twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీవెవరో మూవీ రివ్యూ & రేటింగ్

    By Rajababu
    |

    Recommended Video

    Neevevaro Movie Review & Rating...! నీవెవరో మూవీ రివ్యూ & రేటింగ్

    Rating:
    2.0/5
    Star Cast: ఆది పినిశెట్టి, రితిక సింగ్, తాప్సీ పన్ను, వెన్నెల కిషోర్, సప్తగిరి
    Director: హరినాథ్

    రంగస్థలం చిత్రంతో ప్రేక్షకుల ఆదరణ సంపాదించుకొన్న యువ నటుడు ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రం నీవెవరో. ఆదికి జంటగా తాప్సీ పన్ను, గురు ఫేం రితిక సింగ్ జంటగా నటించారు. 2014లో వచ్చిన లవర్స్ చిత్రానికి దర్శకుడు వ్యవహరించిన హరినాథ్ ఈ సినిమాను రూపొందించగా, ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ సమర్పించారు. తమిళ చిత్రం అధే కాంగల్ అనే చిత్రం ఆధారంగా ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న నీవెవరో చిత్రం ఆగస్టు 24న రిలీజ్‌కు సిద్దమైంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎలాంటి టాక్ సంపాదించుకొన్నదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    నీవెవరో స్టోరి

    నీవెవరో స్టోరి

    పుట్టుకతోనే అంధుడైన కల్యాణ్ (ఆది పినిశెట్టి) ఓ రెస్టారెంట్ యజమాని. ఆదిని బాల్య స్నేహితురాలు (రితిక సింగ్) చాలా ఇష్టంగా ప్రేమిస్తుంది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకొంటున్న సమయంలో వెన్నెల (తాప్సీ పన్ను)తో ఆది ప్రేమలో పడుతాడు. కష్టాల్లో ఉన్న వెన్నెలను ఆదుకొనే క్రమంలో జరిగిన యాక్సిడెంట్‌లో ఆదికి కనుచూపు వస్తుంది. కానీ కనిపించకుండా పోయిన వెన్నెల కోసం వెతికే సమయంలో రితికతో నిశ్చితార్థం కూడా ఆగిపోతుంది. ఈ క్రమంలో వెన్నెల గురించి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది.

    నీవెవరో స్టోరిలో మలుపులు

    నీవెవరో స్టోరిలో మలుపులు

    వెన్నెల గురించి తెలిసిన ఆ నిజం ఏమిటి? వెన్నెల మారు పేర్లతో అంధులను ఎందుకు మోసగిస్తుంది? తనకు జరిగిన మోసానికి వెన్నెలకు కల్యాణ్ ఎలాంటి గుణపాఠం నేర్పాడు. తన స్నేహితురాలిని పెళ్లి చేసుకొన్నాడా? చివరకు వెన్నెల ఏమైంది? ఈ కథలో కానిస్టేబుల్ చోక్కారావు (వెన్నెల కిషోర్), హ్యాకర్ జైహింద్ జగన్నాథం (సప్తగిరి) పాత్రలేమిటి అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే నీవెవరో చిత్ర కథ.

     ఫస్టాఫ్‌లో

    ఫస్టాఫ్‌లో

    అంధుడైన కల్యాణ్ రెస్టారెంట్ నిర్వహించే అంశంతో కథ ప్రారంభమై సినిమాలోని పాత్రలను పరిచయం చేసుకొంటూ వెళ్తుంది. మద్యం ప్రియులైన కల్యాణ్ తల్లిదండ్రుల (తులసి, శివాజీ రాజా), వెన్నెల, ఇతర పాత్రలతో చకచక కథలోకి వెళ్లాడు. కానీ అసలు కథ ఇంటర్వెల్‌కు కూడా మొదలవ్వకపోవడం ప్రేక్షకుడి సహనానికి అద్దం పడుతుంది. వెన్నెల నిజస్వరూపం ఏంటో ఇంటర్వెల్ బ్యాంగ్ వేస్తే రెండో భాగంలో కథపై ఆసక్తి పెరిగి ఉండేదేమో అనిపిస్తుంది.

