»   » రసాభాస(‘రభస’ రివ్యూ)

రసాభాస(‘రభస’ రివ్యూ)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  Rating:
  2.0/5

  ---సూర్య ప్రకాష్ జోశ్యుల

  ఎన్టీఆర్ కు కెరీర్ ప్రారంభంలోనే ఆది, సింహాద్రి, యమదొంగ వంటి సూపర్ హిట్స్ పడటం, ఆ తర్వాత బృందావనం,బాద్షా వంటి కుటుంబాలను సైతం ఆకట్టుకునే చిత్రాలు రావటంతో అటు మాస్, ఇటు క్లాస్ రెండు వర్గాల్లోనూ క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ మధ్య కాలంలో తరుచూ పరాజయాలు పలకరిస్తూ ఉన్నా ఓపినింగ్స్ ,బిజినెస్ ఏ మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. దానికి తోడు 'రభస' చిత్రాన్ని పూర్తి యాక్షన్ గా కాకుండా ఎమోషన్స్ తో కూడిన కామెడీ చిత్రంగా కూడా ప్రమోట్ చేయటం సినిమాకు కలిసివచ్చింది. అలాగే ఎన్టీఆర్ పాడిన పాట ఇప్పటికే జనాల్లోకి బాగా వెళ్లటం, ఆయన ట్రేడ్ మార్క్ డాన్స్ లు అభిమానులకు ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెంచుకునేలా చేసాయి. అయితే ఆ అంచనాలును అందుకోవటానికి దర్శకుడు ఎక్కడా ప్రయత్నించలేదనిపిస్తుంది. ఎన్టీఆర్ కి ఇమేజ్ కి కొద్దిగా కూడా అతకని కథతో నానా 'రభస' చేయటానికి ప్రయత్నించాడు. సెకండాఫ్ లో వచ్చే బ్రహ్మానందం ఎపిసోడ్, ఎన్టీఆర్ నటన లేకపోతే చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పటికీ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో లాగ మొదటి నుంచి చివరి దాకా తన భుజాలపైనే సినిమాను మోయటానికి ప్రయత్నించాడు.

  కార్తీక్‌ (ఎన్టీఆర్‌) ...తన తల్లి(జయసుధ) కి మరదలు(మామయ్య షాయీజీ షిండే కూతురు)నే పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. అయితే అంత ఈజీ కాదు. తన చిన్నప్పుడే ఆ మామయ్య తన తండ్రి(నాజర్)తో విభేదించి సిటీకి వెళ్లి ఎదుగుతాడు. దాంతో ఇప్పుడు తన మరదలుని వెతుక్కుంటూ సిటీకి వస్తాడు. అక్కడకి వచ్చాక బాగ్యం(ప్రణీత)ని చూసి పొరబడి ఆమే తన మరదలు అనుకుని ఆమె వెంటబడతాడు. కొంత దూరం ఆ ప్రేమ ప్రయాణం జరిగాక... తన మరదలు ఆమెకాదు... తను ఎప్పుడూ గొడవపడే ఇందు (సమంత)అని రివిల్ అవుతుంది. సర్లే ఇందునే లైన్ లో పెడదామనుకుంటే ఇందు ఆల్రెడీ వేరే వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. అలాంటి పరిస్ధుతుల్లో కార్తీక్ తన తల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు...ఇందుని ఎలా ఒప్పించాడు అనేది రక రకాల ట్విస్ట్ లతో కూడిన కథ.

  తెలుగు సినిమా ఇంకా 'రెడీ' (చిత్రం) నుంచి ఇంకా బయిటకు రాలేదని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేస్తుంది. శ్రీను వైట్లను గుర్తు చేసేలా సీన్స్, డైలాగ్స్ రాసుకున్నా సినిమాలో కాంప్లిక్ట్ సరిగ్గా వర్కవుట్ చేయకపోవటం, నెగిటివ్ ఫోర్స్ స్పష్టంగా,బలంగా లేకపోవటంతో తేలిపోయినట్లైంది. అలాగే హీరో తన మరదలు ను వివాహం చేసుకునే దిసగా కథ మొదలెట్టి ఎటెటో వెళ్లిపోతుంది. పోనీ సెకండాఫ్ లో వచ్చి బ్రహ్మానందం ఎప్పటిలాగే రక్షిస్తాడు అనుకుంటే ఆ పాత్ర కొద్దిగా నవ్వించగలిగింది కానీ కథని (రెడీ లాగ) ముందుకు తీసుకువెళ్లేలా క్యారక్టర్ డిజైన్ చెయ్యలేదు. అలాగే అలీ పాత్ర ఎప్పటిదో పాత నాగార్జున అల్లరి అల్లుడులో బ్రహ్మానందం పాత్రను గుర్తుచేసింది..కానీ దానికీ ముగింపు ఇవ్వలేదు. ఇక ప్రణీత పాత్ర సైతం ముగింపు లేకపోవటంలో సమగ్రత లేకుండాపోయింది.

  మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

  ప్లస్ లు

  ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో సినిమాలో బ్రహ్మానందం పాత్ర బాగా పేలింది అని చెప్పటం కాస్త ఇబ్బందికరమే అయినా ఉన్నంతలో బ్రహ్మీనే థియోటర్ లో కాస్త నవ్వులు పూయించాడు. ఎందుకంటే మొదటి నుంచి ఈ సినిమా యాక్షన్ కామెడీ అని ప్రమోట్ చేసారు. అదే ఎక్సపెక్టేషన్స్ తో థియోటర్ కి వచ్చినవారికి కాస్త రిలీఫ్. అలాగే ఎన్టీఆర్ కాకుండా మరో హీరో చేసి ఉంటే ఈ మాత్రం కూడా చివరివరకూ చూడటం కష్టమయ్యేది.

  ఎన్టీఆర్ నటన

  ఎన్టీఆర్ సినిమాలు ఈ మధ్యన వచ్చేవన్నీ వన్ మ్యాన్ షో లు లాగే నడుస్తున్నాయి. దాదాపు కీలకమైన సీన్స్ ,డ్రామా మొత్తం అతని భుజాల మీద పెట్టి నడిపిస్తున్నారు. ఎన్టీఆర్ సైతం సమర్ధవంతంగానే మోస్తున్నాడు..కానీ కథలే సహకరించటం లేదు. ఇప్పుడూ అదే జరిగింది. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్, సెకండాఫ్ లో బ్రహ్మీతో వచ్చే కామెడీ సీన్స్ లో ఎన్టీఆర్ బాగా నవ్వించారు.

  వీక్ పాయింట్స్...

  రన్ టైం...162 నిముషాలు ఉండటం ఈ సినిమాకు బాగా లెంగ్తీ సినిమా చూసిన ఫీలింగ్ తీసుకు వచ్చింది. మొదటే చెప్పుకున్నట్లు రొటీన్ కథ,కథనం సినిమాను ప్రెష్ నెస్ లేకుండా చేసేసింది. అలాగే ప్రెడిక్టబుల్ ట్విస్ట్ లు సైతం పేలలేదు.. ఇక ఫస్టాఫ్ లో అయితే ఇంటర్వెల్ వచ్చేసినా కథలోకి రారు. సెకండాఫ్ అయితే రెడీ, దూకుడు,బాద్షా,మిర్చి లోంచి కొంచెం కొంచెం తీసుకుని కథ అల్లినట్లు తెలిసిపోతూ ఉంటుంది.

  కలిసివచ్చే అంశం :

  ఎన్టీఆర్ హీరో కావటం, వినాయిక చవితి, సమంత, కందిరీగ వంటి కామెడీ తీసిన దర్శకుడు డైరక్టర్ కావటం ఈ సినిమాకు మంచి ఓపినింగ్స్ వచ్చేలా చేసాయి.

  దర్శకుడు

  రెండో సినిమాకే ఎన్టీఆర్ వంటి పెద్ద హీరో దొరకినా వినియోగించుకోలేకపోయారని స్పష్టంగా చెప్పవచ్చు. పరమ రొటీన్ పాయింట్ ని అంతకన్నా పరమ రొటీన్ గా డీల్ చేసారు. దర్శకుడుగా అతని ప్రత్యేకమైన ముద్ర ఏమీ వేయలేకపోయారు.

  ఛాయాగ్రహణం,ఎడిటింగ్

  ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్...శ్యాం కె నాయుడు కెమెరా వర్క్ మాత్రమే. సినిమాని గ్రాండ్ గా చూపిస్తూ లొకేషన్స్ ఎలివేట్ చేసారు. దర్శకుడు ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. చాలా చోట్ల రిపీట్ అయ్యిన ఫీలింగ్ వచ్చింది.

  పాటలు...కొరియోగ్రఫీ

  రిలీజుకు ముందే హిట్టైన ఎన్టీఆర్ పాడిన పాట.....రాకాసి రాకాసి...ఆడియో పంరగానే కాక కొరియోగ్రఫీగానూ చాలా బాగా డిజైన్ చేసారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

  ఎవరెవరు

  చిత్రం: రభస
  సంస్థ: శ్రీలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌
  బ్యానర్ :సాయి గణేష్ ప్రొడక్షన్స్
  నటీనటులు :ఎన్టీఆర్ ,సమంత , ప్రణీత, షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు
  సంగీతం : తమన్‌ ,
  ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు,
  ఫైట్స్ : రామ్ లక్ష్మణ్,
  ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు,
  ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్,
  సమర్పణ : బెల్లంకొండ సురేష్,
  నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు,
  కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.
  విడుదల తేదీ: 29,ఆగస్టు 2014


  ఫైనల్ గా ఎన్టీఆర్ అభిమానులకు అయినా నచ్చుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  'Rabhasa' is a big-ticket commercial entertainer released today with divide talk, which has been produced by Bellamkonda Suresh under the banner of Sri Lakshmi Narasimha Productions and Sri Lakshmi Narasimha Productions and Sri Sai Ganesh Productions. Rabhasa has made in NTR's regular style and it has all masala ingredients like romance, action, comedy, music, dance, beautiful locales and trendy costumes. The film has glamour dolls Samantha and Praneetha as the female leads. The audio of the film, especially 'Rakaasi Raakaasi' song sung by NTR, got a superb response.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more