»   » ఓ పక్క ప్రతీకారం.. మరో పక్క ప్రేమ (మా అబ్బాయి రివ్యూ)

ఓ పక్క ప్రతీకారం.. మరో పక్క ప్రేమ (మా అబ్బాయి రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ప్రేమ ఇష్క్ కాదల్' చిత్రంతో పరిచయమైన యువ హీరో శ్రీ విష్ణు 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రంతో తన ప్రతిభను చాటుకొన్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు చిత్రం మంచి గుర్తింపున తెచ్చుకొన్న శ్రీ విష్ణు మరోసారి 'మా అబ్బాయి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిర్మాత బలగ ప్రకాశ్ రావు నిర్మించిన ఈ చిత్రం మార్చి 17న విడుదలైంది. టీజర్‌తో మంచి అంచనాలు నెలకొన్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు సంతృప్తి పరిచిందో తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకొందాం

 అన్యోన్య కుటుంబ కథ..

అన్యోన్య కుటుంబ కథ..

కాశీ విశ్వనాథ్, సనా దంపతులకు ఓ అబ్బాయి (శ్రీ విష్ణు) ఓ అమ్మాయి. వీరిది అన్యోన్యమైన కుటుంబం. శ్రీ విష్ణు చెల్లెలికి పెళ్లి కుదరడంతో పెళ్లి బట్టలు, ఇతర వస్తువులు కొనేందుకు షాపింగ్‌కు వెళ్లారు. షాపింగ్ నుంచి తిరిగి వస్తూ సాయిబాబా గుడికి వెళ్తారు. అక్కడ జరిగిన బాంబు పేలుళ్లలో హీరో శ్రీ విష్ణు కుటుంబ సభ్యులందరూ మ‌ృత్యువాత పడుతారు. బాంబు పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిద్దీన్ కుట్ర ఉందని హీరోకు తెలుస్తుంది.

 ప్రేమ, పగ

ప్రేమ, పగ

తన తల్లి, తండ్రి, చెల్లి ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు మట్టుబెట్టేందుకు శ్రీ విష్ణు నిర్ణయించుకొంటాడు. ఈ క్రమంలో ఎదురింట్లో ఉండే ఓ అమ్మాయి (చిత్ర శుక్ల) తో శ్రీ విష్ణు ప్రేమలో పడుతాడు. హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తూనే హంతకుల వేట కొనసాగిస్తుంటాడు. చివరికి సాయిబాబా ఆలయంలో జరిగిన మారణహోమానికి కారణమైన వారెవరు అనేది తెలుసుకోవడంలో హీరో సఫలమయ్యాడా? వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు అనేది ఈ చిత్ర కథ.

 దర్శకుడి ప్రతిభ ఇలా..

దర్శకుడి ప్రతిభ ఇలా..

ఉగ్రవాదుల బాంబు పేల్లుళ్లో కుటుంబాన్ని కోల్పోయి అనాధగా మారిన హీరో చివరికి ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు అనేది దర్శకుడు కుమార్ వట్టి అల్లుకొన్న కథ. ఇలాంటి కథతో తెలుగు తెరమీద చాలా సినిమాలు వచ్చాయి. కథను ప్రభావవంతంగా, కొత్తగా చెప్పినప్పుడు మాత్రమే ప్రేక్షకులకు చేరువ కావోచ్చు. అయితే కథను చెప్పడంలో పూర్తిగా తడబాటుకు గురైనట్టు కనిపించింది. కన్‌ఫ్యూజన్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు గందరగోళంలో పడ్డాడు. క్లైమాక్స్‌ను చాలా పేలవంగా చెప్పడం ఈ చిత్రానికి ప్రతికూల అంశం. చాలా లావిష్‌గా నిర్మాత పెట్టిన ఖర్చును సద్వినియోగం చేసుకోవడంలో దర్శకుడు విఫలమైనట్టే అని చెప్పవచ్చు. యాక్షన్ సీన్లు, మంచి ఫొటోగ్రఫీ, కోరియోగ్రఫీ కొంత మేరకు దర్శకుడి తడబాటును కప్పిపుచ్చాయి.

సాంకేతిక నిపుణుల బలం

సాంకేతిక నిపుణుల బలం

టెలివిజన్ చానెళ్లలో కెమెరామెన్‌గా అనుభావాన్ని గడించిన థమ్ శ్యామ్ తొలిసారి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు. తొలి చిత్రంతోనే అనుభవం ఉన్న కెమెరామెన్‌గా తన ప్రతిభను చాటుకొన్నాడు. పలు లోకేషన్లలో సీన్లను అద్భుతంగా తెరకెక్కించాడు. సురేశ్ బొబ్బిలి అందించిన పాటలు బాగా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో వచ్చే మూడు పాటలు, క్లైమాక్స్‌ వచ్చే మాస్ బీట్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయితే రీరికార్డింగ్‌లో శబ్ద కాలుష్యం ఎక్కువగానే వినిపించింది. పాటలకు తగినట్టు హీరో హీరోయిన్లతో కోరియాగ్రాఫర్ మంచి స్టెప్పులు వేయించడం ఆహ్లాదంగా ఉంది.

 స్థాయిని మంచిన కథతో శ్రీ విష్ణు

స్థాయిని మంచిన కథతో శ్రీ విష్ణు

అప్పట్లో ఒకడుండేవాడుతో ప్రేక్షకులను మెప్పించిన శ్రీ విష్ణు మరోసారి తన స్థాయికి మించిన పాత్రనే పోషించాడు. భారాన్ని స్వయంగా తన భూజాల మీద వేసుకొని సినిమా నడిపించాడు. డ్యాన్స్, యాక్షన్ సీన్లలో ఇరగదీశాడు. డైలాగ్ డెలివరీని కొంత సరిదిద్దుకుంటే మంచి నటుడిగా మారేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓ యువహీరోకు అన్ని విధాల ప్రూవ్ చేసుకొనే స్కోప్ ఉన్న పాత్రను ఎలాంటి తడబాటులేకుండా పోషించాడు.

తొలిచిత్రంతోనే చిత్ర శుక్ల సూపర్

తొలిచిత్రంతోనే చిత్ర శుక్ల సూపర్

ఇక హీరోయిన్ చిత్ర శుక్లకు తొలి పరిచయం. అయితే అమ్మాయి పెర్ఫార్మెన్స్ చూస్తే మొదటి సినిమా అని ఎక్కడా ఫీలింగ్ కలుగదు. గ్లామర్‌తో ఆకట్టుకున్నది. పాటల్లోనూ, రొమాంటిక్ సీన్లలోనూ స్వేచ్ఛగా అందాలను ఆరబోసింది. మంచి గ్రేస్‌తో డ్యాన్స్ కూడా చేసింది. తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించింది. సినిమాల ఎంపికలో సరైన జాగ్రత్తలు తీసుకొంటే తెలుగు తెరమీద మంచి భవిష్యత్ ఉండటం ఖాయం.

విలన్ ఉన్నాడా? లేడా?

విలన్ ఉన్నాడా? లేడా?

ఉగ్రవాద నేపథ్యం ఉన్న కథలో విలన్ ప్రధాన పాత్ర. కథ ఉగ్రవాదుల చుట్టే తిరుగుతున్న నేపథ్యంలో విలన్ పాత్రకు మంచి నటుడిని ఎంపిక చేసుకోలేకపోవడం మరో మైనస్ పాయింట్. హీరో రేంజ్‌కు తగిన విలన్ లేకపోవడం సినిమా పేలవంగా సాగుతుంది.

 మరో ఆలోచన లేకుండా నిర్మాత ఖర్చు

మరో ఆలోచన లేకుండా నిర్మాత ఖర్చు

కథకు అవసరమా లేదా అనే ఆలోచన రాకుండా నిర్మాత బలగ ప్రకాశ్ రావు పెట్టిన ఖర్చు ప్రతీ సీన్‌లోను కనిపిస్తుంది. నిర్మాణ పరంగా నిర్మాతను ఎక్కడా తప్పుపట్టడానికి అవకాశమే కనిపించదు. సినిమా నిర్మాణంపై బలగం ప్రకాశ్ రావుకు ఉన్న తపన ప్రతీ సన్నివేశంలోను కనిపిస్తుంది. తనకు లభించిన అవకాశాన్ని దర్శకుడే సద్వినియోగం చేసుకోలేదనే ఫీలింగ్ కలుగుంది.

