Kishkindhapuri First Review: కిష్కింధపురి మూవీ ఫస్ట్ రివ్యూ

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై యువ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన చిత్రం కిష్కిందపురి. చావు కబురు చల్లగా చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో యువ హీరో, హీరోయిన్లు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. పీరియాడిక్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్‌‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ అవుతున్నది.

టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌తో పాజిటివ్ రియాక్షన్ సొంతం చేసుకొన్న ఈ సినిమాకు దరహాస్ పాలకొల్లు, కే బాల గణేష్ స్క్రీన్ ప్లే అందించగా, క్రియేటివ్ విభాగంలో జీ కనిష్క, చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫి, నిరంజన్ దేవరమనే ఎడిటర్‌గా, మనీషా దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఇటీవల పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబైంది. ఈ సినిమాపై సెన్సార్ రివ్యూ, రన్ టైమ్ వివరాల్లోకి వెళితే..

Kishkindhapuri Review by Censor Board

కిష్కిందపురి సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు, ప్రతినిధులు చూశారు. ఈ సినిమాను తీర్చి దిద్దిన విధానంపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు ఎలాంటి అభ్యంతరాలు వారి నుంచి వ్యక్తం కాలేదు. జీరో కట్‌తో క్లీన్ ఫిలింగ్‌గా సినిమాను సర్టిఫై చేశారు. ఈ సినిమాలో భయానక దృశ్యాలు, హారర్ ఎలిమెంట్స్ ఉండటం వల్ల పూర్తి అడల్డ్ కేటగిరిలో ఉంటారు. దాంతో ఈ సినిమాకు A సర్టిఫికేట్‌ను అధికారులు జారీ చేశారు అని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

అయితే ఈ సినిమా కథను క్రిస్పీగా చెప్పేందుకు దర్శక, నిర్మాతలు నిర్ణయం తీసుకొన్నారు. ఫీల్ గుడ్ అంశాలు, థ్రిల్లింగ్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను జోడించి సాగదీత లేకుండా కంటెంట్‌ను క్లియర్‌గా క్లారిటీతో చెప్పేందుకు ప్రయత్నించారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ఘోస్ట్ పాత్రలో మంచి పెర్ఫార్మెన్స్‌తోపాటు ఎమోషన్స్‌ను పండించారు. సాయి శ్రీనివాస్ తన పాత్రతో ఈ సినిమాకు మరింత బలంగా మారారు. దర్శకుడు కౌశిక్ అనుసరించిన కథనం ఆకట్టుకొనేలా ఉంటుందని సెన్సార్ నుంచి కామెంట్స్ వినిపించాయి అని చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.

ఇక ఈ సినిమాలో బిగ్ స్క్రీన్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించే అంశాలు బాగానే ఉన్నాయి. వినోదానికి పెద్ద పీట వేసి.. హైపర్ ఆది, సుదర్శన్ లాంటి వాళ్లతో నవ్వుల పూలు పూయించే ప్రయత్నం చేశారు. అలాగే ఈ సినిమాను నిడివిని 2 గంటల 5 నిమిషాలకు అంటే 125 నిమిషాలకు పరిమితం చేశాం. ఈ సినిమా చక్కటి అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

సెన్సార్ రివ్యూ ముగిసిన తర్వాత షైన్ స్క్రీన్ ట్వీట్ చేస్తూ.. కిష్కింధపురి సినిమాకు జీరో కట్స్‌తో A సర్టిఫికెట్ ఇచ్చారు. థియేటర్‌లో అరుపులతో అల్లరి చేయడానికి సిద్దమవ్వండి. ఇది నీ ఏజ్ హారర్ సినిమా. పిల్లలు, గుండె బలహీనంగా ఉండే వాళ్లు ఈ సినిమాకు దూరంగా ఉండండి. ఈ చిత్రం సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ అవుతున్నది అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X