Just In
- 2 min ago
18 నెలల కాపురం.. ప్రెగ్నెన్సీ కూడా.. లాక్డౌన్లో ఆ కారణంగా డిప్రెషన్: నాగార్జున షాకింగ్ కామెంట్స్
- 52 min ago
అక్కడి టాటూను పవన్ చూశారు.. ఆఫర్ చేయడంతో రెండు గంటలు: ఆ ఫోటోతో మేటర్ రివీల్ చేసిన అషు రెడ్డి
- 1 hr ago
ప్రియుడి పేరును బయట పెట్టిన యాంకర్ శ్రీముఖి: తన క్రష్ ఎవరో కూడా రివీల్ చేసిన రాములమ్మ
- 11 hrs ago
ఓ వైపు సాయి పల్లవి, మరోవైపు శేఖర్ కమ్ముల.. ఏదైనా నాగచైతన్యకు లాభమే!
Don't Miss!
- News
తండ్రి బాటకు భిన్నంగా: షర్మిల పార్టీ పేరు మారుతోందా?: రెండు కొత్త పేర్లు: ప్లేస్, డేట్ ఫిక్స్
- Sports
పిచ్‌ను నిందించడం, ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకోవడం మానేయండి! బ్యాటింగ్‌పై దృష్టిపెట్టండి: కేపీ
- Finance
సెంట్రల్ బ్యాంకు కొత్త MD & CEOగా తెలుగు వ్యక్తి
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి వ్యాపారులు ఈరోజు ఆర్థిక నష్టాన్ని భరించాలి...!
- Automobiles
ఫిబ్రవరిలో టీవీఎస్ అమ్మకాల హవా.. మళ్ళీ పెరిగిన అమ్మకాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాంది మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మూవీ: నాంది
నటీనటులు: అల్లరి నరేష్, వరలక్ష్కీ శరత్ కుమార్, ప్రియదర్శి పులికొండ, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, సీవీఎల్, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ వర్మ తదితరులు
దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: సతీష్ వెగేశ్న
మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫి: సిద్
డైలాగ్స్: అబ్బూరి రవి
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
బ్యానర్: ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్

నాంది మూవీ కథ
బండి సూర్య ప్రకాశ్ ( అల్లరి నరేష్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తలిదండ్రులు, భార్యతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటారు. జీవితం హ్యాపీగా సాగిపోతుంటే పౌరహక్కుల నాయకుడు, అడ్వకేట్ రాజ్‌గోపాల్ (సీవీఎల్ నరసింహరావు) హత్య కేసులో సూర్య ప్రకాశ్‌ను ఏసీపీ కిషోర్ (హరీష్ ఉత్తమన్) అరెస్ట్ చేసి జైలుకు పంపుతాడు. ఐదేళ్ల తర్వాత సూర్య ప్రకాశ్‌ను విడిపించేందుకు లాయర్ ఆధ్య (వరలక్ష్మి శరత్ కుమార్) కేసును టేకప్ చేసుంది.

నాంది మూవీ ట్విస్టులు
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సూర్య ప్రకాశ్ ఎందుకు జైలుకు వెళ్లాడు? సూర్య ప్రకాశ్‌ను ఏసీపీ కిషోర్ ఎందుకు టార్గెట్ చేశారు. రాజ్ గోపాల్ హత్య కేసుకు మాజీ హోమంత్రి నాగేందర్ (వినయ్ వర్మ)కు లింక్ ఏమిటి? సూర్య ప్రకాశ్ నిర్ధోషి అని లాయర్ ఆద్య ఎందుకు వాదించడానికి ముందుకు వచ్చింది? ఈ కేసులో సూర్య ప్రకాశ్‌కు న్యాయం జరిగిందా? న్యాయాన్ని పొందేందుకు ఎలాంటి కష్టాలను సూర్య ప్రకాశ్, ఆద్య ఎదుర్కొన్నారనే ప్రశ్నలకు సమాధానమే నాంది చిత్ర కథ.

నాంది ఫస్టాఫ్ రివ్యూ
నాంది చిత్రం తొలి భాగానికి వస్తే.. సూర్య ప్రకాశ్ తన కుటుంబంతో అన్యోన్యంగా గడపడం, భార్య మీనాక్షితో రొమాంటిక్ లైఫ్ గడిపే అంశాలతో కథ ఫీల్ గుడ్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత అనూహ్యంగా కథ మలుపు తిరుగుంది. స్యూర్య ప్రకాశ్ జీవితంలో ఊహించిన సంఘటనలు చోటు చేసుకోవడం కథ మరో లెవెల్‌కు వెళ్తుంది. తొలి భాగంలో కథ అనేక మలుపు తిరుగుతూ ప్రేక్షకుడిని థ్రిల్‌కు, భావోద్వేగానికి గురి చేస్తుంది.

నాంది సెకండాఫ్ రివ్యూ
ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. లాయర్ ఆద్య పాత్రతో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంట్రీతో కథా స్వరూపమే మారిపోతుంది. కథనం ఊపందుకోవడం, ఎమోషనల్ కంటెంట్‌తో సన్నివేశాలు ఉండటంతో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మరింత పెరుగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. కాకపోతే కథా గమనం కాస్త మందగించినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొంత రొటీన్‌గా కథ సాగుతుంది. ఇలాంటి విషయాలు మినహాయిస్తే నాంది చిత్రం ఓ డిఫరెంట్ చిత్రంగా తృప్తి, సంతృప్తిని కలిగిస్తుంది.

దర్శకుడు విజయ్ కనకమేడల ప్రతిభ
దర్శకుడు విజయ్ కనకమేడల రాసుకొన్న కథ, కథనాలు సినిమాకు ఆయువు పట్టు. సన్నివేశాలు, డైలాగ్స్‌పై చేసిన కసరత్తు ఫలితం తెరమీద అద్భుతంగా కనిపిస్తుంది. సెక్షన్ 211 గురించిన క్లిష్టమైన అంశాన్ని సాధారణ ప్రేక్షకుడికి అర్ధం అయ్యేలా చెప్పిన విధంతోనే సినిమా సక్సెస్ స్పష్టమైంది. కథలో ఎక్కడా లోపాలు లేకుండా... న్యాయశాస్త్రంలోనే అంశాలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ తీరును తెర మీద చూపించిన తీరుకు విజయ్ కనకమేడలను అభినందించాల్సిందే. చాలా రోజుల తర్వాత తెలుగులో అద్భుతమైన కోర్టు డ్రామాను ప్రేక్షకులకు అందించారనే చెప్పవచ్చు.

అల్లరి నరేష్ థ్రిల్లింగ్ ఫెర్ఫార్మెన్స్
ఇక గతంలో కమెడియన్‌గా కాకుండా వైవిధ్యమైన పాత్రలను చేసేందుకు అల్లరి నరేష్ ప్రయత్నించినా సరైనా ఫలితం అందలేదు. కానీ నాంది చిత్రంలోని బండి సూర్య ప్రకాశ్ పాత్ర నటుడిగా నరేష్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది. ప్రతీ ఫ్రేమ్‌లో అల్లరి నరేష్ కాకుండా ఓ ఫెర్ఫార్మర్ కనిపిస్తాడు. ఈ పాత్ర కోసం నరేష్ తీసుకొన్న నటనపరమైన జాగ్రత్తలు, హావభావాలు ఆయనను గొప్ప నటుడిగా ఆవిష్కరించేలా ఉన్నాయి. నాంది చిత్రం నరేష్ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పవచ్చు. అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్ గురించి ఎంత రాసినా తక్కువే అనిపిస్తుంది. తెర మీద చూస్తే దాని మజా తెలుస్తుంది.

వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంట్రీతో
ఇక నాంది చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ప్రవేశించిన తర్వాత సినిమా లెవెల్ ఊహించని విధంగా మారిపోతుంది. యాక్షన్‌తో కూడిన సన్నివేశాలు, భావోద్వేగంతో సాగే అంశాలకు వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర వేదికగా మారింది. ఇప్పటి వరకు నెగిటివ్ షేడ్స్‌తో మెప్పించిన వరలక్ష్మి నాంది చిత్రంతో ఫీల్‌గుడ్ ఫెర్ఫార్మర్‌గా కనిపిస్తుంది. నాంది చిత్రానికి ఆద్య పాత్ర వెన్నెముక లాంటిదని చెప్పవచ్చు.

ఇతర పాత్రల్లో నటీనటులు
నాంది చిత్రంలో ఇతర పాత్రల విషయానికి వస్తే.. ప్రతీ ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారు. నరేష్ తండ్రిగా దేవీ శ్రీ ప్రసాద్, మామగా ఆనంద చక్రపాణి తొలి భాగంలో తమ నటనతో ఆకట్టుకొన్నారు. ఇక కమెడియన్లు ప్రియదర్శి, ప్రవీణ్ కామెడీతోపాటు భావోద్వేగాన్ని పండిచారు. మాజీ హోమంత్రిగా వినయ్ వర్మ, ఏసీపీగా హారీష్, లాయర్‌గా శ్రీకాంత్ అయ్యంగార్, ఇతర చిన్న పాత్రలను పోషించిన వారు బ్రహ్మండంగా తమ నటనా ప్రతిభను ప్రదర్శించారు.

సాంకేతిక విభాగాల పనితీరు
టెక్నికల్ విభాగంలో మంచి ప్రతిభను చూపిన వారిలో ఎడిటర్ చోటా కే ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సిధ్ పనితీరు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. శ్రీచరణ్ పాకాల తన రీరికార్డింగ్‌తో సన్నివేశాలను మరింత ఎలివేట్ చేశారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ క్రీస్పిగా సినిమాను చకచకా నడిపించింది. సాంకేతిక విభాగాల్లో అన్ని డిపార్ట్‌మెంట్స్ క్వాలిటీ వర్క్‌ను తెరపైన చూపించారు.

సతీష్ వెగేశ్న ప్రొడక్షన్ వ్యాల్యూస్
ఇక నాంది లాంటి ఎమోషనల్ కథను నమ్మి తెర రూపం కల్పించిన సతీష్ వెగ్నేశను ముందుగా అభినందించాలి. ఈ సినిమాను తెరకెక్కించి విధానం, పాత్రలకు నటీనటులను ఎంపిక చేసిన విధానం వల్ల సినిమా మరో రేంజ్‌కు వెళ్లింది. ప్రతీ చిన్న పాత్రకు ఎంపిక చేసిన నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకొన్న విధానం బాగుంది. నిర్మాతగా సతీష్ వెగేశ్న ఉత్తమ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారని చెప్పవచ్చు.

ఫైనల్‌గా
నాంది చిత్రం ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 211 ఆధారంగా నడిచే కథ. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. సరియైన ఆలోచనతో న్యాయం రాబట్టుకోవడం మంచి పాయింట్‌తో సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చారు. కుటుంబ విలువు, న్యాయవ్యవస్థలోని బలాలు, బలహీనతలను తెర మీద అద్భుతంగా చూపించారు. అలాగే రాజకీయాల్లోని అవినీతి, అక్రమాలపై సంధించిన అస్త్రం నాంది.
విజయ్ కనకమేడల, సతీష్ ప్రయత్నాన్ని నిజంగా అభినందించాల్సిన విషయం. కోర్టు డ్రామా, యాక్షన్, ఎమోషనల్ కంటెంట్ చిత్రాలను ఆస్వాదించే ప్రేక్షకులకు నాంది కేరాఫ్ అడ్రస్. ఈ చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలే కాకుండా కలెక్షన్ల పరంగా మంచి కమర్షియల్ సక్సెస్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.