twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చూసేందుకు కావాలి ఖలేజా!! ('మహేష్ ఖలేజా' రివ్యూ)

    By Srikanya
    |
    Mahesh Khaleja
    Rating
    -జోశ్యులు సూర్య ప్రకాష్
    చిత్రం: మహేష్ ఖలేజా
    బ్యానర్: కనకరత్న మూవీస్ పతాకం
    నటీనటలు: మహేష్ బాబు, అనూష్క, ప్రకాష్ ‌రాజ్, బ్రహ్మానందం, సునీల్,
    వేణుమాధవ్, అలీ, నాజర్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
    సంగీతం: మణిశర్మ
    సినిమాటోగ్రఫీ: ఎస్.భట్
    కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్
    కళ: ఆనంద్‌ సాయి
    ఫైట్స్: రామ్-లక్ష్మణ్
    సమర్పణ: ఎస్.సత్యరామమూర్తి
    కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: త్రివిక్రమ్
    నిర్మాతలు: శింగనమల రమేశ్ ‌బాబు, సి. కల్యాణ్
    విడుదల తేదీ: 07-10-2010

    మహేష్..మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత తన ఖలేజా చూపించటానికి ధియోటర్స్ లోకి భారీ ఓపినింగ్స్ తో దిగాడు. దానికితోడు తనకు గతంలో ఘన విజయం అందించిన త్రివిక్రమ్ ని తోడు తెచ్చుకున్నాడు. అయినా అధ్బుతమేమీ జరగలేదు. ఖలేజా టైటిల్ లోనే తప్ప సినిమాలో కనపడటం లేదని సగటు ప్రేక్షకుడు పెదవి విరిచాడు. ధ్రిల్లర్ ఫార్మెట్ లో సాగే ఈ కథనం మహేష్ లోని హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యలేకపోయింది. కామిడీ, ఫైట్స్, రొమాన్స్ దేనికదే కథలో కలవక కామన్ ఆడియన్ ని కలవరపెట్టాయి. అయితే ఈ చిత్రంలో చివరి వరకూ కూర్చోపెట్టిన మ్యాజిక్ మాత్రం మహేష్ బాబే. అతని ఈజీనెస్, స్క్రీన్ ప్రెజన్స్ మెచ్చుకోకుండా ఉండలేం.

    సీతారామరాజు(మహేష్) ఉషారైన క్యాబ్ డ్రైవర్. జర్నీలో అనుకోకుండా పరిచయమైన సుభాషిణి (అనూష్క) తో ప్రేమలో పడతాడు. ఐరెన్ లెగ్ లాంటి ఆమె కలిసినప్పుడల్లా దురదృష్టం వెంటపడుతున్నా ఎడ్జెస్ట్ అవుతూంటాడు. అలా లైఫ్ ని, క్యాబ్ ని ఈజీగా నడిపేస్తూ గడిపేస్తున్న రాజు...ఓ రోజు...రాజస్ధాన్ పల్లెలో ఉన్న ఓ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ చెక్ అందించటానికి వెళ్ళాల్సివస్తుంది. అయితే ఇక్కడో ట్విస్టు. రాజస్ధాన్ లోని ఆ గ్రామం పరిస్ధితి చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ జనం కారణం తెలియకుండా వరసగా చనిపోతూంటారు. అయితే వారి మత పెద్ద ...దేముడు వచ్చి తమని రక్షిస్తాడని నమ్మి...కొన్ని లక్షణాలు, గుర్తులుతో దేముడు కోసం వెతికిస్తూంటాడు. ఈ లోగా రాజస్ధాన్ చేరిన రాజు ..అనుకోకుండా వారికి దొరికిపోతాడు. వారు రాజునే దేముడుగా భావించి ఆ గ్రామాన్ని రక్షించమని వేడుకుంటారు. అప్పుడు రాజు ఎలా రియాక్టవుతాడు...కష్టాల్లో ఉన్న ఆ ఊరిని రక్షిస్తాడా..ఇంతకీ ఆ ఊరికి...బిజెనెస్ టైకూన్ జి.కె(ప్రకాష్ రాజ్) కీ ఉన్న సంభందం ఏమిటీ... అన్న విషయాలు తెరపైనే చూడాలి.

