twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అదుర్స్' కాదు 'రొటీ(సీ)న్స్'

    By Srikanya
    |
    Adurs
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సంస్థ: వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
    నటీనటులు: ఎన్టిఆర్, నయనతార, షీలా బ్రహ్మానందం, షాయజీ షిండే, రాజ్యలక్ష్మి, ఆశిష్ విధ్యార్ది తదితరులు.
    కథ, మాటలు: కోన వెంకట్
    ఆర్ట్: ఆనంద సాయి
    కెమెరా: ఛోటా.కె.నాయుడు
    ఎడిటింగ్: గౌతం రాజు
    సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
    నిర్మాత: వల్లభనేని వంశి
    సమర్పణ: కొడాలి నాని
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వివి వినాయిక్
    రిలీజ్ డేట్: జనవరి 13,2010

    షూటింగ్ లేటు, మధ్యలో ఎన్టీఆర్ యాక్సిడెంట్, హీరోయిన్ మార్పిడి, తర్వాత తెలంగాణా వివాదం అంటూ రకరకాల అవాంతరాలు ఎదురై ఎట్టకేలకు ఇన్నాళ్ళుకు 'అదుర్స్' ధియోటర్స్ ని పలకరించింది. అయితే ఎదురుచూపులతో ఉన్న ప్రేక్షకులకు మాత్రం ఎక్సపెక్ట్ చేసినంత కిక్ ఇవ్వటంలో విఫలమైంది. ఎన్టీఆర్ వంకపెట్టలేని నటించినా కథ మరీ రాముడు-భీముడు కాలం నాటిది కావటం పెద్ద మైనస్ అయింది. ఎన్టీఆర్ డాన్స్ లు,బ్రహ్మానందం కామెడి కోసం, హీరోయిన్స్ గ్లామర్ కోసం అయితే ఓ లుక్కేయచ్చు. టైటిల్ కు తగ్గట్లుగా సినిమా మరీ అదుర్స్ అని ఊహించుకుని ఫిక్స్ అయి వెళితే మాత్రం నిరాశపడక తప్పదు.

    చిన్నప్పుడే విడిపోయిన కవల పిల్లలు ...ఒకరు నరసింహ(ఎన్టీఆర్),నరసింహాచారి(ఎన్టీఆర్)గా పెరిగి పెద్దవుతారు. వాళ్ళలో తల్లి(రాజ్య లక్ష్మి) దగ్గర పెరిగిన నరిసింహం పోకిరి సినిమాలో మహేష్ లా అండర్ కవల్ పోలీస్ లాగ పనిచేస్తూ సిటీలో గూండా ముఠాలను ఏరివేస్తూంటాడు. మరొకడు బ్రహ్మాణ కుటుంబంలో పెరిగి బ్రహ్మానందం (పురోహితుడు) దగ్గర అసెస్టింట్ గా పనిచేస్తూంటాడు. ఇక వీరిద్దరి తండ్రి(నాజర్)ని విలన్(మహేష్ ముంజ్రేకర్) కిడ్నాప్ చేసి ఆయుధాలు తయారు చేయటానికి ప్రయత్నిస్తూంటాడు. ఈ క్రమంలో ఈ విడిపోయిన అన్నదమ్ములు ఎలా కలుస్తారు. తమ తండ్రిని ఎలా రక్షించుకుంటారనేది మిగతా కథ.

    'రాముడు-భీముడు' నుంచి నిన్న మొన్నటి 'హలో బ్రదర్' దాకా ఇలాంటి సినిమాలు ఎన్నో చూసిన తెలుగు ప్రేక్షకుడుకి ఈ సినిమా కథ కొత్త అనుభూతి ఇవ్వదు. అయితే మరి ఈ చిత్రంలో ఏ ఎలిమెంట్స్ ఆకర్షించి చిత్రం చేసారు అంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలో బాగా సేలబుల్ గా మారిన కామిడి ఉండటం(అదీ 'ఢీ' వంటి సూపర్ హిట్ కు కథ అందించిన కోన వెంకట్ స్టోరీ కావటం కారణం) కావచ్చు. అయితే కామిడీ పండలేదా అంటే బ్రహ్మానందం,ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా వరకూ వర్కవుట్ అయ్యాయి.

    అయితే దురదృష్టం ఏమిటి అంటే ఆ సన్నివేశాల వల్ల కథ కొద్దిగా కూడా కదలదు. అలాగే ఇంటర్వెల్ వరకైనా ద్వి పాత్రలు(ఎన్టీఆర్)లు ఒక చోటకి వచ్చి కలిస్తే కథ రక్తి కట్టేది. అలా కాకుండా సెంకండాఫ్ సగం ఫైగా అయ్యే దాకా రెండు పాత్రలు తాము అన్నదమ్ములమని,ఇద్దరమని తెలుసుకోరు. అలాగే ఇద్దరికి ఉన్న ఏకైక లక్ష్యం(తండ్రిని రక్షించటం)కోసం నడుం కట్టరు. దాంతో ఏ పాత్రకీ సరైన లక్ష్యం(కథకు లక్ష్యం) లేక కాంఫ్లిక్ట్ పుట్టదు. ఇక తండ్రి ఎపిసోడ్ వద్దకు వస్తే అది హృతిక్ రోషన్ 'క్రిష్' చిత్రంలోది లిప్ట్ చేసినా పండలేదు. ఎందుకంటే విలన్స్ దాదాపు పాతికేళ్ళ క్రితం నాజర్ ని ఎత్తుకుపోయి ఫుడ్ పెట్టి పోషిస్తూంటారు. ఎందుకు అంటే అతను తయారు చేసే ఓ గొప్ప మారణాయుధం కోసం అంటారు.

    నిజానికి పాతికేళ్ళ క్రితం నాజర్ కి ఉన్న నాలెడ్జ్ తో ఈ కాలానికి సరిపోయే వెపన్స్ తయారు చేస్తే అది ఎందుకుపనికొస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. అయితే నాజర్ ఎప్పటి కప్పుడు అప్ డేట్ అయినట్లుగా(కంప్యూటర్స్ ని వాడుతూ..) ఓ అద్భుతమైన మారణాయుధాన్ని తయారు చేస్తాడు. ఇక పెద్ద డాన్ ని అని చెప్పుకునే మహేహ్ ముంజ్రేకర్ (అతనే ఎన్టీఆర్ తండ్రిని కిడ్నాప్ చేస్తాడు) డెన్ కి సినిమాలో పాత్రలు అందరూ ఏదో హోటల్ లోకి వచ్చి వెళ్ళినట్లు చాలా క్యాజువల్ గా వస్తూంటారు..పోతూంటారు(బ్రహ్మనందం, ఎమ్.ఎస్.నారాయణ,హీరోయిన్స్ ఇలా..) ఎవరూ రిస్ట్రిక్ట్ చేయరు. అయితే ఇంత విచిత్రమైన కథలోనూ ఎమ్.ఎస్.నారాయణ ని ఆత్మగా చూపెడుతూ.. బ్రహ్మానందంతో కామిడీ చేసే సన్నివేసాలు బాగా నవ్విస్తాయి. షాయీజి షిండే ఉన్నా పెద్దగా ఉపయోగించుకోలేదు.

    ఇక జూనియర్ ఎన్టీఆర్ అండర్ కవర్ కాప్ గా కామన్ గా అనిపించినా నరసింహాచారి పాత్రలో ఇమిడిపోయి అదరకొట్టాడు. ఇక విలన్ కి రైట్ హ్యాండ్ గా రఘుబాబు బాగా చేసాడు. అలాగే షీలా,నయనతార గ్లామర్ ఒలకపోసినా పెద్దగా వర్కవుట్ అయినట్లు అనిపించదు. ఇక దేవీశ్రి ప్రసాద్ పాటల్లో క్లైమాక్స్ లో వచ్చే అదుర్స్ టైటిల్ సాంగ్,వేరీజ్ పంచకట్టు..పాటలు బాగుంది. డైలాగులు విషయానికి వస్తే ప్రతీ చోట పంచ్ వేయటానికి ప్రయత్నం జరిగింది కానీ అనుకున్నంతగా పేలలేదు. దర్శకుడుగా వినాయిక్ పాత కథ నయినా కొత్తగా చెపుతాడనే(వెంకటేష్ తో చేసిన లక్ష్మి) ప్రతీతి ఉంది. అయితే ఈసారి పాత కథను పాత విధానంలో చెప్పటం విచిత్రం అనిపిస్తుంది.

    ఏదైమైనా ఓ పెద్ద స్టార్ ఎన్టీఆర్ చిత్రం చూడబోతున్నాం కాకుండా ఓ మామూలు కామిడీ చిత్రంలా ఫీలయితే ఫరవాలేదనిపిస్తుంది. హింస,అసభ్యత మరీ ఎక్కువగా లేదు కాబట్టి అభిమానులే కాకుండా ఫ్యామిలీలు కూడా ధైర్యం చేసే అవకాశం ఉంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X