ అలాగే ఉంటుంది. కాబట్టి కథలో కలిసే లవ్ స్టోరీ కలిపితే బాగుండేది.


ఇంటర్వెల్ కే పూర్తైతే

ఇంటర్వెల్ కే పూర్తైతే

ఫస్టాఫ్ లో లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ ని తగ్గించి, విలన్ ఫ్లాష్ బ్యాక్ ని సెకండాఫ్ నుంచి మొదటికు తీసుకు వచ్చి పూర్తి చేస్తే.. హీరో బ్యాక్ స్టోరీ మొత్తం పూర్తై.....హీరోకు సెంకడాఫ్ లో ఏదైనా చేయటానికి స్కోప్ ఉండేది.సాంగ్స్ అనవసరం

సాంగ్స్ అనవసరం

ఇలాంటి సినిమాలకు సాంగ్స్ పూర్తిగా అనవసరమనిపిస్తుంది. అలాగని పూర్తిగా తీసేస్తే రిలీఫ్ ఉండదు..కాబట్టి రిలీఫ్ చూసుకుంటూనే సాంగ్స్ తీసేస్తే బాగుండేది. మొన్న ఈ మధ్య తెలుగులో వచ్చిన టెర్రర్ చిత్రంలో అలాగే చేసి సక్సెస్ అయ్యారు.పల్నాడు ని గుర్తు చేస్తుంది

పల్నాడు ని గుర్తు చేస్తుంది

ఈ సినిమా లో విశాల్ ని చూస్తుంటే గతంలో ఆయన చేసిన పల్నాడు సినిమా గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా సహజత్వానికి దగ్గరగా ఫెరఫార్మెన్స్ లు ఉండేలా దర్శకుడు జాగ్రత్తుల తీసుకున్నాడుపుష్కలంగా ఉన్నా..

పుష్కలంగా ఉన్నా..

ఓ ఫెరఫెక్ట్ ధ్రిల్లర్ కు ఉండాల్సిన లక్షణాలన్నీ సినిమాలో ఉన్నాయి. అయితే హీరో టాస్క్ ని ఎదుర్కొనే నెగిటివ్ పోర్సే కనపడదు. సెకండాఫ్ విలన్ అనుచరుల వైపు నుంచి థ్రెట్ మరింత బలంగా చూపితే బాగుండేది.


నిలబెట్టింది

నిలబెట్టింది

సినిమాకు కెమెరా వర్క్, రీరికార్డింగ్, తెలుగు వెర్షన్ కు రాసిన డైలాగులు, దర్శకుడు మేకింగ్ వెన్నుదన్నులా నిలబడ్డాయిఎవరెవరు..

ఎవరెవరు..

బ్యానర్ : విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ
నటీనటులు : విశాల్,కేథరీన్ థెరేసా, కరుణాస్,శత్రు,సూరి,శ్రీజిత్ రవి,పవన్,మైమ్ గోపి తదితరులు
సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణ్యం,
సంగీతం: హిప్‌హాప్‌ తమిళ,
ఎడిటింగ్‌: ప్రదీప్‌ ఇ.రాఘవ్‌,
మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి,
ఫైట్స్‌: అనల్‌ అరసు,
పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర,
సమర్పణ: శ్రీకృష్ణ క్రియేషన్స్,
నిర్మాత: విశాల్‌,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పాండ్యరాజ్‌.
విడుదల తేదీ : 18-03-2016.ఫైనల్ గా ఎంత చెప్పుకున్నా, ఎన్ని చెప్పుకున్నా రెగ్యులర్ తెలుగు ప్రేక్షకులకు తాము చూసే సినిమాలో ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ పేరుతో కామెడీ మిక్స్ లేకపోతే సింగిల్ ట్రాక్ లో కథని చూడబుద్ది కాదు. అలాగని ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పేరుతో కామెడీ కలిపితే ఎవరికీ అసలు చూడబుద్ది కాదు. కాబట్టి...ఈ సినిమా ఇలాగే ఉండాలి... ఫ్యామిలీలు కదిలి వస్తాయనే నమ్మకం ప్రక్కన పెడితే, ఓ కొత్త తరహా సినిమా చూద్దామని వచ్చేవాళ్లకు ఇది నచ్చుతుంది. వాళ్లు ఎంత శాతం మంది ఉన్నారనే దానిపై ఈ చిత్రం సక్సెస్ రేంజి ఆధారపడి ఉంటుంది.

English summary
Kathakali is not a routine commercial movie. This action thriller from Pandiraj and Vishal is a good watch this week.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu