twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనసుకు నచ్చని సినిమా

    By Staff
    |

    Manasu Maata Vinadu
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: మనసు మాట వినదు‌
    నటీనటులు: నవదీప్‌,అంకిత, తనికెళ్ళ భరణి,‌
    ధర్మవరపు, నర్రా వెంకటేశ్వరరావు, నాగేంద్రబాబు తదితరులు‌
    సంగీతం: కళ్యాణ్‌ మాలిక్‌‌
    ఫోటోగ్రఫీ: శివకుమార్‌‌
    కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విఎన్‌ ఆదిత్య‌
    నిర్మాత: పొట్లూరి ఫణీంద్ర బాబు‌

    తెలుగు సినీవినీలాకాశం నిండా ప్రేమ మబ్బులు కమ్ముకున్నాయి. కొన్ని మబ్బులు మాత్రమే డబ్బులు కురిపిస్తుండగా మరికొన్ని మబ్బులు నిర్మాతలకు, బయ్యర్లకు దెబ్బలు తినిపిస్తున్నాయి. 'మనసు మాట వినదు' రెండో రకం సినిమా. 'మనసంతా నువ్వే' దర్శకుడు నవదీప్‌, అంకితలతో తీసిన మరో రొడ్డకొట్టుడు ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాలో ఆటలు పాటలు ఎక్కువై కథ పలచనైపోయింది.

    కథ: వేణు (నవదీప్‌) రాజమండ్రి ప్రభుత్వ కళాశాల డిగ్రీ విద్యార్ధి. ఒక రోజు అతను గోదావరి నదిలో స్నానం చేస్తుండగా రైలు వంతెన మీద సడన్‌గా ఆగిపోయి కదలకుండా మొరాయిస్తుంది. అప్పుడు హీరోయిన్‌ అంకిత వయ్యారంగా రైలు దిగుతుంటే హీరో ఆమాంతం ఆమె ప్రేమలో పడిపోతాడు. మరో రోజు బస్సులో చూసి వెంటపడతాడు. ఆమె వైజాగ్‌లో యూత్‌ ఫెస్టివల్‌లో పాల్గొనబోతోందని తెలుసుకుని కాలేజి తరఫున అక్కడికి వెళ్తాడు. ఒకటి రెండు సంఘటనలతో ఆమె ప్రేమను గెలుచుకుంటాడు. అప్పుడే కథ అయిపోయిందా అని ఆవులించేలోపల వేణు చిన్ననాటి స్నేహితుడు అరుణ్‌ తారసపడతాడు. తాను అంకితను ప్రేమిస్తున్నానని చెప్పి ముక్కోణపు ప్రేమకథకు తెరతీసి ఇంటర్వల్‌ బ్యాంగ్‌ ఇస్తాడు.

    'నా స్నేహితుడు ప్రేమిస్తున్న నిన్ను నేను లవ్‌ చేయడం భావ్యం కాదేమో' అని హీరో గారు ఒక రోజు నింపాదిగా హీరోయి న్‌తో అంటాడు. 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ వాడిని కాదు' అని అంకిత చెబుతుంది. వారి ప్రేమ కొనసాగుతుండగా అరుణ్‌ విలన్‌లా మారుతాడు. అంకిత దృష్టిలో నవదీప్‌ను వెధవను చేయడానికి ప్రయత్నిస్తాడు. హీరోహీరోయిన్లు ఎలా ఒక ఇంటివారవుతారన్నది తెరమీద చూడాల్సిందే.

    ఇటువంటి 'బాయ్‌ మీట్స్‌ ద గాళ్‌' తరహా స్టోరీలను ఎంతో కేర్‌ఫుల్‌గా ఒక ఫీల్‌తో తీస్తే తప్ప సినిమాలు హిట్‌కావు. ఈ సినిమాలో మిస్‌ అయింది అదే. కనిపించిన వెంటనే గుర్తు పట్టలేని (ఆ స్నేహం అంత గట్టిది కాదన్నమాట) స్నేహితుడి కోసం తన ప్రేమను హీరో త్యాగం చేయబోవడం ప్రేక్షకులను కన్విన్స్‌ చేయదు. అలాగే అరుణ్‌ సడన్‌గా విలన్‌గా మారడంలో ట్విస్ట్‌ ఉంది కానీ ఫీల్‌ లోపించింది. 'ఆనందం' సినిమా కామెడీని కాపీ చేయడం దర్శకుడి సృజనాత్మకతా రాహిత్యానికి నిదర్శనం. 'తూర్పు రామాయణం' బిట్‌ రాముడు-సీతలపై హిందువుల మనోభావాలను దెబ్బతీసే అవకాశముంది. హీరోయిన్‌ అంకిత (అను) క్యారక్టర్‌ సరిగా ఎస్టాబ్లిష్‌ కాకపోవడంతో ప్రేమ పండలేదు. హీరోయిన్‌ ముదురుగా, హీరో లేతగా కన్పించడం వల్ల కూడా సినిమా దెబ్బతింది.

    థీమ్‌ మ్యూజిక్‌, టైటిల్‌ సాంగ్‌ బాగున్నాయి. వికలాంగులతో చేసిన పరుగుపందెం సీన్‌ ప్రేక్షకులను కదిలిస్తుంది. హీరో టార్గెట్‌ ఏమిటన్నది స్పష్టం కాకపోవడంతో స్క్రీన్‌ప్లే నీరసంగా తయారైంది. ఫోటోగ్రఫీ బాగుంది. సంగీత దర్శకుడికి మంచి భవిష్యత్తు ఉంది. నవదీప్‌ నటన ఫర్వాలేదు. అంకిత అతనికి అక్కలా కన్పించింది.

    'నువ్వు వస్తానంటే నేనొద్దంటానా' వంటి పవర్‌ఫుల్‌ లవ్‌ సినిమా సరసన ఈ సినిమా ఆడడం కష్టమే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X