    ఈ చిత్రం కథ..చాందినీ చౌక్ టు చైనా అనే ప్లాప్ సినిమాని గుర్తుకు తెస్తే..నేరేషన్...గతంలో త్రివిక్రమ్ రచన చేసిన జై చిరంజీవని చిత్రం గుర్తుకు తెస్తుంది. హీరోకి ప్రీ క్లైమాక్స్ వరకూ విలన్ ఎవరో తెలియదు. ఎక్కడా విలన్, హీరో ల మధ్య ఎత్తుకు పై ఎత్తులు(కమర్షియల్ చిత్రాల్లో తప్పదు కదా) ఉండవు. అలాగే అనూష్కకీ, మహేష్ కీ మధ్య నడిచే లవ్ స్టోరీ పొరపాటున కూడా కథకు సంభందం ఉండదు. తప్పదు అన్నట్లు విలన్ కొడుకు చేసుకోబోయే అమ్మాయి..అనూష్క అని పెట్టి కథకు లింక్ చేసారు. దాంతో లవ్ (అనొచ్చా) సీన్స్ వచ్చినప్పుడల్లా కామిడీగా ఉన్నా కథ ఎవేగా వెళ్ళతున్న ఫీలింగ్ వస్తుంది. ఇక రాజస్ధాన్ లో ఉన్న గ్రామస్తులు ఎదురుచూస్తున్న దేముడు హీరోనే అనే పాయింట్ ఇంటర్వెల్ దాకా రాదు. దాంతో ఫస్టాఫ్ లో చాలా భాగం సునీల్, అలీ, ధర్మవరపు, అనూష్క వంటి వారి కామిడీలతో నింపాల్సి వచ్చింది. అలాగే హీరో...తాను రక్షింపబోయే గ్రామస్తులుకి అస్సలు సమస్య ఏమిటో తెలుసుకుని పోరాడేసరికే పుణ్యకాలం గడిచిపోయి క్లైమాక్స్ కు దగ్గర పడుతుంది. అలాగే త్రివిక్రమ్ కి ఉన్న ఏకైక బలం డైలాగులు అన్న విషయం తెలిసిందే. అవే ఈ చిత్రంలో మిస్సయ్యాయి. అదేం టేస్టోగానీ.. మహేష్ బాబు చేత కొంచెం వల్గర్ గానే చాలా డైలాగులు చెప్పించారు...(అంటే క్యారెక్టర్ క్యాబ్ డ్రైవర్ కాబట్టి పెట్టారని ఎడ్జెస్టవ్వాలి). ఇక అనూష్క...కొన్ని సన్నివేసాల్లో మహేష్ కి అక్కలాగ అనిపిస్తూంటుంది.

    ఇక హైలెట్స్ లో చెప్పాలంటే...జెమినీ టీవి రిపోర్టర్ గా సునీల్ బాగా నవ్విస్తాడు. అలాగే అనూష్క..విలన్ కొడుకు దగ్గర కండోమ్స్ చూసి సేఫ్ గా ఉండలేనని పారిపోయి..మహేష్ బాబు ని చేరితే అతను..నా దగ్గర కండోమ్స్ కూడా లేవు..సేఫ్ కష్టం అనటం కొంచెం బూతుగా ఉన్నా నవ్విస్తుంది. రాజస్ధాన్ ఎందుకు వచ్చారు అని సునీల్ అడిగితే ఎండలు బాగా ఉంటాయి కధా దండెం కట్టి బట్టులు ఆరేసుకుందామని వచ్చాననే డైలాగు బావుంటుంది. అలాగే అనూష్క తక్కువ బట్టలు కట్టుకుని వస్తే..మహేష్ బాబు..అదేంటి ప్యాంటు వేసుకోవటం మర్ఛిపోయావు అని కామెంట్ చేస్తాడు. అలాగే మహేష్ బాబు..తనలోనే దేముడున్నాడనే విషయం తెలుసుకునే సన్నవేశం చాలా బాగా రాసారు..తీసారు..హేట్సాఫ్ త్రివిక్రమ్. అలాగే దేముడ్ని వెతికే భాధ్యత మీద వేసుకున్న సిద్దప్పగా షఫీ బాగా చేసాడు. అయితే కోట శ్రీనివాస రావు లాంటి ఆర్టిస్టుని పెట్టుకుని కూడా ఏం చేయలేదని మరో సారి అనిపిస్తుది. ఇక దర్శకుడుగా త్రివిక్రమ్..షాట్స్ బాగానే తీసాడు..ఎమోషన్స్ ని బాగానే ఆర్టిస్టుల నుంచి రాబట్టుకున్నాడు. అయితే ఆయన...రచయితగానే ఫెయిలయ్యాడు. ఇక మణిశర్మ సంగీతంలో..సదాశివ సన్యాసి అనే పాట ఒక్కటే అధ్బుతంగా ఉంది. బ్రహ్మానందం చేసింది కాస్సేపయినా బాగా నవ్వించారు. టెక్నికల్ గా కెమెరా,ఎడిటింగ్ వేటికీ పేరు పెట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే సినిమా బావుంటే అవన్నీ అధ్బుతమనిపిస్తాయి.

    ఏదైమైనా కాస్సేపు కామిడీగా నవ్వుకోవటానకే సినిమా అంటే ఫస్టాఫ్ చూసి వచ్చేయచ్చు. మహేష్ బాబు కోసమనుకుంటే అంతా బావుంటుంది. సినిమా ...సినిమానే అనుకుంటే కష్టమనిపిస్తుంది. ఫైనల్ గా ఈ సినిమా చూసేవాళ్ళకు కూడా కాస్తంత "ఖలేజా" కావాలనిపిస్తుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X