For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నర్తనశాల తెలుగు మూవీ రివ్యూ

  By Rajababu
  |
  Nartanasala Movie Review నర్తనశాల సినిమా రివ్యూ

  Rating:
  2.0/5
  Star Cast: నాగశౌర్య, కశ్మీరా, యామినీ భాస్కర్, అజయ్, జయప్రకాశ్ రెడ్డి, శివాజీ రాజా
  Director: శ్రీనివాస చక్రవర్తి

  చలో సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగశౌర్య అటు క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను మెప్పించడంలో సఫలమయ్యాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కమర్షియల్‌ హీరోగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ చేసిన సినిమా @నర్తనశాల. సమాజంలో మహిళలు ధైర్యంగా ఉండాలి. సమస్య ఎదురైనప్పుడు ఎదుటివారిపై ఆధారపడకుండా పోరాడాలి అనే పాయింట్‌ నేపథ్యంతో ఓ ప్రేమకథగా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగశౌర్య సరసన కశ్మీరా పరదేశి, యామిని భాస్కర్ జంటగా నటించారు. తొలిసారి గే పాత్రలో కనిపిస్తూ నాగశౌర్య వినోద అల్లరికి ప్రేక్షకులు ఏ విధంగా స్పందించారనే విషయాన్ని తెలుసుకోవడానికి కథలోకి వెళ్లాల్సిందే.

  నర్తనశాల స్టోరి

  కళామందిర్ కల్యాణ్ (శివాజీ రాజా) తన కుమారుడి రాధాకృష్ణ (నాగశౌర్య)ని చిన్నతనం నుంచే అమ్మాయిలా పెంచుతాడు. అమ్మాయిల్లో ధైర్యం నింపే విధంగా రకరకాల శిక్షణలిస్తూ కాలం గడిపే రాధాకృష్ణ ఓ సమస్యలో పడిన మానస (కశ్మీరా పరదేశి)కు దగ్గరవుతాడు. మానస సమస్యను తీర్చే క్రమంలో ఆమెతో ప్రేమలో పడుతాడు. కానీ అంతలోనే జయప్రకాశ్ కూతురు సత్య ( యామిని భాస్కర్)‌తో నిశ్చితార్థానికి సిద్ధమవుతాడు. అయితే తనకు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను కొజ్జా (గే) అని రాధాకృష్ణ చెబుతాడు. ఇది విని అబ్బాయితో జీవితం పంచుకోవాలనుకొంటున్న సత్య సోదరుడు (అజయ్).. రాధాకృష్ణ ను పెళ్లి చేసుకోవాలనుకొంటాడు.

  నర్తనశాలతో ట్విస్టులు

  నాగశౌర్యను తన తండ్రి కళామందిర్ కల్యాన్ ఎందుకు అమ్మాయిలా పెంచుతాడు? మానసకు ఎదురైన సమస్య ఏమిటి? నాగశౌర్య తాను కొజ్జ అని చెప్పడానికి కారణమేమిటి? నాగశౌర్యను పెళ్లి చేసుకోవాలనుకొంటున్న అజయ్ కథ చివరికి ఏమైంది? మానస, సత్యలో ఎవరిని పెళ్లి చేసుకొన్నాడు? ఇందులో జయప్రకాశ్ పాత్ర ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే @నర్తనశాల చిత్ర కథ.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  @నర్తనశాల చిత్రం కూతురు పుడితే అంతకంటే గొప్ప అదృష్టం ఉండదని భావించే కళామందిర్ కల్యాణ్ క్యారెక్టర్‌తో మొదలవుతుంది. తాను భావించినట్టు కూతురు కాకుండా కొడుకు పుట్టడంతో నిరసపడిపోతాడు. ఓ పూజారి ఇచ్చిన సలహా మేరకు తన కుమారుడిని అమ్మాయిలా పెంచుతాడు. కల్యాణ్ కుమారుడిగా నాగశౌర్య మహిళలకు చేయూతనివ్వడం లాంటి అంశాలతో పరమ రొటీన్‌గా కథ సాగుతుంది. ఓ దశలో ప్రేక్షకుల సహానానికి దర్శకుడు పరీక్ష పెడుతున్నాడా అనే పరిస్థితి ఎదురవుతుంది. అలా సాగదీతతో ప్రేమ వ్యవహారాన్ని ముడిపెట్టి ఇంటర్వెల్‌ బ్యాంగ్ పడుతుంది.

  సెకండాఫ్ అనాలిసిస్

  ఓ పురుషుడు, మరో పురుషుడిని పెళ్లి చేసుకోవాలనుకొంటున్న కాన్సెప్ట్‌తో రెండో భాగం మొదలవుతుంది. తొలుత జయప్రకాశ్‌రెడ్డి టిపికల్ కామెడీ బాగానే ఉందనిపిస్తుంది. రీళ్లు తరిగే కొద్ది ఆయన హాస్యం వెగటు పుట్టేలా అనిపిస్తుంది. మధ్య మధ్యలో అజయ్ సీన్లు కొంత కొత్తగా అనిపిస్తాయి. మానస సమస్యను తీర్చడంతో కథలో పస తగ్గిపోతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ మధ్య ఏదో రొటీన్‌ సన్నివేశాలతో ముగింపు పలకడం హమ్మయ్య అనే ఫీలింగ్ కలుగుతుంది.

  దర్శకుడి తడబాటు

  అబ్బాయిని అమ్మాయిలా పెంచడం అనే మంచి పాయింట్‌ను దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి ఎత్తుకోవడమే సరిగా లేదు. దాంతో సినిమా అంతా గందరగోళంగా మారింది. కథ ప్రారంభంలోనే కళామందిర్ కల్యాణ్‌ను పసలేని సన్నివేశాలతో ఏకధాటిగా నడిపించడం తన ఎత్తుగడలో తప్పిదంగా మారింది. ఒక నాగశౌర్య పాత్రను సరిగా డిజైన్ చేయలేకపోవడం మరో మైనస్. ఇక సెకండాఫ్‌లోనైనా అజయ్, నాగశౌర్య మధ్య సీన్లు పరమ రొటీన్‌గా కనిపిస్తాయి. ఏ సీన్‌లో కూడా కొత్తదనం కనిపించకపోవడంతో దర్శకుడు ప్రతిభ ఏమిటో కనిపించకుండా పోయింది.

  నాగశౌర్య ఫెర్ఫార్మెన్స్

  ఛలో సినిమా తర్వాత నర్తనశాత సినిమా రావడంతో నాగశౌర్య‌పై అంచనాలు పెరిగాయి. ఫీల్‌గుడ్ టైటిల్, టీజర్లు, ట్రైలర్లలో ఆకట్టుకొనేలా ఉన్న నాగశౌర్య క్యారెక్టర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. క్యారెక్టర్‌లో పలు రకాల వేరియేషన్ ఉన్నప్పటికీ ఎఫెక్టివ్‌గా తీర్చిదిద్దలేకపోవడంతో నాగశౌర్య పాత్ర ఎలివేట్ కాలేకపోయింది. హీరో పాత్రలో ఉండే కొన్ని లోపాలు నాగశౌర్య తెర మీద మ్యాజిక్ చేయడానికి వీలు దక్కలేదు. పాటలు, ఫైట్స్, కొన్ని ఎమోషన్ సీన్లలో ఆకట్టుకొన్నాడు. విభిన్నమైన పాత్రను పోషించడం ఓ ఛాలెంజ్. కానీ సరైన ఫలితం ఇవ్వకపోవడం ఆయన శ్రమ బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.

  హీరోయిన్ల గ్లామర్

  మానసగా కశ్మీరా పరదేశి, సత్యగా యామిని భాస్కర్‌ నటించారు. వారి పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత ఉన్నట్టు కనిపించదు. మానస పాత్ర చుట్టు కథ తిరిగినా ఆ రోల్‌ ఆకట్టుకొనేలా లేకపోయింది. ఆటపాటలకు పరిమితమైంది. యామిని భాస్కర్ పాత్ర పరిధి తక్కువగా ఉండటంతో నటనకు స్కోప్ లేకపోయింది.

  మిగితా క్యారెక్టర్లలో

  గే పాత్రలో అజయ్ కనిపించాడు. కొన్ని సీన్లలో అజయ్‌ అలరించాడు. అయితే ఆయనది గుర్తుండిపోయే పాత్రమీ కాదు. శివాజీ రాజా మరోసారి ఫుల్ పాత్ర దొరికినా ప్రేక్షకుల మెప్పు పొందే అంశాలు ఏమీ కనిపించవు. జయప్రకాశ్ రెడ్డి కామెడీ రొటీన్‌గా అనిపిస్తుంది. సుధ, ప్రియ క్యారెక్టర్లు కథలో భాగమే కానీ బలంగా కనిపించవు. మిగితా పాత్రల్లో కూడా గొప్పగా చెప్పుకొనే అవకాశమే కనిపించదు.

