»   » మహానుభావుడు మూవీ రివ్యూ: ‘అతి’ శుభ్రమైన ప్రేమకథ

మహానుభావుడు మూవీ రివ్యూ: ‘అతి’ శుభ్రమైన ప్రేమకథ

Posted By:
Subscribe to Filmibeat Telugu

రేటింగ్: 2.75/5

శతమానం భవతి చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకొన్న శర్వానంద్, భలె భలే మొగాడివోయ్ చిత్రంతో ఫీల్ గుడ్ సినిమాను అందించిన దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం మహానుభావుడు. 'భలే భలే'లో మతిమరుపుతో మెప్పించిన మారుతి తాజాగా అతి శుభ్రం (ఓసీడి) అనే వ్యాధితో ఈ చిత్రాన్ని రూపొందించారు. శర్వానంద్‌కు జతగా అందాల తార మెహ్రీన్ పిర్జాదా నటించారు. మరోసారి ఓ ఆసక్తికరమైన పాయింట్‌తో వచ్చిన మహానుభావుడు చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శర్వానంద్, మారుతి కాంబినేషన్ ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.


ఓసీడీ అనే వ్యాధి నేపథ్యంగా

ఓసీడీ అనే వ్యాధి నేపథ్యంగా

ఆనంద్ (శర్వానంద్) అతిశుభ్రం, నీట్‌‌గా ఉండటం (ఓసీడీ) అనే ఓ వ్యాధితో బాధపడుతుంటాడు. ధూళి, చెత్త అంటే అసహ్యం. ప్రతీ విషయంలోనూ సానిటైషన్, లోషన్ వాడటం అలవాటు. అలాంటి విపరీతమైన శర్వానంద్ ఓ స్టాఫ్ట్ వేర్ ఇంజినీర్. తన ఆఫీస్‌లోనే పనిచేసే మేఘన (మెహ్రీన్ పిర్దాదా)తో ఆనంద్ ప్రేమలో పడుతారు. మేఘన తండ్రి (నాజర్) కూడా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. కానీ ఓ కారణం వలన ఆనంద్ ప్రేమను మేఘన తిరస్కరిస్తుంది. తండ్రి (నాజర్) ఆరోగ్యం చూసుకోవడానికి తన ఊరికి వెళ్తుంది. ప్రేమ తిరస్కారానికి గురైన ఆనంద్.. ఆమెను మెప్పించడానికి మేఘన గ్రామానికి వెళ్తారు. అక్కడ ఎందరైన సంఘటనతో సవాల్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. మేఘనను ఎలా ఒప్పించి ప్రేమను గెలుచుకొన్నాడు. తనకు ఎదురైన సవాల్‌ను ఎలా ఎదుర్కొన్నాడు? తనను పట్టి పీడిస్తున్న వ్యాధి నుంచి బయటపడ్డాడా? ఒకవేళ ఆ వ్యాధి నుంచి బయటపడితే అందుకు బలమైన కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మహానుభావుడు సినిమా.


కథ, కథనాలు ఎలా ఉన్నాయంటే

కథ, కథనాలు ఎలా ఉన్నాయంటే

మతి మరుపు కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల చేత భలే భలే అనిపించుకొన్న మారుతి.. తాజాగా ఓ ప్రేమ కథకు ఓసీడీ వ్యాధిని నేపథ్యంగా స్టోరీని అల్లుకొన్నాడు. తొలిభాగంలో ప్రేమకథను చెబుతూనే మరో పక్క ఆహ్లాదకరమైన సన్నివేశాలను చక్కగా డిజైన్ చేసుకొన్నాడు. శుభ్రం అనే పాయింట్ అతిగా మారుతుందని ప్రేక్షకులు గ్రహిస్తున్న సమయంలో ఇంటర్వెల్‌కు ముందు ఎమోషన్ ట్విస్ట్‌తో కథను దర్శకుడు మారుతి మరో మలుపు తిప్పాడు. సెకండాఫ్‌లో గ్రామీణ వాతావరణంలో కథను చక చకా పరుగులు పెట్టించారు. రెండో భాగంలో చెరువు సీన్లు, పచ్చడి అన్నం ఎపిసోడ్ సినిమాకు బలంగా మారాయి. క్లైమాక్స్‌లో రొటీన్ వ్యవహారమే ఉన్నా చివర్లో అమ్మ ప్రేమ పాయింట్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చి ప్రేక్షకుల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌ను కల్పించడంలో సఫలమయ్యాడు.


తొలిభాగంలో స్టోరి ఇలా..

తొలిభాగంలో స్టోరి ఇలా..

అతి శుభ్రం అనే పాయింట్‌పై శర్వానంద్ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు మారుతి పెద్ద కసరత్తే చేశాడు. కానీ ఓ దశలో ఓసీడీ కాన్సెప్ట్ అతిగా, బోర్‌గా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్‌కు ముందు ఆహ్లాదకరమైన కామెడీతో సినిమాను నడించడం దర్శకుడి ప్రతిభ తెలియజేస్తుంది. కథ మూస ధోరణిలో వెళ్తున్న నేపథ్యంలో నాజర్ క్యారెక్టర్ ద్వారా సెంటిమెంట్‌ను జొప్పించాడు. దాంతో ఇంటర్వెల్ తర్వాత కథపై ఆసక్తి పెంచాడు.


విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో

విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో

సెకండాఫ్‌లో మెహ్రీన్ గ్రామంలో సరదా సరదా సన్నివేశాలతో పాటు కొంత సీరియస్ నోట్‌లో కథ ముందుకెళ్తుంది. ఇక గ్రామంలో నాజర్, అతని ప్రత్యర్థుల మధ్య వైషమ్యాలు, విభేదాలు కొంత రొటీన్‌గానే సాగుతాయి. క్లైమాక్స్‌లో కుస్తీ పోటి అంతగా ఆకట్టుకోలేకపోయినా సినిమాను ముగించడానికి ఉపయోగపడింది. అయితే రొటీన్ అని ఫీలయ్యే ప్రేక్షకులకు మదర్ సెంటి మెంట్‌తో ఆకట్టుకొన్నాడు. తన పిచ్చితనం వల్ల అమ్మ ప్రేమను కోల్పోయానని శర్వానంద్‌తో చెప్పించి సినిమాకు జస్టిఫికేషన్ ఇచ్చాడు.


డైరెక్టర్ టాలెంట్ గురించి

డైరెక్టర్ టాలెంట్ గురించి

దర్శకుడిగా మారిన తొలినాళ్లలో బూతు డైరెక్టర్ అనే పేరును మూటగట్టుకొన్నారు. ఆ తర్వాత భలే భలే మొగాడివోయ్‌తో తనకు క్లీన్ చిత్రాలను తెరకెక్కించే మరో కోణం ఉందని మారుతి నిరూపించుకొన్నారు. ప్రస్తుతం భలే భలే మొగాడివోయ్ సీక్వెల్ అనిపించే విధంగా ఉండే మహానుభావుడు చిత్రంతో మారుతి సేఫ్ గేమ్ ఆడారు. ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా.. ఎంటర్‌టైన్‌మెంట్‌నే నమ్ముకున్నారు. పండుగ సీజన్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో సఫలమయ్యాడు. ఇంటర్వెల్‌కు ముందు ఫైట్, రెండో భాగంలో నాలుగైదు సన్నివేశాలను బలంగా రాసుకోవడం ఆయనకు కలిసి వచ్చింది. ఓవరాల్‌గా పండుగ సీజన్‌లో ఫీల్‌గుడ్ చిత్రాన్ని అందించాలన్న ప్రయత్నానికి కొంచెం చేరువయ్యాడని చెప్పవచ్చు.


విభిన్నమైన పాత్రలో శర్వా

విభిన్నమైన పాత్రలో శర్వా

శర్వానంద్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కథలో డెప్త్ ఉంటే చాలు కుమ్మేయడం శర్వానంద్ నైజం. అందుకు సాక్ష్యంగా ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి చిత్రాలు నిలిచాయి. తాజాగా నటించడానికి, తన ప్రతిభను మరోసారి బయటపెట్టడానికి దొరికిన అవకాశం మహానుభావుడు. ఈ చిత్రంలో తన పాత్రను ఎలాంటి తడబాటు లేకుండా పోషించాడు. కామెడీ పండించాడు. ఫైట్స్‌తో ఆకట్టుకొన్నాడు. ఓవరాల్‌గా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.


హీరోయిన్‌గా మెహ్రీన్

హీరోయిన్‌గా మెహ్రీన్

ఆటపాటలకే కథానాయికలు పరిమితమవుతున్న తరుణంలో హీరోయిన్‌గా మెహ్రీన్‌కు నటనకు స్కోప్ ఉన్న పాత్ర లభించింది. కీలక సన్నివేశాల్లో మంచి నటనను ప్రదర్శించడానికి తన వంతు ప్రయత్నం చేసింది. అయితే ఇంకా యాక్టింగ్‌కు మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం కనిపించింది. పాటలు, ఎమోషన్ సీన్లలో పర్వాలేదనిపించింది.


