twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mayagadu review పైరసీ బ్యాక్ డ్రాప్‌తో సస్పెన్స్ థ్రిల్లర్.. ప్లేబాయ్‌గా నవీన్ చంద్ర యాక్టింగ్ ఎలా..

    |

    నటీనటులు: నవీన్ చంద్ర, పూజా ఝావేరి, గాయత్రి సురేష్, అభిమన్యు సింగ్, కబీర్ దుహన్ సింగ్ తదితరులు
    రచన, దర్శకత్వం: జీ కార్తీక్ రెడ్డి
    నిర్మాత: భార్గవ్ మన్నె
    సంగీతం: అనూప్ రూబెన్స్
    సినిమాటోగ్రాఫర్: వెంకట్ గంగాధరి
    ఎడిటర్: జునైద్ సిద్దిఖ్
    రిలీజ్ డేట్: 2023-02-03

    Mayagadu

    కాకినాడకు చెందిన రవి (నవీన్ చంద్ర) కొత్త సినిమాలను పైరసీ చేస్తూ జల్సాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. తమిళ్ రాకర్స్ లాంటి పైరసీ సైట్లను స్పూర్తిగా తీసుకొని సులభంగా డబ్బు సంపాదిస్తుంటాడు. అమ్మాయిలతో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తే ప్లేబాయ్‌ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో పైరసీ చేస్తున్న రవిని సిరి (గాయత్రి సురేష్) అనే అమ్మాయి పోలీసులకు పట్టిస్తుంది.

    ప్రేమించిన రవిని పోలీసులకు సిరి ఎందుకు పట్టించింది? రవికి సిరి ఎందుకు గుణపాఠం నేర్పించాలని అనుకొంటుంది? అసలు సిరి ఎవరు? పూజా జవేరికి నవీన్ చంద్రకు సంబంధం ఏమిటి? రవిని అంథోని (అభిమన్యు సింగ్) ఎందుకు చంపాలని ప్రయత్నిస్తుంటాడు? పైరసీ వృత్తిని రవి ఎందుకు ఎంచుకొన్నాడు? సినీ ప్రముఖులకు రవి ఎలా సవాళ్లు విసిరాడు అనే ప్రశ్నలకు సమాధానమే మాయగాడు.

    మాయగాడు సినిమా తొలి భాగం విషయానికి వస్తే.. రవి క్యారెక్టర్ చుట్టూ పైరసీ నేపథ్యంగా కథ సాగుతుంటుంది. ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి ఫ్యాన్స్ బలహీనతలను క్యాష్ చేసుకొంటూ పైరసీ దందాను కొనసాగిస్తుంటాడు. అమ్మాయిలంటే పిచ్చి, జల్సా రాయుడిగా రవి లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో సిరి ఎంట్రీ ఇస్తుంది. అలాగే పూజా జవేరితో రొమాంటిక్ లైఫ్ ఇలా సరదాగా సినిమా సాగిపోతుంది. తొలి భాగంలో ఆంథోని సోదరితో బ్రేకప్ సినిమాకు ట్విస్టుగా మారుతుంది. ఇక సెకండాఫ్‌లో కొంత రొటీన్‌గా, సాగుతుంది. క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందనే విషయం ముందుగానే తెలిసిపోవడం లాంటి అంశాలు సినిమాపై ఆసక్తిని తగ్గిస్తాయి. దర్శకుడు కథపై మరింత కసరత్తు చేసి ఉంటే కొత్త జోనర్‌ ఆడియెన్స్‌ను మరింత ఆకట్టుకొనేదనిపిస్తుంది.

    నవీన్ చంద్ర ఎప్పటిలానే రవి పాత్రలో ఒదిగిపోయాడు. పైరసీకి పాల్పడే యువకుడిగా, ప్లే బాయ్‌గా, లవర్‌గా వివిధ కోణాలు ఉన్న పాత్రను ఒంటిచేత్తో ముందుకు తీసుకెళ్లాడు. కీలక సన్నివేశాల్లో హావభావాలను బాగా పలికించాడని చప్పవచ్చు. సరి పాత్రలో గాయత్రి సురేష్, పూజా జవేరి తమ పాత్రలకు న్యాయం చేశాడు. అభిమన్యు సింగ్‌కు రెగ్యులర్ విలన్ పాత్రలో కనిపించాడనిపిస్తుంది. కబీర్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడని చెప్పవచ్చు. సాంకేతిక విభాగాల పనితీరు బాగుంది. జీ కార్తీక్ రెడ్డి రాసుకొన్న కథ, కథనాలు ఫర్వలేదనిపిస్తాయి. వెంకట్ గంగాధరి సినిమాటోగ్రఫి బాగుంది. అనూప్ రూబెన్స్ కథకు తగినట్టుగా సంగీతాన్ని అందించాడు. యూత్‌ను ఆకట్టుకొనే అంశాలు పుష్కలంగానే ఉన్నాయి.

    English summary
    Mayagadu review and rating: Naveen Chandra lives up with play boy character
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X