twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాలం చెల్లిన కామెడీ- 'కితకితలు'

    By Staff
    |

    Kitakitalu
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: కితకితలు
    విడుదల తేదీ: 05 ఏప్రిల్‌ 2006
    నటీనటులు: అల్లరి నరేష్‌, గీతాసింగ్‌, మధుశాలిని, కృష్ణభగవాన్‌,
    గిరిబాబు, రఘబాబు, కొండవలస లక్ష్మణరావు, బ్రహ్మానందం, సన,
    జయప్రకాష్‌ రెడ్డి, ఎవిఎస్‌, సునీల్‌ తదితరులు
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత: ఇవివి సత్యనారాయణ

    హాస్యానికి అని కాలరెగరేసే ఇవివి చిత్రాలకు కొంతకాలంగా కలిసి రావడం లేదు. కొడుకుని హీరోగా నిలబెడదామని 'కితకితలు'తో చేసిన ప్రయత్నం పనికిరాకుండా పోయింది. కుండపోతలా డైలాగులు, స్క్రీన్‌ టైంతో కొద్దిగా కూడా కదలని కథనం, పాతకాలం టేకింగ్‌ సినిమాను తలకిందులు చేశాయి.

    రేలంగి రాజబాబు (నరేష్‌) కొత్తగా ఉద్యోగంలో చేరిన ఎస్సై. ఇంట్లో వాళ్ళంతా ఉరేసుకుంటానని బెదిరిస్తే తప్పని స్ధితిలో కోటీశ్వరురాలు, స్ధూలకాయురాలైన సౌందర్య (గీతాసింగ్‌)ను పెళ్ళాడుతాడు. ఇష్టం లేని పెళ్ళితో కష్టంగా హనీమూన్‌కి వెళ్తాడు. అక్కడే రంభ (మధుశాలిని) పరిచయమవుతుంది. అతని డబ్బు చూసి మోజుపడుతుంది. రాజబాబు తన భార్యని చిన్న చూపు చూసి రంభ వెంటపడతాడు. పెళ్ళానికి విడాకులిచ్చి మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. చివరికి సౌందర్య రంభ బారి నుంచి తన భర్తను ఎలా కాపాడుకుందన్నది తెరమీద చూడాలి.

    గతంలో వచ్చిన భాగ్యరాజా 'చిన్నిల్లు' కమల్‌హసన్‌ 'సతీ లీలావతి' కథలు గుర్తుకు తెచ్చే ఈ కథ మొత్తం డైలాగ్‌ కామెడీపై ఆధారపడ్డారు. సినిమాకు ప్రాణమైన స్క్రీన్‌ప్లేని పక్కన పెట్టి కథ నడిపారు. పాటలు లేవన్నారు పాత సినిమా పల్లవులు ప్రతిచోటా ప్రత్యక్షమవటం బోరే. మామూలు కథల కన్నా కామెడీ తీయడమే కష్టం. ప్రతి డైలాగునీ కామెడీ చేయాలనే తాపత్రయం, ప్రాసకోసం పాకులాట వదిలి కథ, కథనాలపై దృష్టి పెడితే మంచి చిత్రం వచ్చుండేది. తెరనిండా కుప్పలుగా కామెడీ నటులే కానీ నవ్వే ప్రేక్షకులే లేరు. టీవీ సీరియల్‌ లాంటి టేకింగ్‌, నిర్మాణ విలువల లోపం సినిమాను మరింత దిగజార్చాయి. కళ్ళు మూసుకుంటే కథ వినపడే ఈ సినిమా ఇది. ఈ సినిమా ఏ సెంటర్‌లోనూ ఆడే అవకాశం లేదు. నరేష్‌ నటన ఫరవాలేదనిపించినా ఇలాంటి చిత్రాల్లో నటిస్తే అతని కెరీర్‌ కష్టమే. సంగీతం, కెమెరా, ఎడిటింగ్‌ శాఖల గురించి చెప్పుకోవాల్సింది ఏమీలేదు. హాస్యప్రియులకు ఇవివి అందించిన చేదు గుళిక ఈ సినిమా. ఈ చిత్రాన్ని చూడకపోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X