For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ‘మణికర్ణిక-ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ రివ్యూ, రేటింగ్

  |

  Rating:
  2.5/5
  Star Cast: కంగనా రనౌత్, అతుల్ కులకర్ణి, జిషు సేన్ గుప్తా, రిచర్డ్ కీప్
  Director: క్రిష్ జాగర్లమూడి, కంగనా రనౌత్

  బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగిన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధానంగా చెప్పుకోదగ్గ పేరు ఝాన్సీ రాణి లక్ష్మిభాయి. ఆంగ్లేయుల అరాచకాలను ఎదురించి పోరాడిన ఆమె వీర వనితగా చరిత్ర పుటలకెక్కారు. మనం చిన్నతనంలో పాఠ్యపుస్తకాల్లో ఝాన్సీ రాణి గురించి తెలుసుకున్నవిషయాలు చాలా పరిమితమే. తాజాగా రాణి లక్ష్మిభాయి గురించిన చరిత్రను మరింత కూలంకషంగా విషదీకరిస్తూ బయోపిక్ రూపంలో ప్రేక్షకుల తీసుకొచ్చారు. మణికర్ణిక... లక్ష్మీభాయిగా ఎలా మారారు? ఝాన్సీ రాజ్యానికి కోడలిగా వెళ్లిన ఆమె ఎలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టారు? బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలు 'మణికర్ణిక' చిత్రం రూపంలో చెప్పే ప్రయత్నంచేశారు. ఈ చిత్ర విశేషాలు ఏమిటో చూద్దాం...

  కథ ప్రారంభం ఇలా...

  వారణాసిలో పుట్టిన మణికర్ణిక(కంగనా రనౌత్) క్షత్రియకన్య కాకపోయినా... బిత్తూరు పీష్వా ఆమెలోని ధైర్యం, సాహసాలు చూసి క్షత్రియ కన్యలా పెంచుతాడు. ఝాన్సీ యువరాజు గంగాధరరావుకు తగిన వధువును వెతుకుతూ వస్తున్న మంత్రి దీక్షితులు మణికర్ణికలోని వీరత్వాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. గంగాధరరావుతో వివాహం తర్వాత ఝాన్సీ సాంప్రదాయం ప్రకారం ఆమె పేరు ‘లక్ష్మీభాయి'గా మారుతుంది.

  ఝాన్సీ రాణిగా అధికారం చేపట్టి...

  అయితే ఝాన్సీ సింహాసనంపై కన్నేసిన రాజవంశంలోని సదాశివరావు ఆంగ్లేయులతో చేతులు కలిపి... లక్ష్మీభాయి-గంగాధరరావుకు జన్మించిన కుమారుడు దామోదరరావుపై విషప్రయోగం చేసి చంపడంతో పాటు, రాజు గంగాధరరావు కూడా జబ్బుపడి చనిపోయేలా కుట్ర చేస్తాడు. బ్రిటిష్ వారి నుంచి రాజ్యాన్ని కాపాడు కోవడానికి రాణి లక్ష్మీభాయి సింహాసనాన్ని అధిష్టిస్తుంది.

  కట్టుబట్టలతో బయటకు...

  రాజు గంగాధరరావు మరణం తర్వాత లక్ష్మీభాయి అధికారం చేపట్టడాన్ని వ్యతిరేకించిన ఈస్ట్ ఇండియా కంపెనీ... కోటపైకి దండెత్తుతారు. అయితే వారిని ఎదురించి పోరడటానికి సరైన సైనిక బలం, ఫిరంగులు తమ వద్ద లేక పోవడంతో రాణి లక్ష్మిభాయి కట్టుబట్టలతో బయటకు వెళుతుంది. ఆ తర్వాత లక్ష్మీభాయి ఏ విధంగా ఝాన్సీని మళ్లీ చేజిక్కించుకుంది? ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం తెరపై చూడాల్సిందే...

  పెర్పార్మెన్స్ పరంగా..

  రాణి లక్ష్మీభాయిగా.... కంగనా రనౌత్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. మణికర్ణికగా, లక్ష్మీ భాయిగా ఆయా సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకుంది. పోరాట సన్నివేశాల్లో ఒళ్లు గగుర్బొడిచేలా చేసి మెప్పించింది. ఝాన్సీ రాణి పాత్రకు కంగనా పర్ఫెక్టుగా సూటయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతర పాత్రల విషయానికొస్తే... లక్ష్మీభాయి భర్త గంగాధరరావుగా జిషు సేన్ గుప్తా, తాత్యాతోపేగా అతుల్ కులకర్ణి, ఝాల్కరి భాయిగా అంకిత లోఖండే తదితరులు తమ నటనతో ఆకట్టుకన్నారు.