  సాంకేతిక నిపుణుల..

  ఇక నర్తనశాల సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే విజయ్ కుమార్ సీ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. ప్రతీ ఫ్రేమ్‌ ఆహ్లాదకరంగా ఉంటాయి. పాటలను చిత్రీకరణ సినిమాకు హైలెట్‌గా అనిపిస్తాయి.

  ఇక నర్తనశాల సాంకేతిక నిపుణల విషయానికి వస్తే విజయ్ కుమార్ సీ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. ప్రతీ ఫ్రేమ్‌ ఆహ్లాదకరంగా ఉంటాయి. పాటలను చిత్రీకరణ సినిమాకు హైలెట్‌గా అనిపిస్తాయి.

  సినిమాకు మైనస్‌గా

  నర్తనశాల సినిమాకు మైనస్‌గా అనిపించే అంశాల్లో సంగీతం ఒకటి. మహతి స్వర సాగర్ రీరికార్డింగ్ రొటీన్‌గా అనిపిస్తుంది. కాకపోతే రెండు పాటలు బాగున్నాయనే ఫీలింగ్ కలుగుతుంది.

  రొటీన్ సీన్లను

  కొత్తదనం లేని, రొటీన్ సీన్లను కూర్పులో ఎడిటర్ కోటగిరి ప్రతిభ కనిపిస్తుంది. కొన్ని సీన్లు సినిమా వేగానికి కళ్లెం వేసినట్టు కనిపిస్తాయి. తాగుబోతు క్యారెక్టర్ సీన్లు హోమ్లీ వాతావరణాన్ని దెబ్బతీసేలా ఉంటాయి.

  ఫీల్‌గుడ్ చిత్రాన్ని

  ఛలో లాంటి ఫీల్‌గుడ్ చిత్రాన్ని అందించిన ఐరా సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌లో రాజీలేని తనం కనిపిస్తుంది. కథ, కథనాల విషయంలోనే జాగ్రతలు తీసుకోలేదని అనిపిస్తుంది. పాటల చిత్రీకరణ, లోకేషన్ల ఎంపిక వారి సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.

  బలం, బలహీనత

  ప్లస్ పాయింట్స్
  నాగశౌర్య, అజయ్ యాక్టింగ్
  సినిమాటోగ్రఫి

  మైనస్ పాయింట్స్
  కథ, కథనం
  నటీనటుల ఎంపిక
  ఎడిటింగ్

  ఫైనల్‌గా

  నర్తనశాల మంచి ఫీల్‌గుడ్ పాయింట్, హాస్యానికి స్కోప్ ఉన్న కథ. కానీ దానిని తెరకెక్కించడంలోనే విఫలమయ్యారని చెప్పవచ్చు. చనిపోయిన తన తల్లి మళ్లీ తన కూతురుగా పుడుతుందనే ఓ తండ్రి ఆశ. ఓ బిడ్డ పుట్టకతో తన సోదరుడు దూరమయ్యాడనే ఇంటెన్సివ్ పాయింట్లను బలంగా చూపలేకపోవడమే సినిమాకు మైనస్. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల ఆదరణను బట్టే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.

  తెర ముందు, తెర వెనుక

  నాగశౌర్య, కశ్మీరా, యామినీ భాస్కర్, అజయ్, జయప్రకాశ్, శివాజీ రాజా తదితరులు
  రచన, దర్శకత్వం: శ్రీనివాస చక్రవర్తి
  నిర్మాత: ఉషా మూల్పూరి
  సంగీతం: సాగర్ మహతి
  సినిమాటోగ్రఫి: విజయ్ కుమార్ సీ
  ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
  బ్యానర్: ఐరా క్రియేషన్
  రిలీజ్ డేట్: 2018-08-30

  English summary
  Naga Shaurya latest movie is Nartanasala. In this movie, Naga Shaurya who runs a Women Empowerment Institute to train women to be mentally and physically strong gets labeled 'GAY' for being around ladies since his childhood. This movie is set to release on August 30th.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more