Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Mukhachitram movie review ప్రియ వడ్లమాని స్టన్నింగ్ ఫెర్ఫార్మెన్స్.. అదిరిపోయేలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్!
Rating: 2.75/5
నటీనటులు - వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్, విశ్వక్ సేన్ తదితరులు
కథ స్క్రీన్ ప్లే: మాటలు: సందీప్ రాజ్
దర్శకత్వం: గంగాధర్
నిర్మాతలు: ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల
సంగీతం: కాల భైరవ
ఎడిటింగ్: పవన్ కళ్యాణ్
సమర్పణ: ఎస్ కేఎన్
రిలీజ్ డేట్: 2022-12-09
రాజ్ కుమార్ (వికాస్ విశిష్ట), అతడి స్నేహితుడు (చైతన్య రావ్) ప్లాస్టిక్ సర్జన్స్. చిన్ననాటి స్నేహితురాలు మాయ అంటే రాజ్‌కుమార్‌కు ఇష్టం. తమ ప్రేమను ఎప్పడూ బయటకు చెప్పుకోరు. అయితే సంప్రదాయ బ్రహ్మణ కుటుంబానికి చెందిన మహితి ఫోటోను చూసి కట్నం లేకుండా పెళ్లి చేసుకొంటాడు. పెళ్లికి ముందు రాజ్ కుమార్‌పై ఉన్న ప్రేమను మాయ బయటకు చెప్పి బాధపడుతుంది. అయితే ఊహించిన విధింగా మాయ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడటంతో ముఖం ఛిద్రం అవుతుంది. అదే సమయంలో మహతి మరణించడంతో ఆమె ముఖాన్ని మాయకు పెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన ముఖానికి మహితి రూపాన్ని కలిగించిన రాజ్‌కుమార్‌తో సహజీవనం చేస్తుంటుంది. అయితే ఓ విషయం కారణంగా రాజ్‌కుమార్‌పై కోర్టులో కేసు దాఖలు చేస్తుంది.
గ్రామీణ ప్రాంతానికి చెందిన మహతిని రాజ్‌కుమార్ ఏరి కోరి పెళ్లి చేసుకొన్నాడు? మాయపై ప్రేమ ఉన్నప్పటికీ ఎందుకు ప్రపోజ్ చేయలేదు. రాజ్ కుమార్‌ను పెళ్లి చేసుకొన్న తర్వాత మహితికి ఎదురైన సమస్యలు ఏమిటి? తనకు అత్యంత ఇష్టమైన రాజ్‌కుమార్‌పై మహతి రూపంలో ఉన్న మాయ ఎందుకు కేసు ఫైల్ చేసింది? మాయ రూపంలో ఉన్న మహతికి లాయర్ విశ్వ (విశ్వక్ సేన్) ఎందుకు హెల్ప్ చేయాలనుకొంటాడు? కోర్టులో సీనియర్ లాయర్ (రవిశంకర్)కు విశ్వకు మధ్య ఎలాంటి కోర్టు డ్రామా నడిచింది. రాజ్‌కుమార్‌పై మాయ పెట్టిన రేప్ కేసులో ఎలాంటి తీర్పు వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే ముఖచిత్రం.

ప్లాస్టిక్ సర్జరీ పాయింట్‌ను ఎమోషనల్ స్టోరిగా డెవలప్ చేయడంలో దర్శకుడు గంగాధర్ సక్సెస్ అయ్యాడు. అయితే కథలోకి వెళ్లడానికి కాస్త సమయం తీసుకోవడం కనిపిస్తుంది. అయితే తొలి భాగంలో కథను డిటేయిల్‌గా చెప్పడానికి కొన్ని అవసరం సీన్లతో సాగదీసినట్టు కనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్‌కు ముందు ఓ భావోద్వైగమైన పాయింట్‌తో కథను మలుపుతిప్పడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. అయితే సెకండాఫ్‌లో ఉండే ట్విస్టు గుండెను పిండేస్తుంది. అయితే కథ ఎమోషనల్‌గా ఎండింగ్ అవుతుందని అనుకొనే సమయంలో వకీల్ సాబ్ సినిమా ఇంపాక్ట్‌తో కోర్టు డ్రామాను నడపడం కథలో ఉండే ఇంటెన్సిటీ తేలిపోయినట్టు అనిపిస్తుంది. కాకపోతే కోర్టు డ్రామా సినిమాను మరో జోనర్‌లోకి తీసుకెళ్లిందా అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఇక ముఖ చిత్రం సినిమాలో నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. మహతి పాత్రలో ప్రియ వడ్లమాని తన ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. ఎవరూ ఊహించని పాత్రలో రకరకాల వేరియేషన్ ఉన్న రోల్‌లో ప్రియ వడ్లమాని అందర్నీ సర్‌ప్రైజ్ చేయడమే కాకుండా థ్రిల్ చేస్తుంది. ఈ సినిమాను ప్రియ తన భుజాలపై మోసిందని చెప్పవచ్చు. మహతి పాత్రను పవర్‌ఫుల్‌గా మార్చడంలో ప్రియ మెచ్యురిటీ ఫెర్ఫార్మెన్స్ తోడైందని చెప్పవచ్చు. ఇక ప్రియ వడ్లమానితో రాజ్ కుమార్ పాత్రలో వికాస్ వశిష్ట పోటీ పడి నటించాడు. నెగిటివ్ షేడ్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. చైతన్య రావ్ తనదైన శైలిలో కామెడీని పండించాడు. మాయగా ఆయేషా ఖాన్ ఫర్వాలేదనిపిస్తుంది. బోల్డ్ పాత్రలో యూత్‌ను ఆకట్టుకొనే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు.
ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాకు కాలభైరవ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. థ్రిల్లర్ మూవీకి కావాల్సిన మూడ్‌ను క్రియేట్ చేయడంలో బీజీఎంది కీలక పాత్ర పోషించింది. మిగితా విభాగాల పనితీరు బాగుంది.
డిఫరెంట్ జోనర్‌తో క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో ప్రేమకథగా రూపొందిన చిత్రం ముఖచిత్రం. నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. కథను ఎమోషనల్‌గా చెప్పే తీరు ఆకట్టుకొంటుంది. లవ్, యూత్, రొమాంటిక్, థ్రిల్లర్ అంశాలు కథకు ప్లస్ పాయింట్. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ప్రియా వడ్లమాని, వికాస్ లాంటి యువ హీరో హీరోయిన్లు ప్రేక్షకులను మెప్పిస్తారు. వారాంతంలో మంచి థ్రిల్ పొందడానికి ఈ సినిమా మంచి ఆఫ్షన్.