For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మీలో ఎవరు తమలపాకు....? ప్రేమంటే బూతు కాదురా (రివ్యూ)

  |

  Rating:
  2.0/5
  పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ 'మీలో ఎవరు కోటీశ్వరుడు. 30 ఇయర్స్ పృథ్వీ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, శృతిసోథీ, సలోనిలు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

  తొలిసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పృథ్వీకి మీలో ఎవరు కోటీశ్వరుడు సక్సెస్ అందించిందా..? సత్తిబాబు, తన కామెడీ ఫార్ములాతో మరోసారి ఆకట్టుకున్నాడా..? అసలు ఈ కథ కామెడీ ఎంతర్టైనర్ గా నిల బడుతుందా?? ఈ సినిమా తర్వాత కూడా పృథ్వీ హీరోగా నిలబడ గలదా అన్న విషయాలమీద ఒక సారి దృష్టి పెడితే...

  కథ:

  కథ:

  రైతు (చ‌ల‌ప‌తిరావు) కొడుకు ప్ర‌శాంత్ (న‌వీన్ చంద్ర‌). బిజినెస్ ఐకాన్ ఏబీఆర్ (ముర‌ళీ శ‌ర్మ‌) కుమార్తె ప్రియ (శ్రుతిసోది). ప్రశాంత్(నవీన్ చంద్ర) ఓ సిన్సియర్ స్టూడెంట్. కాలేజ్ టాపర్ అయిన ఈ కుర్రాడికి ఓ రోజు అర్థరాత్రి ఫుల్గా తాగేసి.. కారును డివైడర్కు గుద్దేసిన ప్రియా(శృతిసోథీ) కనిపిస్తుంది. ప్రియా పరిస్థితిని చూసి తానే వెళ్లి ఇంట్లో దిగబెట్టి వస్తాడు ప్రశాంత్. ఓ అమ్మాయి అలాంటి పరిస్థితుల్లో కనిపించినా.. ఏ మాత్రం అడ్వాంటేజ్ తీసుకోకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చిన ప్రశాంత్తో ప్రేమలో పడుతుంది ప్రియా.

  కోటీశ్వ‌రుల కూతురు :

  కోటీశ్వ‌రుల కూతురు :

  అంత‌స్తుల తేడాను అర్థం చేసుకున్న ప్ర‌శాంత్ ఆమెకు దూరంగా ఉండాల‌నుకుంటాడు. అయితే ఆమె అభ్య‌ర్ధ‌న మేర‌కు త‌మ ప‌ల్లెటూరికి తీసుకెళ్తాడు. కోటీశ్వ‌రుల కూతురు త‌మ ఇంట్లో అంద‌రితో క‌లివిడిగా ఉండ‌టం చూసి మ‌న‌సుప‌డ‌తాడు. వీరి ప్రేమ‌ను ఏబీఆర్ అంగీక‌రించ‌డు. తన ఆస్తి కోసమే ప్రియను ప్రేమలో పడేశావని ప్రశాంత్ని అవమానిస్తాడు.అప్పుడు ప్ర‌శాంత్ ఓ చిక్కుముడి వేస్తాడు.

  నష్టాలు తెచ్చిపెట్టే బిజినెస్ ఐడియా:

  నష్టాలు తెచ్చిపెట్టే బిజినెస్ ఐడియా:

  డబ్బుతో ఆనందం రాదని, కావాలంటే మీరు ఒక్కసారి ఏదైన బిజినెస్ చేసి నష్టపోయి చూడండి తరువాత మీకు ఆనందం విలువ ఏంటో తెలుస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. అప్పటి వరకు ఏ బిజినెస్లోనూ నష్టపోని ఏబీఆర్, నష్టాలు తెచ్చిపెట్టే బిజినెస్ ఐడియా ఇవ్వమని పేపర్ ప్రకటన ఇస్తాడు. అలాంటి ఐడియా ఇచ్చిన వారికి కోటి రూపాయల బహుమతి ప్రకటిస్తాడు. స్టార్ హీరోలతో సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు(పోసాని కృష్ణమురళి) ఆ ప్రకటన చూసి ఏబీఆర్ను కలుస్తాడు.

   కూతురు ప్రేమ విష‌యంలో ఓ నిర్ణ‌యం:

  కూతురు ప్రేమ విష‌యంలో ఓ నిర్ణ‌యం:

  తాను ఓ ఫ్లాప్ సినిమా తీసి పెడతానని దాంతో భారీగా నష్టం వస్తుందని ప్రామిస్ చేస్తాడు. దానికి స‌మాధానం వెతుక్కునే ప్ర‌య‌త్నంలోనే థ‌ర్టీఇయ‌ర్స్ పృథ్విని పెట్టి `త‌మ‌ల‌పాకు` అనే సినిమాను చేస్తాడు ఏబీఆర్‌. ఆ సినిమాలో మ‌హేశ్ (పృథ్వి), స‌మంత (స‌లోని) అనే పాత్ర‌లు అంద‌రికీ న‌చ్చుతాయి. ఆ సినిమాను తీసిన నిర్మాత తాతారావు(పోసాని కృష్ణ‌ముర‌ళి)కు, ద‌ర్శ‌కుడు రోల్డ్ గోల్డ్ ర‌మేశ్ (ర‌ఘుబాబు)కు మంచి పేరు వ‌స్తుంది. ఇంత త‌తంగం త‌ర్వాత ఏబీఆర్ త‌న కూతురు ప్రేమ విష‌యంలో ఓ నిర్ణ‌యం తీసుకుంటాడు. అదేమిటన్న‌ది క్లైమాక్స్.

