»   » బూతు ఎక్కువే కానీ...(రివ్యూ )

బూతు ఎక్కువే కానీ...(రివ్యూ )

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

ఈ ఇంటర్నెట్ యుగంలో బూతు ఎక్కడపడితే అక్కడ క్షణాల్లో లభ్యమవుతోంది. సెల్ ఫోన్స్ లో సైతం ఫోర్న్ ని ఎంజాయ్ చేస్తున్న నేటి తరం పనిగట్టుకుని ఫోర్న్ తరహా సెమీ ఫోర్న్ తో కూడిన చిత్రాలు చూడటానికి టైం, డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళతారా అంటే...అవునని, కాదని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పెద్ద తెరపై సెమీ ఫోర్న్ చూడాలనే కల కోసం వెళ్లచ్చని ఈ రోజు ఈ చిత్రానికి వచ్చిన ఓపినింగ్స్ అనిపిస్తాయి. ఓ చిన్న బిగ్రేడ్ చిత్రానికి ఓ రెగ్యులర్ హీరో చిత్రానికి వచ్చినట్లుగా చాలా చోట్ల ధియోటర్లు కళకళ్ళాడాయి. ఇంతకీ ఓపినింగ్స్ సరే ..సినిమా ఎలా ఉంది...జనం ఎక్సపెక్ట్ చేసింది ఏమన్నా సినిమాల్లో ఉందా అంటారా...

థాయ్‌ల్యాండ్‌లో ఎక్కువ భాగం జరిగే ఈ చిత్రం కథలో బడా బిజినెస్‌ మాగ్నెట్‌(శక్తికపూర్‌) ముద్దుల కొడుకు కన్నయ్య(కన్హయ్య- తుషార్‌ కపూర్‌). థాయ్‌ల్యాండ్‌లో ఉండే అతని ఫ్రెండ్ మైకీ (కృష్ణ అభిషేక్‌) పిలిస్తే ఇంకో ఫ్రెండ్ రాకీ (అఫ్తాబ్‌)ని తీసుకుని థాయ్‌లాండ్‌ వెళ్తాడు. ఇంతాచేసి అక్కడకి వెళ్లాక... మైకీ ఒక పోర్న్‌ ప్రొడక్షన్‌ ని రన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఫోర్న్ అనగనే ఉత్సాహపడి..,ఫ్రెండ్స్ ఇద్దరూ తామూ బాలీవుడ్‌ హిట్‌ సినిమాల్ని ప్యారడీ చేస్తూ అక్కడ పోర్న్‌ స్టార్లుగా మారిపోతారు.మైకీ ప్రోత్సాహంతో అతని ‘పోర్న్‌' బిజినెస్ లో పార్టనర్స్ గా మారేందుకు సిద్ధమవుతారు. అదే టైంలో ఓ ట్విస్ట్...

కన్నయ్య ఓ అమ్మాయి(మందనా కరిమి)తో ప్రేమలో పడతాడు. అయితే.. అమ్మాయి వాళ్లు ట్రెడిషనల్ ఫ్యామిలీ అని తెలుస్తుంది. దాంతో తానొక పోర్న్‌ స్టార్‌ అని తెలిస్తే.. లేనిపోని తలనొప్పులు వస్తాయన్న ఉద్దేశంతో... అమ్మాయి తండ్రికి తానూ మంచి సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానంటూ అబద్ధం చెప్పేస్తాడు. అక్కడ నుంచి ఆ అబద్ధాన్ని నిజం చేసేందుకు రకరకాల అబద్దాలు ఆడుతూ. నానా పాట్లు పడాల్సివస్తుంది. చివరకు ఏమైంది... కన్నయ్య తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

మిగతా రివ్యూ స్లైడ్ షోలో

ప్లస్

ప్లస్

సినిమాలో పేరడీలు ఎక్కువే కానీ ..తుషార్ కపూర్ లవ్ స్టోరీ బాగా నవ్విస్తుంది. సెకండాఫ్‌లో అఫ్తాబ్‌.. కృష్ణా బ్యాచ్ చేసే తింగరి పనులు.. మరింతగా నవ్వుస్తాయి

మధ్యలో బూతే..

మధ్యలో బూతే..


నవ్వించినా ..ఆ నవ్వులకు బూతుని యాడ్ చేయటం చాలా ఇబ్బందిగ ఉంటుంది. దాన్ని పట్టింకుకోకపోతే నవ్వుల పండుగే.

ఇద్దరూ..

ఇద్దరూ..

తుషార్‌.. అఫ్తాబ్‌ ఇద్దరూ తమదైన కామెడీ టైమింగ్‌.. యాక్షన్‌తో బాగనే ఎంటర్టైన్ చేసారు.

పెద్ద స్కోప్ లేదు..

పెద్ద స్కోప్ లేదు..

నటనకు అంత స్కోప్‌ లేని పాత్రలో నటించిన హీరోయిన్‌ మందనా కరిమి ఆలోటును తన అందాలతో భర్తీ చేస్తుంది.

టెక్నికల్ గా..

టెక్నికల్ గా..

ఇలాంటి సినిమాలకు టెక్నికల్ యాస్పెక్ట్ లో ఎవరు చూస్తారు చెప్పండి.

అయినా..

అయినా..

సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు ఇవ్వొచ్చు. అందమైన లొకేషన్‌లలో.. దాదాపు చిత్రంలోని అన్ని సీన్లనూ రిచ్‌గా.. అందంగా చిత్రీకరించారు.మొత్తం మీద దర్శకుడు అన్ని విభాగాలను సమన్వయం చేసుకోవడంలో తెలివిగా వ్యవహరించాడనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

సోసో...

సోసో...

సంగీతం గురించి చెప్పుకోవటం వేస్ట్.. అలాగే కథ- స్క్రీన్ ప్లే ..సీన్స్ ఫిల్ చేయటానికి మాత్రమే.. ఎడిటింగ్‌ ఇంకొంత షార్ప్ గా ఉంటే బాగుండేదనిపిస్తుంది.

ఎవరెవరు...

ఎవరెవరు...

క్యా కూల్‌హై హమ్‌-3 (హిందీ)
తారాగణం: తుషార్‌ కపూర్‌.. ఆఫ్తాబ్‌ శివ్‌దసానీ.. మందనా కరిమి.. కృష్ణ అభిషేక్‌.. గిజిలే థక్రల్‌.. క్లాడియా సీస్లా తదితరులు
కథ-సంభాషణలు: ముష్తాక్‌ షేక్‌.. మిలాప్‌ జవేరీ,
సంగీతం : సజిద్‌- వాజిద్‌,
డీవోపీ : మనోజ్‌ సోని,
ఎడిటింగ్‌ : నితిన్‌ రోకడే,
నిర్మాతలు: ఏక్తా కపూర్‌.. శోభా కపూర్‌,
దర్శకత్వం: ఉమేష్‌ ఘడ్గే.
విడుదల తేది: 22-01-2016

ఫైనల్ గా... ఇలాంటి సినిమా అని ముందే ప్రిపేర్ అయ్యి వెళ్లిన వారు కాస్సేపు నవ్వుకోవచ్చు...మరికాసేపు హీరోయిన్స్ అందాలు ఎంజాయ్ చేయవచ్చు. కానీ పెద్దగా ఎక్సపెక్టేషన్స్ మాత్రం పెట్టుకోవద్దు..

English summary
Tusshar Kapoor, Aftab Shivdasani and Mandana Karimi starrer Kyaa Kool Hain Hum 3, is not up to the mark and will dissapoint you from the very start.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu