»   » కథ నిల్, డైలాగులు ఫుల్ (నాని 'నేను లోకల్' రివ్యూ)

కథ నిల్, డైలాగులు ఫుల్ (నాని 'నేను లోకల్' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

కామెడీతో రెండు గంటలు సేపు సినిమాని నెట్టుకురావటం కష్టం..అందులోనూ కామెడీ సిట్యువేషన్స్ లేకుండా కేవలంఫన్ డైలాగులుని అడ్డం పెట్టి కథ,కథనం లాగేయాలనుకోవటం సాహసమే. అదే ధైర్యం దిల్ రాజు, నాని కలిసి చేసారు. లాస్ట్ ఇయిర్ సూపర్ హిట్ కొట్టిన 'సినిమా చూపిస్తా మామా' టీమ్ తో కొంచెం అటూ ఇటూలో అలాంటి స్టోరీ లైన్ తోనే ముందుకు వచ్చేసారు.

'ఈ మధ్యకాలంలో లోకల్ ఫీలింగ్ రెచ్చగొట్టి ఇద్దరే గెలిచారు..ఒకటి ట్రంప్ రెండు నేను ' ఇలాంటి డైలాగులు ఈ సినిమాలో కోకొల్లలు. సాధారణంగా కథ రాసుకుని తర్వాత డైలాగులు రాస్తూంటారు. కానీ ఈ సినిమా చూస్తూంటే డైలాగులు రాసుకుని, అందుకు తగ్గ సీన్స్ అల్లుకుని, ఆ సీన్స్ తో ఓ కథ ని రెడీ చేసారా అనే డౌట్ వస్తుంది.


ఎందుకంటే ఈ సినిమాలో డైలాగులతో మేజర్ షేర్. సినిమా రన్ మొత్తం సరదా డైలాగులతో లాగేసే ప్రయత్నం చేసారు. ఈ విషయం లో డైలుగులు రచయిత ప్రసన్నకుమార్ ని మెచ్చుకోవాలి. అయితే అదే సమయంలో ఆ డైలాగులు చుట్టూ అల్లిన కథ మాత్రం రొటీన్ గా మారిన విషయం పట్టించుకోకపోవటం విషాదం.


అవన్నీ ప్రక్కన పెడితే నాని ఫుల్ పామ్ లో ఉన్నాడు. ఓ ప్రక్కన దేవి మంచి హిట్ పాటలు ఇచ్చేసాడు. డైరక్టర్ చూస్తే..ఇంతకు ముందు పెద్ద హిట్ ఇచ్చి ఉన్నాడు. దిల్ రాజు అయితే చిన్న సినిమాలతో పెద్ద హిట్ కొట్టడంలో ఆరితేరిపోయాడు. వీళ్లందిరి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం కథేంటి..మిగతా విభాగాలు ఎలా ఉన్నాయి వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదావాల్సిందే.


లవ్ ఎట్ ఫస్ట్ సైట్

లవ్ ఎట్ ఫస్ట్ సైట్

స్లిప్పులు పెట్టి ఇంజీనీరింగ్ పాసైన బాబు(నాని) వాట్ నెక్ట్స్ అనే డైలామాలో ఉన్నప్పుడు (కీర్తి సురేష్) పరిచయం అవుతుంది. సినిమా రూల్ ప్రకారం...ఆమె హీరోయి న్ కాబట్టి..వెంటనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేస్తాడు. అంతేకాకుండా ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు.


డిస్ట్రబ్ చేస్తా అని చెప్పి మరీ

డిస్ట్రబ్ చేస్తా అని చెప్పి మరీ

అంతేకాకుండా తన తండ్రి (సచిన్ కేడ్కర్) మాట వేదంలా భావించి స్ట్రిక్టుగా ఉండే కీర్తిని ప్రేమలో దింపడానికి తను చదివే కాలేజ్ లో ఎం.బి.ఏలో జాయిన్ అవుతాడు. నిన్ను డిస్ట్రబ్ చేస్తా అని ప్రకటించి ఆ పనిలో ఉంటాడు. కానీ నేను డిస్ట్రబ్ కాను అంటూనే ఆమె మనస్సు డిస్ట్రబ్ చేసుకుని ప్రేమలో పడిపోతుంది.సీఐ రూపంలో ప్రేమకు అడ్డు

సీఐ రూపంలో ప్రేమకు అడ్డు

అయితే ఈ ప్రేమ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చి ఇంటర్వెల్ వచ్చే సమయానికి... పోలీస్ అధికారి సిద్ధార్థ్ వర్మ(నవీన్ చంద్ర) ఊడిపడతాడు. అతను ఆల్రెడీ గత నాలుగేళ్లుగా ఆమె ప్రేమిస్తున్న సీనియర్ ప్రేమికుడు. అయితే కీర్తి తండ్రి ..నీకు ఏం చూసి నా కూతురుని ఇవ్వాలి అంటే... కష్టపడి చదవి, పోలీస్ ఉద్యోగం కొట్టి వచ్చి మరీ నీ కూతురుని ఇచ్చి పెళ్లి చేయమంటాడా నిజాయితీ గల ప్రేమికుడు.ఎవరితో కీర్తి సెటిల్ అవుతుంది

ఎవరితో కీర్తి సెటిల్ అవుతుంది

ఊహించని విధంగా ఇలా ఓ సీనియర్ ప్రేమికుడు సీన్ లోకి వచ్చేసరికి..జూనియర్ ప్రేమికుడు అయిన మన హీరో నాని సమస్య ఎదురౌతుంది. కీర్తి ఏమో ..ఈ జూనియర్ ని ప్రేమిస్తూ మొగుడు కావాలని కోరుకుంటోంది. కీర్తి తండ్రి ఏమో ...సీనియర్ ప్రేమికుడుని తన అల్లుడు కావాలని కోరుకుంటున్నాడు. మరి ఎవరికి దక్కుతుంది కీర్తి అంటే..ఆబియస్ గా హీరోకే దక్కుతుంది. అయితే ఎలా హీరో...తన సీనియర్ ని దాటి ..ఆమె చేయందుకున్నాడు అనేది మిగతా కథ.


కథని కూడా సీరియస్ గా తీసుకోవాలి

కథని కూడా సీరియస్ గా తీసుకోవాలి

ఎంత కామెడీ కథ అయినా ఎక్కడో చోట చిన్న ఎమోషనల్ ప్లే లేకపోతే సినిమా కనెక్ట్ అవటం కష్టం. అదే మిస్సయ్యారనిపించింది . ఇడియట్, ఆర్య చిత్రాలను అల్లినట్లున్న ఈ కథ ని కూడా కాస్త సీరియస్ గా తీసుకుని డైలాగులు అంత గొప్పగా రాసుకుని ఉంటే ఖచ్చితంగా మరో భలే భలే మొగాడివోయ్ అయ్యేది. అలాగని ఈ సినిమా తీసిపారేసేది కాదు కానీ నాని సినిమా అని ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని వెళ్లేంత గొప్పగా లేదు.


రొటీన్ ప్లాటే...

రొటీన్ ప్లాటే...

ఒకే అమ్మాయిని ఇద్దరు కుర్రాళ్లు ప్రేమించటం. బుద్దిమంతుడు, పద్దతైన కుర్రాడుకి తన కూతురుని ఇవ్వాలని తండ్రి కోరుకోవటం, ఫైనల్ గా కూతురు కోరిక మేరకు ఇష్టపడిన కుర్రాడివైపే మ్రొగ్గు చూపటం. దాదాపు ఎన్నో సార్లు ఇండియన్ స్క్రీన్ పై తెరకెక్కిన కథే ఇది. అలాగని ట్రీట్ మెంట్ లో ఏమన్నా కొత్త దనం చూపాలా అది నిల్లే.


ఇది నాని సినిమా

ఇది నాని సినిమా

సినిమా హైలెట్స్ లో చెప్పుకోవాలంటే నాని నే అని చెప్పాలి. తన కామెడీ టైమింగ్ తో సినిమాలో విషయం లేకున్నా కూర్చోబెట్టగలిగాడు. తన ఇమేజ్ ని దాటి వచ్చి మాస్ క్యారెక్టర్ బాగా చేసాడు. కృష్ణగాడి వీర ప్రేమ కథలో క్యారక్టర్ కు కంటిన్యూషన్ లా అనిపిస్తుంది. ఇక కీర్తి సురేష్ గురించి అయిచె చెప్పక్కలేదు. అందంగా కనిపించటం తో పాటు నటనలోనూ పూర్తి న్యాయం చేసింది.


విజిల్స్ పడ్డాయి

విజిల్స్ పడ్డాయి

చాలా కాలం తర్వాత పోసాని పాత్రకు ఈ సినిమాలో విజిల్స్ పడ్డాయి. పోసాని తన కామెడీ పంచ్ తో , తనదైన మేనరిజంతో నవ్వించాడు. పోసాని వచ్చినప్పుడల్లా నవ్వులు వినిపించాయి. ఆయన పాత్ర సినిమాకు ప్లస్ అయ్యింది.


 సాంకేతికంగా చెప్పాలంటే...

సాంకేతికంగా చెప్పాలంటే...

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ప్రేమ్ చాలా కలర్పుల్ గా ఉంది. దేవి శ్రీప్రసాద్ అందించిన సంగీతం చాలా డీసెంట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. దిల్ రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్ గ్రాండ్గా ఉన్నాయి. ఈ సినిమా స్టోరీ కొత్తదేమీ కాదు కానీ.. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్త్ చాలా ఇంట్రెస్టింగ్గా మలిచారు. అలాగే డైలాగ్స్ ఈ సినిమాకి అసెట్స్. దర్శకుడు త్రినాధరావు నక్కిన ఈ చిత్రంతో మరోసారి తన ప్రతిభ చాటాడు.


 ఫస్టాఫ్ బాగుంది కానీ

ఫస్టాఫ్ బాగుంది కానీ

ఇక ఈ సినిమాకు కథ రొటీన్ అనిపించినా ట్రీట్ మెంట్ అయినా సరిగ్గా చేసి ఉండాల్సింది. ఫస్టాఫ్ ఫన్ తో నడిచిపోయినా..సెకండాఫ్ మాత్రం డల్ అయ్యిపోయింది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే చాలా సీన్స్ కేవలం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అన్నట్లుగా..కేవలం సినిమా రన్ టైమ్ ని పెంచటానికే పనికొచ్చాయంటే అతిశయోక్తి కాదు. వాటిని తీసేసినా కథలో చిన్నపాటి మార్పు కూడా రాదు. అలాగే చాలా ప్రెడిక్టుబుల్ గా కథనం నడిచింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సాగతీతగా మారాయి.


ఈ సినిమాకి చేసిన టీమ్

ఈ సినిమాకి చేసిన టీమ్

నిర్మాణ సంస్థ: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
తారాగ‌ణం: నాని, కీర్తి సురేశ్, నవీన్ చంద్ర, సచిన్ ఖేడేకర్, పోసాని కృష్ణమురళి తదితరులు
రచన: సాయి కృష్ణ
చాయాగ్ర‌హ‌ణం: నిజార్ షఫీ
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: శిరీష్
కథ - స్క్రీన్‌ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
స‌మ‌ర్ప‌ణ: దిల్‌రాజు
క‌థ‌నం, దర్శకత్వం - త్రినాథ రావు నక్కినఫైనల్ గా..తెలిసిన కథ అయితే ఏంటి... కాస్సేపు డైలాగులతో నవ్విస్తే చాలు అనుకునే వారికి మంచి ఆప్షన్ ఈ సినిమా. అలాంటి వాళ్లు ఎంత ఎక్కువ మంది ఉన్నారనే విషయమై ఈ చిత్రం విజయం రేంజి ఆధారపడి ఉంటుంది.

English summary
Nenu Local is a Telugu action-romantic film directed by Trinadha Rao Nakkina and produced by Dil Raju under his banner Sri Venkateswara Creations, story, screenplay and dialogues are written by Prasanna Kumar Bejawada.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu