twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సవ్యసాచి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Savyasachi Movie Review సవ్యసాచి మూవీ రివ్యూ

    Rating:
    2.5/5
    Star Cast: నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్ మాధవన్, భూమిక, వెన్నెల కిషోర్
    Director: చందు మొండేటి

    శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ అందిస్తున్న చిత్రం సవ్యసాచి. శైలజారెడ్డి అల్లుడు చిత్ర సక్సెస్ అనంతరం యువ సామ్రాట్ నాగచైతన్య అక్కినేని నటించిన చిత్ర కావడంతో అంచనాలు పెరిగాయి. ప్రేమమ్ తర్వాత రెండోసారి జతకట్టిన నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి మరో హిట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీస్‌కు నాలుగో బ్లాక్ బస్టర్‌ను అందించిందా? మళ్లీ ఈ చిత్రం చైతూని సక్సెస్ ట్రాక్‌పై పరుగులు పెట్టించిందా? చందు మొండేటి సరికొత్త పాయింట్ ప్రేక్షకులను మెప్పించిందా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా గురించి సమీక్షించాల్సిందే.

    సవ్యసాచి కథ

    సవ్యసాచి కథ

    విక్రమ్ ఆదిత్య (నాగచైతన్య) వానిషింగ్ ట్వీన్ సిండ్రోమ్ (ఒకే దేహంలో ఇద్దరు) అనే అరుదైన వ్యాధితో బాధపడే యువకుడు. ఆనందంలో, ఆందోళన సమయంలో వ్యాధి కారణంగా తన రెండో చేయి తీవ్రంగా స్పందిస్తుంటుంది. చిత్ర అనే కాలేజ్ మేట్‌తో ప్రేమలో పడుతాడు. ఓ కారణంగా ఆరేళ్లు ఆమెకు దూరమవుతాడు. తనకు ఇష్టమైన అక్కకూతురు, బావ ఓ ప్రమాదంలో చనిపోతారు. తన అక్క తీవ్రంగా గాయపడటానికి, బావ మరణానికి కారణం ప్రమాదం కాదు. ఓ వ్యక్తి దుశ్చర్య కారణమని తెలుసుకొంటాడు.

    సవ్యసాచి కథలో ట్విస్టులు

    సవ్యసాచి కథలో ట్విస్టులు

    యాడ్ ఫిలిం మేకర్ అయిన విక్రమ్ ఆదిత్యకు ఉండే అరుదైన వ్యాధి అతడికి బలంగా మారిందా? బలహీనతగా మారిందా? విక్రమ్ కుటుంబాన్ని వెంటాడి మాధవన్ ఎందుకు ఇబ్బందులు పెట్టాడు? తన ప్రేయసి చిత్రకు విక్రమ్ ఆరేళ్లు ఎందుకు దూరమయ్యాడు? మాధవన్ దుశ్చర్యలను ఎలా అడ్డుకొన్నాడు? తన మేనకోడలు చనిపోలేదని, ఆ పాప మాధవన్ చెరలో ఉందని తెలుసుకొన్న విక్రమ్ ఆ చిన్నారిని ఎలా రక్షించుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే సవ్యసాచి సినిమా.

     ఫస్టాఫ్ విశ్లేషణ

    ఫస్టాఫ్ విశ్లేషణ

    హిమాచల్ ప్రదేశ్‌లో బస్సు ప్రయాణంతో మొదలయ్యే సినిమాలో ఓ ప్రమాదంతో కథపై ఆసక్తిరేపుతుంది. ప్రథమార్థంలో వినోదాన్ని ప్రధానంగా అస్త్రం చేసుకొని కథను ముందుకు నడిపించాడు. కామెడీ, లవ్, సెంటిమెంట్ ట్రాక్‌లతో సాగదీసినట్టు ముందుకెళ్తుంది. కథ, కథనాలు పేలవంగా సాగడంతో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. అలాంటి సమయంలో చక్కటి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ పడుతుంది.

    సెకండాఫ్ విశ్లేషణ

    సెకండాఫ్ విశ్లేషణ

    ఇక రెండో భాగంలో ప్రధానంగా నాగచైతన్య, మాధవన్ మధ్య నడిచే అంశాలు గ్రిప్పింగ్‌గా ఉంటాయి. హీరో, విలన్ మధ్య ఎత్తులు పై ఎత్తులను ఓ పక్క ఆసక్తికరంగా ముందుకు నడిపిస్తూనే మరో పక్క ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుడిని ఆకట్టుకునే అంశాలతో కథ సాగుతుంది. సినిమాకు ఆయువుపట్టుగా మారాల్సిన క్లైమాక్స్‌ను రొటీన్ ఫైట్‌తో ముగించాడు. కాకపోతే మెదడును మంచికి ఉపయోగించాలనే పాయింట్‌ను ప్రేక్షకుడికి బలంగా చెప్పగలడంలో సినిమా యూనిట్ సక్సెస్ అయింది.

    దర్శకుడిగా చందు మొండేటి

    దర్శకుడిగా చందు మొండేటి

    దర్శకుడు చందు మొండేటి ఎత్తుకొన్న పాయింట్ సరికొత్తగా ఉన్నప్పటికీ.. కథ, కథనాలను బలంగా చెప్పడంలో తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌ స్క్రీన్ ప్లే ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పాలి. ప్రధానంగా ఫ్లాష్ బ్యాక్‌లో ఫ్లాష్ బ్యాక్ అనే అంశాలు ప్రేక్షకుడికి చిరాకుపెట్టడటమే కాకుండా గందరగోళానికి గురిచేస్తాయి. కథ అంతా సెకండాఫ్‌లో కాకుండా ఫస్టాఫ్‌లో కొంత కొంత రివీల్ చేసి ఉంటే సినిమాపై మరింత ఆసక్తిపెరిగేది. మాధవన్ క్యారెక్టర్‌ను ఇండోర్‌కు పరిమితం చేయడం వల్ల స్క్రీన్ ప్లేలో పదును తగ్గిందని చెప్పవచ్చు. తొలిభాగంలో బలమైన సన్నివేశాలు లేకపోవడం సినిమాకు ప్రతికూలమైన అంశంగా మారింది.

    నాగచైతన్య పెర్ఫార్మెన్స్

    నాగచైతన్య పెర్ఫార్మెన్స్

    నటుడిగా నాగచైతన్యను చూస్తే ప్రతి సినిమాకు తన ప్రతిభను మెరుగుపరుచుకొంటున్నాడనే విషయం సవ్యసాచి రూపంలో మరోసారి స్పష్టమైంది. సన్నివేశాల్లో బలం లేకపోవడం కారణంగా చైతూ పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేకపోయింది. లవ్ ట్రాక్ కూడా పేలవంగా ఉండటం గ్లామర్ బాయ్‌గా ఎలివేట్ కావడానికి ప్రతికూలంగా మారింది. దర్శకుడిని నమ్మే చైతూలాంటి హీరోపై ఇలాంటి నిందలు వేయడానికి అవకాశం లేదు. పాత్ర పరిధి మేరకు చైతూ వందశాతం న్యాయం చేశాడనే చెప్పవచ్చు.

    నిధి అగర్వాల్ గ్లామర్

    నిధి అగర్వాల్ గ్లామర్

    చైతుగా నిధి అగర్వాల్ తెరపై అందంగా కనిపించింది. చైతు పక్కన ఫ్రెష్‌గా, గ్లామరస్‌గా మెరిసింది. తెలుగులో తొలి సినిమా కావడం వల్ల నటనపరంగా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేని కొన్ని లోపాలు కనిపించాయి. సవ్యసాచి సినిమాకు గ్లామర్ పరంగా ప్లస్ అనే చెప్పవచ్చు. యాక్టింగ్ పరంగా తన ప్రతిభను మెరుగు పరుచుకొంటే టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు తలుపుతట్టే ఛాన్స్ ఉంది.

    విలన్‌గా మాధవన్

    విలన్‌గా మాధవన్

    చెలి, సఖి, 3 ఇడియెట్స్, తమిళంలో విక్రమ్ వేద లాంటి చిత్రాల్లో విభిన్నమైన నటన ప్రదర్శించిన ఆర్ మాధవన్ తొలిసారి విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు మరోసారి పరిచయమయ్యాడు. మాధవన్‌ను ఆ తరహా పాత్రల్లో చూడటానికి తొలుత కష్టమైనప్పటికీ.. సెకండాఫ్‌లో ఆయన తన పాత్రతో సినిమాను మరో మెట్టు ఎక్కించాడు. కీలక సన్నివేశాల్లో ఆయన పలికించిన హావభావాలు మూవీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. మాధవన్ పాత్రను ఫస్టాఫ్‌లో కొంత ప్లాన్ చేసి ఉంటే సినిమా వేగం మరింత పెరిగేది. ప్రీ క్లైమాక్స్ వరకు కథను సాగదీయడం వల్ల మాధవన్ క్యారెక్టర్‌పై పూర్తిస్థాయిలో ఎలివేట్ కాలేకపోయింది.

