For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లండన్ బాబులు మూవీ రివ్యూ: మారుతి మార్కు సినిమా

By Rajababu
|

Rating:
2.0/5
Star Cast: రక్షిత్‌, స్వాతి, అలీ, సత్య, ధన్‌రాజ్‌
Director: చిన్నికృష్ణ

టాలీవుడ్‌లో భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు లాంటి సెన్సేషనల్ హిట్స్‌తో దూసుకెళ్తున్న దర్శకుడు మారుతి. స్వయంగా దర్శకత్వం వహించడమే కాదు.. యువ దర్శకులను ప్రోత్సాహించడానికి నిర్మాతగా మారారు మారుతి. ఆ క్రమంలోనే వచ్చిన చిత్రం లండన్ బాబులు. ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించిన అండవన్ కట్టలై చిత్రానికి రీమేక్. ఈ చిత్రానికి బీ చిన్నకృష్ణ దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లండన్ బాబులు చిత్రం ఎలా ఉందో అనే విషయాన్ని తెలుసుకోవడానికి కథలోకి వెళ్తాం.

లండన్ బాబులు స్టోరి

లండన్ బాబులు స్టోరి

గాంధీ (రక్షిత్), పాండు (సత్య) ప్రాణస్నేహితులు. గాంధీ కుటంబం దిగువ మధ్యతరగతికి చెందినది కావడంతో అనేక కష్టాలను ఎదుర్కొంటుంది. పైగా నిరుద్యోగి కావడంతో ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతాడు. దాంతో సొంత బావ వద్ద తీసుకొన్న అప్పు చెల్లించలేక కష్టాలు పడుతుంటాడు. అప్పు తీర్చమనే బావ పోరు పడలేక లండన్‌కు వెళ్లి డబ్బు సంపాదించాలనుకొంటాడు. ఆ నేపథ్యంలో తన స్నేహితుడు పాండుతో కలిసి హైదరాబాద్‌కు చేరుకొంటాడు.

కష్టాల నుంచి గట్టెక్కాడా?

కష్టాల నుంచి గట్టెక్కాడా?

కష్టాలతో హైదరాబాద్ చేరుకొన్న గాంధీకి మరిన్ని కష్టాలు ఎదురవుతాయి. హైదరాబాద్‌లో ఎదురైన కష్టాలు ఏమిటి? ఇంతకు లండన్‌కు వెళ్లి డబ్బు సంపాదించాడా? గాంధీ జీవితంలోకి ప్రవేశించిన సూర్యకాంతం (స్వాతిరెడ్డి) ఎవరు? గాంధీకి, సూర్యకాంతంకు సంబంధమేమిటి? బావకు అప్పు చెల్లించాడా? కష్టాల నుంచి గట్టెక్కాడా అనే ప్రశ్నలకు సమాధానమే లండన్ బాబులు.

కామెడితో నెగ్గుకొచ్చిన ఫస్టాఫ్

కామెడితో నెగ్గుకొచ్చిన ఫస్టాఫ్

లండన్ బాబులు చిత్రం సున్నితమైన హస్యంతో రూపొందిన చిత్రం. యువ హీరో రక్షిత్‌కు స్వాతిరెడ్డి జంటగా నటించింది. సింగిల్ లైన్‌పై జరిగే కథను ఫస్టాఫ్‌లో చాలా స్ట్రయిట్‌గా చెప్పడంలో దర్శకుడు చిన్నికృష్ణ పరిణతిని చూపించాడు. తొలిభాగంలో సత్య కామెడి హైలెట్‌గా నిలుస్తుంది. అలా సరదా సరదాగా సాగిన ఫస్టాఫ్‌లో హాస్యమే ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు.

సెకండాఫ్‌లో రొటీన్ వ్యవహారమే..

సెకండాఫ్‌లో రొటీన్ వ్యవహారమే..

సెకండాఫ్‌లో లండన్‌కు వెళ్లే ప్రయత్నంలో పాస్‌పోర్ట్‌ కోసం చేసినచిన్న పొరపాటును సరిదిద్దుకునే సన్నివేశాలు చాలా సాగదీసినట్టు ఉంటాయి. లండన్‌కు వెళ్లలేకపోయిన గాంధీ ఓ డ్రామా కంపెనీలో అకౌంటెంట్‌గా చేరుతాడు. అక్కడ జరిగే పరిస్థితుల కారణంగా టీవీ రిపోర్టర్ సూర్యకాంతం పరిచయం అవుతుంది. వారి మధ్య పరిచయంలో జరిగిన సంఘటనలు చాలా రొటీన్‌గా ఆర్టిఫీషియల్‌గా ఉంటాయి. కోర్టు సీన్లు చాలా బోరింగ్ అనిపిస్తాయి. సెకండాఫ్‌ను మరింత మెరుగ్గా ఆలోచించి ఉంటే సినిమా మారుతికి మరో మంచి చిత్రమయ్యేది.

దర్శకుడు చిన్నికృష్ణ ప్రతిభ

దర్శకుడు చిన్నికృష్ణ ప్రతిభ

ఫాస్టాఫ్‌లో దర్శకుడు చిన్ని కృష్ణ స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా ఉంటుంది. సత్యతో చేయించిన కామెడీ సీన్లు సహజంగా ఉంటాయి. సత్య వేసే పంచులు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం ఖాయం. సెకండాఫ్‌లో సత్య లేని లోటు చాలా కొట్టొచ్చినట్టు కనిపించింది. చివర్లో సత్య ఎంట్రీ ఇచ్చినా విషాదమే ఉండటంతో సరిగా ఆకట్టుకోలేకపోయింది. లండన్ బాబులు చిత్రానికి దర్శకుడిగా చిన్నకృష్ణ పర్వాలేదనిపించాడు. ఈ రీమేక్ కావడం వల్ల కొన్ని పరిమితులకు లోబడి చేశాడా అనే ఫీలింగ్ కలుగుతుంది.

ఫర్వాలేదనిపించిన రక్షిత్

ఫర్వాలేదనిపించిన రక్షిత్

రక్షిత్ కొత్తవాడైనా బాగా చేశాడు. కీలక సన్నివేశాల్లో తడబడినట్టు అనిపించినా కథ గమనానికి ఇబ్బంది కాలేదు. ఓవరాల్‌గా రక్షిత్ తన నటనతో మంచి మార్కులే కొట్టేశాడు.

మరోసారి మెరిసిన స్వాతి

మరోసారి మెరిసిన స్వాతి

ఇక స్వాతి మరోసారి విభిన్నమైన పాత్రల్లో కనిపించదు. లైవ్ రిపోర్టింగ్‌ను స్వాతి ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో స్వాతి భావోద్వేగాలను బాగా పండించింది.

ఆకట్టుకొన్న ధన్‌రాజ్

ఆకట్టుకొన్న ధన్‌రాజ్

కమెడియన్ ధన్‌రాజ్‌కు మంచి పాత్రే లభించింది. అడవి నుంచి నగరానికి వచ్చిన నక్సలైట్ పాత్రలో కనిపించాడు. మూగవాడిగా నటించే సీన్లను ఆయన బాగా చేశాడని చెప్పవచ్చు. చివర్లో ధన్‌రాజ్ పండించిన సెంటిమెంట్ కంటతడి పెట్టించేలా ఉంటుంది.

నవ్వుల పువ్వులు పూయించిన సత్య

నవ్వుల పువ్వులు పూయించిన సత్య

లండన్ బాబులు చిత్రానికి ప్రధానమైన బలం కమెడియన్ సత్య హాస్యం. సత్య డైలాగ్ డెలివరీ, స్పాంటేనియస్ వేసే పంచులు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతాయి. ఫస్టాఫ్‌లో వినోదాన్ని పంచిన సత్య.. సెకండాఫ్‌కు వచ్చే సరికి విషాదాన్ని పంచి ఆకట్టుకొన్నాడు.

మిగితా పాత్రల్లో అలీ

మిగితా పాత్రల్లో అలీ

మిగితా పాత్రలో సత్యకృష్ణ, ఆలీ, అజయ్ ఘోష్, మురళీ శర్మ పాత్రలు ఆకట్టుకునేలా ఉంటాయి. ముఖ్యంగా సత్యకృష్ణ, అలీ జంట అక్కడక్కడ నవ్వుల మెరుపులు మెరిపించారు.

సాంకేతిక బలం

సాంకేతిక బలం

శ్యామ్ కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫి సినిమాను రిచ్‌గా ఉండేలా చేసింది. ఉద్దవ్ ఎడిటింగ్, మారుతి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

పాజిటివ్ పాయింట్స్

పాజిటివ్ పాయింట్స్

సింపుల్ స్టోరీలైన్

స్క్రీన్ ప్లే

ఫస్టాఫ్‌లో సత్య కామెడీ

స్వాతి, రక్షిత్ యాక్టింగ్

మైనస్ పాయింట్స్

- స్పీడ్ తగ్గిన సెకండాఫ్‌

సాగతీతతో సహనానికి పరీక్ష

తెర వెనుక.. తెర ముందు

తెర వెనుక.. తెర ముందు

నటీనటులు: రక్షిత్‌, స్వాతి, అలీ, సత్యకృష్ణ, సత్య, ధన్‌రాజ్‌, మురళీశర్మ, అజయ్‌ఘోష్‌, రాజా రవీంద్ర తదితరులు

నిర్మాత: మారుతి

దర్శకత్వం: చిన్నికృష్ణ

సంగీతం: కె

కూర్పు: ఎస్‌బీ ఉద్ధవ్‌

సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు

రిలీజ్ డేట్: నవంబర్ 17, 2017

English summary
London Babulu is another interesting film that released this Friday at the box office. The film actor turned director Chinni Krishna. Director Maruthi is the producter for the movie. Swathi Reddy, and Rakshith are lead pair. This movie released on Noveber 17, 2018. In this occations, Telugu fillmibeat brings an exclusive review for you.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more