»   » ప్చ్...లెక్క తప్పింది ( 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' రివ్యూ)

ప్చ్...లెక్క తప్పింది ( 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

రాజమౌళి శిష్యులంటే ఇండస్ట్రీలో ఓ క్రేజ్ ఉంటుంది. దాంతో వారి చేసే సినిమాలపై ఆసక్తి ఉంటుంది. అలా రాజమౌళి దగ్గర చాలా కాలం పనిచేసిన జగదీష్ దర్శకుడుగా పరిచయం అవుతూ రూపొందించిన ఈ చిత్రం ఈ రోజు రిలీజైంది. దాంతో ఎలా చేసారు. రాజమౌళి స్ధాయిలో ఉందా లేక రొటీన్ సినిమాలాగ ఉందా అనుకుంటూ ధియోటర్స్ ఫిల్ అయ్యాయి. అయితే రాజమౌళి శిష్యుడు పాయింట్ దాకా కొత్తది ట్రై చేసాడు కానీ ... ఎగ్జిక్యూషన్ లో ఫెయిలయ్యాడు అనిపించింది. అసలు ఏమిటా కధ..ఎక్కడ దారి తప్పింది అనేది చూద్దాం.

జనతాబ్యాంక్ లో నవీన్‌ (నవీన్‌చంద్ర), దేవి (లావణ్య త్రిపాఠి) జాబ్ చేస్తూంటారు. మరో ప్రక్క అదే బ్యాంక్ లో అనాధగా పడి ఉన్న అన్ క్లైమ్డ్ ఎక్కౌంట్స్ లో ఉన్న కొన్ని కోట్ల రూపాయలపై మహేష్ బ్యాచ్ ( అజయ్ ) కన్నేస్తుంది. అందుకు వాళ్లు అక్కడ పరిచయం ఉన్న నవీన్ ని అడ్డం పెట్టుకోవాలనుకుని ఫైల్ తెప్పించుకుని, దోచాలని ప్లాన్ చేస్తారు. కొన్ని డబ్బు సమస్యలతో నవీన్ ఓకే చెప్తాడు. కానీ ఆ డీల్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయటానికి దేవి అడ్డం పడుతుంది. ఆమెను ఎలా దాటారు...చివరకు ఆ బ్యాంక్ లో ఉన్న డబ్బుని దోచగలిగారా..అసలు అన్ క్లైమ్డ్ ఎక్కౌంట్ లో డబ్బు ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా పూర్తి గా చూడాల్సిందే.


బ్యాంకులోని గుర్తుతెలియని వ్యక్తులు (అన్‌క్లెయిమ్డ్‌) ఖాతాల వివరాల్ని తెప్పించుకొని.. ఆ ఖాతాదారులకి తామే వారసులమంటూ ఆ సొమ్ముని కొట్టేయాలనే అజయ్ ప్లాన్ దాకా సినిమా బాగానే నడించింది. అయితే అక్కడ నుంచే కథ దారి తప్పింది. లచ్చిందేవి లెక్క తప్పింది. ముఖ్యంగా క్యారక్టరైజేషన్ ఒక్కటీ సరిగా ఉండదు. దాంతో ఏ పాత్ర కూడా తన పరిధిలో మాట్లాడదు. బిహేవ్ చేయదు. వీటితో కథ అంతా కంగాళీగా మారిపోయింది.


Naveen Chandra's latest ‘LOL’review

రీసెంట్ గా సోగ్గాడితో హిట్ కొట్టిన లావణ్య త్రిపాఠికి ఈ సినిమా పెద్దగా ఉపయోగపడదనే చెప్పాలి. ఆమె చుట్టూ కథ తిరిగినా క్యారక్టరైజేషన్ మాత్రం బాగోలేదు. క్యారక్టర్ లో డెప్త్ లేకపోవటం దెబ్బ కొట్టింది.


జయప్రకాష్‌రెడ్డి రాయలసీమ యాసతో నవ్వించాడు కానీ పెద్దగా కథకు ఉపయోగపడలేదు. ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్స్ మాత్రం బాగున్నాయి. సంపూర్ణేష్‌బాబు తదితరులు తమ పాత్రలకు తగ్గట్లుగా నటించారు.


సినిమా హైలెట్స్ లో సినిమాటోగ్రఫీ, కీరవాణి సంగీతం అని చెప్పాలి. దర్శకుడుగా జగదీష్ తొలి చిత్రం లో అతని అనుభవం ఏమైందా అనిపిస్తుంది. అందాల రాక్షసి పెయిర్ నవీన్, లావణ్యలు ఏదో మొక్కుబడిగా చేసుకుంటూ పోయినట్లు అనిపిస్తూంటుంది. ఎడిటింగ్ మరింత షార్ప్ చేస్తే బాగుండేదే అనిపించక మానదు. డైలాగులు అద్బుతం కాదు కానీ బాగున్నాయి.


ఫైనల్ గా ..దర్శకుడు వేసుకున్న లెక్కలు తప్పాయనే అనిపిస్తుంది. భాక్సాఫీస్ దగ్గర కూడా లచ్చిందేవి లెక్క తప్పేటట్లే ఉంది. ఫైనల్ గా ఏ లెక్కలు వేసుకుని ఈ సినిమా చేసారా అని చూసే ప్రేక్షకుడుకి అనుమానం కలగక మానదు.


బ్యానర్: మయాఖ క్రియేషన్స్
నటీనటులు : నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, సంపూర్ణేష్ బాబు, మేల్కోటి, భద్రం, భాను తదితరులు
పాటలు: శివశక్తి దత్తా, అనంత శ్రీరామ్,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు,
డాన్స్: తార, కృష్ణారెడ్డి, జానీ, సన్నీ,
ఫైట్స్: పి.సతీష్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఇ. మధుసూదనరావు,
నిర్మాత: సాయి ప్రసాద్ కామినేని,
రచన, దర్శకత్వం: జగదీష్ తలశిల.
విడుదల తేదీ: 29-01-2016.

English summary
Naveen Chandra 's Lachhindeviki Oka Lekkundi movie (LOL) released today with divide talk.
Please Wait while comments are loading...