Mithra Mandali Twitter Review: మిత్ర మండలి మూవీ ట్విట్టర్ రివ్యూ
ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం మిత్ర మండలి. సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత. రాజీవ్ కుమార్ రామ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వినోదభరిత చిత్రానికి నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకు ఆర్ఆర్ ధ్రువన్ మ్యూజిక్, సిద్దార్థ్ ఎస్టే సినిమాటోగ్రఫి, పవన్ కల్యాణ్ ఎడిటింగ్, గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైన్, శిల్ప టంగుటూరు కాస్ట్యూమ్స్ విభాగాలను పర్యవేక్షించారు. ఈ చిత్రం అక్టోబర్ 16వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ 14వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించారు.

జంగ్లీ పట్టణం అనే ఓ ఫిక్షనల్ టౌన్‌లో నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథ. గ్రామంలో తన కూతురు వంక ఎవరైనా చూస్తే.. వాడి అంతు చూసే తండ్రికి బిడ్డగా ఓ సాఫ్ట్ పాత్రలో నిహారిక ఎన్ఎమ్ నటించారు. ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా చిలిపి చేష్టలతో సినిమా సాగుతుంది. ఈ చిత్రం ఎక్కువగా యూత్‌కు రిలేట్ అయ్యేలా కమర్షియల్ ఎలిమెంట్స్ దట్టించి రూపొందించారు. ఈ సినిమా ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన రివ్యూలు, కామెంట్స్, ఫీడ్‌బ్యాక్ వివరాల్లోకి వెళితే..
మిత్ర మండలి సినిమా చూశాను నటీనటుల ఎంపిక, వారి పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. ప్రియదర్శి, నిహారిక, విష్ణు ఓఐ యాక్టింగ్ బాగుంది. సత్య, వెన్నెల కిషోర్ కామెడీ సీన్లు హిలేరియస్‌గా ఉన్నాయి. కొన్ని కామెడీ సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి. ఈ సినిమాకు నటీనటుల ఎంపిక ప్లస్ పాయింట్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5 అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మిత్ర మండలి ఫస్టాఫ్ చాలా బాగుంది. బడ్డీ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో కొన్ని సీన్లు వర్కవుట్ అయ్యాయి. కొన్ని సీన్లు ఫోర్స్‌ఫుల్‌గా వర్క్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్‌గా ఉన్నాయి. సెకండాఫ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మిత్రమండలి ఒకే అనిపించే స్లాప్ స్టిక్ కామెడీ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్ తమ పాత్రలకు న్యాయం చేయడమే కాకుండా చక్కగా నటించి మెప్పించారు. డైరెక్షన్ విషయంలో ఇంకా బెటర్‌గా చేయాల్సి ఉండాల్సింది అనిపిస్తుంది. ఫస్టాఫ్ గుడ్. సెకండాఫ్ ఒకే అనిపిస్తుంది. మ్యూజిక్, పాటలు సినిమాకు ప్లస్ పాయింట్స్ అని నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ సినిమాకు నా రేటింగ్ 2.75/5 అని చెప్పాడు.
మిత్ర మండలి సినిమా చూశాను. మినిమమ్ లెవెల్‌లో వర్కువుట్ అయింది. జాతిరత్నాలు మాదిరి కామెడీ. హ్యుమర్ పూర్తిస్థాయిలో వర్కువుట్ కాలేదు. ఇంకా బెటర్ జోక్స్ రాయాల్సి ఉండేదనిపిస్తుంది. ఓవరాల్‌గా టైమ్ పాస్ మూవీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మిత్ర మండలి సినిమా చూశాను. జెన్యూన్ కామెడీ అంటే ఇదే బాస్. ఓవర్‌యాక్టింగ్ లేదు. అనవసరపు డ్రామా లేదు. కేవలం స్వచ్చమైన ఫన్. ఈ సినిమాలో ప్రతీ నటుడు తమ పాత్ర పరిధిలో చక్కగా ఒదిగిపోయి నటించారు అని నెటిజన్ కామెంట్ చేశాడు.
మిత్ర మండలి సినిమాను చూశాను. చాలా రోజుల తర్వాత నేను నిజాయితీగా సినిమా చూస్తూ నవ్వుల్లో మునిగిపోయాను. ఈ సినిమా ఓల్డ్ స్కూల్ తెలుగు కామెడీని మళ్లీ తీసుకొచ్చింది. అందరూ కలిసి రీ యూనియన్ మాదిరిగా నవ్వుల్లో ముంచేత్తె సినిమా అని నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











