Mirai Critics Review: మిరాయ్ మూవీ క్రిటిక్స్ రివ్యూ
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం మిరాయ్. పాపులర్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరోలు తేజా సజ్జా, మంచు మనోజ్, శ్రీయ సరన్ నటించిన ఈ చిత్రం పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ చిత్రానికి కృతి ప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 12వ తేదీన పాన్ ఇండియామూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.
మిరాయ్ సినిమా విషయానికి వస్తే.. సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ సరన్ తొలిసారి తల్లి పాత్రలో నటిస్తున్నారు. అఈ సినిమాకు మ్యూజిక్ గౌరా హరి, సినిమాటోగ్రఫి కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, డైలాగ్స్ మణిబాబు కరణం, ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల వ్యవహరిస్తున్నారు. ప్రోమోలు, ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ క్రమంలో రిలీజ్‌కు ముందు ప్రదర్శించిన ఈ మూవీకి సంబంధించిన క్రిటిక్స్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు సినిమాను ప్రపంచానికి చక్కగా పరిచయం చేసే ఫాంటసీ సినిమా. ఈ సినిమాను పూర్తిగా టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా రూపొందించారు. సినిమా ఆరంభం నుంచి చివరి సన్నివేశం వరకు ఇప్పటి వరకు ప్రేక్షకుడు పొందని కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి, భిన్నమైన అనుభూతిని అందిస్తుంది. అన్నివర్గాలను సంతృప్తి పరిచే విధంగా ఈ సినిమాను రూపొందించారు. సూపర్ యోధ పాత్రలో తేజ సజ్జా మరోసారి ఆకట్టుకొన్నాడు.
ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో బర్డ్ సీక్వెన్స్, ఇంటర్వెల్ తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లో చిత్రీకరించిన విధానం.. అందులో నటీనటుల ప్రదర్శన బాగుంటుంది. కొన్ని సర్‌ప్రైజెస్ బాగా వర్కవుట్ అయ్యాయి. బిగ్ స్క్రీన్‌లో సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ బాగుంటుంది. అమేజింగ్ విజువల్స్‌తో కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో కార్తీక్ ఘట్టమనేని తన ప్రతిభను, టెక్నికల్ అంశాలపై తనకు ఎంత పట్టు ఉందో నిరూపించుకొన్నాడు. గౌరా హరి మ్యూజిక్, నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమా ప్లస్‌గా నిలిచాయి అని క్రిటిక్ అభిప్రాయపడ్డారు.
మిరాయ్ సినిమాను ఇప్పుడే చూశాను. బాక్సాఫీస్ హిట్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ చాలా బాగుంది. ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలను తేజా సజ్జా బాగా క్యారీ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌవ్రా అందించిన బీజీఎం కొత్త లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. క్లైమాక్స్ సన్నివేశాల సమయంలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. చివర్లో వచ్చే సన్నివేశంలో సర్‌ప్రైజ్ ఒకటి ఉంటుంది. అది చాలా నీట్‌గా ప్లేస్ చేశారు. కార్తీక్ రాసిన స్టోరి, ప్రజెంటేషన్ ఎక్సలెంట్. టీమ్ అందించిన విజువల్ వర్క్ బాగుంది. పిల్లలకు, ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా నచ్చుతుంది అని క్రిటిక్ తెలిపాడు.
మిరాయ్ సినిమాలో అద్బుతమైన ప్రపంచాన్ని, భారీగా చిత్రీకరించారు. కంటికి ఇంపుగా ఉంటే సినిమాటోగ్రఫి, వావ్ అనిపించే వీఎఫ్ఎక్స్, చెవులకు మధురంగా ఉండే బీజీఎం, ఎక్స్ట్రార్టినరీ కంప్యూటర్ గ్రాఫిక్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈసినిమాకు పాజిటివ్. తేజా సజ్జా తన మాస్టర్ క్లాస్ నటనతో మెప్పించాడు. ఓ యోధుడు ప్రయాణాన్ని ఫస్టాఫ్‌లో చూస్తాం. సెకండాఫ్‌లో శక్తి అంటే ఏమిటో ఎక్స్‌పీరియెన్స్ చేస్తాం. ఇంటర్వెల్ బ్యాంగ్, యాక్షన్ ఎపిసోడ్‌కు సీటీ మార్ మాదిరగా ఉంటాయి. పైసా వసూల్ చిత్రంగా కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను అందించారు అని ఓ క్రిటిక్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











