twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Like Share & Subscribe Review ఫన్ ఎలిమెంట్స్‌తో సంతోష్ శోభన్.. లైక్, షేర్ సబ్ స్క్రైబ్ ఎలా ఉందంటే?

    |

    Rating 2.5/5

    నటీనటులు: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మాజీ, సప్తగిరి, తదితరులు
    దర్శకుడు: మేర్లపాక గాంధీ
    నిర్మాత: వెంకట్ బోయనపల్లి
    ఎడిటింగ్: రాము తూము
    సినిమాటోగ్రఫి: వసంత్ ఏ
    మ్యూజిక్: ప్రవీణ్ లక్కరాజు
    బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్, అముక్త క్రియేషన్స్
    రిలీజ్ డేట్: 2022-11-04

     లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ కథ ఏమిటంటే..

    లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ కథ ఏమిటంటే..


    విప్లవ్ (సంతోష్ శోభన్) ట్రావెల్ బ్లాగ్ నడిపే యూట్యూబర్. డీజీపీ కూతురు వసుధ (ఫరియా అబ్దుల్లా) కూడా యూట్యూబర్‌. అయితే వీరిద్దరూ అడ్వెంచరస్ జర్నీ చేస్తూ ఒకరినొకరు కలుసుకొంటారు. అయితే అడవుల్లో ఏపీ పోలీసులకు, నక్సలైట్ నాయకుడు బ్రహ్మన్న (బ్రహ్మాజీ)కి మధ్య జరుగుతున్న పోరాటంలో విప్లవ్, వసుధ చిక్కుకుంటారు.

    లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ ట్విస్టులు

    లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ ట్విస్టులు


    ఏపీ పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఘర్షణకు కారణమేమిటి? పోలీసులకు, నక్సలైట్ల పోరాటం మధ్య చిక్కుకున్న విప్లవ్, వసుధకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? విప్లవ్, వసుధ మధ్య ప్రేమగా మారిన పరిచయం ఎక్కడి వరకు వెళ్లింది? విప్లవ్‌ ప్రపోజ్ చేసిన తర్వాత వసుధ ఎలా రియాక్ట్ అయింది? విప్లవ్‌ ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసింది? పోలీసులకు, నక్సలైట్లకు మధ్య శాంతి చర్చలకు పరిష్కారం లభించిందా? అనే ప్రశ్నలకు సమాధానమే లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ.

     మూవీ ఎలా సాగిందంటే?

    మూవీ ఎలా సాగిందంటే?


    అక్రమంగా బాక్సైట్ గనుల తవ్వకాలకు పాల్పడిన రాజకీయ నేతను తన కుమారుడి ముందే నక్సలైట్స్ కాల్చి చంపే కథతో సినిమా ఎమోషనల్‌గా మొదలవుతుంది. తన తండ్రిని నక్సలైట్లు చంపిన ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొడుకు భావోద్వేగానికి గురవుతాడు. ఇలాంటి లీడ్‌తో కథ మొదలుతుంది. కట్ చేస్తే విప్లవ్, వసుధ యూట్యూబ్ జర్నీతో ఫన్‌గా కథ సాగుతుంది. అయితే ఫస్టాఫ్‌లో హీలేరియస్ ఫన్ లేకుండా రొటీన్ సన్నివేశాలతో కథ ముందుకు వెళ్లడం సినిమా రెగ్యులర్‌గా అనిపిస్తుంది. నక్సలైట్లు, పోలీసుల మధ్య సీరియస్ ఇష్యూ, విప్లవ్, వసుధ మధ్య ఫన్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి దర్శకుడు కొంత రిలీఫ్ కలిగించే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్‌లో సప్తగిరి కామెడీ, బ్రహ్మాజీ, ఇతర క్యారెక్టర్లు సినిమాను సీరియస్‌గా కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ మూవీగా మార్చేశాయి.

     సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా

    సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా


    నటీనటులు విషయానికి వస్తే.. సంతోష్ శోభన్ యూట్యూబర్ పాత్రలో ఒదిగిపోయాడు. తన బాడీ లాంగ్వేజ్‌కు ఈ రోల్ కరెక్ట్‌గా సూట్ అయ్యేలా మార్చుకొన్నాడు. తనదైన శైలిలో డైలాగ్స్‌తో ఆలరించాడు. ఫరియా అబ్దుల్లాతో కలిసి మంచి కెమిస్ట్రీని పంచాడు. ఇక ఫరియా అబ్దుల్లా ఫన్ బేస్డ్ క్యారెక్టర్‌తో అలరించే ప్రయత్నం చేసింది. గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకొన్నది. యూత్‌కు కనెక్ట్ అయ్యేలా వీరిద్దరి పాత్రలు ఉన్నాయని చెప్పవచ్చు.

     బ్రహ్మజీ, సుదర్శన్, సప్తగిరి కామెడీ

    బ్రహ్మజీ, సుదర్శన్, సప్తగిరి కామెడీ


    ఇక మిగితా పాత్రల్లో సుదర్శన్ కెమెరామెన్‌గా తన మార్క్ కామెడీని పండించాడు. బాలీవుడ్‌లో పాపులర్ సినిమాలకు, అలాగే దంగల్ మూవీకి కెమెరా మెన్‌ అంటూ బిల్డప్ ఇవ్వడం ఇంట్రెస్టింగ్‌గాను, ఫన్‌గాను ఉండటమే కాకుండా తన క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయడానికి ఉపయోగించుకొన్నాడు. ఇక నక్సలైట్ నాయకుడు బ్రహ్మన్నగా బ్రహ్మాజీ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించాడు. మిర్చి కిరణ్ కామెడీ కూడా పలు సందర్బాల్లో నవ్విస్తుంది. మైమ్ గోపి, దయానంద్ రెడ్డి ఫెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇతర పాత్రల్లో కనిపించిన వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

     టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే?


    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఏ వసంత్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. కామెడీ బేస్ట్ యాక్షన్ సీన్లను చక్కగా తెరకెక్కించారు. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ ఒకే అనిపిస్తుంది. కీలక సన్నివేశాల్లో బీజీఏంతో ఆకట్టుకోలేకపోయాడు. రాము తూము ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తుంది. నిహారిక, అముక్త బ్యానర్ల నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?


    నక్సలైట్లతో పోలీసుల శాంతి ఒప్పందమనే బ్యాక్ డ్రాప్‌కు లవ్ స్టోరిని, యూట్యూబర్ల పాయింట్స్‌ను ఆధారంగా చేసుకొని పక్కాగా ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన చిత్రం లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. అయితే ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మూవీలో బలమైన సన్నివేశాలు ఉంటే ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అయి ఉండేది. భావోద్వేగాలు, సినిమాకు ఉండాల్సిన ఓ పర్పస్, డెస్టినేషన్ అనేది పర్‌ఫెక్ట్‌గా కనిపించవు. కామెడీ సీన్లపైనే దృష్టిపెట్టి వినోదాన్ని అందించాలనే తాపత్రయమే కనిపించింది. మంచి కామెడీ సీన్లు, కథకు సరైనా ముగింపు చూపించి ఉంటే.. ది బెస్ట్ ఎంటర్‌టైనర్ అయి ఉండేది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోవింద్ సూర్యన్ ట్విస్టు సినిమాకు జస్టిఫై చేసేలా ఉంటుంది. వినోదాత్మక చిత్రాలు, విట్టీ కామెడీని ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

    English summary
    Tollywood's Director Merlapaka Gandhi is coming with his latest movie Like Share & Subscribe. This movie is set to release on November 4th. Here is the review from Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X