For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మిఠాయి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  1.5/5
  Star Cast: ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, కమల్ కామరాజు, గాయత్రి గుప్తా, అజయ్ ఘోష్
  Director: ప్రశాంత్ కుమార్

  రెడ్ యాంట్స్ పతాకంపై ప్రశాంత్ కుమార్ దర్శకుడిగా యువ నటులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించిన చిత్రం మిఠాయి. తెలుగులో డార్క్ కామెడీ వచ్చిన చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై భారీగా హైప్‌ను పెంచాయి. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబినేషన్‌లో న్యూ జనరేషన్ కామెడీ చిత్రంగా పేరు సంపాదించుకొన్నది. కొన్ని ప్రత్యేకతలతో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ చిత్రం ఎలాంటి టాక్‌ను సంపాదించుకున్నదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  మిఠాయి సినిమా కథ

  ప్రియదర్శి (జానీ) , రాహుల్ రామకృష్ణ (సాయి) క్లోజ్ ఫ్రెండ్స్. ప్రతీ రోజు బార్‌లో మందు తాగడం తప్ప మరో పని ఉండదు. ప్రతీ విషయంలోనూ రాహుల్ రామకృష్ణను దురదృష్టం వెంటాడుతుంటుంది. రాహుల్‌కు ఓ డొక్కు కారు, నస పెట్టే గర్ల్‌ఫ్రెండ్, కష్టాలను పంచుకొనే ప్రియదర్శి తప్ప పెద్దగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు. బాస్ వేధింపులను తట్టుకోలేక పెళ్లికి మూడు రోజుల ముందు ఉద్యోగానికి గుడ్‌బై చెబుతాడు. పెళ్లికి ముందు ఉద్యోగం పోయిందనే బాధలో తప్పతాగి ఇంట్లో పడిపోతాడు. తెల్లారి లేచి చూసే వరకు ఇంట్లో తన ప్రియురాలి కోసం చేయించిన నెక్లెస్, టీవీ, ల్యాప్ టాప్‌ చోరికి గురవుతాయి. ఈ క్రమంలో మందు పార్టీలో స్నేహితుడు (రవివర్మ)తో జరిగిన వాగ్వాదం ఓ ఛాలెంజ్‌కు దారి తీస్తుంది. దొంగను పట్టుకొన్న తర్వాతే పెళ్లి చేసుకోవాలనే ఛాలెంజ్‌తో అసలు కథ మొదలవుతుంది?

  మిఠాయి కథలో ట్విస్టులు

  దొంగను పట్టుకోవడానికి రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? దొంగను పట్టుకొనే క్రమంలో ఎదురైన వ్యక్తులు, వారితో జర్నీలో జరిగిన తమాషా, ఎమోషనల్ సంఘటనలు ఎలాంటి అనుభూతిని కలిగించాయి. ఈ క్రమంలో రాహుల్ రామకృష్ణకు ప్రియురాలు ఇచ్చిన షాక్ ఏంటి? చివరకు దొంగను పట్టుకొని రాహుల్ పెళ్లి చేసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మిఠాయి.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  రాహుల్ రామకృష్ణ బ్రహ్మచారి కష్టాలతో సినిమా ఆరంభమవుతుంది. డొక్కు కారుతో సమస్యలు, ఆఫీస్‌లో వేధించే బాసు, ఎదురయ్యే ఇబ్బందులకు రాహుల్ ప్రవర్తించే తీరుతో కొంత సరదాగా సాగిపోతుంది. కష్టాల్లో మనోధైర్యాన్ని ఇచ్చే స్నేహితుడు ప్రియదర్శితో మందుకొట్టడం, దాంతో రాహుల్ కాస్త ఉపశమనం పొందడం లాంటి అంశాలతో సినిమా వెరీ నార్మల్‌గా కథ నడుస్తుంది. స్నేహితుడు రవివర్మతో జరిగిన గొడవతో ఫస్టాఫ్‌కు సంబంధించి అసలు కథ మొదలవుతుంది. ఏమాత్రం ఆకట్టుకోకుండానే తొలిభాగం అలా ముగిసిపోతుంది.

  సెకండాఫ్‌ కథా ప్రయాణం

  తన ఇంట్లో వస్తువులను దొంగిలించిన వ్యక్తిని పట్టుకోవడం, తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవడమనే మెయిన్ పాయింట్‌తో కథ రన్ అవుతుంది. కాకపోతే నాసిరకమైన సన్నివేశాలు, అర్థంపర్ధం లేని కథ, ఆకట్టుకోలని కథనం ప్రేక్షకుడి సహానానికి పరీక్ష పెడుతాయి. కథ లాగిపట్టి సాగదీస్తూ వెళ్లడం ప్రేక్షకుడికి అగ్ని పరీక్షగా మారుతుంది. సంప్రదాయ సినిమా మేకింగ్ ఆమడ దూరంగా సినిమా ఉండటం ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది.

  దర్శకుడి పనితీరు

  ప్రశాంత్ కుమార్ అనుకొన్న పాయింట్ బాగానే అనిపించినప్పటికీ.. దానిని పూర్థిసాయిలో ఆకట్టుకొనే కథగా మలచడంలో తడబాటు కనిపిస్తుంది. కథనం మరీ పేలవంగా ఉంటుంది. మద్యం తాగడమనేది సొసైటీలో ఫ్యాషన్ అనే విధంగా ప్రతీ క్యారెక్టర్ చేతిలో మందు బాటిల్ తప్ప మరోటి కనిపించదు. వెగటు పుట్టించే రొమాంటిక్ సన్నివేశాలు దర్శకుడి అనుభవలేమికి సాక్ష్యంగా నిలిచాయి. ప్రేక్షకుడికి వినోదమనే సరైన మిఠాయి తినిపించడంలో దారుణంగా విఫలమయ్యాడని చెప్పవచ్చు.

  ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ గురించి

  ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ గొప్ప టాలెంట్ ఉన్న యువ కమెడియన్లు, నటులు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇలాంటి పొంతన లేని కథల్లో హీరోలుగా నటిస్తే తమకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ దెబ్బ తినే ప్రమాదం ఉంది. సాయి, జానీ పాత్రలు ఇద్దరు నటుల్లోని ప్రతిభను ఇసుమంత కూడా బయటపెట్టలేపోయాయి. ఇలాంటి కథ, కథనాలను నమ్ముకొని సినిమా చేయడాన్ని తప్పుపట్టకుండా ఉండలేం. అలా అని వారి టాలెంట్ లేని నటులని ఫిక్స్ కాలేం. నాసిరకమైన కథ, పేలవమైన కథనాన్ని నిలబెట్టడానికి తమ వంతు కృషి చేసినట్టు కనిపించింది.

  మిగితా పాత్రల్లో నటీనటులు

  ఇక మిగితా పాత్రల్లో కనిపించిన కమల్ కామరాజు, గాయత్రి గుప్తా, అజయ్ ఘోష్, రవి వర్మ తదితరుల నటన అంతంత మాత్రమే. ఈ కథలో వారు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి స్కోప్ కూడా లేకపోయింది. దాంతో తమకు లభించిన పాత్రలోని పరిధి మేరకు వారు అలా ఫిక్స్ అయిపోయారు.

  సాంకేతిక విభాగాల పనితీరు

  గతంలో వివేక్ సాగర్ సంగీతం దర్శకత్వంలో మంచి పాటలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో పాటలు వినడానికి ఇంపుగా లేవు. తెర మీద చూడటానికి అంత బాగా కూడా లేదు. రీరికార్డింగ్ కూడా బిలో యావరేజ్. సన్నివేశాలకు తగినట్టే సినిమాటోగ్రఫి ఉంది. ఎడిటర్‌కు ఇంకా చేతినిండా పనుంది. సాంకేతిక విభాగ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా యావరేజ్‌గానే ఉన్నాయి.

  ఫైనల్‌గా

  డార్క్ కామెడీ పేరుతో బలమైన కథ, ఆకట్టుకొనే కథనం లేకుండా నాసిరకంగా రూపొందిన చిత్రం మిఠాయి. సన్నివేశాల్లో చేదు తప్ప తీపి, ఆహ్లాదం కనిపించని చిత్రమని చెప్పవచ్చు. మిఠాయి టైటిల్ పెట్టడానికి అసలు కారణమేంటో బోధపడని చిత్రం. ప్రియదర్శి, రాహుల్ కామెడీని ఆశించి వెళితే ఘోరమైన భంగపాటు తప్పదు.

  బలం, బలహీనతలు

  పాజిటివ్ పాయింట్స్

  • ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ
  • ప్రొడక్షన్ వ్యాల్యూస్

  నెగిటివ్ పాయింట్స్

  • కథ, కథనాలు
  • సాంకేతిక విభాగాలు

  తెరముందు, తెర వెనుక

  ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, కమల్ కామరాజు, భూషణ్ కల్యాణ్, రవి వర్మ, అజయ్ ఘోష్, అర్ష, శ్వేతా వర్మ, అదితి మ్యాకల్, విజయ్ మరార్, గాయత్రి గుప్తా

  ఛాయాగ్రహణం: రవివర్మన్ నీలమేఘం,
  సంగీతం: వివేక్ సాగర్,
  ఎడిటర్: గ్యారీ బి.హెచ్,
  సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ,
  మాటలు: ప్రశాంత్ కుమార్, బి. నరేష్,
  నిర్మాత: డాక్టర్ ప్రభాత్ కుమార్,
  దర్శకత్వం: ప్రశాంత్ కుమార్.
  పీఆర్వో: నాయుడు-ఫణి.

  English summary
  The audio release function of 'Mithai' was held on Friday at the famous Hylife pub in Hyderabad. It was a grand event full of 'masthi' and LIVE performances. The dark comedy, starring Rahul Ramakrishna and Priyadarshi in the lead roles, has been produced by Prabhat Kumar on Red Ants banner.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more