For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ksheera Sagara Madhanam review..బ్రహ్మాజీ కొడుకు ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే!

  |

  Rating: 2.5/5

  నటీనటులు: మానస్ నాగులపల్లి, సంజయ్ కుమార్, అక్షత సోనావని, ప్రదీప్ రుద్ర, చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు
  దర్శకత్వం: అనిల్ పంగులూరి
  మ్యూజిక్ డైరెక్టర్: అజయ్ అరసాద
  సినిమాటోగ్రాఫర్: సంతోష్ షానామోని
  ఎడిటర్: వంశీ అట్లూరి
  రిలీజ్: 2021-08-06
  బ్యానర్: శ్రీ వెంకటేశ పిక్చర్స్, ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్

  కథ: రిషి (మానస్ నాగులపల్లి), ఓంకార్ (సంజయ్ కుమార్) మరో ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఈ ఐదుగురిని ఓ పార్టీకి వెళ్లగా అక్కడ విలన్ (ప్రదీప్ రుద్ర) వారిని మానవ బాంబులుగా మారుస్తాడు. ఐదుగురిని బ్లాస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తాడు. అయితే ఆ ప్లాన్ తెలుసుకొన్న ఐదుగురు షాక్‌కు గురవుతారు.

  తాము మానవ బాంబులుగా మారామని తెలుసుకొన్న ఐదుగురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు తమను తాము రక్షించుకోవడానికి ఏం చేశారు? విలన్ కుట్రలను ఎలా తిప్పికొంటారు? బాల్యంలో ఓ వ్యక్తి తన తండ్రి చనిపోవాలని ఐదుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఒకరు ఎందుకు కొరుకొంటాడు? తనకు కాబోయే భార్య వర్జిన్‌గా ఉండాలని కోరుకొన్న వ్యక్తికి ఎలాంటి పరిస్థితి ఎదురైంది? ఐదుగురు తమ జీవితంలో చోటు చేసుకొన్న సమస్యలను ఎలా పరిష్కరించుకొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే క్షీర సాగర మథనం సినిమా కథ.

   Ksheera Sagara Madhanam Movie review and Rating

  దర్శకుడు అనిల్ పంగులూరికి డైరెక్టర్‌గా తొలి చిత్రం. కథను ఎంచుకొన్న విధానం..దానిని సీన్లుగా మార్చుకొన్న వైనం ఆద్యంత ఆకట్టుకొంటుంది. పలు రకాల ఎమోషన్స్‌ను మేలవించి సినిమాను తెరక్కెక్కించిన విధానం మెప్పిస్తుంది. అక్కడక్కడా అనుభవ లేమి కనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా దర్శకుడిలో ఆ లోపాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ఫీలింగ్ కలుగుతుంది. తొలి చిత్రంతోనే యూత్‌ను, ఫ్యామిలీ ఆడియెన్స్ మెప్పించే ప్రయత్నం చేయడం అభినందనీయం.

  ఇక నటీనటుల విషయానికి వస్తే.. రిషిగా మానస్ నాగులపల్లి, ఓంకార్‌గా బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు, విరితగా కరిష్మా శ్రీకర్, ఇషితగా అక్షత సోనావానే నటించారు. నటనకు కొత్తవారైనప్పటికీ... మంచి అనుభవం ఉన్న యాక్టర్లుగా ఫెర్ఫార్మ్ చేశారు. మిగితా నటీనటులు తమ పాత్రలకు అనుగుణంగా నటించారు.

  సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. అజయ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. నీ పేరు పలకడం, కొండపల్లి బొమ్మ పాటలు క్యాచీగా ఉన్నాయి. వంశీ అట్లూరి ఎడిటింగ్, సంతోష్ షానమోని సినిమాటోగ్రఫి బాగుంది. ఈ సినిమాను దర్శకుడు తన స్నేహితుల సహకారంతో క్రౌడ్ ఫండింగ్ పద్దతిలో శ్రీ వెంకటేశ పిక్చర్స్, ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించారు. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.

   Ksheera Sagara Madhanam Movie review and Rating

  క్షీర సాగర మథనం సినిమా ప్రధానంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్థుల్లో ఉండే ఒత్తిడిని చర్చించే చిత్రంగా తెరకెక్కింది. నిత్య జీవితంలో ఎదుర్కొనే ఒడిదుడుకులు, ఉద్యోగుల అసంతృప్తి తదితర అంశాల ఆధారంగా కథ సాగుతుంది. గోవింద్, వ్రిందా, రిషి, ఇషిక, భరత్ ఇలాంటి క్యారెక్టర్లు మన ముందు కదలాడినట్టు ఉంటాయి. జాబ్ ఇండస్ట్రీలో కుల జాడ్యం, లవ్, ఎమోషనల్ పాయింట్స్‌తో దర్శకుడు కథను సమర్ధవంతంగా నడిపించాడని చెప్పవచ్చు. ఓవరాల్‌గా నేటి యువత పోకడలు, ఎదుర్కొంటున్న మానసిక సమస్యల ప్రత్యక్షంగా తెరపైన కనపడుతాయి. మనుషుల్లోకి ఓ రకమైన పదార్థాన్ని ఎక్కించి మానవ బాంబులుగా తయారు చేసే ఆసక్తికరంగా అనిపిస్తుంది. క్యారెక్టర్, వర్జినిటీ, ఆధునిక భావాలుంటే చెడిపోవడం కాదనే విషయాన్ని చర్చించిన విధానం బాగుంటుంది. అయితే ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే ఎక్కువ మందికి చేరి మంచి టాక్ సంపాదించుకొనే అవకాశం ఉండేదనే ఫీలింగ్ కలుగుతుంది. యూత్‌, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు బాగా నచ్చుతుంది. వారాంతంలో ఓ ఫీల్‌గుడ్ సినిమా చూడటానికి ఆస్కారం ఉన్న సినిమాగా చెప్పుకోవచ్చు.

  English summary
  Ksheera Sagara Madhanam Movie review and Rating: Ksheera Sagara Madhanam Movie is released on 2021 august 6th. Sanjay Rao, Maanas Nagulapalli in lead roles. In this occassion, Telugu filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X