For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా పేరు సూర్య సినిమా రివ్యూ: అల్లు అర్జున్ వన్‌మ్యాన్ షో!

  By Rajababu
  |

  Recommended Video

  Naa Peru Surya Moive Review నా పేరు సూర్య సినిమా రివ్యూ

  Rating:
  3.0/5
  Star Cast: అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్, అర్జున్ సర్జా
  Director: వక్కంతం వంశీ

  సరైనోడు, దువ్వాడ జగన్నాథం లాంటి సక్సెస్‌లతో దూసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన చిత్రం నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఈ చిత్రం కోసం కథా, మాటల రచయిత వక్కంత వంశీ తొలిసారి దర్శకుడిగా మారారు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో స్టైలిష్ స్టార్‌ను యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ఆవిష్కరించారు. సినిమా రిలీజ్‌కు ముందు రిలీజైన టీజర్లు, ట్రైలర్లకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డుస్థాయిలో జరిగింది. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన నా పేరు సూర్య.. అల్లు అర్జున్‌కు మరో సక్సెస్‌ను అందించిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

   నా పేరు సూర్య కథ

  నా పేరు సూర్య కథ

  భారత సైన్యంలో సూర్య (అల్లు అర్జున్) ఓ సైనికుడు. సమాజంలో ఎవరైనా చిన్న తప్పు చేసినా సహించని వ్యక్తిత్వం. కోపమే అతనికి ఆయుధం. దేశ సరిహద్దులో విధులు నిర్వహించాలనే ఓ కోరిక ఉంటుంది. కానీ ఓ కారణంగా సైన్యం నుంచి సూర్యను కల్నల్ (బోమన్ ఇరానీ) బయటకు పంపిస్తారు. అయితే సూర్యలో ఉన్న మంచి తనాన్ని చూసి ఓ మరో ఛాన్స్ ఇవ్వమని కల్నల్‌కు తన గాడ్ ఫాదర్ (రావు రమేష్) కోరుతాడు. దాంతో కన్విన్స్ అయిన కల్నల్ సూర్యకు అవకాశం ఇస్తాడు. కానీ వైజాగ్‌లో ఉన్న మానసిక వైద్యుడు రామక‌ృష్ణంరాజు (అర్జున్) సంతకం తీసుకొస్తే మళ్లీ సైన్యంలో చేర్చుకొంటానని సూర్యకు ఓ షరతు విధిస్తాడు. అంతేకాకుండా తన కోపం తగ్గించుకోవడానికి 21 రోజుల గడువు విధిస్తాడు.

  కథలో కీలక మలుపు

  కథలో కీలక మలుపు

  రామకృష్ణంరాజు వద్దకు వెళ్లిన సూర్య 21 రోజుల అతడి నుంచి సంతకం తీసుకొన్నాడా? సూర్య జీవితంలో తన ప్రేయసి వర్ష (అను ఇమ్మాన్యుయేల్) పాత్ర ఏమిటి? సూర్య, జ్యోతి మధ్య బ్రేకప్ ఎందుకు జరిగింది? 21 రోజుల్లో తన కోపాన్ని తగ్గించుకొన్నాడా? రామకృష్ణంరాజుకు సూర్యకు ఉన్న రిలేషన్ ఏమిటీ? రామకృష్ణంరాజుకు సూర్య ఎందుకు దూరమయ్యాడు? రావు రమేష్ ఎందుకు గాడ్‌ఫాదర్‌గా మారాడు? 21 రోజుల్లో సూర్యకు ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే నా పేరు సూర్య చిత్ర కథ.

  ఫస్టాఫ్ స్క్రిప్టు రివ్యూ

  ఫస్టాఫ్ స్క్రిప్టు రివ్యూ

  తొలి భాగంలో ఎక్కువ భాగం సూర్య క్యారెక్టరైజేషన్‌కే ప్రాముఖ్యత ఇచ్చారు. సూర్య పాత్రను డిజైన్ చేసిన విధానం చక్కగా ఆకట్టుకొంటుంది. ప్రధానంగా కొపిష్టి అయిన సూర్య దేశం కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడే అనే అంశం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ఫైట్స్, ఎమోషన్ సీన్లు ఫస్టాఫ్‌కు బలంగా మారాయి. ఇక తండ్రి రాఘురామకృష్టంరాజు, సూర్య మధ్య సాగే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు సినిమాను మరోస్థాయికి చేర్చాయి. కాకపోతే కథా గమనం కాస్త నెమ్మదించడం ప్రేక్షకుడిని ఇబ్బందికి గురిచేస్తాయి.

  సెకండాఫ్ స్క్రిప్టు రివ్యూ

  సెకండాఫ్ స్క్రిప్టు రివ్యూ

  ఇక రెండో భాగంలో సూర్య తన కోపాన్ని తగ్గించుకునే అంశాలు మరింత ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే బాగుండేది. కోపం అనే ఒక పాయింట్‌ను చాలా రొటీన్‌గా నడిపించడం, సాగదీయడం వలన మేకింగ్‌లో కొత్తదనం కనిపించలేదు. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా శుభం కార్డు వరకు వచ్చే సీన్లకు అల్లు అర్జున్ ప్రాణం పోశాడు. ఎప్పడూ కమర్షియల్ అంశాలతో రఫ్ ఆడించే అల్లు అర్జున్ ఈసారి భారమైన పాత్రను, భావోద్వేగమైన కథను ఏకంగా తన భుజాలపై మోసి న్యాయం చేశాడు. దర్శకుడు వక్కంతం వంశీ స్క్రిప్టు మరింత కసరత్తు చేసి ఉంటే సినిమా రేంజ్ ఊహించడానికి సాధ్యపడి ఉండేది కాదు.

  వక్కంతం వంశీ టేకింగ్

  వక్కంతం వంశీ టేకింగ్

  ఎన్నో విజయవంతంమైన సినిమాలకు కథను అందించిన వక్కంతం వంశీ ఈసారి దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తాడు. ఓ రైటర్ డైరెక్టర్‌గా మారడంటే అందరి దృష్టి అతడి మీదే ఉంటుంది. అల్లు అర్జున్‌తో సినిమా అంటే అంచనాలు భారీగా పెరిగిపోతాయి. ఈ సినిమాకు సంబంధించిన వక్కంతం వంశీకి అదే సమస్యగా మారిందనిపిస్తుంది. విభిన్నమైన పాయింట్‌తో అల్లు అర్జున్‌ను కొత్త కోణంలో చూపించడానికి చేసిన ప్రయత్నం ప్రశంసించదగినట్టే. కానీ కథను ఒక ఫ్లోలో నడిపించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. కథ, కథనాలు, ఇతర క్యారెక్టర్లపై క్లారిటీ మరింత మెరుగ్గా ఇవ్వాల్సింది. కథలో ప్రేక్షకుడిని మెప్పించదగిన ఆత్మను దర్శకుడు మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా ఎండింగ్‌లో వచ్చే అన్వర్ ఎపిసోడ్‌తో తన తడబాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. కానీ సినిమా పుంజుకోవడానికి అది సరిపోయేంత లేకపోవడం ఓ మైనస్.

  అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్

  అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్

  అల్లు అర్జున్ ఎప్పటిలానే ఫైట్లు, పాటలతో అలరించాడు. ఆకట్టుకొన్నాడు. నా పేరు సూర్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ, కోణంలోనూ తప్పు పట్టే పరిస్థితి కనిపించదు. ఎంటర్‌టైన్‌మెంట్ కాదు.. భారమైన కథలను ఒంటిచేత్తో ముందుకు తీసుకుపోయే సత్తా ఉందని ఈ చిత్రం ద్వారా నిరూపించాడు. ఎమోషన్స్ అద్భుతంగా పలికించాడు. ఇంటర్వెల్‌కు ముందు, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ అల్లు అర్జున్ నటనకు అద్దంపట్టాయి. అను ఇమ్మాన్యుయేల్‌తో కెమిస్ట్రీ అంతగా వర్కవుట్ కాకపోవడం ఓ మైనస్ అని చెప్పవచ్చు.

  అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్

  అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్

  వర్షగా కనిపించిన అను ఇమ్మాన్యుయేల్‌కు పెద్దగా పేరు తెచ్చే పాత్ర కాదని చెప్పవచ్చు. ఆట, పాటలకే పరిమితమైనప్పటికీ.. అందించిన వచ్చిన కొన్ని కీలక సన్నివేశాల్లో తనదైన నటనను చూపించే ప్రయత్నం చేసింది. కథపై ఎలాంటి ప్రభావం చూపించే పాత్ర కాకపోవడంతో పెద్దగా ప్రేక్షకుల ఆదరణ పొందడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. పాటల్లో అందంతో ఆకట్టుకొన్నది. దాంతో కేవలం గ్లామర్ తారగానే మిగిలిపోయింది.

  కీలక పాత్రల్లో అర్జున్, నదియా

  కీలక పాత్రల్లో అర్జున్, నదియా

  నా పేరు సూర్య చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ మరోసారి కీలకమైన పాత్రలో నటించాడు. రామకృష్ణంరాజుగా ఎమోషనల్ రోల్‌లో కనిపించాడు. తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణకు లోనయ్యే పాత్రలో మెరిసాడు. ఇంటర్వెల్‌కు ముందు, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సీన్లలో అర్జున్ తన నటనతో అదరగొట్టాడు. తన పాత్రతో సినిమాకు అదనపు ఆకర్షణగా మారారు. అర్జున్‌కు భార్యగా నటించిన నదియా నామమాత్రపు పాత్రనే అని చెప్పవచ్చు.

  మిగితా పాత్రల్లో

  మిగితా పాత్రల్లో

  ఈ చిత్రంలో విలన్ పాత్రల్లో శరత్ కుమార్, ప్రదీప్ రావత్, అనూప్‌ థాకూర్‌ సింగ్‌ నటించారు. విలన్‌గా శరత్ కుమార్ తన మార్కును చూపించారు. బోమన్ ఇరానీ, రావు రమేష్, పోసాని కృష్ణమురళీ తదితరుల పాత్రలు సినిమా కథకు మద్దతుగా నిలిచాయి.

  విశాల్, శేఖర్ మ్యూజిక్

  విశాల్, శేఖర్ మ్యూజిక్

  నా పేరు సూర్యకు బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్, శేఖర్ మ్యూజిక్ అందించారు. కీలక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకొన్నది. కానీ వారి సంగీతం సినిమా నెటివిటికి దూరంగా ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సాంగ్, చివర్లో వచ్చే రొమాంటిక్ సాంగ్ తెర మీద ఆకట్టుకొన్నాయి. అయితే ఇటీవల బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సినిమాలకు ధీటుగా మ్యూజిక్ లేకపోవడం కొంత నిరాశకు గురిచేస్తుంది.

  సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్

  సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్

  రాజీవ్ రవి, సుశీల్ చౌదరీ అందించిన సినిమాటోగ్రఫీ చిత్రానికి ఎస్సెట్. మిలటరీ బ్యాక్ డ్రాప్ కథకు అవసరమైన మూడ్ క్రియేట్ చేయడంలో వారి కెమెరా వర్క్ నూటికి నూరు శాతం ఉపయోగపడింది. ఈ సినిమాకు వెన్నముకగా నిలిచిన యాక్షన్ సీన్లను అద్భుతంగా చిత్రీకరించారు. అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ ఫైట్, ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్. ఈ సినిమాకు ఎడిటింగ్ బాధ్యతుల అందించిన కోటగిరి వెంకటేశ్వరరావుకు ఇంకా కొంత పని ఉందని అనిపించింది.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  నా పేరు సూర్య చిత్రానికి లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు, నాగబాబు నిర్మాతలుగా వ్యవహరించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో అత్యుత్తమ ప్రమాణలను పాటించడం సినిమాకు బలంగా మారాయి. మిలటరీ నేపథ్యం ఉన్న సన్నివేశాలను చాలా రిచ్‌గా తెరకెక్కించారు. యాక్షన్ ఎపిసోడ్స్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  సరిహద్దులో ఉండే శత్రువుల కంటే దేశంలో ఉండే దుష్టశక్తులే ప్రమాదకరం అనే విభిన్నమైన పాయింట్‌తో దర్శకుడు వక్కంత వంశీ తెరకెక్కించాడు. కథకు అనుగుణంగా ఆకట్టుకొనే డైలాగ్స్‌ను రాసుకోవడంలో వంశీ సక్సెస్ అయ్యారు. కానీ ఓ భావోద్వేగాలకు గురిచేసే అంశాలు ఉన్న ఈ కథలో బలమైన సన్నివేశాలను మరింత మెరుగ్గా రాసుకొంటే భారీ విజయాన్ని అందుకొనే అవకాశం ఉండేది. అయితే సినిమా రిలీజ్‌కు ముందే హిట్ టాక్‌ను సొంతం చేసుకొన్న నా పేరు సూర్య చిత్రం సక్సెస్ ఏ రేంజ్ అనేది వారాంతంలో స్పష్టమవుతుంది. ఓవర్సీస్‌లో, బీ, సీ సెంటర్లలో ప్రేక్షకాదరణ పొందింతే కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. అల్లు అర్జున్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవడం తథ్యం.

   బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  • అల్లు అర్జున్ ఆల్ రౌండ్ ప్రతిభ
  • అర్జున్ సర్జా యాక్టింగ్
  • శరత్ కుమార్ విలనిజం
  • కథ
  • యాక్షన్ సీన్లు
  • మైనస్ పాయింట్స్

   • సెకండాఫ్
   • స్క్రీన్ ప్లే
   • సంగీతం
   • ఎడిటింగ్
   • తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్, అర్జున్ సర్జా, శరత్ కుమార్, ఠాకూర్ అనూప్ సింగ్, రావు రమేష్, బోమన్ ఇరానీ, పోసాని తదితరులు
    కథ, మాటలు, స్క్రిన్ ప్లే, దర్శకత్వం: వక్కంతం వంశీ
    నిర్మాతలు: లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు, నాగబాబు
    సంగీతం: విశాల్, శేఖర్
    సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి, సుశీష్ చౌదరీ
    ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
    బ్యానర్: రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
    రిలీజ్ డేట్: 4 మే, 2018
    నిడివి: 168 నిమిషాలు

  English summary
  Naa Peru Surya, Naa Illu India is Telugu language action film written and directed by Vakkantam Vamsi. Produced by Shirisha and Sridhar Lagadapati under the banner Ramalakshmi Cine Creations, it stars Allu Arjun and Anu Emmanuel in the lead roles. This movie released on May 4th, 2018. In this occassion, Telugu Filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X