twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తాతగారింటికి దారేది...(‘చిన్నదాన నీకోసం’ రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5

    ----సూర్య ప్రకాష్ జోశ్యుల

    పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం 'అత్తారింటికి దారేది'. ఆ సినిమా కథని తీసుకుని హీరో పాత్రని హీరోయిన్ చేసేసి, తాత దగ్గరకు అత్తను తీసుకువెళ్లే కాన్సెప్టుని కొద్దిగా మార్చి.. ...తాతనే ...తన తల్లి తండ్రుల దగ్గరకు తీసుకు వెళ్తే...ఏమౌతుంది..ఎలా ఉంటుంది...అంటే ‘చిన్నదాన నీకోసం' సినిమా కథలాగ ఉంటుంది. అదేంటి ..ఆల్రెడీ కొంచెం అటూ ఇటూలో ..యాజటీజ్ రివర్స్ లో గోవిందుడు అందరివాడేలే చూసాం కదా అంటారా...ఇప్పుడు ఇదీ చూడండి.. అంటూ నితిన్ తనకు పవన్ మీద అభిమానం చూపించుకుంటూ ఇలా రంగంలోకి దిగాడు.

    అంతేకాకుండా పవన్ అభిమానులను ఆకర్షించటానికి..పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంలోని 'యే చికిత...' పాటలోని ప్రారంభంలో వచ్చే పవన్ కౌబాయ్ గెటప్ ఫుటేజ్ ని తీసుకుని కలిపివదిలారు. అయితే ఎన్ని ఉన్నా...అది 'అత్తారింటికి దారేది' అనుకరణే అవుతుంది కానీ...మ్యాజిక్ క్రియేట్ కాదనే విషయం మర్చిపోయారు. ఫస్టాఫ్ ఫన్ తో పరుగెత్తినా....సెకండాఫ్ డెడ్ స్లో అయిపోయి, డీవియేట్ అయ్యిపోయి విసుగెత్తించింది. ముఖ్యంగా ఇది హీరో కథ కాదు... హీరోయిన్ తన తాతను తీసుకెళ్లి తన తల్లితండ్రులు కలిపే కథ కావటంతో నితిన్ కూడా చేయటానికి ఏమీ లేక ఏదో సహాయపాత్రలాగ మిగిలాడు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    పవన్‌కల్యాణ్‌ వీరాభిమాని అయిన నితిన్(నితిన్) చేసిన ఓ ఫైట్ లాంటి మంచిపనివల్ల సిటీలో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్ రెడ్డిగారు(నాజర్) అభిమానం పొందుతాడు. మరోప్రక్క గర్ల్ ప్రెండ్ కోసం అన్వేషిస్తున్న నితిన్ కి నందిని(మిస్తి చక్రవర్తి)కనపడుతుంది. ఆమెను ఫాలో అయ్యి ప్రేమలో పడేద్దామనుకుంటే...ఆమె ...రెడ్డిగారితో సాన్నిహిత్యం కోసం ప్రయత్నిస్తూంటుంది. తన వెనక నితిన్ పడుతున్నాడని అర్దం చేసుకున్న నందిని అతనికి, రెడ్డి గారికి ఉన్న చనువుని వాడేసుకుని ఆయనతో రిలేషన్ షిప్ పెంచుకుంటుంది. అంతేకాకుండా ఓ రోజు రెడ్డి గారిని తీసుకుని బర్సెలోనా వెల్లిపోతుంది. అసలు రెడ్డిగారికి, నందిని కు ఉన్న రిలేషన్ ఏమిటి..ఆయనతో ఎందుకు సాన్నిహిత్యం సంపాదించుకోవాలనుకుంది...నందిని ప్రేమని ఎలా నితిన్ పొందాడు అన్న విషయం తెలియాలంటే మిగతా కథ తెరపై చూడాల్సిందే.

    పైన చెప్పుకున్నట్లు వాస్తవానికి ఈ కథ హీరో వైపు నుంచి చెప్పబడలేదు. సమస్య అతనికి కాదు. పోని హీరోయిన్ సమస్యను తీసుకుని తన భుజం మీద వేసుకుని అక్కడ నుంచి సమస్యలు వస్తే అతను కథలో ఇమిడిపోయేవాడు. అలాకాకపోవటంతో హీరోయిన్ ..తన తాతని, తన తల్లి తండ్రులతో కలుపుతుందా లేదా అన్నది ప్రధానంగా హైలెట్ అయ్యింది. సినిమాలో ఉన్న ఏకైక ఎమోషన్ ని ఆమె లాక్కెళ్లిపోయింది. పోనీ అదైనా సరిగ్గా ఎలివేట్ చేసారా అంటే అదీ లేదు. అత్తారింటికి దారేది సినిమాలో తాత గారి ఆరోగ్య పరిస్ధితి బాగోలేదు...ఆ పెద్దాయన తన కూతురుని చూడాలని కొట్టిమిట్టాడుతున్నాడు అన్న సమయంలో హీరో బయిలుదేరటంతో, అది టైమ్ లైక్ అదీ సెట్ అయ్యింది. ఇక్కడ అలాంటిదేమీ లేదు...హీరోయిన్ కి తన తాతని, తల్లి తండ్రులను కలపాలనిపించింది..అంతే బయిలుదేరింది...అది అబద్దం ఆడి తీసుకుని వెళ్లాలనుకుంది కానీ, ఒప్పించి తీసుకెళ్లాలనుకోలేదు. ఇలా ఆమె పాత్ర సరిగ్గా జస్టిఫై చెయ్యలేదు. హీరో క్యారెక్టర్ అయితే సరేసరి.

    స్లైడ్ షోలో మిగతా రివ్యూ

    పెద్ద మైనస్

    పెద్ద మైనస్

    సినిమాలో గే కామెడీ బాగా విసుగించింది..దాన్ని తొలిగిస్తే మేలు. ఏదో గుండెజారి గల్లంతైందిలో హిట్టైంది కదా అని దాని మోడల్ తెచ్చి పెట్టారు. ఆ ఎపిసోడ్ ఎంత జుగుప్స కలిగించిందీ అంటే జనం లేచి వెళ్లేంత.

    మలుపులూ, మెరుపులూ..

    మలుపులూ, మెరుపులూ..

    దర్శకుడుగా కరుణాకరన్...ఎందుకనో తొలి ప్రేమ నాటి మ్యాజిక్ ని ఎప్పుడో కోల్పోయినట్లు ఈ మధ్య వచ్చిన ఆయన సినిమాలు చూస్తూంటే అనిపిస్తోంది. ఒరిజినాలిటి వదిలేసి ఇలాంటి స్ఫూఫ్ ఐడియాతో ఎలా వచ్చాడో మరి. దర్శకత్వంలో కూడూ పెద్ద చెప్పుకోదగ్గ మెరుపులూ లేవు, స్క్రీన్ ప్లే లో మలుపులూ లేవు.

    సేమ్ క్యారెక్టరైజేషన్

    సేమ్ క్యారెక్టరైజేషన్

    నితిన్ కు ఇలాంటి క్యారెక్టర్స్ కొట్టిన పిండిలా మారాయి. లుక్స్,గెటప్స్ విషయంలో మార్పుని చూసుకుంటున్నాడు కానీ క్యారెక్టర్ మాత్రం అదే చేస్తున్నాడు గత మూడు చిత్రాల్లో కంటిన్యూగా. ఇక పవన్ ఫ్యాన్ గా కూడా బాగా చేసాడు. నిజ జీవితంలోనూ పవన్ ఫ్యాన్ కావటంతో అది ప్రతిఫలించింది.

    కొత్త అమ్మాయి

    కొత్త అమ్మాయి


    నితిన్ కి జోడీగా నటించిన బాలీవుడ్ భామ మిష్తి చక్రవర్తి...గ్లామర్ గా ఉంది. ట్రెడిషనల్ డ్రస్ లలోనూ, మోడ్రన్ డ్రస్ లలో నూ బాగానే కనిపించింది. తెలుగులో ఆమెకు అవకాశాలు ఇచ్చినా ప్రూవ్ చేసుకునేటట్లు ఉంది.

    ఫస్టాఫ్-సెకండాఫ్-ఇంటర్వెల్-క్లైమాక్స్

    ఫస్టాఫ్-సెకండాఫ్-ఇంటర్వెల్-క్లైమాక్స్

    చిత్రం ఫస్టాఫ్ ఎత్తుగడ మెల్లిగా ఓకే అనిపించుకుంటూ కాసేపటికి ఫరవాలేదు అనిపించింది. ఇంటర్వెల్ కూడా అద్బుతం అనిపించకపోయినా ఓకే అనిపించింది. ఇక సెకండాఫ్ కష్టం అనిపించింది.

    టెక్నికల్ గా...

    టెక్నికల్ గా...

    సినిమాటోగ్రఫి బాగుంది. అలాగే అనూప్ సంగీతం కూడా సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ మాత్రం సెకండాఫ్ లో నత్త నడక నడిచింది..దాన్ని మరింత స్పీడ్ చేసి ఉంటే బాగుంది.

    కామెడీ, డైలాగులు

    కామెడీ, డైలాగులు

    చిత్రంలో తాగుబోతు రమేష్ కామెడీ మాత్రమే పేలింది. మిగతాది సోసో. గే కామెడీ అయితే వికారం పుట్టించింది. మాటల రచయిత..హర్షవర్ధన్..ఇంతకుముందు చేసిన గుండెజారి గల్లంతయ్యింది, ఇష్క్, మనం చిత్రాల మ్యాజిక్ ని చేయలేకపోయారు. కథ సహకరించినట్లు లేదు.

    ఎవరెవరు...

    ఎవరెవరు...

    బ్యానర్: శ్రేష్ట్ మూవీస్
    నటీనటులు: నితిన్, మిస్తి,నాజర్, అలీ, నరేష్, సితార, మధునందన్ తదితరులు
    కెమెరా: ఆండ్రూ,
    మాటలు: హర్షవర్ధన్,
    సంగీతం: అనూప్‌రూబెన్స్,
    పాటలు: కృష్ణచైతన్య,
    ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి,
    ఆర్ట్: రాజీవ్ నాయర్,
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్.
    నిర్మాతలు: ఎన్.సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి
    సమర్పణ: విక్రమ్‌ గౌడ్‌.
    విడుదల తేదీ: 25 డిసెంబర్,2014

    నితిన్ చేస్తున్న వరస రొమాంటిక్ కామెడీల సరసన ఈ సినిమాని కూర్చోబెట్టడానికి అసలు పనికిరాదు. నితిన్ కు యూత్ లో ఉన్న క్రేజ్ తో కొంతవరకూ లాగవచ్చేమో కానీ...ఇది తిరోగమనమే. ఇలాంటి స్పూఫ్ లాంటి కథ,కథనాలకు దూరంగా ఉండటం...ఫామ్ లో కి వచ్చి హిట్లు కొడుతున్న నితిన్ కెరీర్ కు అవసరం.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Nithiin's Chinnadana Nee Kosam movie released today with divide talk. Nitin plays the role of a young man, who's an ardent fan of Pawan Kalyan, in this romantic comedy. When his family members coax him to reveal if he has a girl friend, he proclaims that he hasn't met the right girl yet; however, his life changes once he meets Nandini (Mishti Chakraborty). Anup Rubens has scored the music for this film which has been directed by A Karunakaran.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X