Khiladi movie review.. కిల్ కిల్ అంటూ రవితేజ డిజాస్టర్ షో

Rating:
1.5/5
Star Cast: రవితేజ, అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరీ, డింపులు హయతీ
Director: రమేశ్ వర్మ

వీర లాంటి అట్టర్ ఫ్లాప్ మూవీ తర్వాత మరోసారి మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేశ్ వర్మ కాంబినేషన్‌లో మూవీ వస్తుందంటే అందరిలోను ఒకరకమైన ఆశ్చర్యం కలిగింది. అయితే ఈసారి భారీ బడ్జెట్, హంగులు కాస్త ఎక్కువగానే కనిపించడంతో హిట్టు కొడతారా అనే ఆసక్తి కలిగింది. అయితే వారిద్దరి మధ్య ఆఫ్ స్క్రీన్ కీచులాటలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా రిలీజ్‌కు ముందు నెలకొన్న అంచనాలను ఖిలాడి మూవీ తప్పని నిరూపించింది. రమేశ్ వర్మ, రవితేజ ఇద్దరు కలిసి వెండితెర మీద ఎలాంటి రచ్చ రంబోలా చేశారో ఓసారి లుక్కేద్దాం..

ఖిలాడీ కథ ఏమిటంటే?

ఖిలాడీ కథ ఏమిటంటే?

గాంధీ (రవి తేజ) డబ్బు సంపాదించాలనే విపరీతమైన కోరిక ఉన్న ఇంటర్నేషనల్ క్రిమినల్. 10 వేల కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలులో ఉంటాడు. గాంధీ జీవితంపై రీసెర్చ్ చేస్తున్న పూజ (మీనాక్షి చౌదరీ) అతడిని జైలులో కలుసుకొంటుంది. అయితే పూజను తాను అల్లిన కట్టుకథతో బోల్తా కొట్టించి జైలు నుంచి తప్పించుకొంటాడు.

 ఖిలాడీ సినిమాలో ట్విస్టులు

ఖిలాడీ సినిమాలో ట్విస్టులు

అయితే జైలులో పూజకు గాంధీ చెప్పిన కట్టుకథ ఏమిటి? జైలు నుంచి తప్పించుకొన్న గాంధీ ఏం చేశాడు? ఖిలాడీ కథలో గాంధీకి రామకృష్ణ (ఉన్ని ముకుందన్) పాత్రకు ఉన్న సంబంధమేమిటి? తన భార్య చిత్ర (డింపుల్ హయతీ), తన అత్తమామలు పుట్టపర్తి, చంద్రకళ (అనసూయ, మురళీశర్మ)తో గాంధీ చేసిన మాస్టర్ ప్లాన్ ఏమిటి? గాంధీ ఎత్తులకు సీబీఐ ఆఫీసర్ అర్జున్ భరద్వాజ్ (అర్జున్ సర్జా) వేసిన పై ఎత్తు ఏమిటి? రాజకీయ నేత గురు సింగం (ముఖేష్ రుషి), అతడి కొడుకు బాల సింగం (నిక్తిన్ ధీర్)‌ను 10 వేల కోట్ల విషయంలో ఎలా బోల్తా కొట్టించాడు? గాంధీ ఆడిన నాటకంలో డీఐజీ జయరాం (సచిన్ కేడ్కర్), పెంపుడు తండ్రిగా చెప్పుకొనే రాజశేఖర్ (రావు రమేష్) పాత్రలు ఏమిటి? చివరకు 10 వేల కోట్ల రూపాయలను గాంధీ ఏం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఖిలాడీ సినిమా కథ.

ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్‌ అయిన గాంధీని ప్రియ కలిసిన నేపథ్యంలో ఓ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ ప్రారంభమయ్యే కథ అనుక్షణం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. వాలి, పాలిపోయిన ముఖంతో రవితేజను తెర మీద చూడటం కూడా కష్టంగా అనిపిస్తుంది. దానికి తోడు రవితేజతో రమేశ్ వర్మ చేయించిన ఓవరాక్షన్ అద్యంతం వెగటుపుడుతుంది. ఇలాంటి చెత్త, నాసిరకమైన కథ, కథనాలతో సినిమాను ఇలా కూడా తీయవచ్చా? అనే ఫీలింగ్ వెంటాడుతుంటుంది. ఇలా పేలవంగా కథ సాగుతున్న సమయంలో ప్రేక్షకులను అబ్బుర పరుద్దామనే ఫీలింగ్‌తో దర్శకుడు ఇచ్చే ఓ ట్విస్టుతో ఎలాంటి థ్రిల్ లేకుండా ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

సెకండాఫ్‌లో సహనానికి ఇలా పరీక్ష

సెకండాఫ్‌లో సహనానికి ఇలా పరీక్ష


ఖిలాడీ ఫస్టాఫ్‌నే భరించలేమనే అసహనంతో ఊగిపోతున్న ప్రేక్షకులకు సెకండాఫ్‌లో మరింత నరకం చూపించే ప్రయత్నం రవితేజ, దర్శకుడు రమేశ్ వర్మ చేశారనే అభిప్రాయం కలుగుతుంది. లాజిక్‌లోని సన్నివేశాలు, అర్ధంపర్ధం లేకుండా వచ్చే సన్నివేశాలు.. బలవంతంగా జొప్పించిన పాటలు ప్రతీ క్షణం ప్రేక్షకుడికి ఊచకోత మాదిరిగానే అనిపిస్తుంది. చివరకు పిల్లలు బొమ్మలాట ఆడుకొన్నట్టు తుపాకుల మోతలు, 80 దశకంలో మల్టీస్టారర్ సినిమాలో వాటాలు వేసుకొని వేసుకొని చేసినట్టు ఫైట్లతో అత్యంత నాసిరకమైన క్లైమాక్స్‌తో సినిమాను మమా అనిపించారు. ఇటీవల కాలంలో వచ్చిన అత్యంత పేలవమైన చిత్రమనే ఫీలింగ్‌ను ఖిలాడీ కలుగజేస్తుంది.

రవితేజ నటన, లుక్ గురించి

రవితేజ నటన, లుక్ గురించి


గత చిత్రాలు (ఫ్లాప్ అయినప్పటికీ) రవితేజ లుక్, బాడీ లాంగ్వేజ్ పరంగా కొంతైనా ఆకట్టుకొనే వాడు. కానీ ఖిలాడి సినిమాలో రవితేజను చూస్తే వయసు మీద పడినట్టు ముఖంపై ముడతలు.. లిటరల్‌గా యంగ్ హీరోయిన్ల పక్కన ముసలి హీరోగా కనిపించాడని చెప్పవచ్చు. తన లుక్ పరంగా కూడా కనీసం జాగ్రత్తలు తీసుకోలేదనే విషయం తెరమీద స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పటి మాదిరిగానే రవితేజ వెకిలి నవ్వులు, ఆయన తరహా సిగ్నేచర్ స్టెప్పులు, బాడీ లాంగ్వేజ్‌తో కంపరం పుట్టించాడు. ఇకనైనా రవితేజ మంచి కథలతో వస్తే.. మళ్లీ అభిమానుల, ప్రేక్షకుల ఆదరించడానికి అవకాశాలు ఉన్నాయని ఫీలింగ్ కలుగుతుంది. ఖిలాడీలో రవితేజ ఎలాంటి కొత్తదనం చూపించలేకపోయారని నిస్పందేహంగా చెప్పవచ్చు.

హీరోయిన్లు, ఇతర నటీనటుల గురించి

హీరోయిన్లు, ఇతర నటీనటుల గురించి

ఇక ఇతర పాత్రల విషయానికి వస్తే.. మీనాక్షి చౌదరీ, డింపుల్ హయత్ అందాల ఆరబోతలో పోటీ పడ్డారు. ఒకరికి మించి మరొకరు బికినీ షాట్లతో అలరించారు. నటనకు ఏ మాత్రం స్కోప్ లేని పాత్రలో ఇద్దరు అలరించారు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పాత్ర ఆటలో అరటి పండుగా కనిపిస్తుంది. గురు సింగం, బాలసింగం పాత్రల్లో కనిపించిన ముఖేష్ రుషి, నిక్తిన్ ధీర్ క్యారెక్టర్ అత్యంత దారుణంగా ఉంది. రావు రమేష్ తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించాడు సచిన్ కేడ్కర్‌ను ఎందుకు పెట్టారో అర్ధం కాని పరిస్థితి. అనసూయ అందాల ఆరబోతతో ఆకట్టుకొన్నది. మురళీశర్మ నామమాత్రంగానే మిగిలిపోయాడు. వెన్నెల కిషోర్ కామెడీ మిస్ ఫైర్ అయింది.

టెక్నికల్ విభాగాల పనితీరు గురించి

టెక్నికల్ విభాగాల పనితీరు గురించి

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. పుష్పతో అద్బుతమైన డైలాగ్స్ అందించిన శ్రీకాంత్ విస్సా దారుణంగా నిరాశపరిచారు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ సీన్లు, రేసింగ్ షాట్స్ బాగున్నాయి. రవితేజను ఓ మోస్తారుగా తెర మీద కనిపించేలా చేయడానికి సుజిత్ చాలానే కష్టపడ్డారని అర్ధమైంది. అమర్ రెడ్డి కుడుములకు ఎడిటింగ్ కత్తిమీద సాము అయినట్టు అనిపించింది. కనీసం ఓ 20 నిమిషాల సినిమాను ట్రిమ్ చేయడానికి స్కోప్ ఉందనిపిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ చేసినట్టు ఎక్కడా కనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో రీరికార్డింగ్ బాగుంది. నిర్మాణ విలువ పుష్కలంగా ఉన్నాయనే ఫీలింగ్ కలిగినప్పటికీ.. నిర్మాత సత్యనారాయణ కోనేరు పెట్టిన ఖర్చు తెర మీద పెద్దగా ఉపయోగం లేనట్టు అనిపిస్తుంది. వెరసి ఓ నాసిరకమైన సినిమా నిర్మాత ఖాతాలో చేరడం ఖాయమనే ఫీలింగ్ కలుగుతుంది.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

రవితేజ సినిమా అంటే మినిమమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉండేది. ఖిలాడి సినిమా చూస్తే ఎలాంటి వినోదం లేని అతుకుల బొంతగా కనిపిస్తుంది. ఎలా సినిమా తీయకూడదో అనే విధంగా రమేష్ వర్మ తన దర్శకత్వ ప్రతిభను చూపించుకొన్నాడు. వెరసి ఈ సినిమా థియేటర్‌కు వెళ్లి భరించడం కష్టమనే ఫీలింగ్ కలిగిస్తుంది. ప్రస్తుతం టికెట్ ధరల మోత భారీగా ఉన్న సమయంలో ఖిలాడి సినిమాకు దూరంగా ఉంటే మంచిది.

Recommended Video

Khiladi Movie : Dimple Hayathi ,Meenakshi Chaudhary Visits Sandhya Theatre | Filmibeat Telugu
ఖిలాడి మూవీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

ఖిలాడి మూవీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు: రవితేజ, అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరీ, డింపులు హయతీ, నిక్తిన్ ధీర్, సచిన్ ఖేడ్కర్, ముఖేష్ రుషి, ఠాకూర్ అనూప్ సింగ్, రావు రమేష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అనసూయ, కేశవ్ దీపక్ తదితరులు
రచన, దర్శకత్వం: రమేశ్ వర్మ
నిర్మాత: కొనేరు సత్యనారాయణ
సినిమాటోగ్రఫి: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు
ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
బ్యానర్: పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2022-02-11


ట్యాగ్ లైన్: కిల్ కిల్ అంటూ ఖిలాడి ఊచకోత

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X