»   » మంచి సినిమానే, కానీ.. (సూర్య నటించిన ‘మేము’ రివ్యూ)

మంచి సినిమానే, కానీ.. (సూర్య నటించిన ‘మేము’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

హైదరాబాద్: సూపర్ స్టార్ సూర్య, అమలాపాల్, బిందుమాధవి నటించిన తమిళ చిత్రం "పసంగ-2" తెలుగులో "మేము" పేరుతో ఈ రోజు విడుదలైంది. ప్రముఖ దర్శకుడు పాండిరాజ్ రూపొందించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను "స్టూడియో గ్రీన్ జ్ఞాన్ వేల్ రాజాతో కలిసి.. తన సొంత నిర్మాణ సంస్థ "2 డి ఎంటర్ టైన్మెంట్స్" పతాకంపై.. సూర్య కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యారు. సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక తెలుగు ప్రేక్షకులు అందించారు.

సినిమాలో సూర్య ఉన్నప్పటికీ ఇది సూర్య స్టార్ ఇమేజ్ ను బేస్ చేసుకుని తెరకెక్కించిన సినిమా కాదు. పిల్లల మనస్తత్వాలు, తల్లిదండ్రుల ప్రవర్తన అనే అంశాలను బేస్ చేసుకుని తీసిన సినిమా. సినిమా మొత్తం ఇదే అంశాన్ని ప్రధానంగా చూపిస్తూ తెరకెక్కిన చిత్రం.


కథ విషయానికిస్తే..
నవీన్‌ (నిశేష్‌).. నయన (వైష్ణవి) అనే ఇద్దరు అల్లరి పిడుగులు. ఏ స్కూల్లో వేసినా అక్కడ వారిని భరించలేక టీసి ఇచ్చి బయటకు పంపేస్తారు స్కూలు యాజమాన్యం. దీంతో పాటు తల్లిదండ్రులకు చీవాట్లు అదనం. ఎంతమంది సైకియాట్రిస్టులకి చూపించినా, ఎంత కౌన్సెలింగ్‌ చేయించినా వాళ్లలో మార్పు రాదు. చివరకు వారిని హాస్టల్‌లో చేర్పిస్తారు. అక్కడ కూడా దెయ్యం అంటూ హడావుడి చేసి బయటికొచ్చేస్తారు. వీళ్ల అల్లరి వల్ల వేగలేక పోతున్న తల్లిదండ్రులకు సైకియాట్రిస్ట్ సూర్య పరిచయం అవుతాడు. అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరాక్టివిటీ డిజార్డర్‌ (ఎడిహెచ్‌డి) సమస్యతో బాధపడుతున్న వారిని సూర్య తన వైద్యంతో ఎలా మార్చాడు? అనేది తర్వాతి కథ.


పెర్ఫార్మెన్స్...
సినిమాలో ప్రధాన పాత్రలు నిశేష్, వైష్ణవీ అనే ఇద్దరు పిల్లలే. సినిమా మొత్తం వీరి చుట్టే తిరుగుతుంది. అల్లరి పిల్లలుగా ఈ ఇద్దరూ బాగా నటించారు. కథ పరంగా సూర్యకు పెర్ఫార్మెన్స్ ప్రదర్శించే అవకాశం లేదు. తన పాత్ర పరిధి మేరకు సైకియాట్రిస్టు పాత్రలో ఆకట్టుకున్నాడు. సూర్య భార్య పాత్రలో అమలాపాల్‌, వైష్ణవి తల్లి పాత్రలో బిందుమాధవి ఓకే. మిగతా నటీనటులంతా తమ పాత్రలకు తగిన విధంగా మెప్పించారు.


టెక్నికల్ అంశాల పరంగా చూస్తే..
బాలసుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ బావుంది. పిల్లల పాత్రలు ప్రధానంగా సాగే సినిమా కాబట్టి అందుకు సంబందించిన వాతావరణాన్ని తన కెమెరాతో బాగా రిఫ్లెక్ట్ చేసాడు. అర్రోల్ కొరెల్లి సంగీతం ఫర్వా లేదు. ఎడిటింగ్ యావరేజ్ గా ఉంది. శశాంక్ వెన్నెలకంటి మాటలు, పాటల ఓకే.


స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...


అభినందనీయం

అభినందనీయం

ఈరోజుల్లో పిల్లలు, తల్లి దండ్రులు ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారు అనే కీలక అంశాన్ని తీసుకుని దర్శకుడు పాండిరాజ్ చేసిన ప్రయత్నం బాగుంది. తన స్టార్ ఇమేజ్ కు భిన్నంగా ఈ సినిమాలో సైకియార్టిస్ట్ పాత్రను ఒప్పుకుని దాన్ని పోషించిన సూర్యను అభినందించకుండా ఉండలేం.


స్లో నేరేషన్

స్లో నేరేషన్

దర్శకుడు ఎంచుకున్న పాయింట్, చూపిన పరిష్కారం బాగానే ఉన్నా కథను నేరేట్ చేసే విధానం చాలా స్లోగా ఉంది. సినిమాను బాగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. రెండవ భాగం మరీ బోరింగ్ అనిపిస్తుంది.


రోటీన్ స్టోరీ

రోటీన్ స్టోరీ

దర్శకుడు ఎంచుకున్న స్టోరీ చాలా రోటీన్ గా అనిపిస్తుంది. అందుకే సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో ఆసక్తి తక్కువగా ఉంటుంది.


క్లైమాక్స్

క్లైమాక్స్

సినిమా క్లైమాక్స్ కూడా ఆకట్టుకునే విధంగా లేదు.


హత్తుకునే సీన్లు

హత్తుకునే సీన్లు

సినిమా కథ, స్లో నేరేషన్ అనే సంగతి పక్కన పెడితే చాలా సన్నివేశాలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి.


ఫ్యామిలీ ప్రేక్షకులకే ఓకే..

ఫ్యామిలీ ప్రేక్షకులకే ఓకే..

కమర్షియల్ కాన్సెప్టుకు, ఎంటర్టెన్మెంటుకు కాస్త దూరంగా ఉన్న ఈ సినిమా ప్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అవకాశం ఉంది.


English summary
"Memu" is a comedy drama film, which is the dubbed version of the 2015 Tamil film "Pasanga-2," that was a thematic sequel to the 2009 film "Pasanga." Besides directing the movie, Pandiraj has also written the script for "Memu," which focuses on the issue of Attention Deficit Hyperactivity Disorder (ADHD) among children.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu