For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క్షణక్షణం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  నటీనటులు: ఉదయ్ శంకర్, జియా శర్మ, రఘు కుంచె, రవి ప్రకాశ్, శృతి సింగ్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి తదితరులు

  డైరెక్టర్: కార్తీక్ మడికొండ

  నిర్మాత: డాక్టర్ వర్లు, డాక్టర్ మన్నెం చంద్రమౌళి

  మ్యూజిక్ డైరెక్టర్: రోషన్ సాలూర్

  సినిమాటోగ్రఫి: సిద్దార్థ కారుమూరి

  ఎడిటర్: గోవింద్ దిట్టకవి

  రిలీజ్ డేట్: 2021-02

  వైజాగ్‌కు చెందిన సత్య (ఉదయశంకర్), ప్రీతి (జియా శర్మ) అనాథలు. స్వశక్తితో ఎదిగి సాధారణ జీవితాన్ని ఆస్వాదిస్తాంటారు. లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రీతికి గొప్పగా, విలాసవంతంగా జీవించాలనే కోరికలు ఉంటాయి. చేపల బిజినెస్ చేసే సత్య సంపాదనపై ప్రీతి అసంతృప్తితో ఉంటారు. దాంతో వారి విభేదాలు నెలకొంటాయి. ఈ క్రమంలో డేటింగ్ యాప్ ద్వారా బిజినెస్‌మెన్ సూర్య ప్రకాశ్ (రఘు కుంచె) భార్య మాయ (శృతి సింగ్)కు సత్య చేరువ అవుతాడు. కానీ ఊహించిన విధంగా మాయ, ఆమె భర్త హత్యకు గురవుతారు.

  Kshana Kshanam movie review and rating

  మాయ హత్య కేసులో ఇరుక్కొన్న సత్య ఏం చేశాడు. తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి సత్య ఎలాంటి ప్లాన్ చేశారు. మాయ, సూర్య ప్రకాశ్ హత్యల వెనుక ఎవరి హస్తం ఉంది? క్షణక్షణం ఆసక్తిని రేపే ఈ చిత్రంలో మర్డరీ మిస్టరీ ఎలా సాల్వ్ అయింది అనే ప్రశ్నలకు సమాధానమే క్షణక్షణం సినిమా కథ.

  సత్య, ప్రీతి లివింగ్ రిలేషన్‌షిప్, వారి మధ్య గొడవలు తదితర అంశాలతో క్షణక్షణం మూవీ సరదాగా సాగిపోతుంది. మాయను కలుసుకోవడానికి సత్య వెళ్లిన సమయంలో ఆమె హత్యకు గురికావడంతో కథ ఊపందుకొంటుంది. ఇక సెకండాఫ్‌లో మర్డర్ మిస్టరీని దర్శకుడు చాకచక్యగా ముందుకు తీసుకెళ్లడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఇక ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టు సినిమా ఎండ్ కార్డు వరకు మంచి జోష్‌తో ముందుకెళ్తుంది. అయితే కథనంలో వేగం లోపించడం మైనస్ పాయింట్లుగా మారాయి.

  దర్శకుడు కార్తీక్ మడికొండ విషయానికి వస్తే కొత్త కథతో ముందుకు వచ్చారు. సెకండాఫ్‌లో కథను డీల్ చేసిన విధానం, నేరేట్ చేసి తీరు ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. తొలి సినిమాతోనే ప్రతిభను చాటుకొన్నాడు.

  ప్రియుడిగా, యువ వ్యాపారవేత్తగా ఉదయ్ శంకర్ రెండు కోణాలు ఉన్న పాత్రలను చాలా నేచురల్‌గా పోషించాడు. ఆటగదరా శివతో పోల్చుకొంటే ఉదయ్ శంకర్ నటనపరంగా మరింత మెచ్యురిటీని సాధించాడు. సెకండాఫ్‌లో ఉదయ్ శంకర్ యాక్టింగ్ ఆకట్టుకొంటుంది. తన పాత్ర పరిధి మేరకు ఆయన పూర్తి న్యాయం చేశాడని చెప్పవచ్చు.

  ఇక జియా శర్మ, శృతిసింగ్ కూడా గ్లామర్‌తోను, ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. సెకండాఫ్‌లో జియా శర్మ తన యాక్టింగ్‌తో మరింత ఆకట్టుకొంటుంది.

  తెర వెనుక నిపుణుల విషయానికి వస్తే.. సిద్దార్థ కారుమూరి పనితీరు బాగున్నది. రోషన్ సాలూర్ మ్యూజిక్, రీరికార్డింగ్ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. ఎడిటింగ్ ఇతర విభాగాల పనితీరు బాగుంది.

  నిర్మాతలు డాక్టర్ వర్లు, డాక్టర్ మన్నెం చంద్రమౌళి ప్రయత్నాన్ని అభినందించాలి. ప్రతిభావంతులైన చిన్న తారలతో రూపొందించిన మర్డర్ మిస్టరీపై మరికొంత కసరత్తు చేయాల్సింది. ఓవరాల్‌గా క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీలను ఆస్వాదించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

  English summary
  Kshana Kshanam movie review and rating: Kshana Kshanam movie is murder mystery movie. Uday Shankar and Jia Sharma are lead pair for this movie. Dr Mannem Chandra Mouli and Dr Warlu are producers. Karthik Madikonda is the director. This movie hits the screeen on Feb 26st, 2021.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X