Madharaasi Twitter Review: మదరాసి మూవీ ట్విట్టర్ రివ్యూ

తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్ కథా నాయకుడిగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మదరాసి. తమిళంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌‌పై నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్, మలయాళ నటుడు బిజు మీనన్, విక్రాంత్, షాబీర్, రుక్మిణి వసంత్ తదితరులు నటించారు.

మదరాసి సినిమాను తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం, శ్రీకర్ ప్రసాద్ అక్కినేని ఎడిటర్‌‌గా, సుదీప్ ఎలామన్‌ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమాకు కీలకంగా మారిన సన్నివేశాలకు నాక్ స్టూడియోస్, ఫాంటమ్ ఎఫ్ఎక్స్, బీస్ట్ బెల్స్ కంపెనీలు విజువల్ ఎఫెక్ట్ వర్క్ చేశాయి. ఈ సినిమా ప్రీమియర్లు నార్త్ అమెరికాలోను, ఇతర దేశాల్లోను ప్రదర్శించబడ్డాయి. ఈ క్రమంలో ఈ సినిమాను చూసిన నెటిజన్లు, క్రిటిక్స్ తమ అభిప్రాయాలను, రివ్యూలను సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..

Madharaasi Twitter Review

మదరాసి సినిమా కథ విషయానికి వస్తే.. తమిళనాడులో నార్త్ ఇండియా మాఫియా, రెండు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ మధ్య జరిే యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రంలో రఘు అనే యువకుడి పాత్రలో శివకార్తీకేయన్ నటిస్తున్నాడు. మాఫియాను ఎదురించే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కథలో లవ్, పగ, ప్రతీకారం, త్యాగం, ఫ్రెండ్‌షిప్, రెండు గ్రూపుల మధ్య వార్ లాంటి అంశాలు హైలెట్‌‌గా నిలిచాయి అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మదరాసి సినిమాను శివకార్తీకేయన్ తన పెర్ఫార్మెన్స్‌తో పీక్స్‌లోకి తీసుకెళ్లాడు. ఏఆర్ మురగదాస్ అనుసరించిన స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగున్నాయి. అనిరుధ్ అందించిన బీజీఎం అదిరిపిోయింది. ఈ చిత్రంలోని సన్నివేశాలు, క్వాలిటీ హై క్లాస్ ుంది. రుక్మిణి వసంత్ అందంతోనే కాకుండా అభినయంతో ఆకట్టుకొన్నది. ఈ సినిమాకు నా రేటింగ్ 4/5 అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

మదరాసి సినిమాను చూశాను. శివకార్తీకేయన్ యాక్టింగ్ ఒకేలా ఉంది. రొమాన్స్ సీన్లు అంతగా ఆకట్టుకోలేదు. సాంగ్స్ బాగాలేవు. రుక్మిణి వసంత్ తన గ్లామర్‌తో అదరగొట్టింది. విద్యుత్ జమ్వాల్ ఒకే‌గా పెర్ఫార్మ్ చేశాడు. ప్రీ ఇంటర్వెల్ సీన్ బాగుంది. ఇక సెకండాఫ్‌‌లో బీజూ మోహన్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. సన్నివేశాలు ఊహించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ సినిమా నిడివి కాస్త తగ్గించాల్సింది. రొటీన్ క్లైమాక్స్ ఉంది. కథ, కథనాలు ఒకే అనిపిస్తాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

శివకార్తీకేయన్ క్యారెక్టర్, ఆయన ఫెర్ఫార్మెన్స్ బాగుంది. రుక్మిణితో లవ్ ట్రాక్ ఫీల్‌గుడ్‌గా ఉంది. విద్యుత్ జమ్వాల్, షాబీర్ విలనిజం స్ట్రాంగ్‌గా ఉంది. సినిమాలోని ఆరు యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి. ఏఆర్ మురగదాస్ అనుసరించిన స్క్రీన్ ప్లే బాగుంది. మావీరన్, అమరన్ సినిమాల తర్వాత శివకార్తీకేయన్ నుంచి వస్తున్న మరో మంచి సినిమా అని భావిస్తున్నాను అని నెటిజన్ కామెంట్ చేశాడు.

లవ్, బ్రేకప్, సెంటిమెంట్, యాక్షన్ తదితర అంశాలు కీలకంగా మారిన ఈ సినిమాలో నిడివి కూడా భారీగా పెరిగిపోయింది. ఈ సినిమా రన్ టైమ్ సుమారుగా 2 గంటల 45 నిమిషాలు అంటే.. సుమారుగా 165 నిమిషాలు. ఇటీవల కాలంలో అత్యధిక రన్‌టైమ్‌లో వచ్చిన చిత్రాల్లో మదరాసి కూడా ఒకటిగా నిలువబోతున్నది అని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టుల పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X