  సాగ‌దీసిన‌ట్టు ఉంది:

  సాగ‌దీసిన‌ట్టు ఉంది:

  సినిమా కొన్నిచోట్ల సాగ‌దీసిన‌ట్టు ఉంది అయితే కేవల కామెడీ ప్రధానం గా, ఎంటర్టైన్ మెంట్ కోసం మాత్రమే చూడాలి తప్ప స‌ర‌దాగా సాగిపోయే ఈ చిత్రంలో లాజిక్కులు వెతకటం వృధా ప్రయాస. ఇంత‌కు ముందు ప‌లు తెలుగు చిత్రాల్లో చూసిన పాత ఫార్ములాతో కాస్త కామెడీ, కొన్ని స్పూఫ్ లతో అల్లుకున్న క‌థే ఇది. సంతోషానికి, ఆనందానికి తేడా తెలుసుకోవ‌డానికి ఓ వ్యాపార‌వేత్త ప‌దికోట్లు న‌ష్ట‌పోవ‌డానికి సిద్ధ‌మ‌వ‌డ‌మ‌నే కాన్సెప్ట్ అంత తేలిగ్గా మింగుడుప‌డ‌దు.

  స్క్రీన్ ప్లే మాత్రం పెద్ద మైనస్:

  స్క్రీన్ ప్లే మాత్రం పెద్ద మైనస్:

  తెలుసా... అనే పాట త‌ప్ప మిగిలిన పాట‌లు కానీ, ట్యూన్లు కానీ పాడుకునేలా అనిపించ‌వు. పాట‌ల‌న్నీ సినిమాలో రావాలి కాబ‌ట్టి వ‌చ్చిన‌ట్టు అనిపిస్తాయి. కాలేజీ స‌న్నివేశాలు కొన్ని, హీరోని ప్రేమ‌లోకి దించ‌డానికి హీరోయిన్ చేసే ప్ర‌య‌త్నాలు కొన్ని ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. పంచ్ డైలాగులు విన‌డానికి బాగానే ఉన్నా కొన్ని చోట్ల ఆయా సీన్‌లు అంత భారాన్ని మోయ‌లేక‌పోయాయ‌న్న‌ది వాస్త‌వం. స్క్రీన్ ప్లే మాత్రం పెద్ద మైనస్ అనిప్స్తుంది.

  ఆకట్టుకున్నాడు:

  ఆకట్టుకున్నాడు:

  పేరుకు నవీన్ చంద్ర హీరో అయినా.. సినిమా అంతా పృథ్వీనే హీరోగా కనిపిస్తాడు. తనకు బాగా అలవాటైన పేరడీ సీన్స్తో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్తో పాటు పంచ్ డైలాగ్స్తోనూ అలరించాడు. సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు పాత్రకు పోసాని కృష్ణమురళి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. రఘుబాబు, పోసాని కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ కితకితలు పెడతాయి.

  మ‌రింత పాపుల‌ర్ :

  మ‌రింత పాపుల‌ర్ :

  ఇతర పాత్రల్లో మురళీ శర్మ, జయప్రకాష్ రెడ్డి, ప్రభాస్ శ్రీను, ధనరాజ్లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. ఇటీవ‌లి కాలంలో మ‌రింత పాపుల‌ర్ అవుతున్న పృథ్వి ఈ సినిమాకు పెద్ద ప్ల‌స్ పాయింట్‌. మ‌హేశ్‌బాబుగా ఆయ‌న న‌ట‌న బావుంది. అన్నిటిక‌న్నా అంద‌రు హీరోల‌ను ఇమిటేట్ చేస్తూ ఆయ‌న చెప్పిన డైలాగు షాట్ క‌నెక్ట్ అవుతుంది. అక్క‌డ‌క్క‌డా కొన్ని డైలాగులు బావున్నాయి. పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు పాత్ర‌లు మెప్పించాయి. సినిమా ప‌రిశ్ర‌మ మీద‌ వేసిన డైలాగులు న‌వ్విస్తాయి.

