For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Missing Movie Review.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులతో ఉత్కంఠ

  |

  Rating: 2.75/5

  నటీనటులు: హర్ష నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్, రామ్ దత్, చత్రపతి శేఖర్, విష్ణు విహారి, అశోక్ వర్థన్, వినోద్ నువ్వుల తదితరులు
  కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీని జోస్యుల
  నిర్మాతలు: భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్
  ఎడిటర్: సత్య జి,
  సంగీతం: అజయ్ అరసాడ,
  సినిమాటోగ్రఫి: జనా. డి,
  బ్యానర్: బజరంగబలి క్రియేషన్స్
  రిలీజ్ డేట్: 2021-11-19
  ప్రివ్యూ: సినీమ్యాక్స్, బంజారాహిల్స్, హైదరాబాద్

  మిస్పింగ్ కథ ఏమిటంటే?

  మిస్పింగ్ కథ ఏమిటంటే?

  గౌతమ్ (హర్ష నర్రా) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. శృతి (నికీషా రంగ్వాలా)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. ఊహించని రీతిలో గౌతమ్, శృతి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవుతుంది. యాక్సిడెంట్ తర్వాత శృతి కనిపించకుండా పోతుంది. గాయాలతో హాస్పిటల్‌‌లో చేరిన గౌతమ్ చికిత్స అనంతరం కోలుకొని బయటకు వస్తాడు. ఆ తర్వాత తమను వెంటాడిని ఐదుగురు వ్యక్తులను గుర్తిస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తులను చేరుకొనే లోపే ఆ నలుగురు హత్యకు గురవుతారు.

  మిస్పింగ్ మూవీలో ట్విస్టులు

  మిస్పింగ్ మూవీలో ట్విస్టులు

  గౌతమ్, శృతి వాహనం సహజంగానే యాక్సిడెంట్‌కు గురైందా? గౌతమ్ కారు యాక్సిడెంట్ వెనుకు ఏదైనా కుట్ర ఉందా? తమ కారు యాక్సిడెంట్ వెనుక నలుగురు అనుమానితుల హత్యకు కారణం ఎవరు? గౌతమ్ యాక్సిడెంట్‌ కేసును జర్నలిస్టు మీనా (మిషా నారంగ్) సీరియస్‌గా తీసుకోవడానికి కారణం ఏమిటి? ఆ నలుగురిది హత్యకు ఎవరు ప్లాన్ చేశారు? ఈ కథలో ఏసీపీ త్యాగి (రామ్ దత్), సీఐ (చత్రపతి శేఖర్) పాత్రలు ఏమిటి? చివరకు శృతి అదృశ్యం వెనుక హస్తం ఎవరిది? శృతిని ఎందుకు కిడ్నాప్ చేశారు? చివరికి శృతి కిడ్నాప్ మిస్టరీ ఎలా వీడింది అనే ప్రశ్నలకు సమాధానమే మిస్టరీ సినిమా కథ.

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

  సినిమా ఆరంభంలోనే ఓ ఆసక్తికరమైన కిడ్నాప్ సీన్‌తో మిస్సింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత గౌతమి, శృతి వెహికిల్ యాక్సిడెంట్ కావడంతో అసలు సినిమా అసలు కథలోకి వెళ్తుంది. యాక్సిడెంట్ తర్వాత కథ ఊహించని విధంగా మలుపులు తిరగడమే కాకుండా ముందు ముందు ఏం జరుగుతుందోననే ఉత్కంఠను కూడా రేపుతుంది. గౌతమ్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. దాంతో సినిమా రెండో భాగంపై మరింత ఆసక్తి పెరుగుతుంది.

   దర్శకుడు శ్రీని ప్రతిభ

  దర్శకుడు శ్రీని ప్రతిభ

  దర్శకుడు శ్రీని జోస్యులు రాసుకొన్న కథనే సినిమాకు బలంగా మారింది. ఎమోషనల్ రోల్స్‌లో నూతన నటీనటులు, చిన్నస్థాయి నటులు నుంచి ఫెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకొన్న విధానం దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టింది. కథను నడిపించిన విధానం, ట్విస్టులను స్టోరీలో జొప్పించిన పద్దతి ఆకట్టుకొనేలా ఉందని చెప్పవచ్చు. సినిమా సక్సెస్‌లో దర్శకుడిదే అగ్రభాగమని చెప్పవచ్చు.

  హర్ష, మిషా నారంగ్

  హర్ష, మిషా నారంగ్

  మిస్పింగ్ సినిమాలో గౌతమ్ పాత్రదే వన్ మ్యాన్ షో. ఆ పాత్రలో కనిపించిన హర్ష నర్రా కొత్తవాడైనప్పటికీ అనుభవం ఉన్న నటుడిగా కనిపించాడు. కీలక సన్నివేశాలలో ఎలాంటి తడబాటు లేకుండా తన హావభావాలతో కథను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు. హీరో, హీరోయిన్ల విషయానికి వస్తే.. శృతి పాత్రలో నికీషా ఒదిగిపోయింది. పాత్ర పరిధిని బట్టి తన నటనతో ఆకట్టుకొన్నది. రొమాంటిక్ సీన్లతో హర్షతో కెమిస్ట్రీ బాగుంది. క్లైమాక్స్‌లో ఒక సీన్‌లో మంచి నటనతో ఆకట్టుకొనే ప్రయత్నం నికీషా చేసింది. జర్నలిస్టు పాత్రలో మిషా నారంగ్ తనదైన శైలిలో నటించింది. కథలో కీలకంగా మారిన పాత్రలో ఆమె నటన మెప్పించిందని చెప్పవచ్చు. ఇక ఏసీపీ త్యాగి, సీఐ పాత్రలో రామ్ దత్, చత్రపతి శేఖర్ ఆకట్టుకొన్నారు.

   సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. థ్రిల్లర్‌కు సరిపోయే విధంగా అజయ్ అరసాడ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంది. కొన్ని సీన్లలో కాస్త అతిగా అనిపిస్తుంది. జనా డీ సినిమాటోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. లైటింగ్ వాడుకొన్న విధానం బాగుంది. సత్య ఎడిటింగ్ ప్రతిభ కూడా ఫర్‌ఫెక్ట్‌గా ఉంది. మిగితా అన్ని విభాగాల పనితీరు బాగుంది.

  Hero Harsha Narra Making Fun Of Team In Bus Tour | Missing Movie
  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  ఫ్యామిలీ ఎమోషన్స్‌, లవ్, క్రైమ్ అంశాలను కలబోసుకొన్న పక్కా సస్పెన్స్ థ్రిల్లర్ మిస్పింగ్ మూవీ. నూతన నటీనటులు, సాంకేతిక నిపుణల టీమ్ వర్క్ ఈ సినిమాకు బలంగా మారిందని చెప్పవచ్చు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా చాలా రిచ్‌గా అనిపిస్తాయి. భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు టీమ్ పాటించిన నిర్మాణ విలువలు సినిమాను ఫీల్‌గుడ్ మూవీగా మార్చాయి. థ్రిల్లర్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు తప్పనిసరిగా నచ్చుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లితే ఈ వారం మిస్పింగ్ సినిమా పైసా వసూల్. ఈ మధ్య వచ్చిన చిన్న సినిమాల్లో హై క్లాలీటీస్‌తో రూపొందిన చిత్రమని చెప్పవచ్చు.

  English summary
  Missing movie is a Suspense thriller with high Technical values. This movie is hits the screen on November 19th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X