     భూమిక పాత్ర గురించి

    భూమిక పాత్ర గురించి

    భూమిక పాత్ర సినిమాకు కీలకమైనప్పటికీ.. ఆ పాత్రలో ఎమోషన్ కరువైంది. ఏదో ఫ్లాట్‌గా సాగిపోతుంది. భూమిక పాత్ర ద్వారా సెంటిమెంట్‌ను డ్రైవ్ చేసి ఉంటే సినిమాకు బలంగా మారి ఉండేదేమో. వెన్నెల కిషోర్, సత్య, సప్తగిరి పాత్రల కామెడీ కామెడీ కథ, కథనాల్లో లోపాలను కప్పిపుచ్చేందుకు దోహదపడ్డాయి. సప్తగిరి పాత్ర కొద్దిసేపే ఉన్నప్పటికీ.. మన్మధుడు చిత్రంలోని సన్నాఫ్ ఎస్ లవంగం పాత్రను పరిచయం చేసి నవ్వులు పూయించాడు.

    తాగుబోతు రమేష్ నటన

    తాగుబోతు రమేష్ నటన

    రెగ్యులర్ ప్రేక్షకులకు సెకండాఫ్‌లో తాగుబోతు రమేష్ ఓ షాక్ ఇచ్చాడు. గతంలో ఇంతకుముందు మాదిరిగా కాకుండా నందకిషోర్ పాత్రలో సరికొత్త తాగుబోతు రమేష్ స్క్రీన్ పై కనిపించాడు. విద్యుల్లేఖ రెండు మూడు సీన్లలో ఫర్వాలేదనిపించింది. రావు రమేష్ రెండు సీన్లలో అతిథిగా దర్శనమిచ్చాడు. కానీ కథకు బలంగా మారే సీన్లలో కనిపించడం వలన గుర్తుండిపోతాడు.

     కీరవాణి మ్యూజిక్

    కీరవాణి మ్యూజిక్

    బాహుబలి తర్వాత కీరవాణి సంగీతం అందించిన చిత్రమిది. పాటలు ఆకట్టుకోలేకపోయాయి. రీమిక్స్ సాంగ్ కూడా అంతంతేగా ఉంది. కాకపోతే సెకండాఫ్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలకు బలంగా మారాయి. యువరాజ్ సినిమాటోగ్రఫి బాగుంది. పాత్రలు, యాక్షన్ సీన్లను చక్కగా తెరకెక్కించారు.

    మైత్రీ ప్రొడక్షన్ వ్యాల్యూస్

    మైత్రీ ప్రొడక్షన్ వ్యాల్యూస్

    మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ అంటే ఓ బ్రాండ్ అనే పాపులరిటీ లభించింది. ఆ బ్యానర్‌ నుంచి వచ్చిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం వారి స్టామినాను తెలియజేశాయి. అలాంటి పరిస్థితుల్లో తమ రూట్ మార్చి చేసిన సరికొత్త ప్రయోగం సవ్యసాచి సినిమా. వారి నిర్మాణ విలువలకు అనుగుణంగా సినిమాను రిచ్‌గా మలిచారు. పాత్రల ఎంపిక చక్కగా ఉంది. కాకపోతే కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండదనేది పలువురి అభిప్రాయం.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    వానిషింగ్ ట్వీన్ సిండ్రోమ్ (ఒకే దేహంలో ఇద్దరు), మేధస్సును మంచి పనికి వాడాలనే పాయింట్‌తో అల్లుకొన్ని సరికొత్త పాయింట్ సవ్యసాచి. కానీ కథ, కథనాలను బలంగా తెరకెక్కించడంలో దర్శకుడు చందు మొండేటి విఫలమయ్యాడు. మల్టీప్లెక్స్ ఆడియెన్స్, ఏ సెంటర్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మైత్రీ మూవీ మేకర్స్ ఖాతాలో మరో విజయం చేరినట్టే.

    బలం, బలహీనత

    బలం, బలహీనత

    ప్లస్ పాయింట్
    నాగచైతన్య, ఆర్ మాధవన్ నటన
    వానిషింగ్ ట్వీన్ సిండ్రోమ్ పాయింట్
    వెన్నెల కిషోర్, సత్య కామెడీ
    బ్యాక్ గ్రౌండ్ స్కోర్

    మైనస్ పాయింట్స్
    చందూ మొండేటి
    కథ, కథనాలు

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: నాగచైతన్య, నిధి అగర్వాల్. ఆర్ మాధవన్, భూమిక, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చందూ మొండేటి
    నిర్మాత: నవీన్, రవిశంకర్, సీవీ మోహన్
    బ్యానర్: మైత్రీ మూవీస్
    సంగీతం: కీరవాణి
    సినిమాటోగ్రఫి: యువరాజ్ జే
    ఎడిటింగ్: కోటగిరి విద్యాధర్ రావు
    రిలీజ్: నవంబర్ 2, 2018

    {document1}

    English summary
    Savyasachi an action film directed by Chandoo Mondeti & produced by Naveen Yerneni, C.V. Mohan, Y. Ravi Shankar under the banner Of Mythri Movie Makers. The film features Naga Chaitanya, R Madhavan and Nidhhi Agerwal in lead roles. This film is set to release on November 2nd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X