»   » ట్విస్టులతో థ్రిల్ చేసే ప్రయత్నం....(మలుపు రివ్యూ)

ట్విస్టులతో థ్రిల్ చేసే ప్రయత్నం....(మలుపు రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

హైదరాబాద్: 'గుండెల్లో గోదారి' సినిమా చూసిన వారికి ఆది పనిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటాం. తెగులు వాడే అయినప్పటికీ ఆది ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేసాడు. అక్కడ పాపులర్ యాక్టర్ కూడా. తెలుగులో మాత్రం పెద్దగా గుర్తింపు లేదు. ఒకప్పటి సంచలన దర్శకులు రవిరాజా పినిశెట్టి తనయుడే ఆది.

ప్రస్తుతం ఆది నటించిన చిత్రం 'మలుపు' రిలీజైంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రం ద్వారా ఆయన సోదరుడు సత్యప్రభాస్ పనిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తన జీవితంలో జరిగిన రియల్ సంఘటనలను స్టోరీగా మలుచుకుని సినిమా చేసాడు దర్శకుడు. ఇద్దరు సోదరులు కలిసి చేసిన ఈ సినిమా వీరి కెరీర్ ను 'మలుపు' తిప్పే రేంజిలో ఉందా? లేదా? అనేది ఓ సారి చూద్దాం.

కథ విషయానికొస్తే...
సగ... పూర్తి పేరు సాయి గణేష్ (ఆది పినిశెట్టి ) హ్యాపీ గోయింగ్ మ్యాన్. తన బెస్ట్ ఫ్రెండ్స్ శివ ,రాజేష్ ,కిషోర్ లతో కలిసి హ్యాపీగా గడిపేస్తుంటాడు. ఓ సారి ఈ నలుగురూ కలిసి న్యూ ఇయర్ పార్టీకి వెళ్లి తాగిన మత్తులో ప్రియ (రిచా ), ఆమె బాయ్ ఫ్రెండ్ సూర్య (శ్రవణ్ )లతో గొడవ పడతారు. శ్రవణ్ ను తీవ్రంగా కొడతాడు. దీంతో ప్రియ తండ్రి, మాఫియా డాన్ అయిన మొదలియార్ (మిథున్ చక్రవర్తి ) సగ ఫ్రెండ్స్ ని చంపడానికి తిరుగుతుంటారు. ఈ విషయం తెలిసి నేరుగా మొదలియార్ ను కలిసి క్షమాపణ చెప్పాడానికి ముంబై వెళ్లిన సగకి వారు తమను చంపాలని తిరగడానికి కారణం వేరే అని తెలుస్తుంది. మొదలియార్ గ్యాంగ్ సగ అండ్ ఫ్రెండ్స్ ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? సగ తన ఫ్రెండ్స్ ను కాపాడుకోవడానికి ఏం చేసాడు? అనేది తెరపై చూడాల్సిందే.

పెర్ఫార్మెన్ష్ విషయానికొస్తే..
సినిమాలో ఆది పని శెట్టి పెర్ఫార్మెన్స్ హైలెట్. అతని పాత్రలోని వేరియేషన్స్ బావున్నాయి. యాక్షన్ సీన్స్ బాగా చేసాడు. పాత్రకు తగిన లుక్ తో ఆకట్టుకున్నాడు. ఆది గర్ల్ ఫ్రెండ్ లాస్య పాత్రలో హీరోయిన్ నిక్కి గల్రాని ఫర్వాలేదు. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. మాఫియా డాన్ పాత్రలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, హరీష్ ఉత్తమన్ ఆకున్నారు. ఆది స్నేహితులుగా చేసిన ముగ్గురూ ఓకే. ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేసారు.


స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

 దర్శకత్వం

దర్శకత్వం

దర్శకుడిగా తొలి సినిమా అయినప్పటికీ సత్య ప్రభాస్ తన టాలెంటును బాగా చూపించాడు. అయితే ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించడానికి మాత్రం అతనికి ఇంకా అనుభవం అవసరం.

స్క్రీన్ ప్లే..

స్క్రీన్ ప్లే..

పలు ట్విస్టులతో స్క్రీన్ ప్లే కొంత వరుక ఓకే కానీ..... ప్రేక్షకులను కట్టిపడేలాసే మాత్రం లేదు.

 హైలెట్స్

హైలెట్స్

ఆది పినిశెట్టి నటన సినిమా ప్రధాన ఆకర్షణ. సినిమాటోగ్రఫీ కూడా బావుంది.

మైనస్ పాయింట్స్

మైనస్ పాయింట్స్

సినిమా మరీ ఎక్కువ నిడివితో ఉంది. ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ద పెట్టాల్సి ఉంది. ఫస్టాఫ్ పెద్దగా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ కూడా సాదాసీదాగా ఉంది.

 ఫైనల్ గా

ఫైనల్ గా

రొటీ సినిమాలు కాకుండా....కాస్త సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు ఇష్టపడే వారికి ఓకే అనిపిస్తుంది. అయితే బాక్సాఫీసు వద్ద గెలవడానికి ఇది మాత్రమే సరిపోదు అని దర్శకుడు గ్రహించాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu