»   » రానా ఔట్ : నాగ చైతన్యతో రామానాయుడి సినిమా

రానా ఔట్ : నాగ చైతన్యతో రామానాయుడి సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Naga Chaitanya with Ramanaidu
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత రామానాయుడు తన మనవడు నాగ చైతన్య (కూతురు కొడుకు)హీరోగా సినిమా చేయబోతున్నాడు. పంజాబీ హిట్ మూవీ 'సింగ్ వర్సెస్ కౌర్' చిత్రానికి రీమేక్ గా రూపొందబోయే ఈ చిత్రాన్ని తమ సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌పై నిర్మించబోతున్నారు.

వాస్తవానికి ఈచిత్రాన్ని తొలుత తన మరొక మనమవడు రానా(సురేష్ బాబు కొడుకు)తో చేయాలని అనుకున్నప్పటికీ, రానా ప్రస్తుతం 'బాహుబలి', 'రుద్రమదేవి' చిత్రాలతో బిజీగా ఉండటంతో ఆ చిత్రాన్ని నాగ చైతన్యతో తీయాలని నిర్ణయించారు. ఈ సంవత్సరాంతానికి ఈ చిత్రం సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. దర్శకుడు, హీరోయిన్ ఇతర వివరాలు ఖరారు కావాల్సి ఉంది.

'సింగ్ వర్సెస్ కౌర్' చిత్రాన్ని పంజాబీలో నిర్మించింది కూడా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థనే. 'భారతీయ భాషలన్నింటిలోనూ సినిమాలు నిర్మించి నెంబర్ వన్ నిర్మాత అనుకోవాలనే లక్ష్యాన్ని పంజాబీ చిత్రం అయిన 'సింగ్ వర్సెస్ కౌర్' తో రీచ్ అయ్యారు రామానాయుడు.

నాగ చైతన్య విషయానికొస్తే....ఈ సంవత్సరం చైతు తన ఇద్దరు తాతయ్యలతో కలిపే పని చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ 'మనం' మొదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఏఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్యలు నిజ జీవిత పాత్రల్లో తాత, తండ్రి, మనవడుగా నటిస్తున్నారు. ఇదే సంవత్సరం మరో తాతయ్య రామానాయుడుతో కలిసి సినిమా చేసే అవకాశం దక్కడం విశేషం.

English summary
Naga Chaitanya signed a film for his maternal grandfather Daggubati Ramanaidu. It is remake of Punjabi cinema with romantic comedy Singh v/s Kaur starring Gippy Grewal, Surveen Chawla, Japji Khaira and Binnu Dhillon in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu