For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Black Panther 2 Review:యాక్షన్, ఎమోషనల్ గా 'వకాండా ఫరెవర్'.. ఆ లోటును కొత్త 'బ్లాక్ పాంథర్' తీర్చిందా?

  |

  రేటింగ్: 3/5
  టైటిల్: బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్
  నటీనటులు: లెటీటియా రైట్, ఏంజెలా బస్సెట్, టెనాక్ హుయెర్టా, డొమినిక్ థోర్న్, లుపీటా నయోంగో, విన్ స్టన్ డ్యూక్ తదితరులు
  ప్రొడక్షన్ బ్యానర్: మార్వెల్ స్టూడియోస్
  కథ, దర్శకత్వం: ర్యాన్ కూగ్లర్
  స్క్రీన్ ప్లే: ర్యాన్ కూగ్లర్, జో రాబర్ట్ కోల్
  సంగీతం: లుడ్విగ్ గొరాన్సన్
  విడుదల తేది: నవంబర్ 11, 2022

  హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమా కోసం సినీ ప్రేమికులు కాచుకుని కూర్చుంటారు. ఇక 2018లో వచ్చిన బ్లాక్ పాంథర్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్ గా తెరకెక్కించారు. ఎమ్ సీయూ (మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్)లో వస్తున్న 30వ చిత్రమిది. అలాగే ఈ సినిమాటిక్ యూనివర్స్ లోని నాలుగో ఫేజ్ లో చివరి మూవీ. సినీ లవర్స్ లో బ్లాక్ పాంథర్ క్యారెక్టర్ తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే బ్లాక్ పాంథర్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి వాటిని బ్లాక్ పాంథర్ 2 అందుకుందా? లేదా? రివ్యూలో చూద్దాం.

  కథ

  కథ


  బ్లాక్ పాంథర్ 1లో వకాండా దేశం గురించి, అక్కడ లభించే అత్యంత అరుదైన, శక్తివంతమైన మెటల్ లోహం వైబ్రేనియం గురించి యావత్ లోకానికి తెలుస్తుంది. బ్లాక్ పాంథర్ 2 సినిమా వకాండా రాజు టి చల్లా అలియాస్ బ్లాక్ పాంథర్ (చాడ్విక్ బోస్మన్) మరణంతో ప్రారంభం అవుతుంది. బ్లాక్ పాంథర్ లేకపోవడంతో వకాండా రాజ్యం బలహీనపడిపోయిందని, ఆ దేశంలో లభించే వైబ్రేనియంపై ప్రపంచ దేశాల కన్నుపడుతుంది. అందుకోసం దాడులు కూడా చేస్తారు. కానీ వాటిని వకాండా తిప్పికొడుతుంది. దీంతో ప్రపంచంలో మరెక్కడైనా వైబ్రేనియం దొరుకుతుందా అని పరిశోధిస్తారు. వాటిని నమోర్ (టెనాక్ హుయార్టా) తిప్పి కొడతాడు. తర్వాత వైబ్రేనియం ఉందని కనిపెట్టిన సైంటిస్ట్ రిరి విలియమ్స్ (డొమినిక్ థోర్న్) ను కనిపెట్టమని వకండా రాణి రమోండా (ఏంజెలా బస్సెట్) డీల్ కుదుర్చుకుంటాడు. సైంటిస్ట్ కోసం వెళ్లిన షూరి (లెటీటియా రైట్) ఏం తెలుసుకుంది? ఆ సైంటిస్ట్ ను నమోర్ ఏం చేయాలనుకున్నాడు? అసలు నమోర్ లక్ష్యం ఏంటి? షూరి బ్లాక్ పాంథర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? వకాండా దేశానికి, నమోర్ కు యుద్ధం ఎందుకు జరిగింది? వంటి తదిర ఆసక్తికర అంశాలు తెలియాలంటే బ్లాక్ పాంథర్ 2 చూడాల్సిందే.

  విశ్లేషణ

  విశ్లేషణ


  2018లో వచ్చిన బ్లాక్ పాంథర్ సినిమా, ఆ క్యారెక్టర్ మూవీ లవర్స్ ను విపరీతంగా మెప్పించింది. ముఖ్యంగా బ్లాక్ పాంథర్ టైటిల్ రోల్ చేసిన చాడ్విక్ బోస్మన్ తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశాడు. కెప్టెన్ అమెరికా సివిల్ వార్, అవెంజర్స్ ఎండ్ గేమ్ లో బ్లాక్ పాంథర్ క్యారెక్టర్, వకాండ ప్రజలను ఎఫెక్టివ్ గా చూపించారు. ఇక ఆ పాత్రలో చాడ్విక్ అదరగొట్టాడనే చెప్పాలి. బ్లాక్ పాంథర్ హిట్ తో దీనికి సీక్వెల్ తెరెక్కిస్తున్నట్లు 2019లోనే ప్రకటించారు. అయితే బ్లాక్ పాంథర్ ప్రధాన పాత్ర చాడ్విక్ బోస్మన్ క్యాన్సర్ తో అకస్మాత్తుగా మరణించడం మార్వెల్, చాడ్విక్ ఫ్యాన్స్ ను శోకసంద్రంలోకి నెట్టేసింది. చాడ్విక్ ఉన్నప్పుడు రాసుకున్న కథను మార్చి కొత్తగా మరో కథను తీసుకొచ్చారు దర్శకనిర్మాతలు. బ్లాక్ పాంథర్ రియల్ క్యారెక్టర్ చనిపోవడంతో ఆ పాత్రలో ఎవరు వస్తారు.. సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తికర ప్రశ్నలతో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్.

   చాడ్విక్ బోస్మన్ కు నివాళి

  చాడ్విక్ బోస్మన్ కు నివాళి


  చాడ్విక్ బోస్మన్ కు నివాళిగా వచ్చిన ఈ సినిమా టి చల్లా మరణం వకాండా ప్రజలపై, దేశంపై ఎలాంటి ప్రభావం చూపించిందో తెలిపే సన్నివేశాలతో ఎమోషనల్ గా ప్రారంభం అవుతుంది. రాజు లేడన్న ఉద్దేశంతో వైబ్రేనియం కోసం ప్రపంచదేశాలు ఎలా పోటీ పడుతున్నాయో, వాటిని వకాండా ఎలా తిప్పికొట్టిందో బాగా చూపించారు. దేశానికి ప్రధాన బలమైన రాజు చనిపోతే ఎలా ఉంటుంది, ఆ కుటుంబం ఎలా మానసికంగా కుంగిపోతుందనేది చూపించారు. అయితే ఈ ఎమోషనల్ సీన్లను సినిమాపరంగా కాకుండా చాడ్విక్ బోస్మన్ కుటుంబం పరిస్థితిని తెరపై చూపించినట్లు అనిపించింది. అయితే ఎమోషనల్ సీన్లు ఎక్కువ అవడం, రన్ టైమ్ (2 గంటల 44 నిమిషాలు) ఉండటంతో సినిమా సాగదీతలా అనిపిస్తుంది.

  కొంచెం ఇంట్రెస్టింగ్ గా

  కొంచెం ఇంట్రెస్టింగ్ గా


  నమోర్ రాకతో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నమోర్ ప్రజలు, వారి పోరాటం ఆకట్టుకుంటుంది. వైబ్రెనియం కోసం వెతికేవాళ్లను వేటాడే సీన్ బాగుంది. ఆ తర్వాత కూడా కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తాయి. ఇక ఎప్పుడైతే వకాండాకు నమోర్ కు వార్ స్టార్ట్ అయ్యే ముందు సీన్లు, తర్వాత సన్నివేశాలు విజువల్ వైస్ గా ఐఫీస్ట్ ఇస్తాయి. సముద్రం అట్టడుగున ఉండే నమోర్ రాజ్యం కాలటోన్ ను అద్భుతంగా చూపించారు. నిజానికి కామిక్ లో నమోర్ అట్లాంటిక్ కు రాజు. కానీ సినిమాలో మాత్రం పేరు మార్చారు. ఇక కామిక్ లో ఉన్నట్లే హల్క్, థోర్ లా శక్తిమంతుడుగా నమోర్ ను చూపించారు. ఇక షూరి బ్లాక్ పాంథర్ గా మారే కారణాలు, ఎమోషనల్ సీన్లు, కుటుంబంలోనే అందరికంటే చిన్న వయసు ఉన్న అమ్మాయి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి రాణి ఎలా అయిందో రీజనబుల్ గా చూపించారు. కానీ అది కొంచెం రొటీన్ గానే ఉంటుంది. ఎండ్ టైటిల్స్ తర్వాత వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది.

  ఎవరెలా చేశారంటే

  ఎవరెలా చేశారంటే


  బ్లాక్ పాంథర్ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్లు ఇందులో లీడ్ రోల్ చేశారు. వకాండా రాజ్యానికి బ్లాక్ పాంథర్ గా లెటీటియా రైట్ మంచి నటన కనబర్చింది. ఎమోషనల్, యాక్షన్ సీన్స్ లలో ఆకట్టుకుంది. నమోర్ పాత్రలోని టెనాక్ హుయెర్టా పవర్ ఫుల్ విలన్ గా మెప్పించాడు. మిగతా నటీనటులు కూడా తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. యాక్షన్స్ సీన్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొత్తగా ఉంటుంది. గ్రాఫిక్ విజువల్స్ బాగున్నాయి.

   ఫైనల్ గా..

  ఫైనల్ గా..


  ఇక బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్ సినిమా గురించి ఫైనల్ గా చెప్పాలంటే చాడ్విక్ బోస్మన్ కు ఘనమైన నివాళిగా ఈ సినిమాను అందించారు. అక్కడక్కడ సాగదీతలా అనిపించిన ఓవరాల్ గా సినిమా పర్వాలేదనిపించింది. అయితే సినిమా బాగున్నప్పటికీ బ్లాక్ పాంథర్ గా చాడ్విక్ బోస్మన్ లేడన్న వెలితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాతో చాడ్విక్ బోస్మన్ లేని బ్లాక్ పాంథర్ సిరీస్, మార్వెల్ ముందుకు పోతుందని నిర్మాణ సంస్థ చెప్పకనే చెబుతున్నట్లు అనిపించింది.

  English summary
  Marvel Studios Black Panther Wakanda Forever Movie Review And Rating In Telugu And Introduced Letitia Wright As New Black Panther.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X