     రెండో భాగంలో

    రెండో భాగంలో

    ఇక రెండో భాగంలో వెన్నెల ముఠా గుట్టురట్టు చేయడం అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో కథ చిన్న పిల్లల ఆటగా అనేక మలుపులు తిరుగుతుంది. అప్పటికే వెన్నెల పాత్ర ఏంటో సగటు ప్రేక్షకుడికి అర్ధమైపోయేలా ఉంటుంది. ఒక వెన్నెల అంధులను ఎందుకు మోసగించిందే అనే విషయాన్ని కన్విన్స్‌గా చెప్పలేకపోయాడు. కాకపోతే వెన్నెల కిషోర్, సప్తగిరి కామెడీతో ఆ మైనస్ పాయింట్‌ను తెలివిగా కవర్ చేయడం వల్ల రెండో భాగం ఓకే అనిపిస్తుంది.

    హరినాథ్ టేకింగ్

    హరినాథ్ టేకింగ్

    నీవెవరో సినిమా కథ మంచి ఫీల్ గుడ్ అంశమే. కానీ దర్శకుడు హరినాథ్ కథను అంతా దాచి సెకండాఫ్‌ వరకు లాగడమే అతని వ్యూహానికి దెబ్బ పడింది. సెకండాఫ్‌లో చెప్పాలనుకోవడం ఓకే అనుకొన్నప్పటికీ, కనీసం తొలిభాగాన్నైనా ఆసక్తికరంగా రూపొందిస్తే బాగుండేదేమో. కాకపోతే సెకండాఫ్‌లో సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టడంలో దర్శకుడు సఫలమయ్యాడనే చెప్పవచ్చు. కథలో నిజాయితీ కనిపించకపోగా అంతా కృత్రిమంగా ఉంటుంది. స్క్రిప్టు మీద మరింత కసరత్తు పెట్టి ఉంటే మరింత మెరుగైన ఫలితాన్ని రాబట్టే అవకాశం ఉండేది.

     ఆది పినిశెట్టి పెర్ఫార్మెన్స్

    ఆది పినిశెట్టి పెర్ఫార్మెన్స్

    రంగస్థలం చిత్రంతో మంచి పేరు సంపాదించుకొన్న ఆది పినిశెట్టి కిషోర్ పాత్రలో ఒదిగిపోయాడు. మొదటి అరగంటలో అంధుడిగా ఆది పెర్ఫార్మెన్స్ బాగుంది. హావభావాలు బాగున్నాయి. ఫైట్స్ మంచి ఈజ్‌తో చేశాడు. బాడీ లాగ్వేంజ్ ఆకట్టుకునేలా ఉంది. కథలో కొన్ని లోపాలు ఆది ఫెర్ఫార్మెన్స్ బయట రాలేకపోవడానికి కారణమైంది.

     తాప్సీ రెండు రకాల షేడ్స్‌లో

    తాప్సీ రెండు రకాల షేడ్స్‌లో

    వెన్నెలగా తాప్సీ పన్ను ఆకట్టుకొంది. ఫస్టాఫ్‌లో సాఫ్ట్ క్యారెక్టర్‌లో అందంగా కనిపించింది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు వరకు తాప్సీ నటన సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందా అనే ఫీలింగ్ కలుగుతుంది. పలు రకాల వేరియేషన్స్ ఉండటంతో వెన్నెల పాత్రను తాప్సీ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొన్నది.

     ఆకట్టుకోలేకపోయిన రితిక సింగ్

    ఆకట్టుకోలేకపోయిన రితిక సింగ్

    రితిక సింగ్‌ పాత్ర పరిధి కొంత తక్కువే. గెస్ట్ అప్పీయరెన్స్‌లా ఉంటుంది. పాటలకు స్కోప్ కూడా లేకపోయింది. చివర్లో టీవీ జర్నలిస్టుగా ఎంట్రీ కావడం కథలో కావాలనే జోప్పించారనే ఫీలింగ్ కలుగుతుంది. రితిక ఫెర్ఫార్మెన్స్ అంచనా వేసేంత బలం ఆ పాత్రలో లేకపోయింది. అంతగా గుర్తుంచుకొనే పాత్రమీ కాదని చెప్పవచ్చు.

    వెన్నెల కిషోర్, సప్తగిరి అదుర్స్

    వెన్నెల కిషోర్, సప్తగిరి అదుర్స్

    రొటీన్‌గా సాగే నీవెవరివో కథకు సంబంధించి సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్, సప్తగిరి ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఫ్లాట్‌గా సాగే కథనానికి వీరి కామెడీ జోష్‌ను పెంచింది. వెన్నెల కిషోర్, సప్తగిరి మంచి వేరియేషన్స్‌తో ఆరోగ్యకరమైన హాస్యాన్ని పంచారు. కథ, కథనాలపై ఏదైనా అసంతృప్తి ఉన్న ప్రేక్షకులకు వీరి కామెడీ కొంత ఊరట అని చెప్పవచ్చు.

    సంగీతం ఎలా ఉందంటే

    సంగీతం ఎలా ఉందంటే

    సస్పెన్స్, థ్రిల్లర్‌కు కావాల్సిన మ్యూజిక్‌ను అందించడంలో జిబ్రాన్, అచు రాజమణి, ప్రసన్ ప్రవీన్, శ్యాం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పవచ్చు. రిరీకార్డింగ్ సన్నివేశాలకు బలంగా మారలేకపోయింది. సాయి శ్రీరాం అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. టాప్ యాంగిల్ షాట్స్ కొత్తగా ఉన్నాయి.

    ఎడిటింగ్

    ఎడిటింగ్

    సాధారణంగా కోన వెంకట్ రాసే సంభాషణలు ఎమోషనల్‌గా ఉంటాయి. కామెడీ సీన్లు రంజుగా ఉంటాయి. కామెడీ విషయానికి వస్తే ఒకే అనుకోవచ్చు. కానీ ఈ చిత్రంలో ఎమోషనల్ పార్ట్ మిస్సయిందనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో, సెకండాఫ్‌లో అక్కడక్కడా ఎడిటర్‌కు చేతినిండా పని ఉందనిపిస్తుంది.

     నిర్మాణ విలువలు

    నిర్మాణ విలువలు

    నీవెవరివో ఫీల్‌గుడ్‌గా మలచడానికి నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నట్టు కనిపిస్తుంది. సాంకేతిక విలువలు బాగున్నాయి. కాకపోతే కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే మరో విజయం సొంతమయ్యేది. పాత్రలకు నటీనటుల ఎంపికలో మరికొంత ఆలోచించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఏ విషయంలోనూ అంధుల తక్కువేమీ కాదనే విషయాన్నీ అంతర్లీనంగా చెబుతూ చేసిన ప్రేమ కథా చిత్రం. కాకపోతే ఈ కథను సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందించడమే కొత్త విషయం. కాకపోతే ఈ రెండు అంశాలను జోడించడంలో తడబాటు కనిపిస్తుంది. సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలను ఆదరించే వారికి ఈ చిత్రం నచ్చుతుంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    • ఆది పినిశెట్టి, తాప్సీ
    • సినిమాటోగ్రఫి
    • ప్రొడక్షన్ వ్యాల్యూస్
    • కథ
    • మైనస్ పాయింట్స్

      • స్క్రీన్ ప్లే
      • మ్యూజిక్
      • తెర వెనుక, తెర ముందు

        తెర వెనుక, తెర ముందు

        నటీనటులు: ఆది పినిశెట్టి, రితిక సింగ్, తాప్సీ పన్ను, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులు
        దర్శకత్వం: హరినాథ్
        నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ
        రచన, సమర్పణ: కోన వెంకట్
        మ్యూజిక్: జిబ్రాన్, అచు రాజమణి, ప్రసన్ ప్రవీన్, శ్యాం
        సినిమాటోగ్రాఫర్‌: సాయి శ్రీరాం
        ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ్
        రిలీజ్ డేట్: 2018-08-24

    English summary
    Aadhi Pinisetty's Neevevaro movie set release on August 24th. This movie is presenting by Kona Venkat. Producing MVV Satyanarayana. Taapsee, Ritika, Vennela Kishore are the cast.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X