సినిమా విశ్లేషణ

సినిమా విశ్లేషణ

మా అబ్బాయి కథలో భాగంగా హీరో కుటుంబం మధ్య ఉన్న అన్యోన్యతను ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు కుమార్ వట్టి సరైన జాగ్రత్తలే తీసుకొన్నాడు. హీరో, హీరోయిన్ల పరిచయం చాలా నాసిరకంగా ఉంది. ఎదురింట్లో అద్దెకు దిగిన హీరోయిన్ సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన ప్రసాదంతో హీరో ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఉదయాన్నే బెడ్ రూంలో కాఫీ కాఫీ అని గోలపెడుతుంటాడు. కనీసం ముక్కు ముఖం తెలియని ఓ ఆడపిల్లను, తొలిసారి ఇంటికి వచ్చిన ఓ అమ్మాయిని ఏకంగా కొడుకు బెడ్ రూంలోకి వెళ్లి కాఫీ ఇవ్వమని చెప్పడం చాలా పేలవంగా ఉంది. హీరో, హీరోయిన్ల పరిచయానికి అంతకంటే గొప్ప సీన్ దొరకలేదా అనిపిస్తుంది. హీరో స్థాయికి తగినట్టుగా విలన్ పాత్ర ఎంపిక చేయకపోవడం ఈ చిత్రంలో మరో బ్లండర్.

అయ్యో ఇంకా ఉందా?

అయ్యో ఇంకా ఉందా?

నిడివి ఎక్కవగా ఉండటం వల్ల సినిమా ఎప్పుడు అయిపోతుందా అని ఎదురుచూడాల్సి వచ్చింది. సినిమా అయిపోయిందనుకుంటున్న తరుణంలో సాయిబాబా గుడి వద్ద పాట పెట్టి ఉగ్రవాదులను హతమార్చడం అంతగా ఆకట్టుకోలేదు. పైగా అప్పటికే సహనం నశించిన ప్రేక్షకులకు కఠిన పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది. కథ, కథనంలో దర్శకుడు సరైన దృష్టపెట్టి ఉంటే శ్రీ విష్ణు కెరీర్‌లో మరో మంచి చిత్రం చేరేది.

మంచి ఓపెనింగ్స్..

మంచి ఓపెనింగ్స్..

అప్పట్లో ఒకడుండేవాడు చిత్ర విజయం తర్వాత వచ్చిన చిత్రం కాబట్టి మంచి ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉంది. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల ఆదరణ బట్టే ఈ చిత్ర విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు, సాంకేతిక వర్గం

శ్రీ విష్ణు, చిత్ర శుక్ల‌, కాశీవిశ్వ‌నాథ్‌, స‌నా తదితరులు
ఎడిటింగ్: మార్తాండ్ కే వెంక‌టేష్‌
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: థ‌మ‌శ్యామ్‌
నిర్మాత: బ‌ల‌గ ప్ర‌కాష్ రావు
క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: కుమార్ వ‌ట్టి

 సినిమా బలం, బలహీనతలు

సినిమా బలం, బలహీనతలు

పాజిటివ్ పాయింట్స్
శ్రీ విష్టు యాక్టింగ్
చిత్ర శుక్ల గ్లామర్
సినిమాటోగ్రఫీ
యాక్షన్ ఎపిసోడ్స్
పాటలు

నెగిటివ్ పాయింట్స్
కథ, కథనం
విలన్
రీరికార్డింగ్
కామెడీ లేకపోవడం

English summary
Maa Abbayi Movie Realesed on March 17. Young Hero Sri Vishnu, Chitra Shukla are lead pair. Director is Kumar Vatti, Producer is Balaga Prakash Rao. This movie made with revenge, Love elements.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu