For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కేశవ మూవీ రివ్యూ

  By Rajababu
  |

  Rating:
  2.5/5
  Star Cast: నిఖిల్ సిద్ధార్థ్, ఇషా కొప్పికర్, రావు రమేష్, రితూ వర్మ, వెన్నెల కిషోర్
  Director: సుధీర్ వర్మ

  విభిన్నమైన చిత్రాలను ఎంచుకొంటూ వరుస హిట్లను సాధిస్తున్న టాలీవుడ్ హీరోల జాబితాలో నిఖిల్ సిద్ధార్థ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నదానా చిత్రాలు నిఖిల్ అభిరుచికి అద్దం పట్టాయి. ప్రేక్షకుల మెప్పు కూడా పొందాయి. తాజాగా నిఖిల్ నటించిన చిత్రం కేశవ. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్, టైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కెరీర్‌లో మరో హిట్‌ను చేర్చేందుకు దర్శకుడు సుధీర్ వర్మతో నిఖిల్ మరోసారి జతకట్టాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'స్వామి రారా' చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిఖిల్, సుధీర్ వర్మ కలయికలో వస్తున్న కేశవపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 19వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  కేశవ్ కథ ఇలా..

  కేశవ్ కథ ఇలా..

  కేశవ్ శర్మ (నిఖిల్ సిద్ధార్థ్) న్యాయశాస్త్ర విద్యార్థి. ఎప్పుడు ఏదో పొగ్గొట్టుకున్న వాడిలా కేశవ్ ముభావంగా ఉంటాడు. తల్లిదండ్రులు లేని అనాధ. శారీరక వైకల్యంతో బాధపడే చెల్లెలు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు పోలీసు అధికారులను హత్యచేయాలని నిర్ణయించుకొంటాడు. అలా వరుసపెట్టి ముగ్గురు పోలీసు అధికారులను (రాజా రవీంద్రతోపాటు మరో ఇద్దరు) హత్య చేస్తాడు. బాల్య స్నేహితురాలు సత్యభామ (రీతూవర్మ) సహా విద్యార్థి ఈ విషయాన్ని పసిగడుతుంది. కేశవ్ చేసే వరుస హత్యలు వైజాగ్ పరిసర ప్రాంతంలో సంచలనం రేపుతుంటాయి. హత్యలపై నిగ్గుతేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తారు. హత్యల గురించి పరిశోధన చేపట్టిన అధికారి (ఇషా కొప్పికర్) చివరికి కేశవ్‌ను అరెస్ట్ చేస్తుంది. అతడే హత్యలకు కారణమని నిర్ధారిస్తుంది. కానీ ఆధారాలు లేకపోవడంతో అతడిని విడుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తారు. దాంతో కేశవ్ బయటకు వస్తాడు.

  హత్యలు ఎందుకు..

  హత్యలు ఎందుకు..

  కానీ కేశవ్ జాబితాలో మరో ఇద్దరు అధికారులు (బహ్మాజీ, అజయ్) ఉన్నారని దర్యాప్తు అధికారి గుర్తిస్తుంది. ఆ ఇద్దరు పోలీసు ఆఫీసర్లను రక్షించేందుకు సిట్ బృందం చర్యలు చేపడుతుంది. మిగిలిన ఇద్దరు పోలీసు అధికారులను కేశవ్ ఎలా చంపాడు. అసలు పోలీసు అధికారులను కేశవ్ ఎందుకు చంపుతున్నాడు. ఎందుకు కేశవ్ తల్లిదండ్రులు చనిపోయారు? తన కేశవ్ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటి? ఈ మర్డర్ మిస్టరీలో రావు రమేశ్ పాత్ర ఏంటీ అనే ప్రశ్నలకు సమాధానమే ‘కేశవ్‘ చిత్రం.

  విశ్లేషణ

  విశ్లేషణ

  స్వామి రారా, దోచెయ్ లాంటి సినిమాలు దర్శకుడు సుధీర్ వర్మ ప్రతిభకు అద్దం పట్టాయి. ఈ క్రమంలో ఆయన దర్శకత్వంలో వస్తున్న కేశవ్ చిత్రం కూడా విభిన్నంగా ఉంటుందని ఆశించడం సహజం. కానీ ప్రేక్షకులు అంచనాలకు భిన్నంగా రొటీన్ కథ, కథనాలతో కేశవ్ కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అందుకు నిఖిల్‌ రూపు రేఖలను, బాడీ లాగ్వేజి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొన్నాడు. ఆరంభంలో ఏదో వైవిధ్యమున్న సినిమానే చూడబోతున్నామనే ఫీలింగ్‌ను కల్పించాడు. కానీ సన్నివేశాలు, డైలాగ్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి. మర్డర్ మిస్టరీ అంటే తర్వాత సన్నివేశంలో ఏం జరుగుతుందో అనే ఇంట్రస్ట్ క్రియేట్ కావాలి. సినిమాలోని సన్నివేశాలను చాలా సులభంగా ఊహించే విధంగా ఉంటాయి.

  కథలో దమ్ము లేకపోవడం..

  కథలో దమ్ము లేకపోవడం..

  కథలో దమ్ము లేకపోవడం ఈ సినిమాకు మొదటి మైనస్ పాయింట్. ప్రతిభావంతులైన దర్శకులకు కథ అక్కర్లేదని కొందరు డైరెక్టర్లను చూస్తే అర్థమవుతుంది. సులభమైన కథను చాలా ఎమోషన్‌లా, పక్కాగా చెప్పినప్పుడే ప్రేక్షకుడు సినిమాలో లీనమవుతాడు. ట్విస్టులు, చమక్కులు ప్రేక్షకుడిని మైమరిపించే విధంగా చేస్తాయి. స్వామి రారా విషయంలో ప్రేక్షకుడి ఫీలయైన విషయం అదే. అందుకే ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు లేని సినిమాను బాగా ఆదరించారు. కేశవ్ చిత్రం దానికి పూర్తిగా వ్యతిరేకమైంది. కథలో లోటుపాట్లు ఉన్నా కథనంపైనా దృష్టిపెట్టి ఉంటే కొంతలో కొంతనైనా ప్రేక్షకుడికి సంతృప్తి మిగిలి ఉండేది.

  నాసిరకంగా..

  నాసిరకంగా..

  ఇక సాంకేతిక విషయాలకు వస్తే ఫొటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి మరో బలం. ఈ రెండు అంశాలు సినిమాకు మంచి తోడ్పాటును అందించాయి. ప్రేక్షకుడికి మంచి ఫీలింగ్‌ను కలిగిస్తాయి. టేకింగ్ విషయానికి వస్తే సినిమాలో మర్డర్లు (బ్రహ్మాజీ హత్య తప్పితే) అనేవి చాలా నాసిరకంగా ఉంటాయి. సినిమాకు కీలకమైన హత్యలను చాలా పేలవంగా చిత్రకరించడం కేశవకు మరో మైనస్ పాయింట్. రావు రమేశ్, అజయ్, బ్రహ్మజీ పాత్రలను సరిగా డిజైన్ చేయకపోవడం మరో బలహీనత. ఇలా పలు బలహీనతల మధ్య కేశవ నలిగిపోయింది. అయితే ఇలాంటి లోపాలను పట్టించుకోకుండా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు ఆదరిస్తే నిఖిల్, సుధీర్ వర్మ కెరీర్‌లో మరో హిట్ పడే అవకాశం ఉంది.

  మరోసారి డిఫరెంట్‌గా నిఖిల్

  మరోసారి డిఫరెంట్‌గా నిఖిల్

  ఎప్పడు డిఫరెంట్ రోల్స్‌ను చేసే నిఖిల్ మరోసారి కేశవగా వైవిధ్యమున్న పాత్రలో కనిపించాడు. కేశవ్ ఓ అరుదైన ఆరోగ్య సమస్యతో డెక్ట్రోకార్డియా అనే బాధపడుతుంటాడు. అందరి మాదిరిగా కాకుండా గుండె కుడివైపు ఉంటుంది. ఆ కారణంగా ఒత్తిడిని, బాధను తట్టుకోలేడు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరుకొంటాడు. ఇలాంటి పరిస్థితిలో కళ్ల ముందే తల్లి,దండ్రులు మరణించి, చెల్లెలు పరిస్థితి దారుణంగా తయారై ఎన్నో బాధలను దిగమింగే పాత్ర కేశవ్ పాత్రలో నిఖిల్ కనిపించాడు. తన పాత్ర మేరకు పూర్తి న్యాయం చేకూర్చాడు. కెరీర్ పరంగా నిఖిల్ ఇది మంచి చిత్రంగానే మిగులుతుంది. ఈ చిత్ర భారాన్ని పూర్తిగా నిఖిల్ మాత్రమే మోశాడని చెప్పవచ్చు. అయితే కథలో విషయం లేకపోవడం నిఖిల్ ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

   రెగ్యులర్ పాత్రలో రీతూవర్మ

  రెగ్యులర్ పాత్రలో రీతూవర్మ

  పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైన రీతూవర్మ కేశవ్ చిత్రంలో సత్యభామ పాత్రను పోషించింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి చాలా పెద్దదైనప్పటికీ.. పెద్దగా గుర్తిండిపోయే పాత్ర కాదు. రొటీన్‌గా కనిపించే పాత్ర. పాటలు, డ్యాన్స్‌లకు ఈ చిత్రంలో అవకాశం లేకపోవడంతో రీతూవర్మ అంతగా ఆకట్టుకోలేకపోయింది. తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించింది.

  ఆకట్టుకోలేని ప్రియదర్శి..

  ఆకట్టుకోలేని ప్రియదర్శి..

  పెళ్లిచూపులు చిత్రం ద్వారా టాలీవుడ్ లభించిన కమెడియన్ ప్రియదర్శి మరోసారి రొటీన్ పాత్రలోనే కనిపించాడు. ఈ చిత్రంలో హీరోకు ఫ్రెండ్‌గా కనిపించాడు. ఆయన పాత్రకు ప్రత్యేకత ఏమీ లేకపోవడంతో గుంపులో గోవిందయ్యగా మారిపోయాడు. ప్రియదర్శిలో ఉండే టాలెంట్‌ను
  దర్శకుడు సరిగా వాడుకోలేదనిపిస్తుంది.

  పసలేని విలనిజం..

  పసలేని విలనిజం..

  ఇక సినిమాలో అజయ్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, రావు రమేశ్‌లు ప్రధాన విలన్లు. వీరిలో రావు రమేశ్ పాత్ర తప్పా మరో పాత్ర అంత గొప్పగా అనిపించదు. హీరో మర్డర్ చేయాల్సినంత విలన్లుగా చిత్రీకరించకపోవడం దర్శకుడి వైఫల్యం కొట్టొచ్చినట్టే కనిపిస్తుంది. చివర్లో రావు రమేశ్ తనదైన మార్కు నటనను ప్రదర్శించే ప్రయత్నం చేశాడు కానీ అప్పటికే సమయం చేజారిపోయి ఉంటుంది. రావు రమేశ్ ద్వారా కొంత సినిమా ఆసక్తిగా మిగిలినప్పటికీ.. ఆ ప్రభావం కొన్ని నిమిషాలు మాత్రమే.

  ఆకట్టుకోలేని ఇషా

  ఆకట్టుకోలేని ఇషా

  ప్రత్యేక ఆఫీసర్‌గా ఇషా కోపికర్ మరోసారి టాలీవుడ్ తెరపై కనిపించింది. ఆమె పాత్రను చాలా పేలవంగా చిత్రీకరించాడు. అప్పుడు ఆ పాత్ర చేసే పనులు చాలా సిల్లీగా అనిపిస్తాయి. వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి. ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిన యాంకర్ అనసూయ చేసిన ప్రేక్షకులకు కొంత ఊరట ఉండేదేమో..

  సత్య రవి మెరుపులు

  సత్య రవి మెరుపులు

  కారు డ్రైవర్‌గా సత్య రవి తన కామెడీతో మరోసారి మెరుపులు మెరిపించాడు. సినిమా సెకండాఫ్‌లో కనిపించిన కొన్నిసీన్లలోనైనా గుర్తుండిపోయే విధంగా సహజమైన కామెడీని పండించాడు. ఇక వెన్నెల కిషోర్ కామెడీ ఎబ్బెట్టు, చాలా పేలవంగా, రొటీన్‌గా ఉన్నాయి. వెన్నెల కిషోర్ ‌కు సంబంధించిన క్లాస్ రూమ్ సీన్లు చాలా బోర్‌గా ఉంటాయి.

  సినిమాటోగ్రఫీ అదుర్స్..

  సినిమాటోగ్రఫీ అదుర్స్..

  కేశవ చిత్రాన్ని అందంగా తెరమీద చూపించడంలో సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి కీలక పాత్రను పోషించాడు. అమలాపురం అందాలను అద్భుతంగా చూపించి ఆకట్టుకొన్నాడు. సాదాసీదాగా సాగిపోయే సినిమాలో ప్రేక్షకుడు లీనమైపోయేలా తన సినిమాటోగ్రఫీతో అలరించాడు. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.

  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుడ్..

  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుడ్..

  ఇక ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించిన సన్నీ ఎంఆర్ మరో అదనపు ఆకర్షణ. సన్నివేశాలకు తగినట్టుగా ఆయన అందించిన రీరికార్డింగ్ చాలా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

  కథను విడిచి టేకింగ్‌తో..

  కథను విడిచి టేకింగ్‌తో..

  దర్శకుడు సుధీర్ వర్మ రొటీన్ కథనే నమ్ముకొని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. కానీ కథ, కథనంపై సరిగా దృష్టిపెట్టకపోవడం వల్ల సినిమా రొటోన్‌గా సాగిపోతుంది. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు చేతిలో ఉన్నా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు. అనవసరమైన పేలవమైన ట్విస్టులతో మిగితా పాత్రలకు అన్యాయం చేశాడనే చెప్పవచ్చు. మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరున్న సుధీర్ వర్మ కథను విడిచి టేకింగ్‌తో సాము చేయాలనుకోవడం సాహసమే అని చెప్పవచ్చు. నిఖిల్, రీతూవర్మ మధ్య లవ్ సీన్లు జొప్పించినా ఓ వర్గం ప్రేక్షకులకు కాలక్షేపంగా ఉండేదేమో.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  పాజిటివ్ పాయింట్స్
  ఫొటోగ్రఫీ
  బ్యాక్ గ్రౌండ్ స్కోర్

  నెగిటివ్ పాయింట్స్
  కథ
  కథనం
  డైలాగ్స్
  పాటలు,
  కామెడీ
  పాత్రల చిత్రీకరణ

  తెర ముందు.. తెర వెనుక..

  తెర ముందు.. తెర వెనుక..

  సినిమా పేరు: కేశవ
  నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, రితూ వర్మ, ఇషా కొప్పికర్, రావు రమేశ్, బ్రహ్మజీ, అజయ్, రాజా రవీంద్ర,
  వెన్నెల కిషోర్, ప్రియదర్శి పులికొండ, రవి ప్రకాశ్, సుదర్శన్, మధుసూదన్, సమీర్
  దర్శకత్వం, రచన: సుధీర్ వర్మ
  నిర్మాత: అభిషేక్ నామా
  సినిమాటోగ్రాఫర్: దివాకర్ మణి
  మ్యూజిక్‌: సన్నీ ఎంఆర్, మికీ మ్యాక్లియరీ
  ఎడిటింగ్: ఎస్ఆర్ శేఖర్
  రిలీజ్ డేట్ః 19 మే 2017

  English summary
  Actor Nikhil Sidharth, Director Sudheer Varma latest movie is Keshav. This movie get good hype with trailer and teaser. This movie released on May 19th. Nikhil as keshava is Law student. He targets five police officer for fullfil his revange.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X