For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘మిస్ ఇండియా’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.0/5
  Star Cast: కీర్తి సురేష్, నదియా, నరేష్, జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్ తదితరులు
  Director: నరేంద్ర నాథ్

  'మహానటి'తో దక్షిణాదిన పాపులర్ అయింది కీర్తి సురేష్. ఈ సినిమా అంతగా హిట్ అయింది కాటట్టే లేడీ ఓరియెంటెడ్ సినిమాలన్నీ కీర్తి సురేష్ ఒళ్లో పడ్డాయి. కానీ కీర్తి సురేష్ మాత్రం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మళ్లీ సక్సెస్ కొట్టలేకపోతోంది. పెంగ్విన్ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకోగా అది నిరాశ పరిచింది. తాజాగా మిస్ ఇండియా అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చింది. ఈ సారైనా కీర్తి సురేష్ కోరిక నెరవేరిందో లేదో ఓ సారి చూద్దాం.

  కథ

  కథ

  మానస సంయుక్త (కీర్తి సురేష్) మధ్య తరగతి అమ్మాయి. కానీ ఆశలు, ఆశయాలు, ఆలోచనలు మాత్రం ఉన్నతంగా ఉంటాయి. పెద్ద వ్యాపారవేత్తగా ఎదగాలని చిన్న తనం నుంచే కలలు కంటుంది. ఓ అమ్మాయి ఇలాంటి కలలు కంటే సాధారణంగా ఎదురయ్యే అడ్డంకులు ప్రతికూల పరిస్థితులే మానసకు ఎదురవుతాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవ్వరూ ప్రోత్సహించరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త (జగపతి బాబు) నుంచి సవాల్ ఎదురువుతుంది. ఈ నేపథ్యంలో ఆమె అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు సిద్ధమవుతుంది.

  కథలోని ట్విస్ట్‌లు..

  కథలోని ట్విస్ట్‌లు..

  బిజినెస్ ప్రారంభించానుకున్న మానసకు ఎలాంటి ఐడియా వచ్చింది? వచ్చిన ఆ ఆలోచనలకు పెట్టుబడి ఎవరు పెట్టారు? అప్పటికే వ్యాపార రంగంలో టైకూన్ అయిన కైలాష్‍ (జగపతిబాబు) మానసను ఎలా అడ్డకుంటాడు? అసలు ఏమీ లేని మానస వ్యాపారవేత్తగా ఎలా ఎదుగుతుంది? ఈ చిత్రంలో సంయుక్త ఎందుకు టీ బిజినెస్ ప్రారంభించాలనుకొన్నారు? కాఫీ ఎక్కువ తాగే విదేశాల్లో టీ బిజినెస్ పెట్టడానికి కారణమేమిటి? కుటుంబ సభ్యులు వ్యతిరేకించిన సమయంలో ఆమెకు ఎవరు అండగా నిలబడ్డారు. ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు ప్రతిరూపమే మిస్ ఇండియా చిత్రం.

  మిస్‌ ఇండియా మూవీ విశ్లేషణ

  మిస్‌ ఇండియా మూవీ విశ్లేషణ

  ఇక సంయుక్త పాత్రను పూర్తిగా పరిచయం చేయడంలో కాస్త సమయం తీసుకొన్నప్పటికీ.. తొలి భాగంలో ఆ పాత్ర ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోతుంది. తొలి భాగం మూవీ ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. కాకపోతే సెకండాఫ్‌లో రొటీన్ డ్రామాగా మారుతుంది. దాంతో పాత సినిమాను చూసిన ఫీలింగ్ తప్ప.. ఓ విభిన్నమైన కథను ఎంజాయ్ చేస్తున్నామనే ఫీలింగ్ కలుగదు. మిగితా పాత్రలు ఆకట్టుకొనేలా ఉన్నప్పటికి.. బలమైన కథ, కథనాలు లేకపోవడం కొంత నిరుత్సాహానికి గురిచేస్తుంది.

  నటీనటుల పనితీరు

  నటీనటుల పనితీరు

  ఇందులో చెప్పుకోవడానికి చాలానే పాత్రలు ఉన్నా కూడా.. ముఖ్యంగా కీర్తి సురేష్, జగపతి బాబు మధ్యే కథ నడుస్తుంది. జగపతి బాబుతో పోటాపోటిగా నటించేందుకు కీర్తి సురేష్ ప్రయత్నించిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పటికే జగపతి బాబు అలాంటి పాత్రలు చేసి ఉండటం వల్ల ఆయన పాత్ర కొత్తగా కనిపించదు.. ఇక అలవాటైన పాత్రే కాబట్టి జగపతిబాబు అవలీలగా చేసేశాడు. ఇక మిస్ ఇండియాలో కీర్తి సురేష్ తన పాత్రకు తగ్గట్టు స్లిమ్ లుక్కులోకి మారి ఆశ్చర్యపరిచింది. నటనతోనూ కీర్తి సురేష్ అందర్నీ ఆకట్టుకుంటుంది. తాత పాత్రలో రాజేంద్ర ప్రసాద్ పర్వాలేదనిపించాడు. నదియా, నరేష్ పాత్రలు కూడా ఓకే అనిపిస్తాయి.

  దర్శకుడి పనితీరు..

  దర్శకుడి పనితీరు..

  మిస్ ఇండియా సినిమా లైన్, కథ బాగానే ఉంది. ఓ అమ్మాయి.. ఎంతో ఎత్తుకు ఎదగాలని చూస్తుంది.. పురుషాధిక్య సమాజం.. ఎన్నో అడ్డంకులు ఇలా ఈ కథలో ఎన్నో సంఘర్షణలు జొప్పించే అవకాశం ఉంది. కానీ దర్శకుడు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా సిల్లీగా కొన్ని సీన్స్‌ను అల్లేసినట్టు కనిపిస్తుంది. విలన్‌గా జగపతి బాబు పాత్రను మరీ పేలవంగా రాసుకున్నాడని అనిపిస్తుంది. కీర్తి సురేష్ ఎదిగే తీరు.. పతనమై మళ్లీ పుంజుకున్న సన్నివేశాలను ఎంతో గొప్పగా చెప్పే అవకాశం చూపించే స్పేస్ ఉన్నా కూడా రొటీన్ రొడ్డ కొట్టుడు సన్నివేశాలు, కథనంతో మిస్ ఇండియాను బలి చేసినట్టు అనిస్తుంది.

  సాంకేతిక నిపుణుల పనితీరు

  సాంకేతిక నిపుణుల పనితీరు

  మిస్ ఇండియాలో సాంకేతిక నిపుణుల పనితం గురించి చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యంగా విజువల్స్, నేపథ్య సంగీతం గురించి మాట్లాడాల్సిందే. ప్రతీ ఫ్రేమ్‌లో రిచ్ నెస్ కనిపిస్తుంది. ఇక ఏమీ లేని చోట కూడా తన బ్యాక్ గ్రౌండ్‌తో సీన్స్‌ను పండించాడు తమన్. తమన్ అందించిన నేపథ్య సంగీతం వల్ల సీన్స్‌లో కొంచెం వెయిట్ కనిపించింది. ఇక ఎడిటింగ్‌పై సరిగ్గా దృష్టి పెట్టలేదని కనిపిస్తోంది. నిర్మాత మహేష్ కోనేరు అనుసరించిన నిర్మాణ విలువలు, పాత్రల కోసం నటీనటుల ఎంపిక మాత్రం సూపర్బ్‌గా ఉన్నాయి.

  ఫైనల్

  ఫైనల్

  మిస్ ఇండియా సినిమాను చూస్తూ ఉంటే మధ్యలో ఇది టీ కి సంబంధించిన యాడ్ అని అనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కొన్ని సీన్స్‌ను చూస్తుంటే మాకేం‘టీ' గోలా? అని చిరాకు పడొచ్చేమో. కీర్తి సురేష్ మళ్లీ ఈ మిస్ ఇండియాతో హిట్ కొట్టాలని అనుకుంది కానీ మిస్ ఫైర్ అయింది.

   బలాలు, బలహీనతలు

  బలాలు, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్..

  కీర్తి సురేష్
  నేపథ్య సంగీతం

  మైనస్ పాయింట్స్..
  రొటీన్ కథనం
  దర్శకత్వం

  చిత్రం : మిస్ ఇండియా

  చిత్రం : మిస్ ఇండియా

  నటీనటులు: కీర్తి సురేష్, నదియా, నరేష్, జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్
  దర్శకత్వం : నరేంద్ర నాథ్
  సంగీతం : తమన్
  సినిమాటోగ్రఫీ : సుజీత్‍ వాసుదేవ్‍
  నిర్మాత : మహేష్‍ ఎస్‍. కోనేరు
  రిలీజ్ డేట్ : 2020-11-04

  English summary
  Keerthy Suresh Miss India Movie Review And Rating. This Movie Released On 4th November On Netflix. This Movie Is Produced By Mahesh S Koneru.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X