For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భయపెట్టే 'బిజినెస్ మ్యాన్' (రివ్యూ)

  By Srikanya
  |

  -జోశ్యుల సూర్య ప్రకాష్

  చిత్రం పేరు: బిజినెస్‌ మ్యాన్
  సంస్థ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌
  నటీనటులు: మహేష్‌ బాబు, కాజల్‌, ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మాజీ, సాయాజీ షిండే, ధర్మవరపు, భరత్‌ రెడ్డి తదితరులు
  పాటలు: భాస్కరభట్ల రవికుమార్
  ఛాయా గ్రహణం: శ్యామ్ కె.నాయుడు
  ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్
  సంగీతం: తమన్
  నిర్మాత: వెంకట్‌
  రచన-దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
  విడుదల: 13-01-2012

  'దూకుడు' వంటి మెగా హిట్ తో తన బిజినెస్ స్ధాయిని పెంచుకుని, కొత్త లెక్కలు వేసుకుని పూరీని కలుపుకుని మహేష్ బాబు అసలు సిసలైన 'బిజినెస్ మ్యాన్'లా రెండు వేల థియేటర్స్ లో దిగాడు. అయితే బిజినెస్ బాగా చేయటానికి కావాల్సింది సరైన మాల్ (కథ)ని వెంటబెట్టుకుని రావటమనే విషయాన్ని మర్చిపోయాడు. దాంతో కేవలం మాటలు(డైలాగ్స్) చెప్పి బిజినెస్ చేయాల్సిన పరిస్ధితి వచ్చింది. తన స్టైయిల్ ,డైలాగ్ డెలవరీ, తన ఫెరఫార్మెన్స్ అండతో చేసిన ఈ ప్రయత్నం కొంత మందికి బాగానే నచ్చేటట్లు ఉంది.

  ముంబైలో డాన్ లు కరువై సెటిల్ మెంట్స్ చేసేవాళ్లు లేక విలవిల్లాడుతూంటుంది. అది తెలుసుకున్న సూర్య(మహేష్) ముంబైకి భాయ్ అవ్వటానికి వస్తాడు. అదొక వృత్తిగా, బిజినెస్ గా చేస్తానంటూ రంగంలోకి దిగుతాడు. అతి తక్కువ కాలంలోనే ..ముంబైని తన ధైర్యంతో,తన తెలివితో లొంగ తీసుకుని అంచెలెంచులుగా సూర్య బాయ్ గా ఎదుగుతాడు. అలాంటి సమయంలో అతనికి కొన్ని సవాళ్లు ఎదురౌతాయి.. వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు... అస్సలు అతనికి ఈ భాయ్ అవ్వాలనే కోరక ఎలా పుట్టింది... అతనికీ, చిత్ర (కాజల్)కీ ఉన్న రిలేషన్ ఏమిటి అన్నది తెరమీద చూడాల్సిందే.

  బయోపిక్ తరహాలో ఉన్న కథను తీసుకుని దానికి పాటలు, ఫైట్స్, లవ్ ఎలిమెంట్స్ జతకూర్చినట్లు ఉంటుందీ చిత్రం. దాంతో సినిమా మొత్తం.. మొదటి నుంచి దాదాపు చివరి వరకూ తనకు ఎదురే లేకుండా అందరినీ భయపెట్టి లొంగతీసుకుంటూ హీరో ప్రయాణం సాగుతుంది. అది కూడా ముంబైకి డాన్ అవ్వటం చాలా ఈజీ అన్నట్లుగా సీన్స్ అల్లటంతో ఎక్కడా కాంప్లిక్ట్, ఇంటెన్సిటీ పుట్టక తేలిపోతాయి. దాంతో హీరో ఎక్కడా సమస్యలో పడటం కానీ, అతనికి ప్రత్యర్ధి ఉండంటం కానీ జరగదు. సినిమా ప్రీ క్లైమాక్స్ లో విలన్ ఎవరో తెలుస్తుంది. అతనితో చిన్న ఫైట్ తో సినిమా క్లైమాక్స్ కు చేరుకుంటుంది. మరో ప్రక్క హీరోయిన్ తో లవ్ ట్రాక్ లో ఎక్కడా ఫీల్ ఉండదు. కేవలం పాటలు కోసం వచ్చినట్లుగా హీరోయిన్ వస్తూ పోతూంటుంది. కేవలం హీరో క్యారెక్టరైజేషన్, డైలాగులను నమ్ముకుని పూరీ ఈ చిత్రం డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది.

  ఇక ఈ స్టోరీ పాయింట్ ని తన గురువు వర్మ ఇచ్చారని పూరి మొదటినుంచీ చెప్తున్నారు. అదే వర్మ గతంలో ముంబై వచ్చి మాఫియాలో చిక్కుకున్న సత్య ని తెరకెక్కించారు. అందులో కావాలని సత్య .. మాఫియాలోకి చేరడు. పరిస్ధితులు అతన్ని అందులోకి తోస్తాయి. అంతేగాక కత్తి పట్టినవాడు కత్తితోనే అంతమొందుతాడు అన్నట్లు చివర్లో మాఫియాలోకి వెళ్లిన సత్య మరణంతో సినిమా ముగించి రిజల్యూషన్ ఇస్తారు. అదే బిజినెస్ మ్యాన్ కి వచ్చేసరికి.. భాయ్ కావాలని పనిగట్టుకుని ముంబై వస్తాడు హీరో. అతను గెలిచి.. భాయ్ కావాలనుకోవటం తప్పేమికాదు అని చివర్లో ఓ సందేశం విసిరి మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. ఇక కామిడి కూడా ఈ చిత్రంలో మైనస్ గా నిలిచింది. దూకుడు మొత్తం కామిడీ కావటంతో మళ్లీ ఎందుకు అనుకున్నారో ఏమో కానీ దాన్ని వదిలేసారు. ధర్మవరపు సుబ్రమణ్యం ఉన్నా ఆయనపై కామిడీ చెయ్యలేదు. అక్కడక్కడా మహేష్ డైలాగులే నవ్విస్తాయి. ఐటమ్ సాంగ్ కూడా ముమైత్ .. ఇప్పటికింకా నిండా పదహారే రేంజిలో లేకుండా నిరాశపరుస్తుంది.

  ఇక ఈ చిత్రంలో హైలెట్స్ లేవా అంటే మొదటిగా చెప్పుకోవాల్సింది మహేష్ నటన... మంచి ఈజ్ తో ఎప్పటిలాగే వన్ మ్యాన్ షో లాగ సినిమా మొత్తం తానే లాక్కెళ్లే ప్రయత్నం చేసాడు. అలాగే పూరీ డైలాగ్స్, 'సారొత్తారా.. 'పాట,'చావో పిల్ల..' పాటలు. ఇవి ఉన్నంతంలో సినిమాను చివరి వరకూ లాక్కెళ్లతాయి. కాజల్ పాత్ర విషయంకి వస్తే ఆమె.. మాటిమాటికి పోకిరిలో ఇలియానాని గుర్తు చేసే క్యారెక్టైజేషన్ సాగుతుంది. ఛాయాగ్రహణం, ఎడిటింగ్,నిర్మాణవిలువలకు తగినట్లే బాగున్నాయి. మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం మహేష్ చెప్పే డైలాగ్స్ కోసం చూడాలి.

  English summary
  Mahesh Babu's much awaited Businessman released across the globe with a bang.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X