twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెంటల్ మదిలో మూవీ రివ్యూ: హృదయాన్ని హత్తుకునే ప్రేమకథ

    By Rajababu
    |

    Rating:
    3.0/5
    Star Cast: శ్రీ విష్ణు, నివేదా పేతురాజు, అమృత శ్రీనివాసన్, శివాజీ రాజా
    Director: వివేక్‌ ఆత్రేయ

    Recommended Video

    మెంటల్ మదిలో మూవీ పబ్లిక్ టాక్

    విభిన్నమైన కథా చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం ఎప్పటికప్పుడు రుజువు అవుతున్నది. ఈ మధ్యకాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న చిత్రాలు కూడా భారీ సినిమాలను తలదన్నేలా సక్సెస్ సాధించాయి. అంతేకాకుండా భారీ కలెక్షన్లను కొల్లగొట్టాయి. అలాంటి చిత్రాల జాబితాలో పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, ఫిదా లాంటి చిత్రాలు చోటు సంపాదించుకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విడుదలకు ముందే మరో చిన్న చిత్రం 'Mental మదిలో' విశేషమైన టాక్‌ను సంపాదించుకొన్నది.

    పెళ్లిచూపుల లాంటి ఫీల్‌గుడ్ చిత్రాన్ని రూపొందించిన నిర్మాత రాజ్ కందుకూరి మెంటల్ మదిలో సినిమాకు ప్రొడ్యూసర్. అలాంటి నిర్మాత చేతిలో అశ్లీలం, ద్వందార్థాలకు ఎక్కడా తావులేకుండా చక్కటి కుటుంబ కథా చిత్రంగా రూపొందుకున్నది మెంటల్ మదిలో.

    Mental మదిలో చిత్రంపై నమ్మకం

    Mental మదిలో చిత్రంపై నమ్మకం

    Mental మదిలో చిత్రంపై ఉన్న నమ్మకం, విశ్వాసంతో నిర్మాత రాజ్ కందుకూరి గతవారమంతా సినీ అభిమానులకు, ప్రముఖులకు, విమర్శకులకు ప్రివ్యూ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరు ఈ చిత్రాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకులకు ముందు వస్తున్నది. ఇలా ప్రతీ ఒక్కరిని ఆకట్టుకొంటున్న Mental మదిలో చిత్రం ప్రత్యేకత ఏంటో అనే విషయాన్ని తెలుసుకోవాంటే కథలోకి వెళ్లాల్సిందే.

    మెంటల్ మదిలో కథ ఇలా

    మెంటల్ మదిలో కథ ఇలా

    అరవింద్ కృష్ణ (శ్రీవిష్ణు) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. చిన్నప్పటి నుంచి ప్రతీ విషయంలోనూ కన్ఫ్‌ఫ్యూజన్ (తికమకపడటం) కలిగిన వ్యక్తి. ఆడవాళ్లకు ఆమడదూరంలో ఉంటాడు. ఇలాంటి లక్షణాలు ఉన్న అరవింద్‌కు స్వేచ్ఛ (నివేదా పేతురాజ్)‌తో పెళ్లి కుదురుతుంది. స్వేచ్ఛ ఆధునిక భావాలు ఉన్న మహిళ. తనపై తనకు పూర్తి క్లారిటీ ఉన్న యువతినే కాక ఎదుటివారికి ఏమి కావాలనే స్పష్టత కూడా స్వేచ్ఛకు ఉంటుంది. ఇలాంటి భిన్న లక్షణాలు ఉన్న ఇద్దరు ఒకరిని మరొకరు బాగా ఇష్టపడుతారు. వీరిద్దరి నిశ్చితార్థానికి ముహుర్తం పెట్టుకొంటారు. కానీ ఓ కారణంగా ఎంగేజ్‌మెంట్ ఆగిపోతుంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ పనిమీద అరవింద్‌ ముంబైకి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా ఎంగేజ్‌మెంట్ కాకుండా పెళ్లి రద్దు చేసుకొందామా? అని స్వేచ్ఛను అరవింద్ అడగుతాడు. దాంతో స్వేచ్ఛ ఒక్కసారిగా కంగుతింటుంది.

    కథలో ట్విస్టులకు సమాధానాలు

    కథలో ట్విస్టులకు సమాధానాలు

    పెళ్లి విషయంలో అరవింద్ తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటి? తాను అమితంగా ఇష్టపడిన స్వేచ్ఛను ఎందుకు దూరం చేసుకోవాలనుకొంటాడు. చివరికి అరవింద్, స్వేచ్ఛ పెళ్లి చేసుకొన్నారా? ఒకవేళ స్వేచ్ఛ, అరవింత్ పెళ్లి చేసుకొంటే ఎలాంటి నాటకీయ పరిణామాలు వారిద్దరి మధ్య చోటుచేసుకొన్నాయి అని ప్రశ్నలకు సమాధానమే Mental మదిలో.

    Mental మదిలో విశ్లేషణ

    Mental మదిలో విశ్లేషణ

    Mental మదిలో చిత్రం చాలా సింపుల్ అండ్ క్యూట్ స్టోరీ లైన్. ప్రతీ సన్నివేశంలో మన చుట్టూ కనిపించే సన్నివేశాలే తెర మీద కనిపిస్తుంటాయి. మధ్య తరగతి కుటుంబంలో కనిపించే భావోద్వేగ సన్నివేశాలు, ఆలోచనలను దర్శకుడు వివేక్ ఆత్రేయ చాలా సున్నితంగా తెరకెక్కించారు. చాలా అందంగా అల్లుకొన్న సన్నివేశాలకు హాస్యాన్ని చక్కగా అద్దారు. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు పెదవి మీద చిరునవ్వు చెరగకుండా ప్రేక్షకుడిని కథలో ఎంగేజ్ చేయడం దర్శకుడు విజయం సాధించాడని చెప్పవచ్చు. ప్రతీ పాత్రను చాలా చక్కగా తీర్చిదిద్దాడు. ఏ పాత్ర కూడా ప్రేక్షకుడిని వదిలిపెట్టకుండా వెంటాడుతూ ఉండటం Mental మదిలో ప్రత్యేకత. శేఖర్ కమ్ముల ఆనంద్, గోదావరి, ఫిదా, తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు లాంటి చిత్రాలను మైమరిపించే విధంగా ఈ చిత్రం ఎంత గొప్పగా తెరకెక్కించారంటే అతిశయోక్తి కాదేమో. ఓ చిన్న స్టోరీలైన్ ఎలాంటి ట్విస్టులు లేకుండా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సినిమాను పరుగులు పెట్టించాడు.

    మెంటల్ మదిలో ఫస్టాఫ్

    మెంటల్ మదిలో ఫస్టాఫ్

    మెంటల్ మదిలో అరవింద్ క్యారక్టర్ ఎస్టాబ్లిష్ చేసే అంశాన్ని చాలా సహజంగా చిత్రీకరించాడు. అరవింద్ తండ్రి పాత్ర (శివాజీరాజా) క్యారెక్టర్‌ను ఆకట్టుకునే విధంగా పరిచయం చేయడంతో సినిమా ఆరంభం చాలా ఆసక్తిగా సాగుతుంది. ఇక స్వేచ్ఛతో అరవింత్ పెళ్లిచూపులు లాంటి ఎపిసోడ్లు ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారుతాయి. ఆ తర్వాత అరవింద్ మైండ్‌సెట్‌ను స్వేచ్ఛ మార్చడం, పెళ్లికి ముందే ఇంట్లో చెప్పకుండా గోవాకు వెళ్లే సీన్లు తొలిభాగంలో హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. అంతలోనే జరుగుతుందని అనుకొన్న ఎంగేజ్‌మెంట్ ఆగిపోవడం, ప్రాజెక్ట్ పనిపై ముంబైకి వెళ్లిన అరవింద్ మనసు మార్చుకొని స్వేచ్ఛతో పెళ్లిని రద్దు చేసుకోవాలనుకునే ట్వీస్ట్‌తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

    Mental మదిలో సెకండాఫ్

    Mental మదిలో సెకండాఫ్

    సెకండాఫ్‌లో రేణు పాత్ర ఎంట్రీతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. అల్లరి అమ్మాయిగా రేణు పాత్ర ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేస్తుంది. రెండో భాగంలో రేణు పాత్ర చలాకీగా ప్రేక్షకులకు దగ్గరవుతుంది. చివర్లో మూడు పాత్రల మధ్య భావోద్వేగాలతో సినిమా క్లైమాక్స్ చేరుతుంది. సినిమా రెండో భాగంలో మూడు పాత్రల మధ్య జరిగే సంఘర్షణ సినిమాకు ప్రాణం పోస్తుంది.

    వివేక్ అనుభవం ఉన్న డైరెక్టర్‌లా

    వివేక్ అనుభవం ఉన్న డైరెక్టర్‌లా

    దర్శకుడు వివేక్ ఆత్రేయ చూడటానికి కుర్రాడైనా ఎన్నో సినిమాలు తీసిన అనుభవం ఉన్న డైరెక్టర్‌లా అనిపిస్తాడు. కథను అతను డీల్ చేసిన విధానం, నడిపించిన తీరు వివేక్ ప్రతిభకు అద్దం పడుతాయి. సాహిత్యంపై వివేక్‌కు ఉన్న పట్టు మరింత ప్లస్ అయ్యాయి. భావితరం సినిమాకు మరో అణిముత్యం అవుతాడనే ఫీలింగ్‌ను కలుగచేయడంలో వివేక్ సఫలమయ్యాడు.

    శ్రీవిష్ణు మరోస్థాయికి

    శ్రీవిష్ణు మరోస్థాయికి

    టాలీవుడ్‌లో శ్రీవిష్ణు చాపకింద నీరులా ఒక్కో సినిమాను తన అకౌంట్లో వేసుకొంటున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలతో ప్రేక్షకుల దగ్గరైన శ్రీ విష్ణు.. ఇక మెంటల్ మదిలో చిత్రంతో మరింత చేరువ కావడం తథ్యం. ఈ చిత్రం తర్వాత శ్రీవిష్ణు మరో లెవల్‌కు వెళ్లిపోవడం ఖాయమనే మాట వినిపిస్తున్నది. అరవింద్ కృష్ణగా అద్భుతంగా నటించాడు. సౌమ్యంగా, అమాయకంగా, భావోద్వేగాలకు లోనైన ప్రేమికుడిగా పలు కోణాల్లో మంచి నటనను ప్రదర్శించాడు. కీలక సన్నివేశాలలో తన నటనతో ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేయడం ఖాయం.

    నివేదా సింప్లీ, సూపర్

    నివేదా సింప్లీ, సూపర్

    స్వేచ్ఛగా నివేదా పేతురాజ్ తన తొలిచిత్రంతోనే పరిణితి చెందిన నటనను ప్రదర్శించింది. ఈ చిత్రంలో స్వేచ్ఛ ఆధునిక యువతికి ప్రతీకగా నిలిచింది. ప్రతికూల పరిస్థితుల్లో ఉంటే వాటిని ఎలా తట్టుకోవొచ్చో అనే విషయాన్ని ప్రతీ యువతి నేర్చుకొనే విధంగా నటించి మెప్పించింది. మొదటి చిత్రంతోనే టాలీవుడ్‌లో చక్కటి భవిష్యత్ ఉన్న నటిగా పేరు తెచ్చుకొన్నది.

    రేణు పాత్రలో అమృత

    రేణు పాత్రలో అమృత

    రేణు పాత్రలో అమృత శ్రీనివాసన్ నటించింది. అమృత పాత్ర తొలుత చిలిపిగా కనిపించినా సినిమా క్లైమాక్స్‌కు వచ్చే సరికి భావోద్వేగానికి గురిచేస్తుంది. ఓ పక్క నవ్విస్తూనే గుండెను పిండేస్తుంది. రేణు పాత్రకు అమృత శ్రీనివాసన్ 100శాతం న్యాయం చేసింది. ఎక్కడ కొత్త నటి అనే ఫీలింగ్ కనిపించదు. మళ్లీ హృదయం సినిమాలో హీరా రాజగోపాల్‌ను గుర్తు చేసింది.

    విభిన్నమైన పాత్రలో శివాజీరాజా

    విభిన్నమైన పాత్రలో శివాజీరాజా

    అరవింద్ తండ్రిగా శివాజీ రాజా ఓ మంచి పాత్రను పోషించారు. మెంటల్ మదిలో ద్వారా శివాజీ రాజాను ఓ కొత్త కోణంలో చూడవచ్చు. ఇప్పటి వరకు కనిపించిన శివాజీరాజాకు ఈ చిత్రంలోని ఆయన నటనకు చాలా తేడా కనిపిస్తుంది. మధ్య వయస్సు ఉన్న తండ్రి పాత్రకు శివాజీ రాజా కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేంతగా తన నటనను ప్రదర్శించారు.

    హైలెట్‌గా ప్రశాంత్ విహారీ సంగీతం

    హైలెట్‌గా ప్రశాంత్ విహారీ సంగీతం

    Mental మదిలో చిత్రానికి ప్రశాంత్ విహారీ సంగీతాన్ని అందించాడు. మొత్తం ఏడు పాటలకు స్వరాలు అందించారు. ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళ, ఊహలే పాట, అలాగే బాగుందయ్య చంద్రం.. నీ ముఖారవిందం పాటలు హుషారుగా సాగుతాయి. మనవా ఆలకించరాదటే..పాట హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. సిరాశ్రీ రాసిన మాలిక్ తేరే బందే పాట మరింత ఉత్తేజాన్ని కలిగించేలా ఉంది. ఈ చిత్రంలోని ఏడు పాటలు ఏ పాటకు ఆ పాట చాలా వినూత్నంగా, ఒక్కసారి వినగానే మళ్లీ మళ్లీ వినిపించేలా ఉంటాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ ఆడియో అని చెప్పవచ్చు.

    వేదరామన్ సినిమాటోగ్రఫీ సూపర్

    వేదరామన్ సినిమాటోగ్రఫీ సూపర్

    Mental మదిలో చిత్రానికి మరో ప్లస్ పాయింట్ వేదరామన్ సినిమాటోగ్రఫీ. హైదరాబాద్, గోవా, ముంబైలో నగరాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు వారెవ్వా అనే రేంజ్‌లో ఉంటాయి. లైటింగ్, తదితర అంశాలు తెరపైన చాలా రిచ్‌గా కనిపిస్తాయి. ఈ సినిమా చూస్తే ఎక్కడ ఓ చిన్న చిత్రం అనిపించదు. కొత్త సినిమాటోగ్రాఫరా అనే ప్రశ్నే తలెత్తదు.

    హైలెట్‌గా ఎడిటింగ్..

    హైలెట్‌గా ఎడిటింగ్..

    మిగితా సాంకేతిక అంశాలలో విప్లవ్ ఎడిటింగ్, మనీషా సత్యవోలు ఆర్ట్ విభాగాల పనితీరు హైలెట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో ఎడిటింగ్ పాత్ర చాలా గొప్పగా అనిపిస్తుంది. చాలా క్రిటికల్ స్క్రీన్ ప్లేను ఎక్కడా తడబాటుకు గురికాకుండా ప్రేక్షకుడికి ఫీల్ గుడ్ అందించడంలో ఎడిటింగ్ తన పాత్రను సమర్ధవంతంగా పోషించింది.

    రాజ్ కందుకూరి అభిరుచికి

    రాజ్ కందుకూరి అభిరుచికి

    పెళ్లి చూపులు తర్వాత నిర్మాత రాజ్ కందుకూరి తెరకెక్కించిన రెండో సినిమా Mental మదిలో. ఆయన అభిరుచికి అద్దంపట్టిన సినిమా ఇది. పెళ్లిచూపుల చిత్రానికి ఏమాత్రం తీసిపోకుండా మరింత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. పెళ్లిచూపులు మాదిరిగానే Mental మదిలో రాజ్ కందుకూరికి మంచి లాభాలనే కాకుండా పేరు ప్రతిష్ఠలను కూడా తెచ్చిపెట్టడం ఖాయం.

    అరుదుగా మెరిసే నక్షత్రం Mental మదిలో

    అరుదుగా మెరిసే నక్షత్రం Mental మదిలో

    చివరగా Mental మదిలో చిత్రం అప్పడప్పుడు ఆకాశంలో మెరిసే నక్షత్రం లాంటింది. ఆకాశంలో అరుదుగా మెరిసే నక్షత్రం ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో Mental మదిలో కూడా అలాంటి ఫీలింగ్‌ను థియేటర్లలో ప్రేక్షకుడికి కలిగిస్తుంది. విశ్వనాథ్ కథకు జంధ్యాల మాటలు రాస్తే మణిరత్నం తీసే దృశ్యకావ్యం ఎలా ఉంటుందో Mental మదిలో కూడా అలానే ఉంటుంది. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడే చిత్రం మెంటల్ మదిలో..

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    కథ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే
    శ్రీ విష్ణు, నివేదా పేతురాజ్, అమృతా శ్రీనివాసన్ యాక్టింగ్
    మ్యూజిక్, ఎడిటింగ్

    మైనస్ పాయింట్స్
    చెప్పుకోవడానికి ఏమీ లేవు..

    తెర ముందు.. తెర వెనక

    తెర ముందు.. తెర వెనక

    నటీనటులు: శ్రీ విష్ణు, నివేదా పేతురాజు, అమృత శ్రీనివాసన్, శివాజీ రాజా తదితరులు
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ
    నిర్మాత: రాజ్‌ కందుకూరి
    మ్యూజిక్ : ప్రశాంత్‌ ఆర్‌ విహారి
    సినిమాటోగ్రఫీ : వేదరామన్‌
    ఎడిటింగ్‌: విప్లవ్‌
    ఆర్ట్: మనీషాసత్యవోలు
    బ్యానర్: ధర్మపథ క్రియేషన్స్‌
    రిలీజ్ డేట్: 24-11-2017

    (ప్రివ్యూ షో: 22 నవంబర్‌న రామానాయుడు ల్యాబ్స్‌లో)

    English summary
    Mental Madhilo is a Telugu romantic drama. Produced by Pellichoopuli fame Raj Kandukuri under Dharmapatha Creations, written and directed by Vivek Athreya. Raj Kandukuri. Sree Vishnu appeared in the recent hit Appatlo Okadundevadu and the blockbuster Pelli Choopulu. Vivek Athreya is making his directing debut with this movie. The music is by Prashat R Vihari.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X