»   » థ్రిల్లింగ్ సగమే.. (మనోజ్ ‘శౌర్య’ రివ్యూ)

థ్రిల్లింగ్ సగమే.. (మనోజ్ ‘శౌర్య’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5
హైదరాబాద్: మంచు మనోజ్‌, రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.బ్యానర్‌పై దశరథ్‌ దర్శకత్వంలో శివకుమార్‌ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య''. థ్రిల్లర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదలైంది. మనోజ్ చివరి సినిమా 'కరెంటు తీగ' వచ్చి దాదాపు సంవత్సరన్నర అయింది. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మనోజ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడో చూద్దాం.

తారాగణం: మంచు మోజ్, రెజీనా, ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, షాయాజీషిండే, సుబ్బరాజు, నాగినీడు, శ్రవణ్‌, బెనర్జీ, జి.వి., ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, సత్యప్రకాష్‌ ,సూర్య, శివారెడ్డి, సుధ, మధుమణి, హేమ, సంధ్యాజనక్‌, చంద్రకాంత్‌, రూప తదితరులు..
స్టంట్స్‌: వెంకట్
కొరియోగ్రఫీ: భాను
ఆర్ట్‌: హరిబాబు
రచనా సహకారం: హరికృష్ణ, సాయికృష్ణ,
స్క్రీన్‌ప్లే: గోపు కిషోర్‌
రచన: గోపి మోహన్‌
ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌
సంగీతం: వేదా.కె
సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్‌ జోషి
నిర్మాత: శివకుమార్‌ మల్కాపురం
దర్శకత్వం: దశరథ్‌
విడుదల: 4 మార్చి, 2014

కథ విషయానికొస్తే...
శౌర్య(మంచు మనోజ్), నేత్ర (రెజీనా) ప్రేమించుకుంటారు. వీరి ప్రేమ పెళ్లికి నేత్ర తండ్రి, పార్లమెంటు సభ్యుడు సత్యమూర్తి (నాగినీడు), బాబాయ్ కృష్ణమూర్తి(సుబ్బరాజు) అడ్డుపడటంతో పెళ్లి చేసుకుని యూకె వెళ్లి సెటిలవ్వాలని నిర్ణయించుకుంటారు. అయితే మొక్కు చెల్లించడం కోసం నేత్ర తన ఊరికి వస్తుంది. ఈ క్రమంలో ఆమెపై హత్యాయత్నం జరుగుతుంది. ఆ నేరం శౌర్య మీద పడుతుంది. ఈ కేసు నుండి శౌర్య ఎలా బయట పడ్డాడు? అసలు నేత్రపై హత్యాయత్నం చేసింది ఎవరు? వారిని పట్టించడానికి శౌర్య ఏం చేసాడు? అనేది ఆసక్తికరంగా సాగుతుంది.

పెర్ఫార్మెన్స్...
శౌర్య పాత్రలో మంచు మనోజ్ ఒదిగి పోయాడు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో మనోజ్ చేసిన క్యారెక్టర్లనీ ఎనర్జీతో నిండినవే. అయితే శౌర్య పాత్ర మాత్రం మనోజ్ గతంలో చేసిన పాత్రలన్నింటికీ భిన్నంగా ఉంది. మనోజ్ చేసిన ఎమోషనల్ సీన్స్‌ ప్రేక్షకులను కట్టిపడేసాయి. నేత్ర క్యారెక్టర్లో రెజీనా సహజ నటనను కనబర్చింది. సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాత్రల్లో ప్రకాష్ రాజ్ చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్ర. ప్రకాష్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఆ పాత్రలో జీవించాడంతే. ప్రభాస్ శీను కొన్ని చోట్ల నవ్వించాడు. నాగినీడు, సుబ్బరాజు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

విశ్లేషణ..

విశ్లేషణ..


దర్శకుడు దశరత్ ఎంచుకున్న కథ బావుంది. తాను అనుకున్న పాత్ర కోసం మనోజ్ ను ఎంచుకోవడం, పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ను తీసుకవడం ఫెక్టుగా సెట్టయింది.

కానీ...

కానీ...


అయితే థ్రిల్లర్ నేపథ్యం ఎంచుకున్నపుడు ముందు నుండి అదే ఫ్లో కొనసాగించాలి, స్లోగా నడిస్తే ప్రేక్షకులు అసహనానికి గురవుతాడు. శౌర్య ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే అలానే సాగింది. అయితే సెకండాఫ్ లో మాత్రం నేరేషన్ స్పీడప్ చేసి క్లైమాక్స్ ఆకట్టుకునేలా చిత్రీకరించాడు.

టెక్నికల్

టెక్నికల్


టెక్నికల్ అంశాల పరంగా చూస్తే మల్హర్ భట్ జోషి అందించిన సినిమాటోగ్రఫీ ఓకే. వేదా అందించి సంగీతం యావరేజ్. పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఎస్.ఆర్ శేఖర్ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త షార్ప్ గా ఉంటే బావుండేది. గోపు కిషోర్ అందించి స్క్రీన్ ప్లే యావరేజ్. నిర్మాణ విలువలు జస్ట్ యావరేజ్.

ఓవరాల్ గా...

ఓవరాల్ గా...


ఓవరాల్ గా చెప్పాలంటే....రొటీన్ సినిమాలకు భిన్నమైన సినిమాలు, థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి మనోజ్ నటించిన ‘శౌర్య' ఓకే అనిపిస్తుంది.

English summary
Manchu Manoj's Shourya movie review. Overall, Shourya might be an okay option if you have nothing else to do this weekend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu