»   » ఎంఎల్ఏ సినిమా రివ్యూ: పక్కా మాస్‌గా కల్యాణ్ రామ్

ఎంఎల్ఏ సినిమా రివ్యూ: పక్కా మాస్‌గా కల్యాణ్ రామ్

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  MLA Movie Review ఎంఎల్ఏ సినిమా రివ్యూ

  Rating:
  2.5/5
  Star Cast: కళ్యాణ్‌ రామ్‌, కాజల్‌ అగర్వాల్‌, రవి కిషన్
  Director: ఉపేంద్ర మాధవ్‌

  నందమూరి కల్యాణ్ రామ్ మంచి అభిరుచి ఉన్న తెలుగు హీరో మాత్రమే కాకుండా నిర్మాత కూడా. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించారు ఆయన. ఇటీవల వచ్చిన జై లవకుశ చిత్రం కల్యాణ్ రామ్ అభిరుచికి ఓ మంచి ఉదాహరణ. స్వంత నిర్మాణ సంస్థలోనే కాకుండా బయటి ప్రొడక్షన్ హౌస్‌లో సినిమాల్లో కూడా నటిస్తున్నారు. కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ఎంఎల్ఏ. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి సినిమాకు ట్యాగ్‌లైన్. అందాల తార కాజల్ అగర్వాల్ హీరోయిన్. నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో సినీ నిర్మాణ రంగంలో ప్రవేశించిన కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మాతలు. పొలిటికల్ సౌండ్ ఎక్కువగా వినిపించే ఈ చిత్రం కల్యాణ్ రామ్‌కు ఎలాంటి సక్సెస్ అందించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఎంఎల్ఏ సినిమాను సమీక్షించాల్సిందే.


  కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

  ఎంఎల్ఏ సినిమా కథ ఇదే

  అనంతపురం జిల్లా వీరభద్రపురంలో గాడప్ప (రవికిషన్), నాగప్ప (జయప్రకాశ్ రెడ్డి) కుటుంబాల మధ్య రాజకీయవైరం ఉంటుంది. ఎన్నో ఎలెక్షన్లలో నాగప్పపై, ఆయన కుటుంబంపై గాడప్ప గెలుస్తూనే ఉంటాడు. ఓ కారణం చేత ఆ నియోజకవర్గంలో గాడప్పపై కల్యాణ్ (కల్యాణ్ రామ్) రాజకీయ సవాల్ విసురుతాడు. రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని విసిరిన కల్యాణ్‌ సవాల్‌కు గాడప్ప సై అంటాడు.


  నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన


  ఎత్తుకు పై ఎత్తు ఇలా..

  రాజీనామా చేసిన గాడప్ప ఉపఎన్నికల్లో గెలిచాడా? ఎన్నో ఏళ్లుగా గెలుస్తున్న గాడప్పను ఎన్నికల్లో కల్యాణ్ ఏవిధంగా దెబ్బతీశాడు. తాను ప్రేమించిన ఇందు (కాజల్ అగర్వాల్)కు నాగప్ప కుటుంబంతో సంబంధమేమిటి? ఏ పరిస్థితుల్లో కల్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలకు కల్యాణ్ ఎలా చరమగీతం పాడాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఎంఎల్ఏ సినిమా కథ.


  ఫస్టాఫ్‌లో

  అమ్మాయికి ఆస్థులు పంచి ఇస్తే అవి ఉన్నంతకాలం బతుకుతారు.. అదే చదువు చెప్పిస్తే జీవితాంతం జీవిస్తారు అనే ఓ మంచి పాయింట్‌తో సినిమా తెరకెక్కింది. తొలి భాగంలో వీరభద్రపురంలో రాజకీయ ఫ్యాక్షన్‌తో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత తన చెల్లెలు (లాస్య) ప్రేమించిన వ్యక్తి (వెన్నెల కిషోర్) పెళ్లి మరో అమ్మాయితో జరుగుతుంటే ఎత్తుకొచ్చే పెళ్లి సీన్‌తో హీరో కల్యాణ్ రామ్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా చెల్లెల్ని పెళ్లి చేయడం వల్ల కల్యాణ్ రామ్, చెల్లెలి కుటుంబంతో సహా బయటకు బెంగళూరుకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ కాజల్ అగర్వాల్‌తో పరిచయం జరుగుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారడం, ఆ తర్వాత ఇందు ఓ సమస్యలో ఇరుక్కోవడంతో కథ ఇంటర్వెల్‌కు చేరి కొత్త మలుపుతిరుగుతుంది.


  సెకండాఫ్

  ఇంటర్వెల్‌లో తర్వాత ఇందు కోసం వీరభద్రపురం గ్రామానికి వెళ్లడం, అక్కడి పరిస్థితలు చూసి కల్యాణ్ రామ్ చలించడం సినిమా రెండోభాగంలో చకచకా సాగిపోతుంటాయి. ఇక ఇందును పెళ్లి చేసుకోవడానికి ఎంఎల్ఏ కావాలనే షరతుతో కథ ఇంకో మలుపు తిరుగుతుంది. అలా గాడప్ప వేసే ఎత్తులకు కల్యాణ్ ఎలా పై ఎత్తులు వేశారనే సినిమా ముగింపుకు సమాధానం.


  తొలిచిత్ర దర్శకుడిగా

  దర్శకుడిగా ఉపేంద్ర మాధవ్‌‌కు ఇది తొలి సినిమా. పక్కా కమర్షియల్ హంగులతో, హీరోయిజానికి పెద్ద పీట వేసి రాసుకొన్న కథ ఇది. ఫ్యాక్షన్, పొలిటికల్, లవ్ లాంటి అంశాలను కలబోసిన ఊరమాస్ చిత్రం ఎంఎల్ఏ. అయితే దర్శకుడు తన తొలి చిత్ర కథను, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేదేమో. రెగ్యులర్ కథ అయినప్పటికీ.. కథనం, బలమైన సన్నివేశాలు లేకపోవడం, ఉన్న సీన్లలో పస లేకపోవడం ప్రేక్షకుడిని కొంత అసహనానికి గురిచేస్తుంది. తొలిభాగంలో కొంత బెటర్‌గా హ్యాండిల్ చేసినప్పటికీ.. రెండో భాగానికి వచ్చే సరికి కొంత గందరగోళానికి లోనైనట్టు కనిపిస్తాడు. తొలి చిత్రమైనా కమర్షియల్ సినిమా చేసే సత్తా ఉన్న దర్శకుడనే అభిప్రాయం మాత్రం కలుగుతుంది.


  కల్యాణ్ రామ్ యాక్టింగ్

  కల్యాణ్ రామ్‌కు ఈ సినిమా పక్కా యాప్ట్ సబ్జెక్ట్. గతంలో పటాస్‌కు కొంత ఎక్స్ టెన్షన్‌ అనే ఫీలింగ్ కలుగుతుంది. పలు రకాల షేడ్స్ ఉన్న కల్యాణ్ క్యారెక్టర్‌ను అవలీలగా పోషించాడు. లవర్ బాయ్‌గా, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా, చెడును ఎదురించడానికి ఎంతకైనా సాహసం చేసే వ్యక్తి పాత్రలో కల్యాణ్ రామ్ ఒదిగిపోయాడు. కేవలం నటనకే పరిమితం కాకుండా, డ్యాన్సులు, ఫైట్స్ ఇరగదీశాడు. కల్యాణ్ రామ్‌కు టైలర్ మేడ్ క్యారెక్టర్.


  కాజల్ అందం, అభినయం

  కాజల్ అగర్వాల్‌కు ఈ సినిమా కొట్టిన పిండే. తన కెరీర్‌లో 50కి పైగా సినిమాల్లో నటించినా.. ఇంకా గ్లామర్ విషయంలో ఇంకా ప్రెష్‌గా కనిపించారు. అందం, అభినయంతో ఆకట్టుకొన్నారు. ఆటపాటలతో కాజల్ మెప్పించారు. కీలకమైన సన్నివేశాల్లో భావోద్వేగాలను పలికించారు.


  మిగితా పాత్రల్లో

  మిగితా పాత్రల్లో కల్యాణ్ రామ్ చెల్లెలిగా టీవీ యాంకర్ లాస్య, బావగా వెన్నెల కిషోర్ నటించారు. కథలో పెద్దగా చెప్పుకోవాల్సిన ప్రాముఖ్యత లేని పాత్రలు వారివి. రవి కిషన్ పీఏలుగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, ప్రభాస్ శ్రీను నటించారు. జయప్రకాశ్, బ్రహ్మానందం తదితరుల పాత్రలు నామమాత్రంగానే మిగిలాయి.


  ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా

  ఎంఎల్ఏ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. పల్లె, పట్ణణ వాతావరణాలను ప్రతిబింబించేలా చక్కగా తెరకెక్కించారు. సెకండాఫ్‌లో మాస్ సీన్లను అద్భుతంగా చిత్రీకరించారు. అందమైన లోకేషన్లలో పాటల పిక్చరైజేషన్ బాగుంది.


  ఇంకా కత్తెరకు పని ఉంది

  మిగితా సాంకేతిక విషయాల్లో ఎడిటింగ్ విషయానికి వస్తే బీ తిమ్మరాజు చేతికి ఇంకా చాలానే పని మిగిలిందనే భావన కలుగుతుంది. సెకండాఫ్‌లో ఇంకా కొన్ని సీన్లను ఎడిట్ చేయాల్సిన అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది.


  మణిశర్మ మ్యూజిక్

  ఎంఎల్ఏ చిత్రానికి మణిశర్మ సంగీతం కల్యాణ్ రామ్ సినిమాకు మరోసారి ప్లస్ అయింది. సెకండాఫ్‌లో తన రీరికార్డింగ్‌తో కొన్ని సీన్లకు ఎనర్జీని కల్పించాడు. తాను స్వరపరిచిన పాటలు చాలా బాగున్నాయి.


  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు వారి అభిరుచికి అద్దంపట్టాయి. కథ, కథనాలపై మరింత జాగ్రత్త వహించి ఉంటే మరింత మెరుగైన ఫలితం వచ్చి ఉండేదేమో అని ఫీలింగ్ కలుగుతుంది.


  ఫైనల్‌గా

  కల్యాణ్ రామ్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన చిత్రం ఎంఎల్ఏ. అన్నివర్గాల ప్రేక్షకులను టార్గెట్‌గా చేసుకోవడం వల్ల కథలో వేరియేషన్స్ ఎక్కువైనట్టు అనిపిస్తాయి. కొంత గందరగోళంగా అనిపిస్తాయి. ఇలాంటివి మినహాయిస్తే.. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే మాస్ ఎంటర్ టైనర్. అన్నివర్గాల ప్రేక్షకులు ఆదరిస్తే ఎంఎల్ఏ చిత్రం కల్యాణ్ రామ్ మంచి సక్సెస్ ఫుల్ చిత్రమవ్వడం ఖాయం.


  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  కళ్యాణ్ రామ్‌, కాజల్‌ యాక్టింగ్
  బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  ఫస్టాఫ్


  మైనస్ పాయింట్స్ :
  టెకింగ్
  రెగ్యులర్ కథ
  పేలవమైన స్క్రీన్ ప్లే
  రొటీన్ కామెడీ
  సెంకడాఫ్‌లో లెంగ్త్


  తెర వెనుక, తెర ముందు

  నటీనటుల : కళ్యాణ్‌ రామ్‌, కాజల్‌ అగర్వాల్‌, రవి కిషన్, థర్టీ ఇయర్స్ పృథ్వీ, మురళీ మనోహర్, అజయ్, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, మనాలీ రాథోడ్‌ తదితరులు
  సంగీతం : మణిశర్మ
  దర్శకత్వం : ఉపేంద్ర మాధవ్‌
  నిర్మాత : కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి, టీజీ విశ్వ ప్రసాద్‌
  రిలీజ్ డేట్: మార్చి 23, 2018


  English summary
  Kalyan Ram's MLA, short for Manchi Lakshanulla Abbayi, is all set to the hit the screens this Friday. The actor assures his audience that the film, which is set in a political backdrop, is an out-and-out entertainer. Kajal Agarwal is the Heroine. MLA movie set to release on March 23. In this occassion, Telugu Filmibeat brings exclusive review for ..
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more