»   »  'మల్లన్న' వద్దన్నా....

'మల్లన్న' వద్దన్నా....

By Staff
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  Mallanna
  Rating

  -కులదీప్ రాయళ్ల
  చిత్రం: మల్లన్న
  నటీనటులు: విక్రమ్, శ్రియ, కృష్ణ, ఆశిష్ విధ్యార్థి, ప్రభు,
  వై.జి.మహదేవన్, ముకేష్ తివారి, బ్రహ్మానందం తదితరులు
  కెమెరా: ఏకాంబరం
  డైలాగ్స్, పాటలు: సాహితి
  సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
  బ్యానర్: వి క్రియేషన్స్
  నిర్మాత: కాలై పులి థాను
  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుశీ గణేషన్
  విడుదల తేది: ఆగష్టు 21 2009

  ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న విక్రమ్ సినిమా మల్లన్న భారీ అంచనాల మధ్య విడుదలయింది...ప్రేక్షకుడి అంచనాలను ఏ మేరకు అందుకుందో చూద్దాం.

  మల్లన్న(విక్రమ్) ఓ CBI అధికారి. అవినీతి నిరోధక శాఖలో కృష్ణారావ్(కృష్ణ) కింద పనిచేస్తుంటాడు. ఇలా ఓ సారి పి.పి.పి.(ఆశిష్ విధ్యార్థి) ఇంటిపైన రైడ్ చేస్తాడు. కేసులోంచి తప్పించుకోవడానికి పి.పి.పి. పక్షవాతం వచ్చినట్టు నటిస్తాడు. సుబ్బలక్ష్మి(శ్రియ) పి.పి.పి. కుమార్తె. తన తండ్రి పక్షవాతం వచ్చినట్టు నటిస్తున్నాడని తెలియక, ఇందుకు కారణమైన మల్లన్న పై పగతీర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా మల్లన్నని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ తన వెంట పడుతూవుంటుంది.

  ఇదిలా వుంటే శ్రీ శైలంలోని మల్లన్న దేవస్థానంలోనున్న చెట్టుకు తమ సమస్యలను ఓ ఉత్తరం రాసి పెడితే ఆ మల్లన్న స్వామి తమ కష్టాలను తీరుస్తాడని ప్రజలకు నమ్మకం కలిగేలా మల్లన్న(విక్రమ్) చేస్తాడు. మల్లన్నే ఓ విచిత్ర వేషధారణతో (కోడిని తలపించేలా) ధనవంతుల వద్ద డబ్బు దోచేసి పేదల కష్టాలు తీర్చుతుంటాడు. ఇందుకోసం తన మిత్రులతో కలిసి పదకొండుమందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుంటాడు. మల్లన్న దేవస్థానంలోని ఉత్తరాల ద్వారా ప్రజల సమస్యలు తీర్చుతున్నది ఎవరన్న దానిపై డి.ఐ.జి అధికారి ప్రభు పరిశోధన చేస్తుంటాడు. ఓ సారి పి.పి.పి. ,సుబ్బలక్ష్మి సాయంతో పథకం పన్ని మల్లన్న చేత నిజాలు చెప్పించి తను దోచేసే డబ్బులో సగం వాటా తనకి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇందులో భాగంగా మల్లన్న, సుబ్బలక్ష్మితో కలసి మెక్సికోకి వెళ్తాడు. డబ్బు తన అకౌంట్ లో చేరిందన్న విషయం తెలియగానే పి.పి.పి. మల్లన్నను చంపేయమని తన మనుషులకు చెప్తాడు. తన తండ్రి పక్షవాతం వచ్చినట్టు నటిస్తున్నాడని, డబ్బుపిచ్చి అని తెలిసిన సుబ్బలక్ష్మి నిజంగానే మల్లన్నను ప్రేమిస్తుంది.

  ఇక మిగిలిన కథ ఎలా మల్లన్న తన లక్ష్యాన్ని చేరుకున్నాడన్నది. కథలో మల్లన్నను ధనికులను దోచుకోవడానికి గల కారణాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చెయ్యలేక పోయారు. డబ్బు వుండటం వల్లే ధనికులు ఇతరులని శాసిస్తున్నారన్న విషయాన్ని ఇంకా బాగా చెప్పుండే అవకాశం వుంది.

  నటీనటుల్లో జాతీయ ఉత్తమ నటుడు విక్రమ్ దానికి తగ్గట్టుగానే నటించాడు. కోడిపుంజు గెటప్ లో, వృద్దుడి గెటప్ లో బాగా కనిపించినా ఆడవేషంలో చూడటానికి ఇబ్బందిగా వుంటుంది. కొన్ని చోట్ల అపరిచితుడు నటనని అనుకరించాడు. ఇక శ్రియ గ్లామర్ సినిమాకి బాగా దోహదపడిందని చెప్పచ్చు. జీరో సైజ్ ఫిగర్ తో గ్లామరస్ గా కనిపించింది. పాటల్లో డాన్స్ చాలా బాగా చేసింది. డబ్బున్న పొగరమ్మాయిగా బాగానే నటించింది. కృష్ణ పాత్ర నిడివి తక్కవే అయినా పాత్రోచితంగా నటించాడు. ఆశిష్ విధ్యార్థి, ప్రభులు తమ పాత్రలకు న్యాయం చేసారు. నేటివిటీ టచ్ ఇవ్వడానికి ప్రత్యేకంగా తీసిన బ్రహ్మానందం కామెడీ ట్రాక్ విసుగు తెప్పిస్తుంది.

  ఇక దర్శకుడు సుశీ గణేషన్ టెక్నికల్ గా బాగా చేసినా స్క్రీన్ ప్లే మీద దృష్టి పెట్టుంటే బాగుండేది. కథ పాతదే. అపరిచితుడు సినిమాలో ప్రజలు సమస్యలు e-mail చేస్తే ఇందులో చెట్టుకు కడతారు, శివాజి సినిమాలోలా హీరో బ్లాక్ మనీ దోచేస్తుంటాడు. అయినా కథను ఇంకా ఆసక్తిగా చెప్పుండచ్చు. ముఖ్యంగా ద్వితియార్థంలో స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు దారుణంగా విఫలమయ్యారు. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాడు. సంగీతం బాగా వున్నా లిప్ సింక్ మిస్ అయింది.

  భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని సంతృప్తి పరచడంలో విఫలమయ్యిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ద్వితియార్థంలో ప్రేక్షకులు మధ్యలో లేచిపోవడం కనిపించింది. విక్రమ్ అభిమానులకు, శ్రియను చూడాలనుకున్నవారికి మాత్రమే నచ్చే సినిమా.... లేకపోతే మల్లన్న వద్దన్నా అనుకుంటూ బయటకి కావాల్సివుంటుంది.

   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more