సపోర్టింగ్ కారెక్టర్లలో

సపోర్టింగ్ కారెక్టర్లలో

మహానుభావుడు చిత్రంలో హీరో, హీరోయిన్ల తర్వాత చెప్పుకోవాల్సిన పాత్ర వెన్నెల కిషోర్. కథలో భాగంగా హీరోతో వెన్నెల కిషోర్ పాత్ర ట్రావెల్‌ అవుతుంది. అవసరమైన సన్నివేశాల్లో తనదైన మార్కు కామెడీతో ఆకట్టుకొన్నాడు. ఈ చిత్రంలోని పాత్రను పోషించడానికి కిషోర్‌ పెద్దగా శ్రమించినట్టు కనిపించలేదు. హీరోయిన్ తండ్రిగా నాజర్ తన పరిధి మేరకు ఓకే అనిపించారు. మిగితా పాత్రల్లో భద్రం కామెడీ ఆకట్టుకొన్నది. మరోసారి ప్రేక్షకులకు తన హాస్యంతో వినోదాన్ని పంచాడు.


థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒకే

థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒకే

మహానుభావుడు చిత్ర సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే సంగీత దర్శకుడు థమన్ గురించి చెప్పుకోవాలి. గత చిత్రాల్లో మూస బాణీలతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన థమన్ ఈ చిత్రానికి ఒకట్రెండు ఫీల్‌గుడ్ పాటలతోపాటు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించాడు. మహానుభావుడే టైటిల్ సాంగ్, రెండు కళ్లు పాటలు తెరపైన ఆకట్టుకొనేలా ఉన్నాయి. కామెడీ, ఎమోషనల్ సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా మారింది.


 ఫోటోగ్రఫీ అదనపు ఆకర్షణ

ఫోటోగ్రఫీ అదనపు ఆకర్షణ

ఈ చిత్రానికి నిజర్ షఫీ సినిమాటోగ్రాఫర్. సిటీ వాతావరణంతోపాటు గ్రామీణ వాతావరణాన్ని చక్కగా ఒడిసిపట్టుకొన్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో లోకేషన్లు చాలా బాగున్నాయి. చెరువు సన్నివేశాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు నిజర్. ఎడిటింగ్ విభాగంలో కోటగిరి వెంకటేశ్వరరావు తన కత్తెరకు బాగానే పదును పెట్టాడు.


నిర్మాణ విలువలు

నిర్మాణ విలువలు

రన్ రాజా రన్ లాంటి క్లీన్ చిత్రాన్ని, పుష్కలమైన నిర్మాణ విలువలుండే సినిమాలను రూపొందించడంలో యూవీ క్రియేషన్ బ్యానర్‌ ఓ ప్రత్యేకత ఉంది. తన బ్యానర్ ప్రతిష్టతకు తగినట్టుగానే క్వాలిటీ విషయంలో యూవీ క్రియేషన్ ఎక్కడా రాజీ పడిన దాఖలాలు కనిపించలేదు. దసరా పండుగ వేళ పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రాన్ని అందించడంలో సఫలమైందనే చెప్పవచ్చు.


ఫైనల్ జడ్జిమెంట్

ఫైనల్ జడ్జిమెంట్

దసరా బరిలో జై లవకుశ, స్పైడర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాల మధ్య ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిత్రం మహానుభావుడు. జై లవకుశ, స్పైడర్ చిత్రాలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వచ్చిన మహానుభావుడు చిత్రంపైనే ఎక్కువ దృష్టి పడింది. పండుగ హీరో అనే ముద్ర వేసుకున్న శర్వానంద్‌పై సానుకూల అభిప్రాయమే వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువయ్యే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రంలో వినోదానికి పెద్ద పీట వేయడం సినిమాకు అనుకూలంగా మారే అంశం. ప్రేక్షకులకు కనెక్ట్‌గా అవడానికి స్కోప్ ఉన్న చిత్రం భారీ చిత్రాలకు పోటీ ఇవ్వడం ఖాయమే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


 ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్

ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్

పాజిటివ్ పాయింట్స్


శర్వానంద్ నటన
మారుతి టేకింగ్
కామెడీ


మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
బలహీనమైన క్లైమాక్స్


 స్టార్స్ అండ్ టెక్నికల్ డిపార్ట్ మెంట్

స్టార్స్ అండ్ టెక్నికల్ డిపార్ట్ మెంట్

నటీనటులు: శర్వానంద్, మెహ్రీన్ పిర్జాదా, నాజర్, వెన్నెల కిషోర్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మారుతి
నిర్మాత: వీ వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: నిజర్ షఫీ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: యూవీ క్రియేషన్
రిలీజ్ డేట్: 29 సెప్టెంబర్ 2017
సినిమా నిడివి: 151 నిమిషాలు


English summary
Mahanubhavudu is an latest Telugu-language romantic action comedy film writtem and directed by Maruthi Dasari. It features Sharwanand and Mehreen Pirzada in the lead roles. This scheduled for a worldwide release on 29 September 2017. In occasion, an exclusive review for Telugu Filmibeat and Telugu oneindia readers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu