»   » భరించలేం ...(కోడి రామకృష్ణ 'నాగభరణం' రివ్యూ)

భరించలేం ...(కోడి రామకృష్ణ 'నాగభరణం' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

అరుంధతి, దేవి, అమ్మోరు వంటి చిత్రాలతో కొత్త తరహా ట్రెండ్ కు తెరలేపారు దర్శకుడు కోడి రామకృష్ణ. ఆయన తోటి దర్శకులు అంతా రిటైర్ అయినా ఆయన సినిమాలు తీస్తున్నారు. అయితే ఆయన ఈమధ్యకాలంలో గ్యాప్ తీసుకుని, ఈ సారి కన్నడంలో చేసిన మరో విజువల్ గ్రాఫిక్స్ చిత్రం నాగభరణం. అయితే ఈ చిత్రానికి ఓ స్పెషాలిటీ ఉంది.

అదే గ్రాఫిక్స్ మాయతో తెరపై కన్నడ సూపర్ స్టార్ స్వర్గీయ విష్ణువర్దన్ ని క్రియేట్ చేయటం. దాంతో ఈ సినిమాపై అంతటా ఆసక్తి మొదలైంది. దానికి తోడు టీజర్ , ట్రైలర్స్ కూడా మంచి రెస్పాన్స్ రావటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని కోడి రామకృష్ణ అందుకోగలిగారా...అనేది ఈ రివ్యూలో చూద్దాం. ముందుగా చిత్రం కథ, ఆ తర్వాత విశ్లేషణ, ప్లస్ లు, మైనస్ లు పరికిద్దాం.


కలసంతో దుష్ట శక్తులపై పోరాటం

కలసంతో దుష్ట శక్తులపై పోరాటం

గ్రహణం సమయంలో దేవతలు తమ శక్తిని కోల్పోతూంటారు. అప్పుడు దుష్టశక్తులదే రాజ్యం. దాంతో ఆ శక్తులు రెచ్చిపోయి లోక వినాశనం మొదలెడతాయి. అలాంటి దుష్ట శక్తుల నుంచి లోకాన్ని కాపాడాలి. తమ శక్తిని కోల్పోయిన సమయంలో దుష్టశక్తులను ఎదుర్కొనేందుకు తమ శక్తినంతా దారపోసి ఓ మహాకలశాన్ని దేవతలు సృష్టిస్తారు.


ఆ కలశమే నాగాభరణం

ఆ కలశమే నాగాభరణం

మరి కష్టపడి శక్తులన్ని దారపోసి సృష్టించిన ఆ మహాకలశాన్ని ఎక్కడ దాచాలి...అంటే భూమి మీద ఓ పవిత్ర స్థలంలో ప్రతిష్టించి, శివయ్య వంశస్థులను రక్షణగా నియమిస్తారు. దానికి అష్ట‌దిగ్భంధ‌నం చేస్తారు. ఆ క‌ల‌శంను నాగ‌భ‌ర‌ణం అంటారు.


కబాలి కాదు కపాలి

కబాలి కాదు కపాలి

క‌ల‌శంను త‌మ వశం చేసుకుంటే త‌మ‌కిక తిరుగుండ‌ద‌ని లోకంలోని దుష్ట‌శ‌క్తుల‌న్నీ ప్ర‌య‌త్నాలు మొదలెడతాయి. ఆ కలసం తమ వసం అయితే దేవతల మీద ఆదిపత్యం ఈజీ అని వాటి భావన. దాంతో ఎన్నో దుష్టశక్తులు ఆ కలశాన్ని సొంతం చేసుకోవటానికి యుగయుగాలుగా ట్రైల్స్ వేస్తూంటాయి. అలా ప్రయత్నిస్తున్నవారిలో ఓ ప్రధానమైన దుష్ట శక్తి కపాలి (రాజేష్ వివేక్).


నాగమ్మ మళ్లీ పుట్టి మరీ..

నాగమ్మ మళ్లీ పుట్టి మరీ..

ఈ శక్తి కవచాన్ని శివయ్య (సాయి కుమార్) వంశం ఏళ్ళుగా కాపాడుతూ ఉంటుంది. అయితే శివయ్య కూతురు నాగమ్మ (రమ్య) శక్తి కవచం నాగాభరణం ని కాపాడే క్రమంలోనే ప్రాణాలు కోల్పోయి, శక్తి కవచాన్ని కూడా జారవిడుస్తుంది. ఆ తర్వాతి జన్మలో శక్తి కవచాన్ని ఎలాగైనా అదే స్థానంలో ప్రతిష్టింపజేయడానికి నాగమ్మ, మానస (రమ్య)గా పుట్టి నాగాభరణం కోసం పోరాడుతుంది.


నాగాభరణం కోసం పోటీ

నాగాభరణం కోసం పోటీ

అలా తరతరాలుగా పోరాటాలు జరిగేలా చేస్తున్న ఆ నాగ‌భ‌ర‌ణం అర్కియాల‌జీ డిపార్డ్‌మెంట్‌కు ద‌క్కుతుంది. వారు దాన్ని ఢిల్లీ భ‌ద్ర‌ప‌రుస్తారు. చివ‌ర‌కు ఇండియాలో జ‌ర‌గ‌బోయే వ‌ర‌ల్డ్ మ్యూజిక్ కాంపిటీష‌న్‌లో గెలిచిన వారికి నాగ‌భ‌ర‌ణం బ‌హుమ‌తిగా ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తారు. దాని కోసం అనేక మంది పోటీలు ప‌డుతుంటారు.


నాగాభరణం కోసం పోటీలో

నాగాభరణం కోసం పోటీలో

నాగచరణ్‌ (దిగంత్‌) ఓ మంచి సింగర్. సంగీతమే ప్రపంచంగా బతుకుతుంటాడు. ఏ పోటీకి వెళ్లినా అతనిదే విజయం. అది తెలుసుకొని మానస (రమ్య) అతడిని ఇష్టపడుతుంది. ఒక పోటీని ఏర్పాటు చేసి.. అందులో గెలిచే విజేతకి ఆర్కియాలజీ సంస్థకి చెందిన పురాతన కలశం బహుమతిగా అందజేయాలనుకొంటుంది ప్రభుత్వం. చరణ్ కూడా ఆ పోటీలో పాల్గొంటాడు.


నాగ్ చరణ్ నో..కక్ష పెంచుకుంటాడు

నాగ్ చరణ్ నో..కక్ష పెంచుకుంటాడు

ఆ కలశం ఎంతో మహిమ కలదని తెలుసుకొన్న వ్యాపారవేత్త ఒబెరాయ్‌ (ముకుల్‌దేవ్‌) నాగచరణ్‌ని సంప్రదిస్తాడు. ఎలాగైనా ఆ కలశాన్ని గెలిచి తనకి ఇవ్వాలని కోరతాడు. నాగచరణ్‌ అందుకు ససేమిరా అంటాడు. దాంతో కక్ష పెంచుకొన్న పారిస్ నుండి ఓ విల‌న్ గ్యాంగ్(ముకుల్ దేవ్‌, ర‌వి కాలే త‌దిత‌రులు) నాగచరణ్‌ని అంతం చేయాలని ప్రయత్నిస్తుంది.


గ్యాంగ్ లో చేరి కాపాడుతుంది

గ్యాంగ్ లో చేరి కాపాడుతుంది

నాగ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర శిష్య‌రికం చేయాల‌ని నాగ‌మ్మ‌(ర‌మ్య‌) కోరుకుని, చ‌ర‌ణ్ త‌ల్లిదండ్రులు, ఫ్రెండ్స్‌ను మ‌చ్చిక చేసుకుని వారి గ్యాంగ్‌లో చేరుతుంది. ఎంతో శ‌క్తివంత‌మైన నాగ‌భ‌ర‌ణంను గెలుచుకోవాల‌ని పారిస్ నుండి ఓ విల‌న్ గ్యాంగ్(ముకుల్ దేవ్‌, ర‌వి కాలే త‌దిత‌రులు) ప్ర‌య‌త్నం చేస్తూంటే దాన్ని మానస తిప్పి కొడుతుంది.


నాగమ్మ పాముగా మారి..

నాగమ్మ పాముగా మారి..

నాగాభరణం కోసం చ‌ర‌ణ్ టీంను త‌మ కంపెనీ త‌ర‌పున పోటీలో పాల్గొనాల‌ని విలన్స్ అడుగుతారు. కానీ అందుకు చ‌ర‌ణ్ ఒప్పుకోక పోవ‌డంతో చ‌ర‌ణ్ ఫ్రెండ్స్‌ను చంపేస్తారు. అప్పుడు నాగ‌మ్మ పాముగా మారి విల‌న్స్‌ను చంపేస్తుంది.


నాగమ్మ మనిషి కాదు..పామే..

నాగమ్మ మనిషి కాదు..పామే..

నాగ‌మ్మ మ‌నిషి కాదు, పాము అనే నిజం తెలుసుకున్న చర‌ణ్ ఏం చేస్తాడు? అస‌లు నాగ‌మ్మ ఎవ‌రు? చ‌ర‌ణ్ వ‌ద్ద‌నే ఎందుకు శిష్యురాలుగా చేరుతుంది? అస‌లు ఇంత‌కీ నాగ‌భ‌ర‌ణంను చ‌ర‌ణ్ గెలుచుకున్నాడా? మానస తన శక్తి సామర్థ్యాల్ని కోల్పోయాక ఆమె కోసం వచ్చిన మరో శక్తి ఎవరు? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.


కేవలం గ్రాఫిక్స్ నే నమ్ముకుని

కేవలం గ్రాఫిక్స్ నే నమ్ముకుని

కోడి రామకృష్ణ ఈ సారి ఎందుకనో బలమైన కథ, కథనం పైన కన్నా ఎక్కువగా గ్రాఫిక్స్ పై దృష్టి పెట్టారు. కథలేని గ్రాఫిక్స్ రాణించవు అని ఆయనే ఎన్నోసార్లు గతంలో చెప్పి ఉన్నారు. కానీ ఆ బేసిక్ రూల్ ని ఆయనే మరిచి ఈ సినిమాని మలిచారు.


సరైన జాగ్రత్తలు తీసుకోకే

సరైన జాగ్రత్తలు తీసుకోకే

క్లైమాక్స్ సన్నివేశాల్లో కన్నడ సూపర్‌స్టార్‌ విష్ణువర్ధన్‌ని గ్రాఫిక్స్‌ రూపంలో సృష్టించి చూపించమే ఈ సినిమాకు నిజానికి హైలెట్. మనకు ఇక్కడ కనెక్ట్ కాకపోయినా కన్నడంలో ఆ సీన్స్ మాత్రమే సినిమాకు యుఎస్ పి. అయితే ఎంతో కీలకంగా నిలవాల్సిన ... ఆ సన్నివేశాల్లో సహజత్వం లోపించింది. ఒక నటుడిని గ్రాఫిక్స్‌ రూపంలో రీక్రియేట్ చేసేనప్పుడు ఎంతటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సినిమా చెబుతుంది.


దర్శకుడే దెబ్బేసాడు

దర్శకుడే దెబ్బేసాడు

ముఖ్యంగా దర్శకుడు కోడి రామకృష్ణ సినిమా అన్న నమ్మకంతో తెలుగు వాళ్లు ఈ సినిమా థియేటర్లలో అడుగుపెడతారు. అయితే ప్రేక్షకులకు ఏ విభాగం కూడా ఆయన స్థాయిలో పనిచేసినట్టుగా కనిపించదు. కథా పరంగా ఓకే అనిపించినా..స్క్రీన్ ప్లే విషయంలో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోవటంతో టార్చల్ లాగ తయారైంది.


కీ ఐడియా బాగుంది కానీ...

కీ ఐడియా బాగుంది కానీ...

క్లైమాక్స్ పార్ట్‌లో దివంగత కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆవిష్కరించాలని చేసిన ఆలోచన ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్ట్ తీసేస్తే ఇది అతి సాధారణమైన రొటీన్ సినిమా. కన్నడంలో ఓ రేంజిలో ఓపినింగ్స్ వచ్చాయంటే ఆ ఐడియావల్లే.


ఆ సీన్స్ పండలేదు

ఆ సీన్స్ పండలేదు

నాగ‌భ‌ర‌ణం ఇంట్రడక్షన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రారంభమైన ఐదు నిమిషాలు త‌ర్వాత సినిమా ఎటు వెళ్తూందో అర్దం కాదు. ఒక సీన్ కు మరొక సీన్ కు పొంతన కనపడదు. ముఖ్యంగా ఫ‌స్టాఫ్‌లో హీరో, హీరోయిన్ మ‌ధ్య స‌న్నివేశాలు, ఫ్యామిలీ డ్రామా స‌రిగా పండ లేదు.


హ్యాండిల్ చేయలేకపోయింది

హ్యాండిల్ చేయలేకపోయింది

ఇక సెకండాఫ్‌లో నాగ‌మ్మ ప్లాష్‌బ్యాక్ చూస్తే అరుంధ‌తి స్ఫూఫ్ లా అనిపిస్తుంది. ముఖ్యంగా నాగ‌మ్మ వంటి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ను ర‌మ్య స‌రిగా హ్యాండిల్ చేయ‌లేకపోవటం మైనస్ గా నిలిచింది. ఇక దుష్ట‌శ‌క్తులు క‌ల‌శం గురించి చేసే చేసే విన్యాసాలు ఇంట్రస్ట్ కలిగించకుండా, విసుగును తెప్పిస్తాయి.


హైలెట్స్ ఇవే..

హైలెట్స్ ఇవే..

సినిమా హైలెట్స్ చెప్పాలంటే ఇంటర్వెల్ అప్పుడు ఒక పెద్ద పామును వీఎఫ్‌ఎక్స్‌లో సృష్టించిన విధానం, క్లైమాక్స్‌లో చనిపోయిన ఒక సూపర్ స్టార్‌ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆవిష్కరించడం వంటివి బాగున్నాయి. సినిమా ఉన్నంతలో గిట్టుబాటు అయ్యేలా చేసాయి.


పాముని మాత్రమే...

పాముని మాత్రమే...

సాంకేతిక విభాగం పనితీరు సంతృప్తికరంగా అనిపించదు. మకుట సంస్థ విజువల్‌ ఎఫెక్ట్స్‌లో పామును సృష్టించిన విధానం బాగుంది. పాటల్లో ఒక్కటీ కూడా ఆకట్టుకునేలా లేదు. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. ఎడిటింగ్ మరింత షార్ప్ గా చెయ్యాల్సింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.


వీళ్లే టీమ్...

వీళ్లే టీమ్...

బ్యానర్స్: ఇన్‌బాక్స్ పిక్చ‌ర్స్ ప్రై.లి, బ్లాక్ బ‌స్ట‌ర్ స్టూడియోస్‌, పెన్ మూవీస్‌
నటీనటులు: దిగంత్, రమ్య, విష్ణువర్ధన్, రాజేష్‌ వివేక్, సాయి కుమార్, దర్శన్, సాధు కోకిల, ముకుల్‌దేవ్‌,రవి కాలే తదితరులు
ఛాయాగ్రహణం: హెచ్‌.సి.వేణు
సంగీతం: గురుకిరణ్‌
ఎడిటర్: జానీ హర్ష
నిర్మాతలు: సాజిద్‌ ఖురేషి,సోహైల్‌ అన్సారీ, ధవల్‌ గడ
కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం: కోడి రామకృష్ణ
విడుదల తేదీ: 14-10-2016ఫైనల్ గా అరుంధతి, అమ్మోరు రేంజిలో సినిమాను ఊహించుకుని వెళితే బోల్తా పడతారు. కన్నడ జనాలకు ఏమోకానీ మన వాళ్లకు మాత్రం ఈ సినిమా కష్టమే అనిపిస్తుంది.

English summary
Nagabharanam is the Telugu version of latest 2016 Indian Kannada language epic fantasy film Nagarahavu directed by Kodi Ramakrishna, who his directorial debut in Kannada cinema, and produced by Sajid Qureshi. ‘Nagabharanam’ is a classic case of how socio fantasy scripts can go wrong when emotions and story are left shallow.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu