twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేల టికెట్ సినిమా రివ్యూ: పక్కా మాస్‌గా రవితేజ!

    By Rajababu
    |

    Recommended Video

    Nela Ticket Movie Review నేల టికెట్ సినిమా రివ్యూ

    Rating:
    2.5/5
    Star Cast: రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు
    Director: కల్యాణ్ కృష్ణ కురసాల

    మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. రాజా ది గ్రేట్‌తో బంపర్ హిట్‌ను సొంతం చేసుకొన్న రవితేజ.. ఆ తర్వాత టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచాడు. అయితే కల్యాణ్ కృష్ణ మాత్రం రెండు బ్లాక్‌బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకొని హ్యాటిక్ విజయం కోసం రామ్ తాళ్లూరి నిర్మాతగా నేల టికెట్‌ను రూపొందించారు. రవితేజతో కొత్త భామ మాళవిక శర్మ జతకట్టింది. టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్‌లుక్‌‌లు భారీగా అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో మే 25న నేల టికెట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో కల్యాణ్ కృష్ణ హ్యాట్రిక్ కొట్టాడా? రవితేజ ఖాతాలో మరో విజయం చేరిందా? అనే తెలుసుకోవాలంటే అసలు కథ, కథనాలు, నటీనటుల పెర్ఫార్మెన్స్‌ ఏంటో తెలుసుకోవాల్సిందే.

    నేల టికెట్ కథ ఇదే

    నేల టికెట్ కథ ఇదే

    నేల టికెట్ రవితేజ ఓ అనాధ. సేవా గుణం కలిగిన రాజకీయ వేత్త ఆనంద భూపతి (శరత్ బాబు) చేరదీసి ఆదరిస్తాడు. ఆనంద భూపతిని స్వయంగా తన కుమారుడు మినిస్టర్ఆదిత్య భూపతి (జగపతిబాబు) హత్య చేస్తాడు. ఆ విషయాన్ని జర్నలిస్టు (కౌముదీ) కెమెరాలో రికార్డు అవుతుంది. ఆ విషయం తెలుసుకొన్న ఆదిత్య భూపతి జర్నలిస్టుపై దాడి చేస్తాడు. ఈ క్రమంలో ఆదిత్య భూపతి ఆగడాలను ఎదుర్కొంటూ, అతడు వేసే ఎత్తులకు పైఎత్తు వేస్తుంటాడు.

     కథలో ట్విస్టులకు

    కథలో ట్విస్టులకు

    ఆదిత్య భూపతిని అక్రమాలను ఎలా ఎదుర్కొన్నాడు? రవితేజ అనుకొన్న లక్ష్యాన్ని ఎలా చేరుకొన్నాడు? జర్నలిస్టుతో నేలటికెట్టుకు ఉన్న సంబంధం మేమిటి? ఆనంద భూపతిని ఆదిత్య భూపతి ఎందుకు చంపాడు? ఈ కథలో డాక్టర్ (మాళవిక శర్మ)తో నేలటికెట్టు సాగించిన ప్రేమయాణం కథకు ఎలా ఉపయోగపడింది అనే ప్రశ్నలకు సమాధానమే నేల టికెట్టు కథ.

    ఫస్టాఫ్‌లో

    ఫస్టాఫ్‌లో

    ఆనంద భూపతి హత్యతో అసలు కథ ప్రారంభమవుతుంది. ఆదిత్య భూపతి దుష్టబుద్ది, అధికార కాంక్ష, అక్రమాలతో సినిమా సాదాసీదాగా గడిచిపోతుంది. జర్నలిస్టుపై దాడితో కథ మలుపు తిరుగుంది. జర్నలిస్టును కాపాడేందుకు నేలటికెట్టు చేసే ప్రయత్నాలు కొంత ఆసక్తికరంగా సాగుతాయి. ఆదిత్య భూపతి, నేలటికెట్టు మధ్య జరిగే ఓ ఆసక్తికరమైన సన్నివేశంతో తొలిభాగం ముగుస్తుంది.

