twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కిరాక్ పార్టీ సినిమా రివ్యూ: రొమాంటిక్ కామెడీ

    By Rajababu
    |

    Recommended Video

    Kirak Party Review కిరాక్ పార్టీ రివ్యూ

    Rating:
    2.5/5
    Star Cast: నిఖిల్ సిద్ధార్థ, సిమ్రాన్ పరీంజా, సంయుక్త హెగ్డే
    Director: శరణ్ కొప్పిశెట్టి

    హ్యాపీడేస్ చిత్రంతో కెరీర్ ఆరంభించిన నిఖిల్ సిద్ధార్థ్ టాలీవుడ్‌లో సక్సెస్‌లతో దూసుకెళ్తున్నారు. స్వామి రారా సినిమాతో ప్రారంభమైన విజయాల వేట కేశవ వరకు సాగింది. తాజాగా కన్నడంలో విజయవంతమైన కిరిక్ పార్టీ సినిమా రీమేక్‌గా మలిచి కిరాక్ పార్టీగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోయిన్లుగా సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా నటించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా, దర్శకుడు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందించారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రం మార్చి 16న రిలీజ్ అయింది. నిర్మాత అనిల్ సుంకర నిర్మాణ సారథ్యంలో పక్కా కాలేజీ, యూత్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం గురించి తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     కిరాక్ పార్టీ కథ

    కిరాక్ పార్టీ కథ

    కృష్ణ (నిఖిల్ సిద్ధార్థ) ఇంజినీరింగ్ స్టూడెంట్. ఐదుగురు ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ కాలేజీలో హంగామా చేస్తుంటాడు. అలాంటి కృష్ణ తన సీనియర్ మీరాతో ప్రేమలో పడుతాడు. కానీ ఓ కారణంగా మీరా అతడికి దూరమవుతుంది. దాంతో సరదాలకు దూరమైన కృష్ణ వైరాగ్యానికి లోనవుతాడు. ఆ తర్వాత కాలేజీలో జూనియర్ సత్య (సంయుక్త హెగ్డే) కృష్ణను చూసి ప్రేమలో పడుతుంది. కృష్ణ జీవితంలోకి సత్య ప్రవేశించిన తర్వాత ఏమి జరిగిందనేది కిరాక్ పార్టీ సినిమా కథ.

    కృష్ణ జీవితంలోకి

    కృష్ణ జీవితంలోకి

    తాను అమితంగా ప్రేమించిన మీరాకు కృష్ణ ఎందుకు దూరమయ్యాడు? ఏ పరిస్థితుల్లో మీరాను కోల్పోయాడు? సరదాగా ఉంటే కృష్ణ ఒక్కసారిగా వైరాగ్యానికి లోనవ్వడానికి కారణం? కృష్ణ జీవితంలోకి సత్య ప్రవేశించిన తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకు తెరపైన సమాధానం కోసం కిరాక్ పార్టీ చూడాల్సిందే..

    ఫస్టాప్‌లో కథ, కథనాలు

    ఫస్టాప్‌లో కథ, కథనాలు

    కిరాక్ పార్టీ తొలిభాగంలో కాలేజీ వాతావరణం, సీనియర్లు, జూనియర్లకు మధ్య ర్యాగింగ్, గొడవలు, కొట్లాటలతో సాగిపోతుంది. ఆ తర్వాత మీరాకు కృష్ణ దగ్గరవ్వడంతో కథ రొమాంటిక్‌గా మారుతుంది. కృష్ణ జీవితం సాఫీగా సాగుతుందనుకొంటున్న సమయంలో ఒక్క కుదుపు కుదిపేస్తుంది. ఎవరూ ఊహించిన ఓ ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.

    రెండోభాగంలో కథ, కథనాలు

    రెండోభాగంలో కథ, కథనాలు

    ఇంటర్వెల్ తర్వాత కాలేజీలో కృష్ణ గంభీరమైన వ్యక్తిగా కనిపిస్తాడు. సరదాలకు దూరమై కాలేజీ గ్యాంగ్ వార్ మధ్య కాలం వెల్లదీయడం లాంటి జరుగుతుంటాయి. ఈ మధ్యలో సత్య అతడి జీవితంలోకి ప్రవేశించడంతో మళ్లీ కథనం కొంత పుంజుకొన్నట్టు కనిపిస్తుంది. మీరా దూరమైన కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లిన కృష్ణ వాస్తవ జీవితంలోకి రావడంతో కథకు ముగింపు పడుతుంది.

    దర్శకుడి ప్రతిభ

    దర్శకుడి ప్రతిభ

    కన్నడ కిరిక్ పార్టీని పోల్చితే శరణ్ కొప్పిశెట్టి తెలుగులో కిరాక్ పార్టీని పూర్తిస్థాయి కాలేజీ, యూత్ చిత్రంగా రూపొందించే ప్రక్రియలో తడబాటుకు గురయ్యాడని చెప్పవచ్చు. కాలేజీలో సన్నివేశాల చిత్రీకరణలో, కృష్ణ, మీరా లవ్ ఎపిసోడ్‌లో ఎలాంటి కొత్తదనం కనిపించదు. ఆసక్తికరంగా సన్నివేశాలను రూపొందించడంలో విఫలమైనట్టు కొట్టొచ్చి కనబడుతాయి. కథ, కథనాలు, సన్నివేశాల రూపకల్పనలో రొటీన్ వ్యవహారమే ప్రేక్షకుడికి ఎదురవుతుంది. ఓవరాల్‌గా హ్యాపీడేస్, ప్రేమమ్ లాంటి సినిమాలకు మించి ఆశించిన ప్రేక్షకులకు కొంత నిరాశనే కలిగించాడని చెప్పవచ్చు.

     నిఖిల్ ఫెర్ఫార్మెన్స్

    నిఖిల్ ఫెర్ఫార్మెన్స్

    హీరో నిఖిల్ పాత్ర విషయానికి వస్తే పలు రకాల షేడ్స్‌ కనిపిస్తాయి. యూత్ అల్లరి చిల్లరిగాగా మెప్పించాడు. సెకండాఫ్‌లో సీనియర్ స్టూడెంట్‌గా అమ్మాయిలను ఏడిపిస్తే తాట తీసే లీడర్‌గా ఆకట్టుకొన్నాడు. కథ, కథనాల్లో దమ్ము లేకపోవడం వల్ల నిఖిల్ తన పాత్రను మించి ప్రతిభను బయటపెట్టలేకపోయాడనిపిస్తుంది.

     సిమ్రాన్ యాక్టింగ్

    సిమ్రాన్ యాక్టింగ్

    మీరాగా సిమ్రాన్ పరీంజా కనిపించింది. సిమ్రాన్‌ది సాదాసీదా అమ్మాయి పాత్ర. ప్రేక్షకుడి సానుభూతిని పొందే అవకాశం ఉన్నప్పటికీ.. ఆమె పాత్ర పెద్దగా ఎలివేట్ కాలేకపోయింది. తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించింది.

    సంయుక్త హెగ్డే నటన

    సంయుక్త హెగ్డే నటన

    ఇక సత్యగా కనిపించిన సంయుక్త హెగ్డేది అందరినీ ఆటపట్టించే తుంటరి అమ్మాయి పాత్ర. సత్య పాత్ర ఎంట్రీ తర్వాత కథలో కొంత ఆహ్లాదకరంగా మారుతుంది. రొటిన్‌గా సాగిపోతున్న పాత్రలో ఓ మెరుపుగా కనిపిస్తుంది. కాకపోతే ఆ మెరుపు ఎక్కువ కాలం కనిపించకపోవడం సంయుక్త మ్యాజిక్ వర్కవుట్ కాలేదు.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    కాలేజ్ గ్యాంగ్‌లో నిఖిల్ ఫ్రెండ్స్‌గా వివా రాఘవ్, బ్రహ్మాజీ తదితరులు నటించారు. అయితే కాలేజ్ గ్యాంగ్‌లోని పాత్రధారుల ఫెర్ఫార్మెన్స్ చాలా పేలవంగా అనిపిస్తుంది. ప్రేక్షకులతో ఏ ఒక్కరు కనెక్ట్ కావడానికి అవకాశమే లేకపోయింది. బ్రహ్మాజీ ఒకట్రెండు సీన్లలో ఒకే అనిపించారు. రఘు కారుమంచి పాత్రకు స్కోప్ లేకపోయింది. మిగితా పాత్రలన్నీ నామమాత్రంగానే మిగిలిపోయాయి.

    ఫీల్‌గుడ్ మ్యూజిక్

    ఫీల్‌గుడ్ మ్యూజిక్

    కిరాక్ పార్టీ సినిమాకు ప్రధానమైన బలం పాటలు, రీరికార్డింగ్. అంజనీష్ లోకనాత్ అందించిన మ్యూజిక్ ఒక్కటే సినిమాలో ఫీల్‌గుడ్‌గా అనిపిస్తుంది. గురువారం పాట, ఇతర పాటలు తెరమీద ఆకట్టుకొన్నాయి. సెకండాఫ్‌లో రీరికార్డింగ్ చక్కగా ఉంటుంది.

     ఇతర సాంకేతిక విభాగాలు

    ఇతర సాంకేతిక విభాగాలు

    అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎంఆర్ వర్మ‌కు ఎడిటర్‌గా చాలా పని మిగిలిపోయిందనే భావన కలుగుతుంది. వర్మ కత్తెరకు ఇంకా పనిపెట్టాల్సి ఉంటుందేమో. సినిమా నిడివి ప్రేక్షకుల సహనానికి పరీక్షే అనిచెప్పవచ్చు.

     ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ఏకే ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత అనిల్ సుంకర నిర్మాణ సారథ్యం సగటు సినిమా ప్రేక్షకుడి అభిరుచికి తగినట్టుగా ఉంది. సినిమాను చాలా రిచ్‌గా కనిపించడానికి ఎక్కడా రాజీ పడలేదనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ కథ, కథనాలపై మరికొంత జాగ్రత్త పడాల్సిందోమోననే భావన మాత్రం కలగడం సహజం.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    కాలేజీలో లవ్ బ్యాక్ డ్రాప్ సినిమాలంటే ప్రేమదేశం, చెలి, హ్యాపీడేస్, ప్రేమమ్ లాంటి సినిమాలు కళ్ల ముందు కదలాడుతాయి. ఆ చిత్రాలు రొమాంటిక్ సినిమాలకు ఓ ప్రామాణికంగా నిలిచాయి. అలాంటి చిత్రాలతో కనిపించిన ఫీలింగ్స్, ఎమోషన్స్ కిరాక్ పార్టీలో కాస్త తక్కువే అనిచెప్పవచ్చు. టపాటపా పేలే డైలాగ్స్, హ‌‌ృదయానికి టచ్ చేసే సీన్లు తక్కువగా కనిపిస్తాయి. ప్రజెంట్ యూత్ ట్రెండ్ తగ్గట్టుగా కిరాక్ పార్టీని మలిచారు. యూత్ ఆడియెన్స్‌ను మెప్పిస్తే కిరాక్ పార్టికి ఎదురే ఉండకపోవచ్చు.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    నిఖిల్ యాక్టింగ్
    రీరికార్డింగ్, పాటలు
    సంయుక్త హెగ్డే
    సినిమాటోగ్రఫీ

    మైనస్ పాయింట్స్
    సినిమా నిడివి
    స్క్రీన్ ప్లే
    డైలాగ్స్
    ఎడిటింగ్

    తెరముందు, తెర వెనుక

    తెరముందు, తెర వెనుక

    నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ, సిమ్రాన్ పరీంజా, సంయుక్త హెగ్డే, బ్రహ్మాజీ, రఘు కారుమంచి తదితరులు
    దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
    నిర్మాత: అనిల్ సుంకర
    డైలాగ్స్: చందు మొండేటి
    స్క్రీన్ ప్లే: సుధీర్ వర్మ
    కథ: రిశబ్ శెట్టి
    మ్యూజిక్: అంజనీష్ లోక్‌నాథ్
    ఎడిటర్: ఎంఆర్ వర్మ
    బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్
    రిలీజ్: మార్చి 16, 2018

    English summary
    Kirrak Party is a Telugu language campus romantic comedy film directed by Sharan Koppisetty and produced by Ramabrahmam Sunkara under AK Entertainments banner. The film is the remake of the most successful Kannada film Kirik Party (2016) which was directed by Rishab Shetty. The film features Nikhil Siddharth in the lead role along with Simran Pareenja, making her debut and Samyuktha Hegde reprising her role from the Kannada version. This movie released on March 16, 2018. In this occassion, Telugu Filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X