  టెక్నికల్ అంశాల పరంగా...

  శంకర్-ఎస్సాన్-లాయ్ అందించిన పాటలు, సంచిత్ బహరా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలోని సీన్లు మరింత ఎలివేట్ చేశాయి. కిరణ్ ద్యోహాన్, జ్ఞానశేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బావున్నాయి.

  ఫస్టాఫ్ ఎలా ఉంది...

  మణికర్ణిక గురించిన పరిచయ సన్నివేశాలు, ఆమెలోని పోరాట పటిమ చూపించే సీన్లు, ఝాన్సీ కోడలిగా వెళ్లి లక్ష్మీభాయిగా మారడం... ఆ తర్వాత రాజ్యాధికారం చేపట్టే సన్నివేశాలతో మొదటి భాగం ఆకట్టుకునేలా చిత్రీకరించారు. ఇంటర్వెల్ వరకు పెద్దగా బోర్ కట్టకుండా సినిమాను నడిపించారు.

  సెకండాఫ్ ఎలా ఉందంటే...

  అయితే సెకండాఫ్ మొత్తం ఆంగ్లేయులతో పోరాటం, యుద్ధం లాంటి సన్నివేశాలతో సాగడం... డ్రామా పోర్షన్ తగ్గడంతో కాస్త బోర్ ఫీలింగ్ కలుగుతుంది. పోరాట సన్నివేశాలు కూడా అంత గొప్పగా చత్రీకరించక పోవడం కూడా కథ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.

  ప్లస్ పాయింట్స్

  కంగనా రనౌత్ పెర్ఫార్మెన్స్
  సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్
  అక్కడక్కడ వచ్చే కొన్ని డైలాగులు
  కొన్ని యుద్ధ సన్నివేషాలు

  మైనస్ పాయింట్స్

  సెకండాఫ్‌లో ఆకట్టుకోని స్క్రీన్ ప్లే
  కొన్ని చోట్ల అసంపూర్తి సన్నివేశాలు

  డైరెక్షన్ క్రిడిట్ ఎవరికి?

  ఈ చిత్రం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైనప్పటికీ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఆయన తప్పుకున్నారు. మిగిలిన భాగాన్ని కంగనా రనౌత్ డైరెక్ట్ చేశారు. మరి వీరిలో ఎవరు ఏ సీన్లను చిత్రీకరించారో... బావున్నీ సీన్లు ఎవరి ఖాతాలో పడతాయో? బాగోలేని సీన్లకు బాధ్యుల ఎవరు? అనేది అంచనా వేయడం కష్టమే.

  ఫైనల్‌గా

  ఝాన్సీ రాణి లక్ష్మీభాయి ధైర్యసాహసాలు, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆమె పోరాటం బాగా చూపినప్పటికీ కొన్ని చోట్ల సన్నివేశాలు ఆకట్టుకోలేదు. చరిత్రను ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది.

  నటీనటులు

  కంగనా రనౌత్, అతుల్ కులకర్ణి, జిషు సేన్ గుప్తా, రిచర్డ్ కీప్, సురేష్ ఒబెరాయ్, అంకిత లోఖండే తదితరులు....

  దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, కంగరనా రనౌత్
  నిర్మాతలు: కమల్ జైన్, నిషాంత్ పిట్టి
  కథ: కె. విజయేంద్రప్రసాద్
  పాటలు: శంకర్, ఎస్సాన్, లాయ్
  బ్యాగ్రైండ్ స్కోర్: సంచిత్
  సినిమాటోగ్రఫీ: కిరణ్, జ్ఞానశేఖర్
  ఎడిటింగ్: రామేశ్వర్ భగత్, సూరజ్ జగతప్
  నిర్మాణ సంస్థ: కైరోస్ కంటెంట్ స్టూడియోస్
  సమర్పణ: జీ స్టూడియోస్
  విడుదల తేదీ: జనవరి 25, 2019

  English summary
  In one of the scenes in Manikarnika: The Queen Of Jhansi, Ghulam Ghaus Khan (Danny Denzongpa) who is breathing his last after getting severely wounded, tells Rani Laxmibai that he wouldn't be alive to see the 'jeet ka jashan'. Sadly by the end, the film gives you just a handful of reasons to rejoice. While Kangana Ranaut makes sure that Manikarnika is her battlefield where she is the sole brightest star, she fails to realize that it's the way a team plays as a whole which determines its success.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more