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    ఇక రెండో భాగంలో ఆదిత్య భూపతి వేసే ఎత్తులకు నేలటికెట్టు పై ఎత్తులు వేయడం, ప్రీక్లైమాక్స్‌లో భావోద్వేగమైన ఎపిసోడ్‌ ఆకట్టుకునేలా ఉంటుంది. డబ్బులో ఆనందంలో ఉండదు. మన చుట్టు ఉండే జనమే మనకు ఆనందం, సంపద అనే చక్కటి పాయింట్‌తో కథ ముగుస్తుంది.

    దర్శకుడు కల్యాణ్ కృష్ణ

    దర్శకుడు కల్యాణ్ కృష్ణ

    చుట్టు జనం మధ్యలో మనం అనే పాయింట్‌ను దృష్టిలో పెట్టుకొని కల్యాణ్ కృష్ణ చేసిన మాస్ కథా చిత్రం నేలటికెట్టు. చెప్పుకోవడానికి పెద్దగా కథలో పెద్దగా బలం లేకపోయినప్పటికీ.. ఎమోషనల్ సీన్ల పేర్చుకొంటూ వెళ్లిన తీరు ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. రవితేజ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ తగినట్టుగా కథను అల్లుకొన్నాడు. మాస్ ఎలిమెంట్స్ జొప్పించి హాస్యాన్ని పండించాడు. ఇప్పటి వరకు క్లాసిక్ చిత్రాలను రూపొందించిన కల్యాణ్ కృష్ణ మాస్ చిత్రాలను కూడా తెరకెక్కించగలనని ఈ చిత్రం ద్వారా నిరూపించుకొన్నారు.

    మాస్ మహారాజా రవితేజ ఫెర్ఫార్మెన్స్

    మాస్ మహారాజా రవితేజ ఫెర్ఫార్మెన్స్

    నేలటికెట్టు లాంటి పాత్రలు రవితేజకు కొట్టిన పిండి. హాస్యం, యాక్షన్ మేలవించి ఇలాంటి పాత్రలు ఎన్నో చేశారు. కానీ నేల టికెట్టు పాత్ర రవితేజకు కొత్తదనం లేని రొటిన్ పాత్ర. అయినా తనదైన మార్కులో ఎమోషన్స్ పలికించాడు. ఆనాధలు, వృద్ధుల ఎపిసోడ్స్‌లో రవితేజ విజృంభించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రవితేజ చెప్పిన అంశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి.

    మాళవిక శర్మ గ్లామర్

    మాళవిక శర్మ గ్లామర్

    తెలుగు తెరకు తొలిసారి పరిచయమైన మాళవిక శర్మ డాక్టర్ పాత్రలో కనిపించింది. కథలో పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్ర. ఆట, పాటలకు, అందాల ఆరబోతకు మాత్రమే పరిమితమైంది. నటన పరంగా ఇంకా నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. నేల టికెట్టు పాటలో మాళవిక ఆకట్టుకొన్నది.

    జగపతిబాబు, సంపత్ రాజ్ నటన

    జగపతిబాబు, సంపత్ రాజ్ నటన

    నేల టికెట్టు చిత్రంలో కథ అంతా జగపతిబాబు చుట్టే తిరుగుంది. ప్రాధానంగా విలన్ యాంగిల్‌లో నడవడంతో జగపతిబాబు పాత్ర హైలెట్‌గా ఉంటుంది. జగపతి బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్, విలనిజం కొత్తగా ఉంటాయి. అయితే ఇటీవల పోషించిన పాత్రలకు భిన్నంగా మాత్రం ఆదిత్య భూపతి పాత్ర ఎక్కడ కనిపించదు. సినిమాలో సంపత్ రాజ్ పాత్ర చాలా లో ప్రొఫైల్‌లో ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో సంపత్ రోల్ బౌన్స్ కావడం, కథకు బలం చేకూరే విధంగా ఉంటుంది. ప్రేక్షకులు పెద్దగా గుర్తుంచుకొనే పాత్ర కాదని చెప్పవచ్చు.

     ఇతర పాత్రల్లో

    ఇతర పాత్రల్లో

    నేల టికెట్టు చిత్రంలో బోలెడంత మంది ఆర్టిస్టులు పనిచేశారు. బ్రహ్మనందం, ప్రియదర్శి, కౌముది, సురేఖవాణి, పోసాని, బ్రహ్మాజీ ఎల్బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి లాంటి పాత్రలు చాలానే కనిపిస్తాయి. కానీ ఏ పాత్రకు గొప్పగా కనిపించదు. కేవలం కథకు సపోర్టుగానే నిలిచాయి. ఆలీ, ప్రియదర్శి, పృథ్వీ కామెడి కొంత రిలీఫ్‌గా ఉంటుంది.

    సాంకేతిక వర్గాలు.. పనితీరు

    సాంకేతిక వర్గాలు.. పనితీరు

    నేల టికెట్టు చిత్రానికి సంబంధించిన టెక్నికల్ విషయాలలో సినిమాటోగ్రఫి ప్రధాన ఆకర్షణ. ఏరియల్ షాట్స్ చాలా రిచ్‌గా ఉంటాయి. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ విభాగం పనితీరు చాలా బాగుంది. చోటా కే ప్రసాద్ కత్తెర పదును వాడివేడిగా ఉంది.

    శక్తికాంత్ మ్యూజిక్

    శక్తికాంత్ మ్యూజిక్

    ఫిదా చిత్రంతో ఆకట్టుకొన్న శక్తికాంత్ నేల టికెట్టు చిత్రానికి సంగీతం అందించారు. ఫిదాలో ఫీల్ గుడ్ మ్యూజిక్‌ను, మెలోడిలను అందించిన ఆయన ఈ చిత్రంలో మాస్ బీట్స్‌ ప్రయత్నించారు. ఒకట్రెండు పాత్రలు తప్ప పెద్దగా గుర్తుంచుకో తగిన పాటలు లేకపోవడం ఓ మైనస్ అని చెప్పవచ్చు.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    నేల టికెట్టు చిత్రానికి నిర్మాత రామ్ తాళ్లూరి. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను చాలా రిచ్‌గా రూపొందించారు. భారీ తారాగణంతో స్క్రీన్ నిండా పాత్రలు కనిపిస్తాయి. అందమైన లొకేషన్లు, సెట్స్‌‌తో సినిమా అంతా కలర్ ఫుల్‌గా ఉంటుంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    మాస్ అంశాలతోపాటు కొన్ని ఎమోషనల్ పాయింట్స్ కలబోసిన చిత్రం నేలటికెట్టు. ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా సినిమా చూసొద్దామనే ప్రేక్షకులకు, రవితేజ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా పక్కా చాయిస్. ఇక కొత్తదనం ఆశించే వారికి కొంత నిరాశనే మిగులుస్తుంది. వీకెండ్ సినిమా లవర్స్‌కు టైంపాస్ మూవీ.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    రవితేజ యాక్టింగ్
    మాళవిక శర్మ గ్లామర్
    కల్యాణ్ కృష్ణ టేకింగ్
    కథ, స్క్రీన్ ప్లే

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు, సంపత్ రాజ్, బ్రహ్మనందం, ఆలీ, పోసాని మురళీకృష్ణ, సుబ్బరాజు, అజయ్, సురేఖవాణి, ప్రియదర్శి, బ్రహ్మజీ తదితరులు
    కథ, దర్శకత్వం: కల్యాణ్ కృష్ణ కురసాల
    నిర్మాత: రామ్ తాళ్లూరి
    స్క్రీన్ ప్లే: సత్యానంద్
    సంగీతం: శక్తికాంత్ కార్తీక్
    సినిమాటోగ్రఫి: ముఖేష్ జీ
    ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
    బ్యానర్: ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్
    రిలీజ్ డేట్: మే 25 2018

    English summary
    Nela Ticket cinema review:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X