twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్(ర్ట్) ఎటాక్ ( రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    కెరీర్ ప్రారంభంలో ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మా...నాన్న తమిళ అమ్మాయి, శివమణి వంటి లవ్ స్టోరీ లు అందించిన పూరీ తర్వాత కాలంలో మెల్లిగా మసాలా ఎంటర్టైనర్స్‌లో పడి వాటికి దూరం అయిపోయాడు. అయితే చాలా కాలం తర్వాత లవ్ స్టోరీలతో హిట్స్ కొడుతున్న నితిన్ తో ప్రేమ కథ చేస్తానంటూ ముందుకొచ్చి ఈ చిత్రం అందించాడు. దాంతో ఏ రేంజి లవ్ స్టోరీ తెరపై ఆవిష్కారమవుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే పూరీ మాత్రం తనదైన మసాలా సీన్స్, హాట్ డైలాగ్స్ తో తెరను వేడిక్కించే ప్రయత్నం చేసాడు. దానికి తోడు ఈ కథ అమ్మాయిలని కిడ్నాప్ చేసి, అమ్మేసే విలనిజంతో పాత ఫంథాలోనే నడిచింది. ఫస్టాఫ్ లైటర్ వీన్ సీన్స్ తో ఓకే అనిపించినా...సెకండాఫ్ మరీ రొటీన్ అనిపించింది. అయితే స్టైలిష్ మేకింగ్‌తో, వేగంగా నడిచే సీన్స్ తో తనదైన శైలి డైలాగులతో చివరిదాకా కూర్చోబెట్టడం పూరీ ప్రత్యేకత...అదే ఈ సినిమాకు ఉన్నంతలో ప్లస్ అయ్యింది.

    ప్రేమపై పెద్దగా నమ్మకాలు లేని వరుణ్(నితిన్) ఓ ట్రావెలర్‌. ప్రపంచమంతా తిరుగుతూ అందులో భాగంగా స్పెయిన్ రాగా అక్కడ అక్కడే హయాతి (ఆదాశర్మ) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే ఆమెని ఇష్టపడ్డ వరుణ్ ఓ ముద్దు ఇవ్వమని వెంబడిస్తాడు. ఆమె అతన్ని మొదట ఇష్టపడకపోయినా మెల్లిమెల్లిగా అతనితో ప్రేమలో పడుతుంది. తర్వాత అతనికి ప్రేమ, పెళ్లి అంటే ఇష్టపడవని తెలుసుకుని దూరంగా వెళ్లిపోతుంది. ఆమె దూరం వెళ్లిపోయాక ఆమె విలువ తెలుసుకున్న వరుణ్ ఆమె కోసం వెతకటం మొదలెటతాడు. ఈ లోగా ఆమె ఓ పెద్ద సమస్యలో చిక్కుకుంటుంది. ఆ సమస్య ఏమిటి...వరుణ్ ఎలా ఆమెను ఎలా సమస్యనుంచి తప్పించి, తన ప్రేమను గెలిపించుకున్నాడు అనేది మిగతా కథ.

    పూరి జగన్నాథ్ సినిమాలు గత కొంతకాలంగా భారత దేశాన్ని వదిలి బ్యాంకాక్ వెళ్లి ఇప్పుడు స్పెయిన్‌లో సెటిలవుతున్నాయి. కానీ కథలు మాత్రం ఆయన సినిమాల్లో రొటీన్ గా కనిపించే మసాలా, ఫార్ములా కామెడీ తోనే తయారవుతున్నాయి. అదే తరహాలో నితిన్ తో కొత్త తరహా ప్రేమ కథ అంటూ వచ్చిన ఈ సినిమాలోనూ గతంలో ఆయన చిత్రాల్లోనే వచ్చిన సీన్స్ రిపీట్ అయ్యాయి. నితిన్ అయితే ఎవరో ఏమిటో చెప్పడు..కేవలం ట్రావెలర్ అంటారు. ట్రావెలర్ అనేది కొత్త క్యారక్టరైజేషన్ కావచ్చు కానీ ఎంతమందికి అది కనెక్టు అవుతుందనేది చూడాలి.

    పూరీ జగన్నాథ్ సూపర్ హిట్లు ఇడియట్ వంటి వాటిల్లో హీరో ప్రేమకథకీ, విలన్ పాత్రకు బాగా దగ్గర సంభంధం ఉండటంతో అవి కథలో కలిసిపోయి వేరేగా అనిపించవు. కానీ ఈ చిత్రంలో హీరోకి, విలన్ కి సంబంధం ఉండదు. కేవలం హీరోకి ఫైట్స్ కోసమే అన్నట్లు విలనిజం ఎస్టాబ్లిష్ చేసారు. సినిమా చివర్లో వచ్చే క్లైమాక్స్ కోసం మొదట నుంచి హీరోకు సంబంధం లేకుండా విలన్ ట్రాక్ రన్ అవుతూంటుంది. అలాగే హీరో కి సహాయం కావాలనుకున్నప్పుడుల్లా వాటంతట అవే(అలీ, ప్రకాష్ రాజ్ పాత్రలు) ఎదురుగా ప్రత్యక్ష్యమవుతూంటాయి. హీరోయిన్ పాత్ర చూస్తే...తన తండ్రిపై ఎంతో ప్రేమ ఉన్న ఆమె ఒంట్లో బాగోపోతే స్పెయిన్ వచ్చి గడపటం ఎందుకనేది స్పష్టత లేదు. కేవలం హీరో అక్కడ పరిచయం అవుతాడే కాబట్టే వచ్చినట్లుంది. అలాంటి పాత్ర తన తండ్రి కోసం సెకండాఫ్‌లో తన ప్రేమను పణంగా పెట్టి జీవితాన్ని త్యాగం చేస్తూంటే ఆశ్చర్యం వేస్తుంది.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

    మెయిన్ హైలెట్...

    మెయిన్ హైలెట్...

    సినిమా లో చెప్పుకోదగ్గ గొప్ప అంశం... కెమెరా వర్క్. ఇక 'నువ్వంటే నాకు ' సాంగ్, ఇంటర్వెల్ వద్ద వచ్చే ముద్దు సీన్ మాత్రమే. హీరో,హీరోయిన్స్ మధ్య చోటు చేసుకునే సుదీర్ఘ ముద్దు సీన్ కు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

    పెద్ద మైనస్...

    పెద్ద మైనస్...

    స్క్రీన్ ప్లే ఈ సినిమాలో చాలా నీరసంగా ఉంటుంది. రొటీన్ కథే అయినా స్క్రీన్ ప్లే దాన్ని మాయ చేస్తూంటారు. అయితే ఈసారి పూరీ రొటీన్ కథని అంతకంటే రొటీన్ స్క్రీన్ ప్లే చెప్పే ప్రయత్నం చేసారు. చాలా ప్రెడిక్టిబుల్ గా సంఘటనలు జరుగుతూంటాయి. అలాగే హీరో సమస్యలో పడగానే అతనికి దర్శకుడు సాయిం చేస్తున్నట్లుగా అన్ని ఎదురువస్తూంటాయి. దాని కోసం ఆల్కెమిస్ట్ పుస్తకంలోని నీ కోరిక బలంగా ఉన్నప్పుడు నీకు సాయిం చేయటానికి ప్రపంచమంతా కుట్ర పన్నుతుందనే వాక్యం చెప్పినా కనెక్టు కాలేదు.

    నితిన్

    నితిన్

    ఎప్పటిలాగే నితిన్ ప్రేమ సన్నివేశాల్లో సూపర్ గానూ, యాక్షన్ సన్నివేశాల్లో సోసో గానూ కనిపించాడు. నితిన్ ఎందుకో యాక్షన్ సీన్స్ కి వర్కవుట్ కాడని మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేసినట్లు అనిపిస్తుంది.

    విలన్ గ్యాంగ్

    విలన్ గ్యాంగ్

    ఈ చిత్రంలో సబ్ ప్లాట్ గోవా డ్రగ్ రాకెట్, అమ్మాయిల అమ్మకం చుట్టూ అల్లారు. విలన్స్ ని ఆనేపధ్యం నుంచి సృష్టించారు. ఎంత గోవా డ్రగ్ రాకెట్ పెట్టుకున్నా అమ్మాయిలని ఎత్తుకుని అమ్మేయటం అనే విలనిజం పాత గానే అనిపిస్తుంది. అలాగే హీరోకి విలన్ కి మధ్య సన్నివేశాలు కేవలం క్లైమాక్స్ కు మాత్రమే పరిమితం చేసుకున్నారు. లవ్ స్టోరి కదా ఎక్కువ ఎందుకు అనుకున్నారో ఏమో కానీ, విలనిజం మాత్రం కథలో కలిసినట్లు ఉందదు.

    మరో దేశముదురు

    మరో దేశముదురు

    పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని తన ఇడియట్ తో పోల్చారు కానీ నిజానికి దేశముదురు చిత్రం గుర్తుకు వస్తుంది. హీరోయిన్ వెంట హీరో పడినా ఆమె పట్టించుకోకపోవటం..ఒప్పుకునే సమయానికి విలన్స్ రావటం....విలన్స్ చేతిలో దెబ్బ తిని కోమాలో ఉన్న వ్యక్తి, చివరకు హీరో..తను ప్రేమించిన అమ్మాయి కోసం వారిని తుదముట్టించటం...

    డైలాగ్స్...

    డైలాగ్స్...

    దేముడా పైరసీ చేయటం కూడా నేర్చుకున్నావా ( తనలాంటి ఆలోచనలు ఉన్న మరో అమ్మాయిని చూసి హీరో ...చెప్పే డైలాగు), అమ్మాయిలు,అబ్బాయిల గురించి హీరో చెప్పేవి..పూరీ ఎప్పటిలాగే తన కలం పదును చూపెట్టి రాసారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    సాంకేతికంగా

    సాంకేతికంగా

    అమోల్ రాధోడ్ అందించిన సినిమాటోగ్రఫీ హైలెట్ అని చెప్పాలి. చాలా సీన్స్ గ్రాండియర్ గా చూపెట్టడం,బ్రిలియంట్ గా స్పెయిన్ లో చిత్రీకరణ చేసారు. ఎడిటింగ్ ని యాక్షన్ సీక్వెన్స్ లో శేఖర్ అదరొట్టారు.

    సంగీతం

    సంగీతం

    నితిన్ చిత్రాలకు వరసగా సంగీతం అందిస్తున్న అనూప్..ఈ సారి ఒక్క హిట్ పాట తోనే సరిపెట్టారు. అలాగే రీ రికార్డింగ్ కూడా పూరి గత చిత్రాల రేంజిలో లేదు.

    కామెడీ...

    కామెడీ...

    పూరీ చిత్రాల్లో బ్రహ్మానందం,అలీ కామెడీలకు ప్రత్యేకంగా స్లాట్ ఉంటుంది. ఎందుకనో గత కొంత కాలంగా ఆయన కామెడీ పేలటం లేదు. ఇందులో బ్రహ్మానందం కామెడీ బాగుండి ఫస్టాఫ్ కు ప్లస్ అయినా, అలీ కామెడి అసలు వర్కవుట్ కాలేదు. సెకండాప్ లో కేవలం సీన్స్ ఫిల్ చేయటానికే ఉపకరించింది.

    ఎవరెవరు

    ఎవరెవరు

    చిత్రం: హార్ట్‌ ఎటాక్‌,
    సంస్థ: పూరి టూరింగ్‌ టాకీస్‌
    నటీనటులు: నితిన్‌, అదాశర్మ, అజీజ్‌ఖాన్‌, అలీ, బ్రహ్మానందం తదితరులు
    సంగీతం: అనూప్‌ రూబెన్స్‌,
    పాటలు: భాస్కరభట్ల,
    కెమెరా: ఆమోల్ రాథోడ్,
    ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్,
    ఆర్ట్: బ్రహ్మ కడలి,
    ఫైట్స్: రామ్-లక్ష్మణ్,
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ,నిర్మాత : పూరి జగన్నాథ్.
    సమర్పణ : లావణ్య
    విడుదల: 31,జనవరి,2014.

    ఏదైమైనా నితిన్, పూరీ కాంబినేషన్ అంటే ఇంత రొటీన్ చిత్రాన్ని ఎక్సపెక్ట్ చేయం. మిగతా అన్ని విషయాల్లోనూ అడ్వాన్స్ గా ఉండే పూరీ ఎందుకనో కథల విషయానికి వచ్చేసరికి తడబడుతున్నారు. పూరి తడబాటుని క్షమించేసి, సినిమా చూడగలిగితే ఓకే అనిపిస్తుంది. పోకిరి వంటి చిత్రం అని ఊహించుకుని వెళితే...మన మనస్సు మీద ఎటాక్ చేసిన ఫీలింగ్ మిగులుతుంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Nitin’s new movie Heart Attack directed by Puri Jagannath is released today. This is the first film in this combination and the leading lady of the film is Aada Sharma. Music is scored by Anup. Ali and Brahmanandam also starred in the film. Heart Attack is the first movie coming from Puri Touring Talkies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X