   కెమెరా ప‌నితనం బావుంది:

  కెమెరా ప‌నితనం బావుంది:

  కొన్ని చోట్ల ఆలోచింప‌జేస్తాయి. ద‌ర్శ‌కుడు రోల్డ్ గోల్డ్ ర‌మేశ్ పాత్ర‌ను చూస్తున్నంత సేపు ప‌రిశ్ర‌మ‌లోని ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడిని ఇమిటేట్ చేశారేమోన‌నే అనుమానం క‌లుగుతుంది. సంద‌ర్భోచితంగా పాత సినిమాల్లోని పాట‌ల‌ను, డైలాగుల‌ను వాడుకోవ‌డం బావుంది. న‌వీన్‌చంద్ర‌, శ్రుతిసోడి త‌మ త‌మ పాత్ర‌ల్లో బాగానే న‌టించారు. ముర‌ళీశ‌ర్మ‌, ప్ర‌భాస్ శ్రీను ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల్లో క‌నిపించారు. కెమెరా ప‌నితనం బావుంది. తెలుసా అనే పాట విన‌సొంపుగా ఉంది. పాట‌ను కంపోజ్ చేసిన తీరు కూడా మెప్పిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది.

  డైలాగ్ లో డ‌బుల్ మీనింగ్ :

  డైలాగ్ లో డ‌బుల్ మీనింగ్ :

  మమూలు ప్రేమకథా చితెరమే ఒక హీరో త‌న ల‌వ్‌ను నెగ్గించుకోవ‌డానికి త‌న ల‌వ‌ర్ తండ్రికి పెట్టిన ప‌రీక్షే "మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా అయ్యింది. . ఫ‌స్టాఫ్‌లో హీరోయిన్‌, ధ‌న్‌రాజ్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల్లోని డైలాగ్ లో డ‌బుల్ మీనింగ్ ధ్వ‌నిస్తుంది. కండోమ్‌కి సంబంధించిన డైలాగులు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి.

  టీచ‌ర్ పైట‌జార్చి:

  టీచ‌ర్ పైట‌జార్చి:

  ఇక అన్నిటికంటే మరీ ధారుణం గా అనిపించే సీన్ ఏమిటంటే సెకండాఫ్‌లో స్టూడెంట్ అడిగిన సందేహాన్ని తీర్చాల్సిన టీచ‌ర్ పైట‌జార్చి విష‌యాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టించే సీన్ ఒక్కసారి మనం ఎక్కడ ఉన్నాం, అసలు కామెడీ అంటే ఏమితీ అనిపించే లా చేస్తుందు. అనిపిస్తాయి. ఓ గౌర‌వ‌నీయ‌మైన వృత్తిలో ఉన్న లెక్చ‌ర‌ర్ నోట అలాంటి డైలాగు చెప్పించుకుండా ఉంటే బావుండేది. ఫ్యామిలీ ప్రేక్షకులకి కాస్త ఇబ్బంది గా అనిపించే సన్ని వేశాలు ఇవి.

  లాజిక్కుల‌ను ప‌క్క‌న‌పెట్టి :

  లాజిక్కుల‌ను ప‌క్క‌న‌పెట్టి :

  అయితే ఈ మధ్య వచ్చే పలు కామెడీ సినిమాల్లో ఇదే తరహా కామెడీ సీన్లు ఉంటున్నాయి కాబట్టి పెద్దగా పట్టించుకోనవసరం లేదు. పృథ్వి జూనియ‌ర్ ఇంట‌ర్ చ‌ద‌వ‌డం ఏంటి? స‌లోనికి స‌మంత అనే పేరేంటి? అనే లాజిక్కుల‌ను ప‌క్క‌న‌పెట్టి చూడాల్సిన చిత్ర‌మిది. తెలుసా పాట త‌ప్ప మిగిలిన పాట‌లు ఏవీ పెద్ద‌గా ఎక్క‌లేద‌న్న‌ది నిజం. ధ‌న్‌రాజ్ పోర్ష‌న్ మ‌రీ డ్ర‌మ‌టిక్‌గా ఉంది. మ‌రో సందర్భంలో హీరోని ప్రేమ‌లో ప‌డేయ‌డానికి హీరోయిన్ పైట జారేస్తుంది.

  కామానికి, శృంగారానికి:

  కామానికి, శృంగారానికి:

  ఈ చిత్రంలో ఆనందానికి, సంతోషానికి తేడాను చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అలాగే కామానికి, శృంగారానికి, ప్రేమ‌కు తేడా ఉంటుంద‌నే విష‌యాన్ని కాసింత గ‌మ‌నించి ఉంటే బావుండేది. ఇటువంటి ఒక‌టీరెండు స‌న్నివేశాల వ‌ల్ల ప్రేమ అనే ప‌దానికి త‌ప్పుడు అర్థం వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌న్న‌ది గ్ర‌హించి ఉండాల్సింది. ఇక మొత్తానికి ఒక మాటగా చెప్పాలీ అనుకుంటే కామెడీ అనే దృష్తిలో మాత్రమే చూడాలనుకున్న వారికి పూర్తి సంతృప్తినిచ్చే సినిమా ఇది.

  English summary
  The Film Meelo Evaru Koteeswarudu starring Naveen Chandra and Comedian Prudhvi Raj in Main Lead Roles going to hit slivers screens this friday Review Rating
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X